Breaking News

తాజా వార్తలు

పందుల స్వైర విహారం అరికట్టండి

  నందిపేట, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో పందుల సంతతి రోజురోజు కు పెరిగిపోతుందని దాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త, చెదారం, మురికి నీరు ఉన్నచోట పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో చెత్త కుప్పలు రోజులతరబడి ఉండడంతో పందులు అక్కడ స్వైర విహారం చేస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర దుర్గంధం వస్తుంది. పందులను అరికట్టాలని గ్రామ పాలకవర్గానికి, ప్రజావాణిలో అధికారులకు పలుమార్లు ప్రజలు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం …

Read More »

బడిబాటలో బూర్గుల్‌ పాఠశాల సక్సెస్‌

  గాంధారి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడిబాట కార్యక్రమంలో బడి బయట పిల్లలు పాఠశాలలో చేర్పించే విధంగా బూర్గుల్‌ పాఠశాల ఉపాధ్యాయులు విజయవంతమయ్యారు. మండలంలోని బూర్గుల్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారావ్‌, ఉపాధ్యాయులు బూర్గుల్‌ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో గత వారంరోజులుగా బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. ఇంటింటికి వెళ్ళి బడిబయట పిల్లల తల్లిదండ్రులకు చదువుకుంటే కలిగే లాభాల గురించి వివరించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వీరి కృషి వల్ల పాఠశాల …

Read More »

గాంధారిలో జ్యోతిబాఫూలే జయంతి

  గాంధారి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే 191వ జయంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతిబాఫూలే సమాజంలోని కులవివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్నే ధారపోశారని ఎంఇవో సేవ్లానాయక్‌ అన్నారు. అనాథలు, వితంతువుల సంరక్షణకు పాటుపడిన సమాజ సేవకుడని కొనియాడారు. బాలికల విద్య ప్రోత్సహించడంతోపాటు మహిళలకు సమాన హక్కులు తేవడంలో ఎనలేని కృషి చేసిన సమతావాదిగా పేర్కొన్నారు. బడుగు, బలహీన …

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

  గాంధారి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో మంగళవారం హనుమాన్‌ జయంతిని ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హనుమాన్‌ ఆలయం, మొకరంపేట్‌ అంజన్న ఆలయం, బాల్‌రాజ్‌ ఆలయం, దేవరపేట హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతోపాటు గౌరారం మాత్‌సంగం, పేట్‌సంగం, గండివేట్‌, ముదెల్లి, పోతంగల్‌, బూర్గుల్‌, నేరెల్‌, నాగులూర్‌, చెద్మల్‌, ముత్తునూరు, గురుజాల్‌ తదితర గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో హనుమాన్‌ భక్తులు, గ్రామస్తులు శోభాయాత్ర చేపట్టారు. ట్రాక్టర్‌పై …

Read More »

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని వీరాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు విద్యార్థులకు జత ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కని విద్యాబోధన జరుగుతుందని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పురం వెంకట్‌ సూచించారు. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. Email this page

Read More »

మిర్జాపూర్‌లో తెరాస సభ్యత్వ నమోదు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో మున్నూరు కాపు సంఘం వధ్ద మంగళవారం తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పురం వెంకట్‌ మాట్లాడుతూ తెరాస ప్రవేశపెట్టిన సంక్షేమపథకాల వల్ల గ్రామస్తులు తెరాసలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. లక్ష్యాన్ని మించి తెరాస సభ్యాత్వాలు నమోదవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. Email this page

Read More »

ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే 191వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఫూలే విగ్రహాలను, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, స్త్రీ విద్యకోసం, పునర్‌వివాహం తదితర అంశాలపై పనిచేసిన వ్యక్తి అన్నారు. తన భార్యను మొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహానుభావుడు ఫూలే అన్నారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

బీర్కూర్‌లో గజ్జలమ్మ జాతర

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో బుధవారం నుంచి గజ్జలమ్మ ఆలయ జాతర నిర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ నర్సయ్య తెలిపారు. హనుమాన్‌ జయంతి పురస్కరించుకొని ప్రతియేడు గజ్జలమ్మ జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బుధవారం ఉదయం రథోత్సవం, సాయంత్రం ఎడ్ల బండ్ల ఊరేగింపు, గురువారం కుస్తీపోటీలు, శుక్రవారం ఒగ్గుకథ, తదితర కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆయాగ్రామాల ప్రజలు, భక్తులు తరలివచ్చి జాతర విజయవంతం చేయాలని కోరారు. Email this page

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో హనుమాన్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా దీక్షాస్వాములు నసురుల్లాబాద్‌ గ్రామంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా మహా అన్నదానం నిర్వహించారు. స్వాములు మాల విరమణ కోసం కొండగట్టు బయల్దేరి వెళ్లారు. Email this page

Read More »

ట్రాక్టర్‌ పంపిణీ

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి సొసైటీ ఆద్వర్యంలో గ్రామానికి చెందిన రైతుకు దుర్కి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ట్రాక్టర్‌ పంపిణీ చేశారు. ప్రబుత్వం యంత్రలక్ష్మి ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ చేస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Email this page

Read More »

ఫూలే ఆశయాలను అమలు చేస్తున్న ఘనత తెరాసదే

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయాల మేరకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా, మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ లు అన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని తాళ్ల రాంపూర్‌ గ్రామంలోగల ఫూలే విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, మహిళలకు …

Read More »

5, 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయి

  – ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 5, 10 నాణేలు వ్యాపారు, దుకాణ సముదాయాల వారు తీసుకోవాలని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి వ్యాపారస్తులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీసు స్టేషన్‌లో వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో 10, 5 రూపాయల నాణేలు వర్తకులు తీసుకోవడం లేదని, ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు …

Read More »

ఘనంగా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం దళిత సంఘాలు, అంబేడ్కర్‌ సంఘాల ఆద్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలెం అంబేడ్కర్‌ యువజన సంఘం సభ్యులు కాలినడకన 5 కి.మీ. పాదయాత్ర చేసి మోర్తాడ్‌ రైల్వేస్టేసన్‌ పక్కనగల జ్యోతిరావుఫూలే విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు, కులపెద్దలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోదన జరుగుతుందని ఆయా గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లోగల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయలు, ఉపాధ్యాయులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఇవో రాజేశ్వర్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Email …

Read More »

జైహనుమాన్‌ నామస్మరణతో మారుమోగిన ఆలయాలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జైహనుమాన్‌ నామ స్మరణతో హనుమాన్‌ ఆలయాలు మారుమోగాయి. మంగళవారం హనుమాన్‌ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో ప్రజలు, భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. మోర్తాడ్‌లో దీక్షాస్వాములు హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని అఖండ జ్యోతితో గ్రామంలోని ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాలను జయంతి వేడుకలను దృష్టిలో పెట్టకొని విడిసిల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. అలాగే నీటివసతి, అన్నదానం, టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తి, …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">