Breaking News

తాజా వార్తలు

నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం టేక్రియాల్‌ చెరువు వద్ద గణేష్‌ నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ పరిశీలించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఇంచార్జ్‌ చందర్‌ నాయక్‌, కామారెడ్డి తహసిల్దార్‌ రాజేంద్ర, జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమ, పోలీస్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. The following two tabs change content ...

Read More »

ముళ్ళ పొదలు తొలగింపు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్‌ బీడీ కాలనీలో స్థానిక టిఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ వైస్‌ యంపీపీ కుడుముల సత్యం ఆధ్వర్యంలో రోడ్డుకు రెండు వైపులా పెరిగిన ముళ్ళ పొదలను తొలగించారు. జేసిబి సహాయంతో పనులు చేపట్టారు. కాగా ఇందుకయ్యే ఖర్చు సత్యం భరించారు. ముళ్ళ పొదలు తొలగించడంతో రోడ్డు అందంగా కనిపిస్తుంది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యం వెంట ఎంపిటిసి సంతోష్‌, రాము, సజ్జు కృష్ణ, చక్రపాణి ...

Read More »

హెల్త్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ రజినీ హెల్త్‌ కిట్‌లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం హెల్త్‌ కిట్లను అందజేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో గోపాలకష్ణ, మండల పరిషత్‌ అధికారి గౌస్‌, ఎంఈవో గణేష్‌ రావ్‌, వైద్యాధికారి క్రిస్టినా, హెచ్‌ఈవో వెంకటరమణ, వ్యాయమ ఉపాధ్యాయుడు క ష్ణమూర్తి ఉపాధ్యయులు తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content ...

Read More »

గంగమ్మ చెంతకు గణనాథుడు

రెంజల్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11రోజులు నిత్యపూజలు అందుకున్న లంబోదరుడిని తల్లి గంగమ్మ చెంతకు భక్తులు భకి శ్రద్దలతో తరలించారు. గురువారం చివరి రోజు కావడంతో ప్రత్యేకంగా గణనాదులను అలంకరించి గ్రామాల్లో ప్రధాన వీధులగుండా డప్పు వాయిద్యాలు, భజనలతో ఊరేగింపుగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి లంబోదరుడిని నిమర్జనానికి తరలించారు. రెంజల్‌ మండల కేంద్రంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి శోభయాత్రను ఎంపీపీ రజినీ, ఎస్సై శంకర్‌ ప్రారంభించారు. మండలంలోని రెంజల్‌, తాడ్‌ బిలోలి, దండిగుట్ట, ...

Read More »

లంబోదరుడి లడ్డూకు భారీ ధర

రెంజల్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లంబోదరుడి లడ్డుకు గణేష్‌ మండపాల వద్ద నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. గణేశ్‌ ఉత్సవాల చివరి రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డుకు వేలం పాట నిర్వహించగా భక్తులు లడ్డును దక్కించుకునేందుకు పోటీపడ్డారు. రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి, దూపల్లి, రెంజల్‌, దండిగుట్ట గ్రామాల్లో గణేష్‌ మండపాల వద్ద నిర్వహించిన వేలంపాటలో 3 వేల నుండి 25 వేల వరకు వేలంలో పాల్గొని లడ్డును దక్కించుకున్నారు. మండలంలో దండిగుట్ట గ్రామంలోని ...

Read More »

స్వచ్చంద సేవా సమితి ఆర్థిక సాయం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన బత్తిని సంగీత అనే మహిళ గర్భిణిగా ఉండగా అంతు చిక్కని వ్యాధి సోకి వైద్య పరీక్షల కోసం చాలా ఖర్చు అయింది. సంగీత ఇటీవల ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో, విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకుడు వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి తనవంతు సహాయంగా రూ. 5 వేలు ఆర్థిక సహాయం చేశారు. గురువారం కాంగ్రెస్‌ నాయకులు వారి ఇంటికి ...

Read More »

చెరువుల వద్దకు వెళ్లకూడదు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి చెరువు వద్ద ఎస్‌ఐ సాయన్న హెచ్చరిక ఫ్లెెక్సీ ఏర్పాటు చేశారు. నిజాంసాగర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు పడడంతో చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయని, ప్రమాదకరంగా ఉండడంతో చెరువులు, కుంటల వద్దకు ఎవరు కూడా వెళ్లకూడదని అన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News ...

Read More »

ప్రజల భాగస్వామ్యంతో సమస్యలు పరిస్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజు వారి కార్యక్రమాలను నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ చందూరు, వర్ని మండలంలోని ఘనపూర్‌ వకిల్‌ ఫారం గ్రామాలలో జరుగుతున్న గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామ ...

Read More »

విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఎన్‌పిడిసిఎల్‌ నిజామాబాద్‌ ఎస్‌.ఇ. సుదర్శనం టౌన్‌ సబ్‌ డివిజన్‌ స్టాఫ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా టౌన్‌లో గల అన్ని రకాల విద్యుత్‌ సమస్యలను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లూస్‌ లైన్స్‌, రోడ్‌ క్రాసింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెల ఎత్తును పెంచడం, ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర కంచెలు ఏర్పాటుచేయటం, విరిగిన స్థంబాలను తొలగించడం, జంతువులకు, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా అన్నిరకాల ...

Read More »

గణేష్‌ నిమజ్జనంలో అపశతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో బుధవారం జరిగిన గణేష్‌ నిమజ్జనంలో అపశతి చోటు చేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయక మంటపాలలో భాగంగా రజక సంఘం ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా శేఖర్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ కిందపడి మతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest ...

Read More »

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన పోలీస్‌ కమీషనర్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ కేంద్రంలో గురువారం జరిగే గణేశ్‌ నిమజ్జన కార్యక్రమలను, శోభయాత్ర జరిగే ప్రధాన ప్రదేశాలు, నిమజ్జనం చేసే ప్రదేశాన్ని బుధవారం సాయంత్రం పోలీసు కమీషనర్‌ కార్తికేయ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆనంద సంతోషాలతో శోభాయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చె వదంతులను నమ్మరాదని అన్నారు. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటాయని ప్రజలందరూ ...

Read More »

దళితులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గ విస్తరణలో దళితులకు చోటు కల్పించకపోవడం బాధాకరమని ఎంఆర్‌పిఎస్‌ మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 11 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు. మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేంతవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నాయకులు భూమయ్య, పోశెట్టి, అబ్బయ్య, గంగాధర్‌, కిరణ్‌, నరేశ్‌, వినోద్‌ ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest ...

Read More »

వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ టేక్రియాల్‌ చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఆర్డిఓ రాజేంద్ర కుమార్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, పోలీస్‌ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see all) ...

Read More »

మండలంలో ఘనంగా వినాయక నిమజ్జనం

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి, బోర్గాం, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి గణేశ్‌ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న స్వామివారు అంగరంగ వైభవంగా నిమజ్జనానికి తరలివెళ్లిపోయారు. కందకుర్తి గ్రామంలో సార్వజనిక్‌ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గోదావరి కళాబృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రధానవీదుల గుండా శోభాయాత్ర సాగింది. అనంతరం గ్రామ పరిసరాల్లోని గోదావరిలో నిమజ్జనం చేశారు. స్థానిక సర్పంచ్‌ కలీంబేగ్‌ ఏర్పాటు చేసిన కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ ...

Read More »

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌కు విద్యార్థుల ఎంపిక

రెంజల్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న వరంగల్‌లో జరిగే రాష్ట్రస్తాయి హ్యాండ్‌బాల్‌ క్రీడలకు రెంజల్‌ మండల పాఠశాలకు చెందిన విద్యార్థులు శృతి, శ్రీలత, అనిల్‌లు ఎన్నికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరామ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌లు తెలిపారు. ఈనెల జిల్లా కేంద్రంలో జరిగిన హ్యాండ్‌బాల్‌ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రస్తాయికి ఎంపికైన విద్యార్థులను మాడల్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్‌ కాంబ్లే, జైనుద్దీన్‌, అయేషా సుల్తానాలు ఉన్నారు. The following ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">