Breaking News

Renjal

వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం

రెంజల్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్‌ సవిత రాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమతా లైఫ్‌ సైన్సెస్‌ వారి ఆధ్వర్యంలో కౌమార బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. శారీరక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విద్యార్థులకు అవసరమైన సలహాలను, సూచనలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. కౌమార బాలికలకు వచ్చే శారీరక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైద్యులను సంప్రదించి ...

Read More »

ఇష్టపడి చదివితే విజయం వరిస్తుంది

రెంజల్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడే అనుకున్న విజయాన్ని సాధిస్తారని రెంజల్‌ ఎస్సై శంకర్‌ అన్నారు. శుక్రవారం కస్తూర్బా బాలికల పాఠశాలలో కీర్తన సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినిలకు పరీక్ష అట్టలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తమ ప్రతిభ ఆధారంగానే సమాజంలో గొప్ప హోదా కలుగుతుందని విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యను బోధించిన ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని ఆయన అన్నారు. కీర్తన సొసైటీ అధ్యక్షులు ప్రణయ్‌రాజ్‌ మాట్లాడుతూ ...

Read More »

ఓటర్‌ నమోదు పై అవగాహన ర్యాలీ

రెంజల్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క దివ్యాంగులు ఓటరు నమోదు చేసుకోవాలని తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్‌వాడి కార్యకర్తలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నేటి నుండి 5వ తేదీ వరకు ఓటర్‌ నమోదు కోసం బీఎల్‌వోలు స్థానికంగా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటారని వారి వద్ద నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ...

Read More »

పాసుపుస్తకాల పంపిణీ

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో నూతనంగా మంజూరైన పట్టాదారు పాస్‌పుస్తకాలను తహసిల్దార్‌ కార్యాలయంలో బుధవారం తహసిల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపీపీ మోబిన్‌ఖాన్‌ లు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మండలానికి నూతనంగా 309 పట్టాపాసు పుస్తకాలు మంజూరవడంతో వాటిని లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తహసిల్దార్‌ తెలిపారు.

Read More »

మంత్రిని కలిసిన తెలంగాణ శంకర్‌

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని బుధవారం తెలంగాణ శంకర్‌ నిజామాబాద్‌ లో కలిశారు. అభినందనలు తెలిపి పూలమాలతో ఘనంగా సన్మానించారు. మంత్రిపదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్‌కు విచ్చేసిన వేముల ప్రశాంత్‌రెడ్డికి టిఆర్‌ఎస్‌ నాయకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఆయన వెంట జాగతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్‌ ఉన్నారు.

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

రెంజల్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో పాల్గొని ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అనంతరం పలు రకాల రికార్డులను పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Read More »

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్నీ సోమవారం మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌, విండో చైర్మన్‌ మొహినోద్దీన్‌ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన శనగ పంటను దళారులను ఆశ్రహించకుండా నేరుగా ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాల్లోన్నే విక్రయించాలన్నారు. శనగ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర రూ.4620 చెల్లిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ...

Read More »

పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామంలో శనివారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను సర్పంచ్‌ లలిత ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ పనులలో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్‌ పనులను త్వరగా చేపట్టాలన్నారు. తెరాస మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌, ఉపసర్పంచ్‌ నాగభూషణం, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏ.ఇ. ప్రమోద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమిపూజ

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సర్పంచ్‌ సునీత భూమిపూజ చేశారు. ఎంఎస్‌డిపి నిధుల ద్వారా మంజూరైన రూ.22.48000ల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పనులలో గుత్తేదారు నాణ్యత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, మాజీ ఎంపిటిసిలు నర్సయ్య, శ్రీనివాస్‌, రైతు సమన్వయసమితి జిల్లా సభ్యుడు మౌలానా, రైతుసమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, గ్రామస్థులు సాయరెడ్డి, హన్మంత్‌ రావ్‌, ...

Read More »

పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో బుధవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులను సర్పంచ్‌ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ పనులలో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్‌ పనులను త్వరగా చేపట్టాలన్నారు. మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, రైతుసమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్‌, గ్రామస్తులు సాయరెడ్డి, హన్మంత్‌రావ్‌, ...

Read More »

ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

రెంజల్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి హిందూ ధర్మాన్ని పరిరక్షించి ఇతర మతాలను గౌరవించిన ఘనత ఒక్క చత్రపతి శివాజీకి దక్కుతుందని హైందవ యూత్‌ సభ్యులు అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి, బొర్గం, నీలా, కందకుర్తి, రెంజల్‌, దూపల్లి, కళ్యాపూర్‌, సాటా పూర్‌ గ్రామాల్లో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజ కార్యక్రమాలు నిర్వహించి జై శివాజీ అంటూ పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తెలంగాణ శంకర్‌, ...

Read More »

అక్రమ కేసులు ఎత్తివేయాలి

రెంజల్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల తరపున పోరాడుతున్న రైతు కూలీసంఘం నాయకులు వి.ప్రభాకర్‌, బి.దేవరాంలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి విడుదల చేయాలని రైతుకూలీ సంఘం నాయకులు సోమవారం తహసీల్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రైతుల పక్షాన రైతుల కోసం పోరాడిన రైతు కూలీ సంఘం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని రైతుకూలీ సంఘం మండల నాయకులు నాగన్న, ఒడ్డెన్న, నసీర్‌, రాజేశ్వర్‌లు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర ...

Read More »

కిసాన్‌ సమ్మాన్‌ పథకంపై అవగాహన

రెంజల్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా అధికారులు పథకానికి అర్హులైన లబ్దిదారులను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఈవో అజయ్‌ మాట్లాడుతూ ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.6000 నగదును మూడు విడతలలో కేంద్ర ప్రభుత్వం అందించనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మౌలానా, రైతు సమన్వయ సమితి ...

Read More »

భారత జవాన్లకు అశ్రునివాళి

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాశ్మీర్‌లో సిఆర్పీఫ్‌ జవాన్లఫై జరిగిన దాడికి నిరసనగా శనివారం మండలంలోని తాడ్‌ బిలోలి, నీలా, కళ్యాపూర్‌, కందకుర్తి గ్రామల్లోని యువకులు జాతీయ పతాకం, కొవ్వొత్తులతో గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ల దిష్టి బొమ్మలను, పాకిస్థాన్‌ జెండాను దగ్ధం చేశారు. అమర జవాన్లకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. అమర జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. నేరుగా పోరాడే ధైర్యం లేకనే దొంగచాటుగా ఇలాంటి దాడులకు ...

Read More »

గ్రామ పంచాయతీల పరిశీలన

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన కొరకు ఢిల్లీ నుండి వచ్చిన డాక్టర్‌ దివ్య, సమద్ధి ప్రత్యేక బందం శనివారం మండలంలోని బాగేపల్లి బోర్గాం గ్రామాల్లో పర్యటించి గ్రామీణ అభివద్ధి, పంచాయతీ రాజ్‌ పథకాల అమలుపై పర్యవేక్షణ నిర్వహించారు. గ్రామ పంచాయతీల తీరు, గ్రామాల్లో పర్యటించి పెన్షన్లు, ఉపాధి హామీ, మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులపై గ్రామాల్లో విచారణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో అమలు విధానంపై ...

Read More »

మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు, ఎర్ర జొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతుంటే ప్రభుత్వం రైతులను మాత్రం అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్యఅని సిపిఐ ఎంఎల్‌ నాయకులు నాసిర్‌ రాజేశ్వర్‌ అన్నారు. గత కొన్ని రోజులుగా రైతులు మామిడి పల్లి చౌరస్తాలో రైతు మద్దతు ధర కల్పించాలని దీక్షకు దిగడంతో రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం సరికాదన్నారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ రైతులను ముందస్తుగా అరెస్టు ...

Read More »

త్రివేణి సంగమంలో పాపవ్వ అస్తికలు నిమజ్జనం

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తల్లి ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసిందే. కాగా పాపవ్వ అస్థికలను శనివారం మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో కలిపారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు శంభురెడ్డి సమక్షంలో అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేశారు.

Read More »

నేరుగా పోరాడే ధైర్యం పాకిస్థానీలకు లేదు

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాకిస్తాన్‌ కు భారతదేశంపై నేరుగా పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా ఇలాంటి దాడులకు పాల్పడుతుందని పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని బిజెపి మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ అన్నారు. శనివారం సాటాపూర్‌ చౌరస్తాలో రెంజల్‌ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో పాకిస్థాన్‌ జెండాను తగలబెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య అని. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మ శాంతించాలన్నారు. ...

Read More »

వీర జవాన్లకు దివ్యాంగుల నివాళి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జమ్మూ కాశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వీర జవానుల ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం మండలంలోని సాటాపూర్‌ లోని భవిత దివ్యాంగుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మేము సైతం అమరవీర జవాన్లకు శ్రద్ధాంజలి అర్పిస్తాం అంటూ కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వనాథ్‌, స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఎంపీ కవితను కలిసిన సర్పంచ్‌

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవితను శుక్రవారం దండి గుట్ట గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి గ్రామస్తులు నిజామాబాదులోని ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న ఎంపీ కవితను అభినందించారు. దండిగుట్ట గ్రామాభివృద్దికి ఎంపీ సహాయ సహకారాలు అందిస్తే వాళ్ల గ్రామాన్ని మరింత అభివద్ధికి కషి చేస్తామని సర్పంచ్‌ శ్రీదేవి తెలిపారు. ఆమె వెంట గ్రామస్తులు కిష్టయ్య, చరణ్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More »