Breaking News

Renjal

మరుగుదొడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలి

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని ఎంపిడివో చంద్రశేఖర్‌ సూచించారు. బుధవారం తన చాంబరులో ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. హరితహారంలో మండలానికి నిర్దేశించిన లక్ష్యం 4.4 లక్షల మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. కాని వాటిని సంరక్షించే బాద్యత కూడా తీసుకోవాలన్నారు. అదేతరహా మరుగుదొడ్లు నిర్మాణాలు కూడా చేపట్టాలని ఎంపిడివో అన్నారు. వాటిని నిర్మించుకోకపోతే ఏర్పడే అనర్దాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ...

Read More »

ఆశాజనకంగా సోయాపంట

  రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో రైతాంగం సోయాపంటపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు ఆరుతడి పంటలవైపు దృష్టి మల్లించారు. మండలంలోని కందకుర్తి, బోర్గాం, నీలా, తాడ్‌బిలోలి, సాటాపూర్‌, రెంజల్‌ శివార్లలో ఆరుతడి పంటలకు అనువుగా ఉన్న భూముల్లో సోయా, మినుము, పెసర, జొన్న తదితర పంటలను వేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు సోయాపంట ఆశాజనకంగా మారింది. ప్రస్తుతం వర్షాలు లేకున్నా భూగర్భజలాలు రావడం వల్ల పంటలకు ...

Read More »

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి దిష్టిబొమ్మ దగ్దం

రెంజల్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా వ్యవహరించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను శనివారం రెంజల్‌ మండల మాలమహానాడు ఆద్వర్యంలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులను విభజించి పాలించే దిశగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తుందని, దళితుల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించడం సరికాదని వారన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీ వర్గీకరణ పేరుతో దళితులను చీల్చే ప్రయత్నం చేయగా వారికి సరైన బుద్దిచెప్పడంతో వర్గీకరణ ప్రస్తావన తీసుకురాకుండా ఉన్నారని, మళ్లీ నేడు ...

Read More »

తాగునీటి సమస్యపై ఎంపిపి, ఎంపిడివోకు వినతి

రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మాసం రోజులుగా తాగునీటి సమస్య జఠిలమవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని శుక్రవారం మండలంలోని కూనేపల్లి వాసులు ఎంపిపి, ఎంపిడివోలకు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎంపిపి మోబిన్‌ఖాన్‌ సమస్యపై ఆరా తీసి సంబంధిత కార్యదర్శితో వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడివోను కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో లింగం, సాయిలు, తదితరులున్నారు.

Read More »

సమయానికి రారు… ప్రజా సమస్యలు పరిష్కరించరు…

  రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అప్పుడే గ్రామాలు అభివృద్ది చెందుతాయి. రెంజల్‌ మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. ఉదయం 10.30 గంటల్లోపు కార్యాలయానికి చేరుకోవాల్సిన సిబ్బంది శుక్రవారం ఉదయం 11.20 గంటలకు కూడా ఏ ఒక్క అధికారి సక్రమంగా విధులకు హాజరు కాలేదు. కార్యాలయం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. కార్యాలయ పనితీరును పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. పాలకవర్గం అటువైపు కన్నెత్తి చూసిన ...

Read More »

ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

– మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెంజల్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూర్తి స్థాయిలో విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నీలా గ్రామ శివారులో నిలిచిపోయిన కందకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వర్గాల సంక్షేమానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, గృహ నిర్మాణాలు రైతుల రుణ మాఫీ తదితర అంశాలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. తమ కాంగ్రెస్‌ ...

Read More »

జోగినిలకు 1500 పింఛన్లు అందించాలి

రెంజల్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జోగిని మహిళలందరికి ప్రభుత్వం ఆదుకుని రూ. 1500 పింఛన్లు అందించాలని సోమవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ వెంకటయ్యకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జస్టిస్‌ రఘునాథ్‌రావు కమీషన్‌ సిఫారసులు వెంటనే అమలుచేయాలని, ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు లేదా 35 కిలోల బియ్యం అందించాలని, కార్పొరేషన్‌ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో రాజయ్య, రాజు, తదితరులు ...

Read More »

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించినప్పుడే సత్ఫలితాలు

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినపుడే సత్పలితాలు వస్తాయని, అందుకుగాను ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాందీ పాఠశాలలో కొనసాగుతున్న వందేమాతరం ఫౌండేషన్‌ శిక్షణను ఆమె పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థినిల గదిలోకి వెళ్లి ఆరాతీశారు. గణాంక మూల్యాంకనంపై విద్యార్థులు నేర్చుకున్న విషయాలను కలెక్టర్‌కు చెప్పారు. అందరి ...

Read More »

సాటాపూర్‌లో 915 మందికి వైద్య పరీక్షలు

  రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలలో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపిపి మోబిన్‌ఖాన్‌, సర్పంచ్‌ జావెద్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌, ఆర్ధోపెడిక్‌, పిల్లలు తదితర వ్యాధులతో బాధపడుతున్న 915 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో వ్యాధిగ్రస్తులైన నలుగురిలో ముగ్గురిని నిజామాబాద్‌ నగరానికి, ఒకరిని హైదరాబాద్‌ రిఫర్‌ చేసినట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ సంతోష్‌ తెలిపారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు నాగార్జున, ప్రవీణ్‌ కుమార్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అభివృద్దిని అడ్డుకునేందుకే ప్రతిపక్షాల కుట్రలు

  – మాజీ ఎంపిపి రమణాగౌడ్‌ రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ అభివృద్దిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎంపిపి రమణాగౌడ్‌ అన్నారు. మంగళవారం తెరాస ఆధ్వర్యంలో రెంజల్‌ మండల కేంద్రంలో ప్రతిపక్షాల దిష్టిబొమ్మను ఊరేగింపు నిర్వహించి దగ్దం చేశారు. తెరాస పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ కాబట్టి అభివృద్దిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నాయన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ...

Read More »

భారీ వర్షంతో నీటమునిగిన పంటలు

  రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. రైతులు ఎకరానికి రూ. 20 వేలు ఖర్చుచేసి పంటలు వేయగా రాత్రి కురిసిన వర్షానికి పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా తాసికుంట చెరువులో రూ. 28 లక్షలతో పనులు చేపట్టగా అందులో 10 ఎకరాలకు మాత్రమే ప్రయోజనం చేకూరగా, మిగతా 40 ఎకరాల సాగుభూమికి నష్టం వాటిల్లుతుందని ...

Read More »

ఘనంగా కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

  రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఐటి మంత్రి తారకరామారావు జన్మదినాన్నిపురస్కరించుకొని మండల తెరాస నాయకులు షాటాపూర్‌లోని తెలంగాణ చౌరస్తాలో కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. అనంతరం బిఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ పాశం సాయిలు మాట్లాడుతూ కెటిఆర్‌ ఇలాగే మరిన్నిపదవులు చేపట్టి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసి హరిత తెలంగాణ మున్ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు వికార్‌ పాషా, కుర్మె సాయిలు, అఖిల్‌ బేగ్‌, నిసార్‌, ముజాహిద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మండలంలో హరిత హారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి

  రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో హరితహారంలో భాగంగా 4 లక్షల 40 వేల మొక్కలు నాటి లక్ష్యాన్నిపూర్తిచేయాలని తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశానుసారం పచ్చని హరితహారం పూర్తిచేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు సహకరించాలని, గ్రామాల్లో ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు ముందుకొచ్చి లక్ష్యాన్ని పూర్తిచేయాలని, మేట్‌లకు, క్షేత్ర సహాయకులకు ఆయన సూచించారు. తహసీల్దార్‌ వెంట డిప్యూటి తహసీల్దార్‌ వినయ్‌ ...

Read More »

విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి

  – జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య రెంజల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో విద్యాప్రమాణాలను పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య అన్నారు. మండలంలోని సాటాపూర్‌, నీలా ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులను నేరుగా వెళ్ళి చూశారు. విద్యార్థులకు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించాలన్నారు. సైన్స్‌ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డిప్యూటి డిఇవో పద్మనాభన్‌, ఎంఈవో ...

Read More »

బాగేపల్లిలో రైతుల ప్రతిజ్ఞ

  రెంజల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బాగేపల్లి గ్రామంలో శుక్రవారం రైతుదినోత్సవాన్ని పురస్కరించుకొని హరితహారం పై రైతులు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఎస్‌ఐ డి. రవికుమార్‌ ఆధ్వర్యంలో రైతులతో సమావేశమై అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించాలని అప్పుడే పెట్టిన మొక్కలకు ప్రతిఫలముంటుందన్నారు. ఆయన వెంట స్తానిక సర్పంచ్‌ వాణి సురేందర్‌గౌడ్‌, సాయిబాబాగౌడ్‌, రైతులున్నారు.

Read More »

జిల్లాలో 2.1 కోట్ల మొక్కలు నాటడం పూర్తి చేశాం

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా రెంజల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గురువారం నాటికి 2.1 కోట్ల మొక్కలు నాటడం పూర్తిచేశామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామ శివారులో ఎస్సీ లబ్దిదారులకు ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన ఎన్‌ఎస్‌ఎఫ్‌ సాగుభూముల గట్లపై టేకు మొక్కలను కలెక్టర్‌ నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శుక్రవారం రోజున జిల్లా వ్యాప్తంగా రైతులకు సంబంధించిన పొలల ...

Read More »

విద్యార్థులకు నాణ్యతతో కూడిన పరిజ్ఞానం నేర్పించాలి

  – శిక్షణ అదనపు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ రెంజల్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్‌ పర్సంటేజ్‌ ఉత్తీర్ణత సాధించడం గొప్ప కాదని, విద్యార్థులకు నాణ్యతతో కూడిన పరిజ్ఞానాన్ని నింపాలని జిల్లా శిక్షణ అదనపు కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా, మాడల్‌ పాఠశాలతోపాటు నీల ప్రభుత్వ పాఠశాలలోని స్తితిగతులను నేరుగా పరిశీలించారు. మాడల్‌ పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులకు గణితంకు సంబంధించిన పార్ములాలను అడిగారు. విద్యార్థుల నుంచి జవాబు రాలేదు. ...

Read More »

ఎంపి కవిత చిత్రపటానికి పాలాభిషేకం

  రెంజల్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాస ఎత్తిపోతల పథకం అభివృద్దికి 67 లక్షలు మంజూరు కావడానికి కృషి చేయడంతో పాటు, రైతుల వాటా ధనాన్ని 3 లక్షలు ఎంపి, ఎమ్మెల్యేలు భరించడం వల్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేశారు. ఎంపి, ఎమ్మెల్యేలకు తాము ఎప్పటికి రుణపడి ఉంటామని రైతులు చెప్పారు. కార్యక్రమంలో ఎత్తిపోతల ఛైర్మన్‌ మౌలానా, సర్పంచ్‌ తెలంగాణ ...

Read More »

తెలంగాణ హరితహారం పనులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

  నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అదికారుల సస్పెన్షన్‌ రెంజల్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను సహించేదిలేదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటించాల్సిన బాధ్యత సెక్టారు అధికారులదేనని తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం సంబంధిత గ్రామ పంచాయతీలో బసచేసి, ప్రజలను సన్నద్దం చేసి రెండురోజులకొక గ్రామ పంచాయతీలో హరితహారం పూర్తిచేయాలని తెలిపారు. మండల స్థాయి, గ్రామస్థాయి ఉద్యోగులందరు ...

Read More »

ఐఎస్‌ఎల్‌ రికార్డులు తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి

  రెంజల్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన రికార్డులను సోమవారం మండల ప్రత్యేకాధికారి కీర్తికాంత్‌ తనిఖీ చేశారు. ఐకెపి కార్యాలయంలోని ఐఎస్‌ఎల్‌కు సంబంధించిన వివరాలు ఎపిఎం సరళను అడిగి తెలుసుకున్నారు. మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాల కంట్రిబ్యూషన్‌ రూ. 9 వందల చొప్పున అందరు చెల్లించడం జరిగిందన్నారు. ఎంపిడివో తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఎపిఎం సరళ మండల ప్రత్యేకాధికారి కీర్తికాంత్‌కు వివరించారు. మహిళ అయినందుకే తనను అధికారులు, ప్రజాప్రతినిదులు చిన్న చూపు చూస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని కంటతడిపెట్టి ...

Read More »