Breaking News

Sadashivanagar

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సదాశివనగర్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సదాశివనగర్‌ మండల కేంద్రంలో మండలానికి చెందిన 95 మంది లబ్దిదారులకు 95 లక్షల 11 వేల 020 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా తన సొంత ఖర్చులతో ఆడపడుచులకు కిట్టు (పట్టు చీరలను) స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జహీరాబాద్‌ ఎం.పీ బి.బి పాటిల్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల జడ్పీటీసీ నర్సింలు, ఎంపీపీ అనసూయ రమేష్‌, స్థానిక ఎంపీటీసీలు శ్రీనివాస్‌ (వైస్‌ ఎంపీపీ), బీరయ్య, సర్పంచ్‌ శ్రీనివాస్‌ ...

Read More »

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27 నుంచి ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ భానుమతి తెలిపారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి, ఏడు నుంచి 10వ తరగతి వరకు ఖాలీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వించనున్నట్లు పేర్కొన్నారు. 27న 6వ తరగతి, 28న 7, 8వ తరగతులు, 29న 9, 10వ తరగతుల వారికి పరీక్ష ఉంటుందన్నారు. ...

Read More »

హత్య కేసులో నిందితుడి అరెస్టు

సదాశివనగర్‌ : రూ.3 వేలు అప్పు ఇమ్మని అడిగితే ఇవ్వనందుకు సదాశివనగర్‌ మండల కేంద్రంలో శీల శంకర్‌ను ఏప్రిల్‌ 18న బండరాయితో తలపై కొట్టి హత్య చేసిన ఘటనలో నిందితుడు తోకల రాజును సోమవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు కామారెడ్డి రూరల్‌ సీఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శీల శంకర్‌, తోకల రాజులు కలిసి ఆ రోజున మద్యం సేవించారు. ఈ క్రమంలోనే తనకు రూ. 3 వేలు అప్పుగా ఇవ్వాలని రాజు, శంకర్‌ను అడిగారు. తాను ఇవ్వనని ...

Read More »

3.58 లక్షల టన్నుల చెరకు గానుగ

సదాశివనగర్‌ : అడ్లూర్‌ఎల్లారెడ్డిగాయత్రి షుగర్స్‌ పరిశ్రమలో మంగళవారం నాటికి 3.58 లక్షల టన్నుల చెరకు గానుగ చేసినట్లు జనరల్‌ మేనేజర్‌ (కేన్‌) వెంకట్‌రావు తెలిపారు. మంగళవారం రోజున 3390 టన్నుల చెరకు గానుగ చేశామన్నారు. రైతులువరుస క్రమంలో అనుమతి పత్రాలు పొంది తమకు సహకరించాలన్నారు. క్షేత్రసహాయకులు అందుబాటులో లేనిచో తమకు సమాచారం అందించి అనుమతిపత్రాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిందుసేద్యం సాంకేతిక అధికారి హన్మంత్‌రావు పాల్గొన్నారు.

Read More »