Breaking News

sirikonda

త్వరగా పూర్తిచేయాలి… మళ్ళీ వస్తా…

సిరికొండ, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం గడ్కోల్‌, సిరికొండ గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలాఖరు నాటికి రైతు వేదికలు ప్రారంభించు కోవాలని, పని ఫాస్ట్‌గా జరగాలన్నారు. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకతి వనాలు, హరితహారం పనులు పరిశీలించారు. గడ్కుల్‌ వైకుంఠ దామంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడ్కుల్‌లో వైకుంఠధామం బాగుందని సర్పంచ్‌ని అభినందించారు. విలేజ్‌ పార్కు, రైతు ...

Read More »

పాముకాటుతో బాలుడు…

రామన్నపేట : పాముకాటుకు గురై బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని సిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన పబ్బు వెంకటేశం కుమారుడు పబ్బు శివ(8) గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. తనకుమారుడు పాముకాటుకు గురికావడంతో వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నార్కట్‌పల్లిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు ...

Read More »

కుంగుతున్న శాలిగౌరారం ప్రాజెక్టు రాళ్లు.. ఆందోళనలో రైతులు

శాలిగౌరారం : జిల్లాలోనే మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు కట్ట రాళ్లు కదులుతున్నాయి. చెరువు కట్టను పటిష్టం చేసేందుకు నవాబుల కాలంలో నిర్మించిన రాతికట్టడం కుంగుతోంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాజెక్టు కట్ట మధ్యన లోపలి భాగంలో నీటి అలలకు కట్ట కుంగిపోతోందని రైతులు పేర్కొంటున్నారు. కట్టకు ఏర్పాటు చేసిన రాళ్లు కదులుతుండడంతో ఆయకట్టు కింది గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కట్టను పటిష్టం చేయాలని ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు ...

Read More »

తూంపల్లి అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యం

సిరికొండ : మండలంలోని తూంపల్లి గ్రామ పరిధిలోని పులుసుమామిడి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యమైయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మేకల కాపరి అటవీ ప్రాంతంలో మేకలను మేపడానికి వెళ్లడంతో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనబడంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. సర్పంచి బుసా దేవరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భీమ్‌గల్ సీఐ రమణారెడ్డి ,ఎస్సై ఉపేందర్ రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద ...

Read More »

రెండేళ్ల బాలుడు మృతి

తూంపల్లి (సిరికొండ): సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో రెండేళ్ల బాలుని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం నాగేష్‌, రుక్క దంపతుల రెండో కుమారుడు నాగేంద్ర(2) రజకుల దోభీగాట్‌ నీటితొట్టిలో పడి పసిప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు బట్టలు ఉతకటానికి వెళ్లటంతో వాళ్లతోధోబీఘాట్‌కు వెళ్లారు. ఉతికిన బట్టలను ఆరవేసిందుకు తల్లిదండ్రులు వెళ్లగానే బాలుడు నీటితొట్టీని పట్టుకొని ఆడుతుండగా అనుకోకుండా అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు గమనించలేదు. బట్టలు ఆరేసి వచ్చేసరికి విగత జీవిగా కుమారుడు కనిపించడంతో తల్లిదండ్రులతో పాటు అక్కడున్న వారందరూ కన్నీటి ...

Read More »

లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో హోమం

  సిరికొండ : మండల కేంద్రంలో ని కొండ కింద భాగాన వెలిసిన శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఉత్సవాలు ముగిశా యి. సోమవారం ఆలయంలో హోమం నిర్వహించారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమ ం ఏర్పాటు చేశారు. ఆలయ క మిటీ సభ్యులు లింబాద్రి, గంగారెడ్డి, చిన్న గంగయ్య, భూషణ్‌రెడ్డి, రంజిత్, బాలరాజు, శ్రీకాంత్, గంగాధర్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Read More »

కులరహిత సమాజమే లక్ష్యం

  సిరికొండ, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులరహిత సమాజం మన అందరి లక్ష్యం కావాలని, విద్యార్థి జీవితం నుంచే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని, ఒడిదొడుకులు ఎదురైనా వెనుదిరగకుండా తన జీవితం సమాజానికి అంకితం చేసిన మహానుభావుడు బాబుజగ్జీవన్‌రామ్‌ అని సత్యశోధక్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ నర్సయ్య అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సమతామూర్తి భారత అమూల్యరత్న బాబు జగ్జీవన్‌రామ్‌ 108వ జయంతి వేడుకలు మండలంలోని సత్యశోధక్‌ పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు ...

Read More »

సత్యశోధక్‌లో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి

  సిరికొండ, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, సామాజిక విప్లవ కారిణి, చదువుల తల్లి మహిళా మూర్తి సావిత్రిబాయి ఫూలే 119వ వర్ధంతి సిరికొండ మండలంలోని సత్యశోధక్‌ పాఠశాలలో గురువారం నిర్వహించారు. ముందుగా సంస్థ ఛైర్మన్‌ నర్సయ్య సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీలకు, పీడిత, తాడిత వర్గాల ప్రజలకు విద్యావకాశాల కోసం, సామజిక గౌరవం కోసం ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ...

Read More »

మహిళా సాధికారత మహోజ్వలమవ్వాలి

- ఎంపిపి మంజుల సిరికొండ, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడతనం, అమ్మతనం ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశిని నిర్దేశిస్తుందని, అభ్యుదయభావాల సమాహారం, ప్రేమానురాగాల భాండాగారం మహిళలని ఎంపిపి బోయిడి మంజుల ప్రకాశ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక సత్యశోధక్‌ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మహిళా చైతన్యర్యాలీని ఎంపిపి బోయిడి మంజుల ప్రకాశ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజం పురోగతి సాధించాలన్నా, మానవీయ ...

Read More »

అగ్ని ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

  సిరికొండ, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ప్రమాదస్థాయిని బట్టి తగు ప్రాథమిక అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి భానుప్రతాప్‌ అన్నారు. ఈ మేరకు గురువారం సిరికొండ మండలంలోని సత్యశోధక్‌ పాఠశాలలో అగ్ని ప్రమాదాలు – నివారణ చర్యలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భానుప్రతాప్‌ మాట్లాడుతూ ప్రమాద స్థలంలో నివారణ చర్యలు ...

Read More »

కొండపై కొలువైన అన్నపూర్ణేశ్వరీ

సిరికొండ :మండలంలోని పెద్ద వాల్గోట్ సమీపంలో ఎత్తైన గుట్టపై వెలిసిన అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నా రు. ఈనెల 7 నుంచి రెండు రోజుల పాటు గుట్టపై న జాతర, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అన్నపూర్ణ మాత కొలువైన ఆ గుట్టకు బోడగుట్ట అని పేరు. 200 ఏళ్ల క్రితం ఓ మహర్షి తపస్సు చేసి గుట్టపైన అమ్మవారి ఆలయా న్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలిసింది. ఆ గుడికి ...

Read More »

విషాహారం తిన్న ఆవులు… అస్వస్థత

గడ్కోల్‌ (సిరికొండ, న్యూస్‌టుడే): మండలంలోని గడ్కోల్‌ గ్రామ పరిధిలో ఉన్న జొన్న పంటను తిని 350 ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. ఒక ఆవు మృతి చెందింది.ముషీర్‌నగర్‌ గ్రామానికి చెందిన కేతావత్‌ చందర్‌, అజ్మీరా హిత్న గిరిజన కుటుంబాలకు చెందిన ఆవులు ఆదివారం సాయంత్రం గడ్కోల్‌ గ్రామ పరిధిలో ఉన్న జొన్నను మేయటంతో అస్వస్థతకు గురయ్యాయి. ఐదు రోజుల కిందట జొన్న పంటకు వాడిన రసాయనిక ఎరువులు వదలకపోవటంతో ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలానికి జిల్లా సంచార వైద్యులు ప్రమోద్‌ ఆధ్వర్యంలో వచ్చి ఆవులకు ...

Read More »