Breaking News

Renjal

కుంటలో పడి వ్యక్తి మృతి

  రెంజల్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కుషాన్‌ తాండాలో నవీపేట గ్రామానికి చెందిన మహ్మద్‌ అంజాద్‌ (34) అనే వ్యక్తి నీటి కుంటలో పడి మృతి చెందాడు. సోమవారం అంజాద్‌ తన సోదరుడితో కలిసి గొర్లు కాయడానికి తాండా శివారుకు రాగా గొర్లకు నీరు తాగించడానికి కుంటలోకి దిగి వాటిని బయటకు తీసుకురావడానికి లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో దిగిన అంజాద్‌కు ఈత రాక పోవడంతో తచ్చాడుతూ మునిగి అక్కడికక్కడే మృతి ...

Read More »

వాహనాల తనిఖీ

  రెంజల్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :రెంజల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో శనివారం వాహనాలు తనికీ చేశారు. ఎటువంటి దృవీకరణ అనుమతి పత్రాలు లేకుండా, మోతాదుకు మించి ప్రయాణికులతో వెల్తున్న వాహనాలను పట్టుకొని జరిమానా విధించినట్టు ఆయన అన్నారు. సుమారు 30 వాహనాలకు 3300 జరిమానా విధించినట్టు తెలిపారు. ఎస్‌ఐ వెంట కానిస్టేబుల్‌ ప్రసాద్‌, గంగాధర్‌, గంగాకుమార్‌, సాయి ఉన్నారు.

Read More »

పలు గ్రామాల్లో గ్రామసభలు

  రెంజల్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి, దూపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శనివారం సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలోని పలు సమస్యలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ సిబ్బంది దృస్టికి గ్రామస్తులు తెచ్చారు. కార్యక్రమంలో ఆయాగ్రామల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

యువత మహాత్ముని బాటలో నడవాలి

  రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత మహాత్ముని బాటలోనడిచి నప్పుడే దేశ ప్రగతి సాద్యపడుతుందని, మహనీయుడు కన్న కలల స్వరాజ్యం సాధ్యమవుతుందని తాడ్‌బిలోలి సర్పంచ్‌ శంకర్‌ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత దేశ ప్రగతి కోసం ముందుండి మహాత్ముని బాటలో పయనించినపుడే ప్రతియువకుడు అభివృద్ది చెందుతాడన్నారు. గ్రామ స్వరాజ్యం బాగున్నప్పుడే దేశ ప్రగతి సాద్యమని, అలాంటపుడు యువత చెడు ...

Read More »

గాంధీవిగ్రహానికి వినతి పత్రం

  రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గాంధీవిగ్రహానికి శుక్రవారం ఆశ వర్కర్లు మండల పరిషత్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. అదికారులకు, పాలకులకు విన్నవించుకున్నా కూడా తమ సమస్యలు పరిష్కరించేటట్టు కనబడడం లేదని, మహాత్ముడైనా పరిష్కరిస్తాడని, మహాత్ముని జయంతి సందర్బంగా గాంధీ విగ్రహానికి విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో వెలకట్టలేని సేవలు చేస్తున్నా గుర్తించే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. గ్రామ ప్రథమ పౌరుడినుంచి దేశ ప్రధాని ...

Read More »

రెంజల్‌లో స్వచ్ఛభారత్‌

  రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంగణం, గాంధీ విగ్రహం ముందు శుక్రవారం మండల అధికారులు తహసీల్దార్‌, ఎంపిడివో, జడ్పిటిసి, ఎస్‌ఐ, ఎంపిటిసిలు శుభ్రంచేసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల చెత్తా చెదారాన్ని తొలగించి, పిచ్చిమొక్కలను లేకండా చేసి పరిసరాలు శుభ్రం చేశారు.

Read More »

బహుమతుల ప్రదానం

  రెంజల్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణపతులను అలంకారప్రాయంగా ఉంచి భక్తిశ్రద్దలతో, ప్రశాంతంగా పూజలు చేసి శాంతియుతంగా నిమజ్జనం చేసిన మండపాలకు ప్రథమ, ద్వితీయ ఎన్నుకొని ఎంపికైన మండపాలకు మొదటి బహుమతి 5 వేల నగదు, ద్వితీయ బహుమతి 2500 నగదును తహసీల్దార్‌ వెంకటయ్య, ఎస్‌ఐ రవి, జడ్పిటిసి నాగభూషణంరెడ్డిలు మండపాల నిర్వాహకులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసంవత్సరం కూడా ఎటువంటి అల్లర్లకు తావులేకుండా శాంతియుతంగా గణేష్‌ ...

Read More »

వ్యక్తి అదృశ్యం

  రెంజల్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన జందార్‌ వీరన్న (40) అనే వ్యక్తి గత వారంరోజుల క్రితం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లగా ఇంతవరకు ఇంటికి రాకపోవడంతో తమ తెలిసిన బంధువుల వద్ద సమాచారం అందించినా ఆచూకీ తెలియకపోవడంతో గురువారం వీరన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వీరన్న ఆచూకీ కోసం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రవికుమార్‌ పేర్కొన్నారు.

Read More »

సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదు

  రెంజల్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఆశ వర్కర్లు అన్నారు. మండల పరిసత్‌ కార్యాలయం ముందు కొనసాగుతున్న ఆశ వర్కర్ల సమ్మె గురువారం ఖోఖో ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు లేకుండా వెట్టి చాకిరి చేస్తున్నా తమ పట్ల ప్రబుత్వం చిన్నచూపు చూపుతుందని గ్రామంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని, ఆరోగ్య స్తితిని ఎల్లప్పుడు రికార్డుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక చూపుతున్నా కూడా తమకు కనీస ...

Read More »

మిషన్‌ ఇంద్రధనుస్సుపై ఏఎన్‌ఎంలకు అవగాహన

  రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అంగన్‌వాడి కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు మిషన్‌ ఇంద్రధనుస్సుపై అవగాహన కల్పించారు. సమావేశంలో హెచ్‌ఇవో వెంకటరమణ మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి రెండు సంవత్సరాల చిన్నారులను గుర్తించి, గర్భిణీలకు వ్యాక్సిన్‌లు అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రమేశ్‌ ఎలిజబెత్‌, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడిలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

రాష్ట్ర స్తాయిలోవిద్యార్థినికి బంగారు పతకం

  రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ మాడల్‌ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సుష్మ రాష్ట్ర స్తాయిలో వాలీబాల్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించినట్టు ప్రధానోపాధ్యాయుడు బలరాం, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. సుష్మను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. e

Read More »

ఘనంగా గణనాథుని నిమజ్జనం

  రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలో 7వ రోజుల గణేష్‌ నిమజ్జనం శాంతియుతంగా చేపట్టారు. గణేష్‌ ఉత్సవాలను మతాలకు అతీతంగా భాజా, భజంత్రీలతో, కోలాటాలు, యువకుల నృత్యాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో కందకుర్తి గోదావరి వరకు గణేష్‌లను తరలిస్తున్నారు. ఈ శోభాయాత్రలో బోధన్‌ సిఐ శ్రీనివాసులు, రెంజల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ...

Read More »

బతుకమ్మ ఆడిన ఆశ వర్కర్లు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలను పరిస్కరించాలని కోరుతూ గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారతి, దివ్య, శైలజ,రాణి తదితరులున్నారు.

Read More »

పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా పండగలు జరుపుకొని సామరస్యంగా ఉండాలని బోధన్‌ రూరల్‌ సిఐ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గణపతి మండపాల వద్ద పేకాట, మద్యం సేవించినట్టయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిజెలకు బదులుగా భజనలతో శాంతియుతంగా నిమజ్జనం చేయాలని, ముందుగా యువత ...

Read More »

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

  రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కల్యాపూర్‌ గ్రామానికి చెందిన ఐతి సాయన్న (55) అప్పుల బాధ భరించలేక సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో అందరు నిద్రించిన సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బోదన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు రెంజల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో రైతు ...

Read More »

ప్రజావాణికి 3 ఫిర్యాదులు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల తహసీల్‌ కార్యాలంయలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 3 ఫిర్యాదులు అందినట్టు తహసీల్దార్‌ వెంకటయ్య చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రజావాణి అని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

మంగళవారం మండల సర్వసభ్యసమావేశం

  రెంజల్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు, సమావేశానికి మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పలు శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజం

  రెంజల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సహజమని బదిలీలు జరిగినప్పుడే తాము చేసిన పనులకు గుర్తింపు లభిస్తుందని తాడ్‌బిలోలి సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌ అన్నారు. శుక్రవారం గ్రామంలో విఆర్వోగా విధులు నిర్వహించిన అల్లా ఉద్దీన్‌ బదిలీపై వర్ని మండలంలోని ఘన్‌పూర్‌కు వెళ్లగా తాడ్‌బిలోలి గ్రామస్తుల ఆధ్వర్యంలో శుక్రవారం అల్లా ఉద్దీన్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగ రీత్యా బదిలీలు సహజమే అయినా గత నాలుగేళ్లగా తాడ్‌బిలోలిలో విధులు నిర్వహించిన తనకు ...

Read More »

ఆశల వంట వార్పు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ వర్కర్ల సమ్మె బుధవారానికి 15 వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా ఎంపిపి కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమంలో నిరసన తెలిపారు. సమస్యలు పరిస్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు శైలజ, రాణి, భారతి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బాధిత కుటుంబాలను పరామర్శించిన నాయకులు

  రెంజల్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం పిడుగుపాటుకు మృతిచెందిన ధూపల్లి గ్రామానికి చెందిన గైని వాణి, గైని లక్ష్మి, ఊషం సంగీతల కుటుంబీకులను బుధవారం బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ వేరు వేరు సమయాల్లో పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి అన్ని రకాలుగా కుటుంబీకులను ఆదుకోవాలని వారన్నారు. వారి వెంట ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు గంగాధర్‌, రాష్ట్ర నాయకులు ...

Read More »