Breaking News

Renjal

అలరించిన కుస్తీ పోటీలు

రెంజల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో బుధవారం హోలీ పండుగను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోధులు కుస్తీ పోటీలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు ఆనవాయితీగా నిర్వహిస్తారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సాయరెడ్డి, రమేష్‌, వికార్‌ పాషా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా హోలీ సంబరాలు

రెంజల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దూపల్లి, సాటాపూర్‌ గ్రామాలలో బుధవారం ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. మంగళవారం రాత్రి కామదహనం చేసి ఉదయం హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు సంతోషాల మధ్య రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

Read More »

సీఎం కేసీఆర్‌ సభ విజయవంతం చేయండి

రెంజల్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న నిజామాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ ఎన్నికల సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సాటాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన అభివద్ధిని చూసి ప్రజలు మళ్ళీ టిఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం పట్టారన్నారు. నిజామాబాద్‌ జిల్లాను అభివద్ధి పథంలో నడిపిన ఎంపీ కల్వకుంట్ల కవితను 4 లక్షల భారీ మెజార్టీతో నిజామాబాద్‌ పార్లమెంట్‌ ...

Read More »

పది పరీక్షలో ఒకరు గైర్హాజరు

రెంజల్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం కాగా మొదటి రోజు ఒక విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్లు ఎంఇఓ గణేష్‌ రావు తెలిపారు. మండలంలో మొత్తం 476 మంది విద్యార్థులకుగాను శనివారం నిర్వహించిన తెలుగు మొదటి పేపర్‌కు 475 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. మొదటి రోజు పరీక్షలు కావడంతో స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టి విద్యార్థులను పరీక్ష సెంటర్లకు పంపించారు. ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Read More »

ఉరివేసుకుని వ్యక్తి మతి

రెంజల్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటా పూర్‌ గ్రామానికి చెందిన లాలి లింగం (42) అనే వ్యక్తి గ్రామ శివారులోని పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మతి చెందినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. లాలి లింగం మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవారని శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవ పడి వెళ్లి పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మతి చెందినట్లు తెలిపారు. తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ...

Read More »

పరీక్ష అట్టల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఉపాధ్యాయ సిబ్బంది పరీక్ష అట్టల వితరణ చేశారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ పీ.బీ.కష్ణమూర్తి నిజామాబాద్‌ వారి ప్రోత్సాహంతో విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు, పిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌ సింగ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, రాజు, సునీల్‌, గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. గురువారం రెంజల్‌ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళా దినోత్సవం ప్రాముఖ్యత ప్రపంచంలోని మహిళలు సాధించిన విషయాలను వివరించారు. మహిళలు మునుముందు మరింత అభివద్ధి చెంది మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. సమాజంలో ...

Read More »

తైబజార్‌ వేలం

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన సాటాపూర్‌ తైబజార్‌ వేలంను గురువారం సర్పంచ్‌ వికార్‌ పాషా, కార్యదర్శి రఘురాం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. వివిద గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. 10 లక్షల 12 వేల రూపాయలకు సాటాపూర్‌ గ్రామానికి చెందిన మునీర్‌ అనే వ్యాపారస్తుడు తైబజార్‌ను వేలంలో పొందారు. తైబజార్‌ కాలపరిమితి ఒక సంవత్సర కాలానికి సంబంధించినదని కార్యదర్శి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, కార్యదర్శి ...

Read More »

మహిళలకు పోషక లోపాలు లేకుండా చూడాలి

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు, మహిళలకు పోషకాలలో లోపాలు లేకుండా చూడాలని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల అన్నారు. శిశుసంక్షేమ శాఖ ఆద్వర్యంలో పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఐసిడిఎస్‌ ఆద్వర్యంలో అంగన్‌వాడి కేంద్రాల్లో పోషణ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. కిషోర బాలికలకు పోషకాహారంపై అవగాహన నిర్వహించి బాల్య వివాహాలు విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు తప్పక పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా ...

Read More »

ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

రెంజల్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి వ్యవస్థాపకులు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదినవేడుకలు రెంజల్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. అనంతరం రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవంతుడు కవితక్కకు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బోధన్‌ మార్కెట్‌ కమిటీ ...

Read More »

ప్లేట్ల పంపిణీ అభినందనీయం

రెంజల్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు ప్లేట్లను అందజేయడం అభినందనీయమని సర్పంచ్‌ లలిత, ఎంఇవో గణేవ్‌రావు అన్నారు. మండలంలోని నీలా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ తండ్రి గైని గంగారాం జ్ఞాపకార్థం మంగళవారం విద్యార్థులకు ఉచితంగా 250 ప్లేట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి విద్యార్థులకు పలు రకాలుగా ప్రోత్సాహకాన్ని అందిస్తు తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం బహుమతులు అందజేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ, పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు ...

Read More »

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆద్వర్యంలో గ్రామ సర్పంచ్‌ లలితను మంగళవారం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్దికి సహకరించాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ పాఠశాల అభివృద్దికి ఎల్లవేళలా సహాయసహకారాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయుడు లక్ష్మినారాయణ, పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు సోమలింగం, సాయిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌సింగ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, పోసాని, అనిల్‌ తదితరులున్నారు.

Read More »

ప్రశ్నించే వారికే పట్టం కట్టండి

రెంజల్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమర్థులైన వారికే పట్టం కట్టాలని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్‌ అన్నారు. పిఆర్‌టియు పక్షాన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూర రఘోత్తం రెడ్డికి మద్దతుగా రెంజల్‌ మండలంలోని పలు పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరుగకుండా పోరాటం చేసిన రఘోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి ...

Read More »

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని ఎంఇఓ గణేష్‌ రావు అన్నారు. శుక్రవారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు కస్తూర్బా పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలురకాల ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం ఎంఇఓ గణేష్‌ రావు మాట్లాడుతూ మహిళలు ...

Read More »

తాడ్‌ బిలోలి లో మహిళా సదస్సు

రెంజల్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం (పీవోడబ్ల్యూ) ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సర్పంచులను సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అప్పుడే మహిళలు చైతన్య వంతులు అవుతారని పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి అన్నారు. మహిళలు సమాజాభివద్ధిలో పురుషులతో సమానంగా రాణించాలని అప్పుడే మహిళలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. జీవించే హక్కును హరిస్తున్న పితస్వామిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మహిళలందరూ పోరాడవలసిన అవసరముందని ...

Read More »

కేసీఆర్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్‌ విజయ కేసిఆర్‌ కిట్‌లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆడపిల్లల సంరక్షణ కొరకు ప్రభుత్వాసుపత్రిలో ప్రమాదాలు జరుగుతూ కేసరి ద్వారా తల్లి బిడ్డకు సరిపడా సామాగ్రిని, నగదును అందజేయడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read More »

సర్పంచ్‌కు సన్మానం

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కళ్యాపూర్‌ గ్రామ సర్పంచ్‌ కాశం నిరంజని ని రావుజి వంజరి సంఘం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భూమయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఎన్నికైన వంజరి కుల సంఘం సర్పంచ్‌ సభ్యులు వంజరుల ఐక్యతకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు కరిపే సత్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కాశం సాయిలు,రవి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా దేవతమూర్తుల విగ్రహాలను వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠాపన చేశారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమవారం శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా ...

Read More »

ప్రజలు మూఢవిశ్వాసాలు నమ్మద్దు

రెంజల్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై శంకర్‌ అన్నారు. గురువారం రాత్రి రెంజల్‌లో పోలీసు కళాబందం ద్వారా మూఢ నమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మవద్దని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్న ప్రజలు మూఢనమ్మకలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని, ఒక్కో సీసీ కెమెరా 100 మందితో ...

Read More »

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలోని గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా, ఆలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేశారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »