Breaking News

Renjal

ఘనంగా సేవాలాల్‌ జయంతి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్న గుట్ట తండా, మౌలాలి తండా, కిసాన్‌ తండా గ్రామాల్లో శుక్రవారం సేవాలాల్‌ మహారాజ్‌ 280వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవలాల్‌ మహారాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపొందించుకొని సేవలాల్‌ మహారాజ్‌ బాటలో పయనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జాదవ్‌ గణేష్‌ నాయకులు యాదవరాజు, విజయ్‌, బాబు నాయక్‌ ,మురళి, సురేష్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని, తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచిపేరు తేవాలని ఎంఇవో గణేష్‌ రావు అన్నారు. మండలంలోని నీలా ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చక్కగా చదువుకొని రాణించాలన్నారు. ఇంటర్మీడియట్‌ తరువాత చదువులు జీవితంలో ఓ పాఠం వంటిదని చక్కగా చదువుకుంటే విద్యార్థి ఉన్నత స్థితిని తెలుపుతాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే పోటీ పరీక్షలలో ఎంపిక ...

Read More »

సహచరురాలికి సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని సరస్వతి విద్యానికేతన్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న లోలపు వందన గత రెండు రోజుల క్రితం వెలువడిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కాగా తోటి సహచరురాలిని పాఠశాల సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరస్వతి విద్యానికేతన్‌లో గత కొంతకాలంగా ఉపాద్యాయురాలిగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవ్వడం ఆనందదాయకని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ సాయికిరణ్‌, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

Read More »

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో బోధన్‌ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, బోధన్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేర పరివార్‌ భాజపా పరివార్‌, బీజేపీ కుటుంబమే నా కుటుంబం అనే నినాదంతో కార్యకర్తల ఇళ్లపై బీజేపీ జండా ఎగురవేసి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ...

Read More »

ఘనంగా వెంకటేశ్వర కళ్యాణం

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రథసప్తమిని పురస్కరించుకుని మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు, స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం రథ సప్తమిని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నిరంజని, ఉపసర్పంచ్‌ జలయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాశం సాయిలు, మోహన్‌, ...

Read More »

అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు

రెంజల్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్ర జొన్న, పసుపు రైతులకు మద్దతుగా రైతు సంఘం నాయకులు చేపట్టిన మహాదీక్షలో పాల్గొనకుండా రైతులను ముందస్తుగా అక్రమ అరెస్టులు రైతు ఉద్యమాన్ని ఆపలేవని సిపిఐ ఎంఎల్‌ రెంజల్‌ మండల నాయకులు పార్వతి రాజేశ్వర్‌, నసీర్‌ అన్నారు. సోమవారం మామిడి పల్లి చౌరస్తాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు ఆందోళన దీక్ష చేపట్టాలని పిలుపునివ్వడంతో పోలీసులు రైతులను దీక్షలో పాల్గొనకుండా రైతు సంఘం నాయకులను ముందస్తుగా రెంజల్‌ పోలీసు ...

Read More »

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో సోమవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను సర్పంచ్‌ రమేశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్ట్రార్‌ పనులలో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్‌ పనులను త్వరగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయిబాబా గౌడ్‌, గంగాగౌడ్‌, రమేశ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మా డబ్బులు మాకివ్వండి

రెంజల్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు నెలల నుండి పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదంటూ కూనేపల్లి గ్రామస్తులు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పోస్టుమాన్‌ ఇష్టారీతిన పింఛన్‌ డబ్బులు ఇంటివద్దే పంచుతున్నాడని, గ్రామ పంచాయతీ వద్ద డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. గత రెండు నెలల నుంచి పింఛన్‌ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ విజయ గ్రామ పంచాయతీకి చేరుకొని ...

Read More »

వాహనాల తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ తెలంగాణ చౌరస్తాలో శనివారం వారాంతపు సంత సందర్భంగా ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఐ శంకర్‌ ఆద్వర్యంలో తనిఖీ చేశారు. లైసెన్సు, ఆర్‌సి, ఇన్సురెన్సు లేని 15 వాహనాలకు రూ. 1500 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని, వాహన పత్రాలు కలిగిఉండాలని ఆయన అన్నారు. లేకపోతే జరిమానాలు విదిస్తామని ఎస్‌ఐ అన్నారు.

Read More »

గ్రామాభివృద్దికి కృషి చేస్తా

రెంజల్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోర్గాం గ్రామ పంచాయతీ అభివృద్దికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి గ్రామాభివృద్దికి కృషి చేస్తానని సర్పంచ్‌ వాణి అన్నారు. బోర్గాం గ్రామ పంచాయతీలో శుక్రవారం సర్పంచ్‌, వార్డు సభ్యులకు సన్మానసభ ఏర్పాటు చేశారు. ఎంపిడివో చంద్రశేఖర్‌, రెంజల్‌ విండో ఛైర్మన్‌ మోహినోద్దీన్‌ పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్‌, గ్రామస్తులు సాయిరెడ్డి, రాజు, నాగన్న, పోశెట్టి, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యులతో ఎంపిడివో చంద్రశేఖర్‌

Read More »

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆద్వర్యంలో ముదిరాజ్‌ సంఘం మండల కమిటీ సభ్యులు సర్పంచ్‌ మర్ల రమేశ్‌ను ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ సర్పంచ్‌గా ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌ రమేశ్‌ను తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ మండల అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి పోశెట్టి సర్పంచ్‌ను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ మండల ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, సంతోష్‌, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు బహుమతులు అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని సర్పంచ్‌ సునీత అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌బిలోలి ఉన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గతనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు ఆంజనేయులు, సాయిలు, ఎంపిటిసి సంధ్య, మాజీఎంపిటిసి నర్సయ్య, నాయకులు ప్రవీణ్‌, క్రాంతికుమార్‌, పిఆర్‌టియు రాష్ట్ర నాయకులు రాజేందర్‌ ...

Read More »

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌ వెల్మల సునీతను మంగళవారం ఉపాధ్యాయ బృందం పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. పాఠశాల అభివృద్దికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, సాయిలు, రాజేందర్‌ సింగ్‌, మాజీ ఎంపిటిసి నర్సయ్య, ప్రవీణ్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సర్పంచ్‌లకు సన్మానం

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, ఎంపిడివో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన 17 గ్రామాల సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. సోమవారం మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం అనంతరం సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, వివిద గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Read More »

తూతూమంత్రంగా మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్యసమావేశం తూతూమంత్రంగా సాగింది. ప్రధాన శాఖల అంశాలను పరిగణలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే సమావేశం ముగించారు. వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఆర్‌అండ్‌బి, రెవెన్యూశాఖల అధికారుల పనితీరుపై గౌరవ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే అధికారులు కార్యాలయానికే పరిమితమవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడుతుందని సభ్యులు అధికారులను నిలదీశారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ...

Read More »

పోలింగ్‌బూత్‌లను పరిశీలించిన ఆర్డీవో

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లను ఆదివారం బోదన్‌ ఆర్డీవో గోపి పరిశీలించారు. ముందస్తు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌బూత్‌లను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్‌బూత్‌లలో అన్ని సౌకర్యాలు ఉండాలని విఆర్వో సంతోష్‌ను ఆదేశించారు. పోలింగ్‌బూత్‌లో బిఎల్‌వోలు అందుబాటులో లేకపోవడంతో విఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటల వరకు కూడా బిఎల్‌ఓలు అందుబాటులో లేకపోవడం ఏమిటని విఆర్వోను మందలించారు. ఓటరు జాబితాలో తప్పు ఒప్పులను సవరించుకునేందుకు చివరిరోజు కావడంతో బిఎల్‌వోలు అందుబాటులో ...

Read More »

సోమవారం మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి మోబిన్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు ఎంపిడివో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిదులు హాజరు కావాలని ఆయన అన్నారు.

Read More »

విద్యార్థికి నగదు అందజేత

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన విద్యార్తిని ముస్కాన్‌ పర్వీన్‌ 10వ తరగతిలో 8.8 జిపిఎ సాధించినందుకుగాను కందకుర్తి గ్రామ మాజీ సర్పంచ్‌ యాదవరావు విద్యార్థిని ఉన్నత చదువుల కోసం తన వంతు సాయంగా రూ. 5 వేల నగదును శనివారం విద్యార్థినికి అందజేశారు. కార్యక్రమంలో నూతన సర్పంచ్‌ కలీంబేగ్‌, ఉపసర్పంచ్‌ యోగేశ్‌, గౌస్‌ తదితరులున్నారు.

Read More »

కొలువుదీరిన కొత్త పాలకవర్గం

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌ అభ్యర్తులు, వార్డు సభ్యుల కొత్త పాలక వర్గం కొలువుదీరింది. శనివారం వీరికి గ్రామ పంచాయతీ ప్రత్యేక అదికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గ్రామస్తులు ఘనంగా సన్మానం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాభివృద్దికి పాటుపడి గ్రామానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అసదుల్లా ...

Read More »

ఎలక్ట్రిసిటి సూపరింటెండెంట్‌ను సన్మానించిన ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎలక్ట్రిసిటి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీర్‌గా నూతనంగా నియమితులైన సుదర్శనంను ఎంఆర్‌పిఎస్‌ నాయకులు శనివారం నిజామాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఎర్ర రాంచందర్‌, మల్ల సాయిలు, మందారం రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More »