Breaking News

State News

రేషన్ డీల‌ర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూ.36.36 కోట్ల కమిషన్‌ విడుదల‌ చేసింది. ఏప్రిల్‌, మే నెల‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించిన కమిషన్‌ ఇది. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల‌ చొప్పున కమిషన్‌ చెల్లించింది సర్కార్‌. ఏప్రిల్ నెల‌లో 3.18 ల‌క్షలు, మే నెల‌లో 3.26 ల‌క్షల‌ మెట్రిక్ టన్నుల‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. కమిషన్‌ ఇవాళ ...

Read More »

గొప్ప పనులు చేస్తున్నారు

రాజన్న సిరిసిల్లా, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల‌ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నేడు ప్రారంభించారు. ఆవునూరు-వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా స్పీకర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని, హరితహారం ...

Read More »

కల్లాల‌ నిర్మాణానికి దరఖాస్తులు

హైదరాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన పంట ఆరబెట్టుకోవడానికి కల్లాల‌ నిర్మాణం కొరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. దీనిలో 3 రకాల‌ నిర్మాణాలు ఉన్నాయి. 1) 50 స్క్వేర్‌ మీటర్లు – 538 స్క్వేర్‌ ఫీట్‌ యూనిట్‌ ధర రూ. 56, 000 2) 60 స్క్వేర్‌ మీటర్లు – 645 స్క్వేర్‌ ఫీట్‌ యూనిట్‌ ధర రూ. 68000 3) 75 స్క్వేర్‌ మీటర్లు – 807 స్క్వేర్‌ పీట్‌ యూనిట్‌ ధర రూ. ...

Read More »

రైతు ఆత్మహత్య

పెద్దపల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దపల్లి జిల్లా కాల్వ‌ శ్రీరాంపూర్‌ తహశీల్దార్‌ కార్యాల‌యం ముందు రైతు ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. రెడ్డిపల్లికి చెందిన మంద రాజి రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల‌ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకరం 20 గుంటల‌ భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, వీఆర్వో గురు మూర్తి, స్వామి పేర్లు సూసైడ్‌ నోట్‌లో రాశాడు.

Read More »

ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దు

హైదరాబాద్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదల‌య్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల‌ను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాల‌యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల‌ చేశారు. ఫస్టియర్‌లో 60.1 శాతం, సెకండియర్‌లో 68.86 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్ల‌డిరచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంత ఉత్తీర్ణత శాతం రావడం ఇదే తొలిసారన్నారు. ఈ సారి ఫలితాల్లో కూడా బాలికల‌దే పైచేయి అన్నారు. ఈ నెల‌ 22 వరకు కాలేజీల‌కు మార్కుల‌ మెమోలు అందనున్నట్లు ...

Read More »

సైనిక లాంఛనాల‌తో ఆర్మి క‌ల్న‌ల్‌ అంత్యక్రియలు

సూర్యపేట, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాల‌తో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌ బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సంస్కారాల‌ ప్రక్రియలో 16 బిహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా వ‌ల్ల‌ పరిమిత సంఖ్యలో అంత్యక్రియల‌కు అనుమతించారు. అంతకుముందు విద్యానగర్‌లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్‌ విలాస్‌ సెంటర్‌, రైతు ...

Read More »

క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుటుంబానికి రూ. ల‌క్ష ఆర్థిక సాయం

నిజామాబాద్‌ ప్రతినిధి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణల్లో వీరమరణం పొందిన తెలంగాణ సూర్యాపేట ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుటుంబానికి ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తరపున ఆ శాఖ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌పి స్టేట్‌ లీడర్‌ ఉప్పల‌ శ్రీనివాస్‌ గుప్త రూ. ల‌క్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. క‌ల్న‌ల్‌ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉప్పల‌ శ్రీనివాస్‌ భారతజాతి కోసం ఆర్యవైశ్య బిడ్డ చేసిన ప్రాణత్యాగం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ...

Read More »

మిడతల‌ దాడుల‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల‌మేరకు రాష్ట్రంలో మిడతలు దాడిచేసే ప్రమాదమున్న 9 సరిహద్దు జిల్లా కలెక్టర్లు ఎస్‌.పిలు, ఫైర్‌, వ్యవసాయ, అటవీ శాఖ అధికారుల‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ బుధవారం బిఆర్‌ కెఆర్‌ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎటువంటి పరిస్ధితుల‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల‌ని, మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న గ్రామాల‌లో చేపట్టబోయే చర్యల‌పై సూక్ష్మ స్ధాయి ప్రణాళిక తయారు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామాల‌లో ...

Read More »

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సిఎం

కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా (ఎన్‌ఆర్‌ఇజిఏ) పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ను, కాలువ‌ల్లో పూడిక తీత పనులు, కాలువ‌ల‌ మరమ్మతు పనుల‌ను నరేగా ద్వారా పెద్ద సంఖ్యలో చేయించిన జగిత్యాల‌, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్‌, సిక్తా పట్నాయక్‌, ఆర్‌.వి. కర్ణన్‌ను అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కల‌ను బతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు అభినందించారు.

Read More »

సంతోష్‌బాబు త్యాగం వెల‌కట్టలేనిది

హైదరాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన క‌ల్న‌ల్‌ బిక్కుమ‌ల్ల‌ సంతోష్‌ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెల‌కట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్‌ తల్లిదండ్రులు, భార్యాపిల్ల‌లు, ఇతర కుటుంబ సభ్యుల‌కు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు. సంతోష్‌ ...

Read More »

ఐలయ్య పుస్తకంపై వైశ్యుల ఆగ్రహం

ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై గరమైతున్నారు ఆర్యవైశ్యులు. ఆయన రాసిన.. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు పుస్తకం తమను కించపరిచెటట్టు ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు ఆర్యవైశ్యులు. ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు పెట్టారు.  ఆయన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరిలో.. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాల ఆర్యవైశ్యులు నిరసనకు దిగారు. కించపరిచేలా కంచె ఐలయ్య పుస్తకం రాశారని ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యవైశ్యులను స్మగ్లర్లు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లో.. కంచె ఐలయ్య రాసిన ...

Read More »

తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ డిమాండ్స్ డే

 14. 04. 2017 అధికారంలోకి వచ్చి 34 నెలలైనా…. ప్రవాసులను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ! తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 10 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో, మరో 10 లక్షల మంది అమెరికా తదితర దేశాలలో నివసిస్తున్నారు. ‘తెలంగాణ ప్రవాసుల సంక్షేమం’ పేరిట టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక-2014 లో పలు హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటింది, 34 నెలలు గడిచిపోయాయి, ఇచ్చిన హామీల అమలు చేయడం లేదు. ఈ బడ్జెలో గల్ఫ్ ఎన్నారైల సంక్షేమానికి ...

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన TNREDCL చైర్మ‌న్

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో క‌లిసి తెలంగాణ నూత‌న పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న అభివృద్ధి సంస్థ (TNREDCL) చైర్మ‌న్ స‌య్య‌ద్ అబ్దుల్ అలీం ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆలీం సిఎంకు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌పై న‌మ్మ‌కంతో ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చార‌ని, మీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని అలీం సిఎంతో అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కూడా పాల్గొన్నారు.

Read More »

తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ జీతాల పెంపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన చంద్రులు ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వోద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచారు. తాజాగా మరోసారి జీతాలు పెంచుతామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అది కూడా అందరికి కాదు అంగన్‌వాడీ సిబ్బందికి..ఇవాళ జనహిత కార్యక్రమంలో భాగంగా ప్రగతిభవన్‌లో సీఎం అంగన్‌వాడీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన త్వరలోనే మీకు మరోసారి జీతాలు పెంచుతానని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.10,500 సహాయ సిబ్బందికి రూ.6 వేలు చోప్పున ...

Read More »

‘ఖైదీ 150’ సెట్లో గొడవ పడిన క్యాథరిన్ ఇప్పడు బాధపడుతోందట

పబ్లిసిటీ కోసం హీరోయిన్లు రకరకాల స్టంట్లు చేస్తుంటే క్యాథరిన్‌ మాత్రం ఫ్రీగా వచ్చే పబ్లిసిటీని చేజేతులా వదులుకుంది అంటున్నారు సినీజనాలు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ‘ఖైదీ నంబర్‌ 150’లో ఐటెంసాంగ్‌ కోసం ముందు క్యాథరిన్‌ అనుకున్నారు. సెట్లో జరిగిన గొడవలతో క్యాథరిన్‌ ఆ పాట నుంచి తప్పుకుంది. దాంతో ఆ ఛాన్స్‌ లక్ష్మీరాయ్‌కి దక్కింది. ఇదంతా పాత కథే! ఇప్పుడు కొత్త కథ ఏమిటంటే ఈ సినిమా పబ్లిసిటీలో ఈ పాటను, అందులో లక్ష్మీరాయ్‌ డ్యాన్స్‌ను బాగా ప్రమోట్‌ చేస్తున్నారట! దీంతో లక్ష్మీరాయ్‌కి ...

Read More »

పవన్ కళ్యాణ్‌కు ‘మెగా’ స్వాగతం, పూలవర్షం, తోపులాట: పోలీసులు తీసుకెళ్లారు

విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, మెగా అభిమానులు తరలి వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలోని ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించనున్నారు. రేపు ఉదయం రోడ్డు మార్గాన ఆయన విశాఖ నుంచి బయలుదేరి వెళ్లి, పరామర్శిస్తారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం ఆయన విశాఖ చేరుకున్నారు. పవన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది ...

Read More »

సామాన్యుడికి అవస్థలే అవస్థలు

– 500, 1000 నోట్లను అంగీకరించని వ్యాపారులు – అత్యవసర పనులకు డబ్బు చెల్లింపులో సమస్యలు – ఉన్న నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితి – చేతిలో డబ్బున్నా చెల్లించలేని దుస్థితి – ఏటీఎంల వద్ద క్యూలు, కొద్ది సేపటికే ‘నో క్యాష్’ బోర్డులు – కార్డుపై ఎక్స్‌ట్రా ట్యాక్స్ అంటున్న వ్యాపారస్తులు – సామాన్యుడి జీవితాన్ని స్థంభింపచేసిన కేంద్రం నిర్ణయం ► రామ్ ప్రసాద్ వాళ్ల నాన్నగారికి బుధవారం హస్పటల్‌లో బైపాస్ సర్జరీకి ప్లాన్ చేసుకున్నాడు. హాస్పటల్‌లో చేర్చి ఇప్పటికే రెండు ...

Read More »

భార్య అనుమానిస్తోందని విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చంపేసిన భర్త..

ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అనే వ్యక్తి పాము విషాన్ని భార్య సహీదాకు ఇంజక్షన్ రూపంలో ఇచ్చి చంపేశాడు. సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుంచి ఈ విషాన్ని సాహెబ్ కొనుగోలు చేశాడు. భార్య అనుమానిస్తోందని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి మొగల్ సాహెబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కృష్ణా ...

Read More »

వారంతా ఇక లేనట్లే!

  ఏఎన్‌-32 విమాన ప్రయాణికులు బతికుండే అవకాశం లేదు   రక్షణ శాఖ కోర్టు ప్రకటన   ఆర్థిక సాయం అందిస్తాం: రక్షణ మంత్రి న్యూఢిల్లీ: సుమారు రెండు నెలల క్రితం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయల్దేరి వెళ్లిన భారత వాయుసేన విమానం ఏఎన్‌-32 ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణించినవారంతా బతికుండే అవకాశం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులకు అధికారికంగా సమాచారం అందజేసింది. ఢిల్లీలోని వాయుసేన ప్రధాన కార్యాలయం నుంచి ఆగస్టు 24న లేఖ ద్వారా మృతుల కుటుంబాలకు ...

Read More »

లారీ డ్రైవర్‌ కూతురికి 8వ ర్యాంకు

ఆదిలాబాద్‌ : చదువులో ఉన్నతశిఖరాలను అధిరోహించేందుకు కుటుంబ నేపథ్యం, స్థాయితో సంబంధం లేదని నిరూపించిందో అమ్మా యి! టీఎస్‌ ఎంసెట్‌-3లో ఓ లారీ డ్రైవర్‌ కూతురు ఏకంగా టాప్‌టెన్‌ ర్యాంకర్‌గా గుబాళించింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌లో నివసిస్తున్న లారీ డ్రైవర్‌ సయ్యద్‌ అక్తర్‌ హుస్సేన్‌కు ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె నూజ్‌హత ఫాతిమా ఎంసెట్‌-3లో 8వ ర్యాంకును సాధించింది. గతంలో ఆమెకు ఏపీ ఎంసెట్‌లో 68, ఎంసెట్‌-1లో 51, ఎంసెట్‌-2లో 77వ ర్యాంకు దక్కింది. అక్తర్‌ హుస్సేన్‌ పెద్దమ్మాయి బీటెక్‌ పూర్తి చేయగా, ...

Read More »