Breaking News

Renjal

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

  రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు సిద్ద సాయిలు తండ్రి గత వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. కాగా ఆయన కుటుంబాన్ని బుధవారం మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయాడని, ఆ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. సుదర్శన్‌రెడ్డి వెంట జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సాయిరెడ్డి, నర్సయ్య, ప్రవీణ్‌, కార్తీక్‌, రమణ, తదితరులున్నారు.

Read More »

తెలంగాణ మాడల్‌ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  రెంజల్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తెలంగాణ మాడల్‌ స్కూల్లో 7,8,9,10 తరగతులకు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 12వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని, రాత పరీక్ష ఏప్రిల్‌ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఉంటుందన్నారు. 7వ తరగతిలో 3 సీట్లు, 9వ తరగతిలో 7 సీట్లు, 10వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బోనోఫైడ్‌ సర్టిఫికెట్లు, కులదృవీకరణ ...

Read More »

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

  రెంజల్‌, మార్చి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వాటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాద్యత సర్పంచ్‌లు, కార్యదర్శులపై ఉందని, నీటి నివారణ అరికట్టి ప్రజలకు తాగునీరు అందించాలని ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య లేదని, నీరు వృదా అవుతుందని, వృధాను అదుపుచేయాలని కార్యదర్శులకు సూచించారు. కుళాయిలకు ...

Read More »

మూఢనమ్మకాలపై అవగాహన

  రెంజల్‌, మార్చి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం రాత్రి జాగృతి పోలీసు ఆధ్వర్యంలో ప్రజలకు మూడనమ్మకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవికుమార్‌ మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాల బారిన పడకుండా ఉండాలన్నారు. గ్రామాల్లో మూడనమ్మకాల తాకిడి ఎక్కువగా ఉంటుందని, వీటిని ప్రజలు విడనాడాలని సూచించారు. మంత్రతంత్రాలనేవి మూడనమ్మకాలని, వీటిని నమ్మకుండా సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు. అనంతరం కళాకారుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కొందరు వేదికపైకి వచ్చి తాము సైన్స్‌పై అవగాహన ...

Read More »

నామమాత్రంగా విండో సమావేశం

  రెంజల్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం ఛైర్మన్‌ మోహినుద్దీన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు డైరెక్టర్లు గైర్హాజరు కావడంతో కొంత మంది డైరెక్టర్‌ సభ్యులతో మాత్రమే సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. బోర్గాం గ్రామంలో గోదాము నిర్మాణానికి గ్రామస్తులు స్థలం కేటాయించడానికి ముందుకు వచ్చినట్టయితే గోదాము నిర్మాణ పనులు చేపడతామన్నారు. గ్రామంలో రైతులు దీనిపై శ్రద్ద వహించి ప్రభుత్వ ...

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

  రెంజల్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి నవీపేట నుంచి వీరన్నగుట్టకు తిరుగు ప్రయాణంలో దండిగుట్టవైపు నుంచి నవీపేట వైపు వెళ్తున్న బైక్‌ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మధు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్రకారం… వీరన్నగుట్ట గ్రామానికి చెందిన మధు తమ చెల్లిని నవీపేటలో దింపిరావడానికి వెళ్లగా తిరుగు ప్రయాణంలో దండిగుట్టవైపు నుంచి నవీపేట వైపు వెళ్తున్న వాహనదారుడు కళ్యాపూర్‌ చౌరస్తా వద్ద ఎదురెదురుగా ...

Read More »

ఘనంగా గుడ్‌ప్రైడ్‌డే

  రెంజల్‌, మార్చి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, నీలా, వీరన్నగుట్ట, దూపల్లి, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గుడ్‌ప్రైడే నిర్వహించారు. 41 రోజులు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని శుక్రవారంతో ముగియడంతో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Read More »

వ్యక్తిగత అభిప్రాయాలతో ఉద్యోగులపై వేటు వేయరాదు

రెంజల్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 12న జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులకు తెలియకుండా ఏపిఎంను సరెండర్‌ చేస్తూ తీర్మానం చేయడం ఎంతవరకు సమంజసమని స్థానిక ఎంపిడివో చంద్రశేఖర్‌ను జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, ఎంపిటిసిలు భూంరెడ్డి, లోలపు కిషోర్‌ ప్రశ్నించారు. గత గౌరవ సభ్యులకు తెలియకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంపిడివో సమాధానమిస్తూ మండల ఛైర్‌పర్సన్‌ ఎంపిపి తీర్మానం చేయగా అధికారులు పంపించడం జరిగిందని అన్నారు. సభ్యుల తీర్మానం లేకుండా, తమకు ...

Read More »

ఐకెపి కార్యాలయంలో 134వ మహిళా సమాఖ్య సమావేశం

  రెంజల్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో శనివారం ఎపిఎం సరళ ఆద్వర్యంలో 134వ మహిళా సమాఖ్య సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని మహిళా సంఘాల అద్యక్షురాళ్ళతో సమీక్షించారు. ముందుగా క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించి సమాఖ్య సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. క్యాన్సర్‌ నివారణకు మందుల అవసరం లేకుండా మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతత అవసరమని, దీంతో ఏవ్యాధినైనా జయించవచ్చని ఆమె సూచించారు. అనంతరం గ్రామ సంఘాల వివరాలు, గ్రామసంఘాల తీరును సబ్యులను అడిగి ...

Read More »

ఉపాధి కూలీల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు

  రెంజల్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్గం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమై పది సంవత్సరాలు పురస్కరించుకొని ఉపాధి కూలీలు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఐఎన్‌టియుసి అధ్యక్షుడు వెంకులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కూలీలు ఏర్పాటు చేసిన కేక్‌ కట్‌చేసి అందరికి పంచిపెట్టారు.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాది హామీ పథకం కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి కూలీకి వేసవిని పురస్కరించుకొని రూ. 150 దినసరి కూలీ అందించాలని, ఎండవేడిమి ...

Read More »

కందకుర్తి సర్పంచిపై సస్పెన్షన్ వేటు

రెంజల్ : తప్పుడు కుల ధ్రువీ కరణ పత్రం పొందారని ఫిర్యాదుల నేపథ్యంలో మండలంలోని కందకుర్తి గ్రామ సర్పంచి మీర్జా ఖలీంబేగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి మంగళవారం జారీ చేశారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి 2007 నవంబర్ 5తేదీన తీసుకున్న తప్పుడు బీసీ-ఇ(రజకాస్) కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా 13 జూలై 2013 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సర్పంచిగా మీర్జా ఖలీంబేగ్ ఎన్నికయ్యారు. కుల ధ్రువీకరణ పత్రం చెల్లదంటూ గత వారం ...

Read More »

పోలీసు స్టేషన్‌ను తనికీ చేసిన డిఎస్పీ

  రెంజల్‌, మార్చి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ పోలీసు స్టేషన్‌ను బోధన్‌ డిఎస్‌పి వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ గురించి ఎస్‌ఐ రవికుమార్‌ ప్రత్యేక శ్రద్ద చూపడం అభినందనీయమన్నారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటులేకుండా, శాంతియుతంగా కేసులు పరిష్కరిస్తున్నారని అభినందించారు.

Read More »

అధికారుల తీరుపై ఎంపిటిసి సభ్యుల ఆగ్రహం

రెంజల్‌, మార్చి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా సాగింది. అధికారుల తీరుపై ఎంపిటిసి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశంలో చేసిన తీర్మానాలు ఎంత వరకు పరిష్కరించారో తెలపాలని సభ దృష్టికి తెచ్చారు. విద్యార్థుల సౌకర్యార్థం ధూపల్లి నుంచి కూనేపల్లి, కళ్యాపూర్‌, బాగేపల్లి వరకు ఆర్టీసి బస్సును నడపాలని, అలాగే ధూపల్లి మూల మలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న రోడ్డు పనులను ...

Read More »

వీరభద్రుని దర్శించుకున్న ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌

  రెంజల్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో శుక్రవారం వీరభద్రుని జాతర ప్రారంభం కావడంతో ఉదయం ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, తహసీల్దార్‌ వెంకటయ్యలు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఆర్‌ఐ క్రాంతికుమార్‌, విఆర్వో భూమన్న, స్థానిక సర్పంచ్‌ పుష్పమాల శంకర్‌గౌడ్‌ తదితరులున్నారు.

Read More »

తాగునీటి సమస్య సత్వరమే పరిష్కరించాలి

  రెంజల్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా, వీరన్నగుట్ట గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గురువారం వీరన్నగుట్ట గ్రామానికి చెందిన 7వ వార్డు కాలనీవాసులు ఎంపిడివో కార్యాలయాన్ని ముట్టడించడంతో శుక్రవారం బోధన్‌ ఆర్డీవో శ్యాం ప్రసాద్‌లాల్‌ వీరన్నగుట్ట గ్రామానికి చేరుకొని కాలనీవాసులతో మాట్లాడి ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏ.ఇ. అభిలాష్‌ను మందలించారు. గత 15 రోజుల నుంచి గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చినా పట్టించుకోకపోవడంతో ఆయన ఏ.ఇ.పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యను ...

Read More »

పడగ విప్పిన నాగసర్పం

మహశివరాత్రి పర్వదినం మరుసటి రోజైన మంగళవారం రాత్రి ఓ నాగసర్పం రెంజల్‌ మండల కేంద్రంలోని దళితవాడలో ఓ ఇంటివద్ద పడగ విప్పి దర్శనమిచ్చింది. ఈ సర్పాన్ని చుడటానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చారు. సర్పం వెళ్ళిపోయే వరకు అక్కడే జాగరణ చేశారు. అర్ధరాత్రి దాటాక నాగ సర్పం అక్కడినుంచి పంట పొలాలకు జారుకుంది.

Read More »

తైబజార్‌ వేలానికి అందరు సహకరించాలి

రెంజల్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ మార్కెట్‌ యార్డుకు తెలంగాణ జిల్లాలోనే పేరుగాంచిన తైబజార్‌ కావడంతో వేలం వేస్తున్నట్టు సర్పంచ్‌ జావిదుద్దీన్‌ అన్నారు. ఈ వేలంలో పాల్గొని తైబజార్‌ వేలం నిర్వహించేందుకు అందరు సహకరించాలని అన్నారు. ఆయన వెంట కార్యదర్శి బషీరుద్దీన్‌, ఉపసర్పంచ్‌ పోతడి గంగామణి, తదితరులు ఉన్నారు.

Read More »

పలు ఆలయాల్లో అన్నదానం

రెంజల్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని తాడ్‌బిలోలి, సాటాపూర్‌, కందకుర్తి, నీలా, రెంజల్‌, గ్రామాల్లోని శివాలయాల వద్ద బక్తులకు ఉపవాస దీక్షల సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంవత్సరానికోసారి నిర్వహించే ఉపవాస దీక్షల సందర్భంగా ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

రెంజల్‌, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో చర్చలు ముగించిన అనంతరం తిరుగు పయనమైన కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికి కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ఎకార్‌ పాషా, మేక సాయిలు, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవాలు

రెంజల్‌, మార్చి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్నగుట్ట ప్రాథమిక పాఠశాలలో శనివారం పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానోఅలరించాయి. అనంతరం ప్రధానోపాధ్యాయులు గంగాదర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిసారిగా పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం పిల్లల్లో, ఉపాధ్యాయుల్లో నూతనోత్సాహం నింపుతుందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రయివేటుస్కూళ్లకు ఏమాత్రం తగ్గిపోకుండా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలుగా ముందంజలో ఉంటాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుష్పమాల, శంకర్‌గౌడ్‌, ఎంపిటిసి ...

Read More »