Breaking News

Temples

వైభవంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హనుమాన్‌ ఆలయంలో బుధవారం శ్రీవెంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, అభిషేకం, తిరు ఆరాధన, తిరుమంజన సేవ, అలంకార సేవ, తులసీ అర్చన, కుంకుమార్చన, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిదులు రాజు, కుంభాల రవి, సతీష్‌, లక్ష్మణ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, లక్ష్మిపతి ఇవో …

Read More »

పెరియ కోయిల్‌.. శ్రీరంగం

పెరియ కోయిల్‌.. శ్రీరంగం పాలకడలి నుంచి శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన క్షేత్రమే శ్రీరంగం. సమున్నత గోపురాలతో, విశాల ప్రాకారాలతో, శ్రీరంగనాధుని నామస్మరణలతో నిత్యం మార్మోగే దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగొందుతోంది. 108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో నెలకొనివుంది. కోయిల్‌ అంటే శ్రీరంగం, మలై అంటే తిరుమల అంటారు. శ్రీరంగాన్ని పెరియకోయిల్‌ అని కూడా అంటారు. దీనర్థం పెద్ద దేవాలయం అని. శ్రీరంగనాధుడు శయనమూర్తిగా వుండి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. దాదాపు 157 ఎకరాల్లో నెలకొన్న ఆలయం ప్రపంచంలోని పెద్ద దేవాలయం …

Read More »

జగద్గురు ఆలయంలో వైభవంగా పూజలు

  కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి హౌజింగ్‌ బోర్డు కాలనీలో జగద్గురు ఆదిశంకరాచార్య ఆలయంలో బుధవారం శంకరాచార్య జయంతిని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోనే ఏకైక ఆదిశంకరాచార్యుల మందిరంగా కామారెడ్డి ఆలయం పేరుగాంచింది. బుధవారం వైశాఖ శుద్ద పంచమిని పురస్కరించుకొని ఘనంగా పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యుల వైభవాన్ని కొనియాడారు. ఆదిశంకరాచార్యులు సమాజానికి గొప్ప మార్గనిర్దేశం చేసి ప్రపంచానికి శాంతిమార్గాన్ని ఉపదేశించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పండితులు గంగవరం ఆంజనేయశర్మ, అయాచితం నటేశ్వరశర్మ, అవధానులు రంగనాథ …

Read More »

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన

బోర్గాం(రెంజల్‌): రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామంలో సోమవారం మహలక్ష్మి, మహంకాళి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ్ఘ 15 లక్షల గ్రామాభివృద్ధి కమిటీ నిధులతో మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించగా గతమూడు రోజులుగా యజ్ఞం నిర్వహించారు. సోమవారం విగ్రహ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మధ్య నిర్వహించారు. ఆలయంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రవికుమార్‌ బోరుబావి తవ్వించగా విగ్రహ పున:ప్రతిష్టాపన కార్యక్రమంలో వారు సతీసమేతంగా పాల్గొని మహాలక్ష్మి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. …

Read More »

గాయత్రీ మందిర నిర్మాణానికి భూమిపూజ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 13 వందల ప్లాట్ల ఆవరణలో బ్రాహ్మణ సేవాసమితి ఆద్వర్యంలో శనివారం గాయత్రీ మందిరం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి, రాంపూర్‌ మహరాజ్‌, ఆర్మూర్‌ తెరాస నియోజకవర్గ రాజేశ్వర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ స్వాతిసింగ్‌ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మందిరం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం త్వరగా పూర్తికావాలని వారు ఆకాంక్షించారు. సేవాసమితికి చెందిన స్థలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వంత కమ్యూనిటీ హాల్‌ లేక కలిగిన ఇబ్బందులను …

Read More »

లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువైన లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఓ భక్తుడి మొక్కులో భాగంగా స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయం చుట్టూ పల్లకీ ఊ రేగించారు. సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలలతో పాటు కరీంనగర్, మెదక్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మూలబావి వద్ద స్నా నాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకు న్నా రు. ఒడిబియ్యం, పట్టేనామాలు, కోరమీసాలు, కళ్లు సమర్పించి …

Read More »

ఒడ్డేడ్‌పల్లిలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం ఒడ్డేడ్‌పల్లి గ్రామంలో గురువారం హనుమాన్‌ భక్తులు, గ్రామస్తులు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యుల ఆద్వర్యంలో హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హనుమాన్‌ భక్తులు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామ శివారులోని ఒడ్డేడ్‌ చెరువు పక్కన విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గీత, తెరాస నాయకులు సత్యం, ఉపసర్పంచ్‌ అరుణ్‌, చిరంజీవి, ఒడ్డెన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు …

Read More »

హనుమాన్‌ జయంతికి ఆలయాల ముస్తాబు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామల్లో గల హనుమాన్‌ ఆలయాలను జయంతి సందర్భంగా ఆయా గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, దీక్షా స్వాములు అ ందంగా ముస్తాబు చేశారు. శుక్రవారం జరగనున్న హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడపాకల్‌, గుమ్మిర్యాల్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో జాతర నిర్వహిస్తారు. Email this page

Read More »

ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం (నేడు ఒంటిమిట్టలో కల్యాణం)

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు. యథావాల్మీకమైన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారు రాసినదాన్ని బట్టి చూస్తే, సౌమ్య నామసంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగ రక్షణకు తీసుకెళ్తాడు. 27వ …

Read More »

దేవి ఆలయానికి ఎంపి 2 లక్షల విరాళం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత గ్రామం. కాగా మాణిక్‌ బండార్‌పరిధిలోని మాణిక్‌బండార్‌ తాండాలోని దేవి ఆలయానికి ఎంపి కవిత 2 లక్షల రూపాయలు విరాళాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల రాంకిషన్‌, ఎంపిటిసి దేవి, జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు …

Read More »