Breaking News

Renjal

శనివారం నుంచి తల్లిపాల వారోత్సవాలు

రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మపాలు నవజాత శిశువుకు అమృతంతో సమానం… పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతియేటా ఆగష్టు మొదటివారంలో తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది. అనేక దేశాల ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.   శిశువు పుట్టిన అరగంటలోపే తల్లిపాలు పడితే పిల్లలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ...

Read More »

నీటి సమస్యతో నర్సరీ తరలింపు

  రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి, నీలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలకు నీటి సమస్య తలెత్తడంతో వాటిని రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నర్సరీ వద్దకు తరలిస్తున్నట్టు క్షేత్ర సహాయకులు మధు, సాయిలు తెలిపారు. తాడ్‌బిలోలిలోని 50 వేల మొక్కలు, నీలాలోని 50 వేల మొక్కలను రెంజల్‌ ఆరోగ్య కేంద్రానికి తరలించి మొక్కలు నాటుతున్నట్టు వారు తెలిపారు. ఉపాధి హామీ ఆధ్వర్యంలో ప్రతి కూలీ మొక్కలను తమ పంట పొలాల వద్దగానీ, ఇంటి ఆవరణలో ...

Read More »

నదీ జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం

  రెంజల్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని మంగళవారం నవీపేట మండలంలోని నాగేపూర్‌ గ్రామస్తులు కోస్లి గోదావరి నది వరకు పాదయాత్ర చేశారు. అనంతరం నదీ జలాలతో గ్రామంలోని గ్రామ దేవతలకు అభిసేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా చేస్తే వరుణుడు కరుణించి వర్సాలు కురిస్తే పాడి పంటలు ఫుష్కలంగా ఉంటాయని గ్రామస్తుల నమ్మకం. వరుణుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు.

Read More »

చివరి రోజు పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు

  రెంజల్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కందకుర్తి గోదావరి పుష్కరాలు శనివారంతో పూర్తయ్యాయి. ఈ సందర్బంగా స్నానాలు ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి, హరిద్రా, మంజీర త్రివేణి సంగమం ద్వారా ప్రవహించే కందకుర్తి క్షేత్రంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పుష్కర కాలంలో గోదావరిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే జిల్లాలోని 11 ప్రదేశాల్లో 18 పుష్కర ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కందకుర్తి గోదావరి వద్ద ...

Read More »

శివాలయ హుండి లెక్కింపు

  రెంజల్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి పుష్కర ఘాట్‌ వద్ద గల శివాలయంలో శనివారం ఆలయ ఇవో వేణు, ఘాట్‌ ఇన్‌చార్జి ఉద్యానవన ఎడి శ్యాముల్‌, సర్పంచ్‌ శంకర్‌ ఆధ్వర్యంలో హుండి డబ్బులు లెక్కించారు. పుష్కరాల సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో హుండిలో నగదు జమ అయిందన్నారు. 33 వేల 368 రూపాయల నగదు వచ్చిందని తెలిపారు. అదేవిధంగా పుష్కరాలను పురస్కరించుకొని తాడ్‌బిలోలి గ్రామస్తులందరు కలిసి 12 రోజుల పాటు పుష్కరాలకు వచ్చిపోయే ...

Read More »

పుష్కరాల్లో ఎన్‌సిసి, ఆర్‌ఎస్‌ఎస్‌ సేవలు అభినందనీయం

  రెంజల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కందకుర్తి గోదావరి పుష్కరాలలో అధికారులు చేసిన సౌకర్యాలు చాలా బాగుగా ఉన్నాయని పుష్కరఘాట్ల పర్యవేక్షకులు ప్రసన్నకుమార్‌ తెలిపారు. బుధవారం కందకుర్తికి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారంగా సంబంధిత అధికారులు సమన్వయంతో సంగమేశ్వర దేవాలయం వద్దగల నీరును కందకుర్తి ఘాట్ల వద్దకు తీసుకొని రావడమే కాకుండా, నీరు కలుషితం కాకుండా ఏరోజుకు ఆరోజు క్లోరినేషన్‌ చేయించడం, గోదావరి నదిలో ప్రజలు, భక్తులు ఒకేచోట గుమిగూడకుండా ఏర్పాటు చేసిన ...

Read More »

పుష్కరాలను పరిశీలించిన డిఐజి

  రెంజల్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలంలోని తుంగిని పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి పుష్కరాల వ్యవస్థను మంగళవారం డిఐజి వై.గంగాధర్‌, డిఎస్పీ ఆనంద్‌కుమార్‌లు పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద పోలీసులు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారని, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నందున వారిని అభినందించారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన భద్రత వివరాలను పరిశీలించి తెలుసుకున్నారు. ఆయన వెంట సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు. పుష్కర స్నానాలు ఆచరించిన ...

Read More »

పుష్కరాల్లో సేవాదృక్పథంతో ఆర్టీసి పనిచేస్తుంది

  రెంజల్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల, వర్గ, ప్రాంత, మత సంప్రదాయాలకు అతీతంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం సేవాదృక్పథంతో ఆర్టీసి యాజమాన్యం తరఫున బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసి ఎండి జి.రమణారావు తెలిపారు. మంగళవారం కందకుర్తి బస్టాండ్‌ ప్రాంతంలోని రద్దీని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కందకుర్తి గోదావరి పుష్కర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులు, ప్రజలు రవాణా సౌకర్యార్థం మంగళవరం బోధన్‌ నుంచి 59 బస్సులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ...

Read More »

పుష్కర ఘాట్లను సందర్శించిన జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ

  నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాలో సదుపాయాలు, నీరు బాగున్నందున భక్తులు పుష్కర స్నానాలకు ఇక్కడి ఘాట్లకే రావాలనిజిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఇతర జిల్లాల ప్రజలకు సూచించారు. సోమవారం కందకుర్తి, తుంగిని పుష్కర ఘాట్లలో పర్యటించి హాజరవుతున్న భక్తులను, పరిస్థితులను పరిశీలించారు. కందకుర్తి వద్దగల మహారాష్ట్ర సరిహద్దులోని సంగమేశ్వర్‌ గ్రామం వద్ద గోదావరినదిలో కందకుర్తివరకు ఏర్పాటు చేసిన కాలువను, దానిద్వారా ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. మరింత నీరు చేరుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలని ...

Read More »

వారంరోజులు పూర్తిచేసుకున్న పుష్కరాలు

  – ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి అభినందనలు రెంజల్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గోదావరి పుణ్య స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి 106 ఘాట్లను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కందకుర్తిలో గోదావరి నదిలో స్నానమాచరించిన అనంతరం ఘాట్ల వద్ద పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన పోలీసు నిఘా మంచ్‌పై నుంచి బైనాకులర్‌తో ఘాట్లలో స్నానమాచరిస్తున్న ప్రజల సౌకర్యాలను, శానిటేసన్‌, ఘాట్లలో నీటిని పరిశీలించిన ...

Read More »

పుష్కరస్నానం పుణ్యస్నానం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెంజల్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి పుష్కర స్నానం భక్తులు పునీతులయ్యే పుణ్య స్నానమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం కందకుర్తి గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద అధికారుల ప్రయత్నం వల్ల ఏర్పాటు చేసిన నీరు చూసి సంతోషిస్తూ ఎప్పుడుపడితే అప్పుడు స్నానం ఆచరించే స్నానం కాదు ఈ పుష్కర స్నానమని ప్రత్యేకంగా పుష్కరుడు, బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే రోజునుంచి 12 రోజులు ...

Read More »

ఏర్పాట్లు భేష్‌

  – అభినందించిన లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డిజిపి రెంజల్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కందకుర్తి ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును, పోలీసు సిబ్బంది విధులను లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డిజిపి సుధీప్‌ లకట కీయా పరిశీలించారు. శుక్రవారం కందకుర్తి ఘాట్‌లోని భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. pశివాలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల రేఖ చిత్రాన్ని పరిశీలించి వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. పోలీసు కంట్రోల్‌ ...

Read More »

కందకుర్తికి పోటెత్తిన భక్తజనం

రెంజల్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కందకుర్తిలోని 4 ఘాట్ల వద్ద ప్రజలు పుష్కర స్నానం చేయడానికి కావాల్సిన నీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ మాట్లాడుతూ కందకుర్తి గోదావరి నదిలో స్నానంచేయటానికి సుమారు 80 వేల మంది ప్రజలు పాల్గొన్నారని తెలుపుతూ స్నానం ఆచరించడానికి వచ్చే వికలాంగులను, వృద్దులను, నడవలేని వారిని వీల్‌చైర్ల సహాయంతో ఘాట్ల వద్దకు చేర్చడంతో పాటుఘాట్ల నుంచి బస్టాండ్‌ వరకు తీసుకెళ్లడానికి రెండు ప్రత్యేక వాహనాలను ...

Read More »

రెండోరోజు భక్తుల పుష్కర స్నానాలు

  రెంజల్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కందకుర్తి గోదావరినది పుష్కరాలు బుధవారం రెండోరోజు కొనసాగాయి. స్నానాలు ఆచరించేందుకు భక్తులు అదిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి, హరిద్ర, మంజీర మూడు నదుల కలయిక ద్వారా ప్రవహించే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్త జన సందోహం కనిపించింది. పుష్కర కాలంలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే జిల్లాలోని 11 ప్రదేశాల్లో 18 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో కందకుర్తి వద్దే 4 ...

Read More »

కందకుర్తిలో జేసి పుష్కరస్నానం

  రెంజల్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రివేణి సంగమం కందకుర్తి పుష్కర ఘాట్‌లో బుధవారం జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి పుణ్య స్నానాలు ఆచరించారు. ముందుగా గోదావరి నదిలో స్నానం చేసి, పురాతన , నూతన శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘాట్ల వద్ద అధికారుల పనితీరును పరిశీలించారు. తాగునీరు అందించే దగ్గర, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు జేసి దృష్టికి తీసుకొచ్చారు. భక్తులకు తాగునీరు అందించే దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి ...

Read More »

పుష్కరఘాట్ల వద్ద భక్తజన సందోహం

  రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి పుష్కర ఘాట్ల వద్ద భక్తజన సందోహం ఏర్పడింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు జిల్లా నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాలు అదిక సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. పురాతన, నూతన శివాలయాల్లో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ జలాలతో శివాలయాల్లో అభిషేకాలు చేశారు. మరో 11 రోజుల పాటు జరిగే పుష్కరాల సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.

Read More »

తెలంగాణ అంతటా మహాపుష్కరాల్లో స్నానాలు ఆచరించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గోదావరి మహా పుష్కరాల్లో ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరి పుష్కరాల్లో పాల్గొని స్నానం ఆచరించిన మంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు చేయించారు. అనంతరం మంత్రికి, జడ్పి ...

Read More »