Breaking News

Yellareddy

పుర్రె మనిషి ఆచూకీ చెప్పండి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి శివారులోని కొత్తకుంటలో ఐదు రోజుల క్రితం లభించిన పుర్రెకు సంబంధించిన సమాచారం కోసం ఫ్లెక్సీలు తయారు చేయించినట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 4న ఎల్లారెడ్డి సమీపంలోని కొత్తకుంటలో పుర్రెతో పాటు నల్లరంగు ప్యాంటు, ఆకు పచ్చని చెక్స్ షర్టు లభించిందన్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, ఆరు నెలల క్రితం చని పోయినట్లుగా తెలుస్తోందని అన్నారు. వివరాలు తెలిసిన వారు ఎల్లారెడ్డి ఎస్సై శ్రీధర్ రెడ్డి 9440795463 లేదా సీఐ అనిల్ కుమార్ ...

Read More »

బంగారం కోసమే మహిళ దారుణ హత్య?

ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలో ఈ నెల 7న దారుణహత్యకు గురైన బండ లింగవ్వ హత్యకేసు ఛేదన కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీ సహాయంతో కేసును పరిష్కరించడంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. లింగవ్వ వద్ద ఉన్న బంగారం, వెండి కోసమే మరో ఇద్దరు మహిళలు కలిసి దారుణ హత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. లింగంపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన లింగవ్వకు ఎల్లారెడ్డి మండలం సబ్ధల్‌పూర్‌, దాల్‌మల్కపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ...

Read More »

నిగనిగల్లో… నిజమెంత..!

కూరగాయలపై విషం చిమ్ముతున్నారు విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం కూరగాయలపై రసాయన అవశేషాలు రోగాల భారిన పడుతున్న జనం పోచారం తండాకు చెందిన రమేష్‌. కూరగాయల మొక్కలకు చీడపీడలు వ్యాప్తి చెందాయి. వాటి నివారణకు వ్యవసాయాధికారులు మందులు తెలపడం లేదు. దీంతో పురుగు మందుల దుకాణా యజమానులు తెలిపిన మందులను పిచికారి చేస్తున్నారు. దేవునిపల్లి.మహిళా రైతులు తమ కూరగాయల పంటలకు పురుగు వస్తే ఏ మందులు వాడాలో ఎవరిని అడగాలో తెలియడం లేదు. దీంతో పురుగు మందులు విక్రయించేవారిని కూరగాయల మొక్కలకు రోగం వచ్చిందని ...

Read More »

మూడు నెలలుగా బిల్లులు అందలేదని నిరసన

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని ఉపాధిహామీ కూలీలకు మూడు నెలలుగా కూలి డబ్బులు రావడం లేదని.. కూలి డబ్బులు ఇవ్వకుంటే కరవు కాలంలో ఏం తినాలని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమను ఆదుకోవాలని ఎంపీపీ నక్కగంగాధర్‌, ఏపీవో సాయిలుకు విన్నవించారు. కూలి డబ్బులు మూడు రోజుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించారు. మండలంలో రూ.1.30 కోట్ల ఉపాధి హామీ డబ్బులు బకాయి ...

Read More »

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

కొట్టాల్‌(ఎల్లారెడ్డి), : మండలంలోని కొట్టాల్‌ గ్రామంకు చెందిన బోదాసు నర్సింలు(30) అనే యువకుడు మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ పూర్ణేశ్వర్‌ తెలిపారు. నర్సింలు మూడేళ్ల కిత్రం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ పని దొరకకపోవడంతో తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. ఇక్కడ వ్యవసాయం, కూలీ పనులు చేస్తున్న కాలం కలిసి రాకపోవడంతో చేసిన అప్పులు అధికమై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. రైలు కింద పడి ...

Read More »

ఎల్లారెడ్డిలో నాలుగు షాపుల్లో చోరీ

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలో శనివారం రాత్రి దొంగలు నాలుగు షాపుల తాళాలు తెరిచి దొంగతనం చేశారు. రాత్రి ఒంటి గంట తరువాత దొంగతనాలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. డైలీ బజార్‌లోని రెండు బంగారు నగల దుకాణాల షాపుల తాళాలు తెరిచిన దొంగలు అక్కడ ఏమీ లభించక పోవడంతో వాటి పక్కనే ఉన్న చికెన్ సెంటర్ తాళాలు పగులగొట్టి వాటిని పక్కనే పడేశారు. తరువాత క్లబ్ రోడ్డులో ఉన్న కిరాణా దుకాణం తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న సుమారు నాలుగు వేల రూపాయల నగదుతో పాటు ...

Read More »

నేడు ఎల్లారెడ్డికి మంత్రి హరీశ్‌రావు

ఎల్లారెడ్డి : మండల కేంద్రంలో నిర్మించిన పలు భవనాలను రాష్ట్ర మంత్రులు శనివారం ప్రారంభించనున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు. రూ.కోటీ 50 లక్షలతో నిర్మించిన గోదాంతో పాటు రూ.4కోట్లతో చేపట్టనున్న సిమెంటు రోడ్డు పనులు ఉన్నాయి. గ్రామీణ నీటి పారుదల శాఖ చేపట్టనున్న రూ.50 లక్షల పైపు లైన్ పనులు, అంబేద్కర్ చౌరస్తా నుంచి శివ్వానగర్ వరకు రూ.2కోట్లతో నిర్మించనున్న తారు రోడ్డు ...

Read More »

ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐకి ప్రత్యేక అవార్డు

ఎల్లారెడ్డి రూరల్ : కల్తీ కల్లు నివారణతో పాటు సారాయి తయారీని నిరోధిం చడంలో విశేష కృషి చేసినందుకు ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ ఏఎల్‌ఎన్ స్వా మి అవార్డు అందుకున్నట్లు ఎస్సై సృజన తెలిపారు. సోమవారం హైదరాబా ద్‌లో డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అకున్ సబర్వాల్ నుం చి స్వామి అవార్డు అందుకున్నారన్నారు. ఎల్లారె డ్డి పరిధిలోని నాలుగు మండలాల సిబ్బంది ప నితీరును డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.

Read More »

వాహనాల తనిఖీ…

ఎల్లారెడ్డి రూరల్ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా వచ్చిపోయే అన్ని రకాల వాహనాలను ఆపి ధ్రువపత్రాలను పరిశీలించారు. ద్విచక్రవాహన దారులకు హెల్మెట్ ఆవశ్యకత గురించి తెలిపి, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించారు. ఎళ్లవేళలా వాహనంతో పాటు సరైన ధ్రువపత్రాలను ఉంచుకోవాలని సూచించారు. 20 కేసులు నమోదు చేసి రెండు వేల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ...

Read More »

పోలీసుల ప్రత్యేక తనిఖీలు

ఎల్లారెడ్డి : మెదక్ జిల్లాలో జరిగిన దొంగతనానికి సంబంధించిన దొంగల కోసం ఎల్లారెడ్డిలో ఆదివారం ఉదయం నాలుగు గంటల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో మొబైల్ ఫోన్‌లు దొంగిలించి ఎల్లారెడ్డి వైపు వస్తున్నారనే సమాచారం మేరకు ఎల్లారెడ్డిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు తెల్లవారు జామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు వాహనాలను, ప్రయాణికులను తనిఖీ చేశారు. వందలాది మందిని తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించలేదని ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాహనాల తనిఖీ గాంధారి ...

Read More »

నాటు సారా లేకుండా చేశాం.. కల్తీకల్లుపై నిరంతర నిఘా

ఎల్లారెడ్డి : ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ డివిజన్‌లోని 17 మండలాల్లో నాటు సారా లేకుండా చేశామని, కల్తీకల్లుపై నిరంతర నిఘావేసి దాడులు చేస్తున్నామని ఈఎస్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఆరు నెలల కాలంలో 220 కేసులు నమోదు చేశామని, తొమ్మిది మంది లైసెన్సులు రద్దు చేశామని వివరించారు. ముందస్తుగా 1174 మందిని బైండోవర్ చేశామని, వారు తప్పు చేయకుండా వారికి అవగాహన కల్పించామన్నారు. బైండోవర్ తరువాత ...

Read More »

కల్తీ కల్లు అమ్ముతే చర్యలు

ఎల్లారెడ్డి  : కల్తీ కల్లు అమ్ముతే కఠిన చర్యలుంటాయని ఆబ్కారీ ఈఎస్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆబ్కారీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు కల్తీకల్లుకు సంబంధించి 1,174 మందిని బైండోవర్‌ చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా దుకాణాలు, డిపోలు నిర్వహించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మత్తుమందు రవాణా చేసే వారిపై నిఘా పెట్టామని కల్తీకల్లు నివారణకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ...

Read More »

డీఈవో ఆగ్రహం

ఎడపల్లి: వార్షిక పరీక్షలు సమీపించినా ఉపాధ్యాయులు ఆలస్యంగా విధులకు వస్తున్నారు. పాఠశాల ప్రారంభమై అరగంట గడిచినా విద్యార్థులు పాఠశాలకు వస్తూనే ఉన్నారు. అసలు పాఠశాలకు సమయపాలన లేదా అంటూ జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఎడపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలను ఆకస్మికింగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలు అయినా విద్యార్థులు పాఠశాలకు వస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ఇంకా తరగతి గదులకు వెళ్లలేదు. దీనితో ఆయన ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు షుగ్నా ఖలీంపై ఆగ్రహం వ్యక్తం ...

Read More »

అందరం మనుషులమే.. అందరం సమానమే..!

ఎల్లారెడ్డి,: అందరం దేవుడు చేసిన మనుషులమే.. అందరం సమానులమే.. మనుషుల్లో తేడా ఉండొద్దని.. దళితులంటే వివక్షత చూపొద్దని.. అందరిలో మార్పు రావాలని జిల్లా పాలానాధికారిణి యోగితారాణా అన్నారు. సోమవారం భిక్కనూర్‌ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంటరానితనం అమానుషంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న దళితులను కులం పేరుతో దూషించినా.. చిన్నచూపు చూసినా.. కుల బహిష్కరణలు చేసినా.. చట్టపరంగా బాధ్యులను శిక్షిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దళితులందరు చదువుకోవాలని..అక్షరాస్యతతోనే అంటరానితనం దూరమవుతుందన్నారు. ఎస్సీలు చదువుకు ...

Read More »

కలప విక్రయంలో ప్రభుత్వానికి రూ.లక్ష ఆదాయం

ఎల్లారెడ్డి,  : ఎల్లారెడ్డి అటవీ శాఖ ప్రాంగణంలో శనివారం కలప విక్రయం కోసం వేలం పాట నిర్వహించారు. కామారెడ్డి డివిజన్ అటవీ శాఖ అధికారి జోజి కలప విక్రయానికి వేలం పాట పాడారు. విలువైన టేకు కలపను కొనుగోలు చేయడానికి పలువురు ఆసక్తి చూపారు. వేలం పాటలో ప్రభుత్వానికి రూ.లక్ష 600 ఆదాయం వచ్చింది. వేలం పాటలో 16 టేకు కలప లాట్‌లను పలువురు తీసుకున్నారు. వేలం పాట కార్యక్రమంలో స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి రాధా కిషన్, సెక్షన్ అధికారి రమేశ్ ...

Read More »

విద్యుత్ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలోని సురాయిపల్లి గ్రామ శివారులో విద్యుత్ షాక్‌కు గురై ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు.. జొన్న పంట వేసుకున్న రైతు గుగులోత్ శంకర్ పక్షులను బెదిరించేందుకు డబ్బాలను ఏర్పాటు చేశాడు. సోమవారం ఉదయం 11కేవీ విద్యుత్ వైరుకు జియావైరు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. శంకర్‌ను రక్షించేందుకు అక్కడే ఉన్న రమావత్ బిక్యా ప్రయత్నించగా అతనికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన శంకర్‌ను వైద్యం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read More »

ఖేడ్‌ విజయంపై తెరాస గెలుపు సంబరాలు

నాగిరెడ్డిపేట, : నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందటంతో మండల కేంద్రంలోని బోధన్‌-హైదరాబాద్‌ రహదారిపై మంగళవారం తెరాస నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయం నుంచి తెరాస పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా రహదారిపైకి చేరుకున్న నాయకులు టపాసులు కాల్చారు. అనంతరం మిఠాయిలను తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాశీ నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గంగారెడ్డి, మధుకర్‌, సంజీవులు,రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, దుర్గారెడ్డి, ...

Read More »

కంప్యూటర్‌ విద్యకు నిర్లక్ష్యపు వైరస్‌

 ఎల్లారెడ్డి : ఈ చిత్రంలో మూలకుపడేసిన కంప్యూటర్లు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనివి. అక్కడ గత సంవత్సరం నుంచి కంప్యూటర్‌ విద్యను బోధించే వారు లేకపోవడంతో వాటిని ఒకచోట మూలకు పెట్టారు. దానితో పాటు కంప్యూటర్‌ గదిలో వర్షం కురుస్తుందని, పైన ఏర్పాటు చేసిన పీవోపీ కూలిపోవడంతో వాటిని కాపాడేందుకు ఇలా ఒకచోట పెట్టారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న కంప్యూటర్లు గండిమాసానిపేట ఉన్నత పాఠశాలలోనివి. ఇక్కడ రెండేళ్లుగా కంప్యూటర్‌ విద్య విద్యార్థులకు అందడం లేదు. సక్సెస్‌ పాఠశాల లేకపోవడంతో వీటిని ఖాళీగా ఉన్న గదిలో ...

Read More »

ఇస్లాంలో విద్యకు మొదటి ప్రాధాన్యం

ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే : ప్రతీ ఒక్క ముస్లీం ఖురాన్‌లోని బోధనలు తప్పనిసరిగా పాటించాలని.. క్రమం తప్పకుండ ప్రార్థనలు చేయాలని శ్రీలంకకు చెందిన ఇస్లాం మత గురువు హజరత్‌ మౌలానా ఇసాక్‌ ఎక్బాల్‌ రిజ్వీ, వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లీం మత పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ విద్యను అభ్యసిస్తేనే అన్నింటా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇస్లాం మతంలో మొట్టమొదటి ప్రాధాన్యం విద్యకే ఇచ్చారని అధ్యాత్మిక వేత్త ముస్లీం మత గురువులు హజరత్‌ మౌలాన సయ్యద్‌ షా నియమతుల్లా ఖాద్రీ, హజిదుల్లా ఖాద్రీ, అబుల్‌అసన్‌ ...

Read More »

దుబాయ్ గల్లీ

-గల్ఫ్ వెళ్లిన వారి కుటుంబాల నెలవు -1958 నుంచి మొదలైన వలస -ఉన్నత స్థానాల్లో పలువురు -ఎల్లారెడ్డిలో ప్రత్యేకంగా ఓ బస్తీ ఎల్లారెడ్డి/నమస్తే తెలంగాణ;దుబాయ్ గల్లీ .. గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి కుటుంబాల నెలవు.. ఆ బస్తీ వాసుల్లో ఇంటికొకరు గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇసుక తిన్నెలతో ఆ గల్లీకి తరతరాల అనుబంధం ఉన్నది. ఈ గల్లీకి చెందిన వారు ఉపాధి కోసం వలస పోయారు.. కొందరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొందరు కూలీలుగా, ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా ఎడారి దేశాల్లో విధులు నిర్వర్తి ...

Read More »