Breaking News

Spiritual

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

  1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? ( బ్రహ్మ) 2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు) 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం) 4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం) 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం) 6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు) 7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం) 8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన) 9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన) 10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార …

Read More »

నిజమైన భక్తి తియ్యమామిడి పండు లాంటిది

పిండినకొద్దీ మధురమైన రసం వస్తుంది. కష్టాలు పడినకొద్దీ భక్తి మరింత మధురంగా మారిపోతుంది. భక్తి మైకంలో సుఖదుఃఖాల స్పృహే ఉండదు. బాబరు కాలంలో జరిగిన సంఘటన ఇది. గురునానక్‌దేవ్‌ని మహనీయుడిగా గుర్తించి, సాధువులు గంజాయిని ఇష్టపడతారు గనుక ఆయనకు ఎంతో విలువైన గంజాయి సంచిని బహుమతిగా బాబరు ఇవ్వజూపుతాడు. ‘నేను ఎప్పుడూ దైవనామ జపమనే మత్తులో మునిగి ఉంటాను. నాకు ఇతర మత్తు పదార్థాల అవసరమే లేదు’ అంటూ గురునానక్‌దేవ్‌ సున్నితంగా తిరస్కరిస్తాడు. నిజ భక్తి అలా ఉంటుంది. ప్రదర్శన భక్తి ఎన్నడూ మేలిమి …

Read More »

పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ

పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ ఆమె సంతరించుకున్నది అని ఎలా చెప్తామో పెండ్లి కుమారుని చేసినప్పుడు పెండ్లి కుమారునకు కూడా పరమశివుని కళ ఆవాహన అవుతుంది. పెండ్లి కుమారుని చేసినప్పుడు ఆ సుముహూర్తానికి మంగళస్నానం చేయిస్తారు. తిలక ధారణ చేయించి వైదికమైనటువంటి వస్త్రాలంకారం చేసి పిల్లవాడిని కూర్చోబెట్టి పెండ్లి కుమారుని చేసినప్పుడు తప్పకుండా చేయవలసింది కులదేవతారాధన చేయాలి. ఎందుకంటే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది భార్య రూపంలో. తన ఐశ్వర్యం పెంపొందాలి. తను పితృఋణం నుండి విముక్తుడు అవడానికి సంతానం పొందాలి. …

Read More »

 “మర్యాద-స్థాయి”

  “మర్యాద-స్థాయి” అనేవి ఎవరికి వారు ప్రకటించుకునేవి కాదు, ఎదుటి వారు మనలో డబ్బు, అంతస్తు, బలగం ఇవేవి కాక కేవలం మన గుణం చూసి మనకు ఇచ్చేవి, “మర్యాద-స్థాయి”. మన గుణం గుర్తింపు పొందే అంత స్థాయి కలిగి ఉన్నప్పుడు మనం పొందేది మర్యాద, అది ఇచ్చేది మన గుణం యొక్క స్థాయి. అటువంటి గుణం పొందడానికి సంస్కారం అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోదు, సంస్కారం అలవర్చుకోవాలి. నూటికి తొంభై శాతం చదివో వినో సంస్కారం గురించి తెలుసుకుని సంస్కారం పొందేశాము అనుకుంటారు,. …

Read More »

నేరెళ్‌ తాండాలో ఘనంగా ఆంజనేయస్వామి ఆలయవార్షికోత్సవం

  గాంధారి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరెళ్‌ తాండాలో ఆంజనేయస్వామి వారి ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హోమం, అభిషేకాలు నిర్వహించిన అనంతరం వార్షికోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామిజి అనుగ్రహ భాషణం, ప్రవచనాలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జడ్పిటిసి తానాజీరావు, వైస్‌ ఎంపిపి చందా నాయక్‌, మాజీ ఎంపిపి దశరథ్‌ …

Read More »

పంచముఖి హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించిన తొగుట పీఠాధిపతి

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హనుమాన్‌ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని ఆదివారం ఉదయం తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్దికి పలు సూచనలు చేస్తు అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీ సూచనల మేరకు ఆలయ అభివృద్దికి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆంజనేయశర్మ, నగేశ్‌, శ్రీనివాస్‌, రవి, చంద్రశేఖర్‌, వెంకటి, రాజ్‌కుమార్‌, చీలప్రభాకర్‌, లక్ష్మణ్‌, కౌన్సిలర్‌లు ముప్పారపు ఆనంద్‌, కుంబాల రవి, జమిల్‌, గణేశ్‌, భక్తులు …

Read More »

అయ్యప్ప స్వామి దీక్షకు పాటించాల్సిన కఠోర నియామాలు ఏమిటో తెలుసా..?

ధనుర్మాసం అనగానే సూర్యోదయంలోగా స్నానాలు.. పూజలు.. ఉపవాసాలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. మాలధారణలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఈ మాసంలోనే వేలాది మంది భక్తులు జ్యోతిస్వరూపుడు.. హరిహరసుతుడు.. శబరిమల మీద కొలువై ఉన్న దేవదేవుడు, ప్రతి సంవత్సరం వందల మంది స్వామి దీక్ష చేబట్టి జ్యోతి దర్శనం కోసం శబరికి వెళతారు. శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో …

Read More »

క్రిస్మస్ ఆచారాలు గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు…

క్రిస్మస్ సమయంలో వేడుకలను చాలా ఆనందంగా చేసుకుంటారు. క్రిస్మస్ తో ముడిపడిన కొన్ని ఆచారాల కారణంగా ఈ పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి పండుగలోను ఇతిహాసాలు మరియు సంప్రదాయాలు అనేవి దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటాయి. క్రిస్మస్ విషయంలో కూడా ఇతిహాసాలు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. క్రైస్తవ పండుగలలో కిస్మస్ అనేది ప్రధానమైన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను బిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటారు. అందువలన క్రిస్మస్ ఆచారాలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. క్రిస్మస్ సంబంధించిన ఆచారాలు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ …

Read More »

శివుడిని పూజించేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పొరపొట్లు..!!

హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. మీకు తెలుసా ? శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. …

Read More »

ప్రారంభమైన అయ్యప్పస్వాముల మహాపాదయాత్ర

  కామారెడ్డి, అక్టోబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప దీక్షాపరులు 119 మంది కామారెడ్డి అయ్యప్ప దేవాలయం నుంచి శబరిమలకు మహాపాదయాత్రగా తరలివెళ్లేందుకు సంకల్పించారు. ఆదివారం అయ్యప్ప ఆలయంలో గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వాములు మహాపాదయాత్రను ప్రారంభించారు. దీనికి ఎంపి బి.బి.పాటిల్‌ హాజరయ్యారు. స్వాములు చేపట్టిన దీక్షను ప్రశంసించారు. దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పాదయాత్రను అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉదయ్‌, రమేశ్‌, …

Read More »