Breaking News

తాజా వార్తలు

చిన్న సినిమా తీద్దాం – బంగారు తెలంగాణ నిర్మిద్దాం

  డిచ్‌పల్లి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమాన్నే ఊపిరిగా శ్వాసిస్తూ భవిష్యత్‌ తరాలు బాగుండాలని తపించిన ఆరు దశాబ్దాల పోరాటం, నాలుగున్నర కోట్ల ప్రజల ఆరాటం బంగారు తెలంగాణ. ఈ అంశంపై ఎస్‌డిఎఫ్‌ఎఫ్‌ఐ తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని కేంద్ర ఎంటర్‌రైన్‌మెంట్‌ సమర్పణలో షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు జరిగాయని డిచ్‌పల్లికి చెందిన తిరుపతి అన్నారు. జాతీయ స్థాయిలో 150 సినిమాల ఎంట్రీలు వచ్చాయని, ఉత్తరభారతదేశం నుంచి సినిమాలు రాగా అందులో మంచి 45 సినిమాలను అన్నపూర్ణ స్టూడియోలో రెండురోజులు ...

Read More »

శ్రీ లలితాదేవి ఆశ్రమాలయ 12వ వార్షికోత్సవాలు

– ప్రారంభమైన లక్షమోదక గణపతి హవనము నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీలలితాదేవి ఆశ్రమాలయ 12వ వార్షికోత్సవాలను స్థానిక న్యాల్‌కల్‌ రోడ్డులోని ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయని బుధవారం సహస్రకలశ మహాకుంభాభిషేకంతో ఉత్సవాలు పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు వేలేటి సుధాకర శర్మ, పురాణం మహేశ్వరశర్మ హైదరాబాద్‌ వాస్తవ్యులు మాట్లాడుతూ అమ్మవారి కృపా, కటాక్షాలతో ఆశ్రమం 12వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటుందని అన్నారు. ఆశ్రమం ఏర్పాటైన నాటి ...

Read More »

నిజామాబాద్‌లో డ్వాక్రాబజార్‌ అమ్మకాలు, ప్రదర్శన

నిజామాబాద్‌ కల్చరల్‌ జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రజలకు చేనేత, ఖాదీ వస్త్రాలను విక్రయించేందుకు, ప్రదర్శించేందుకు స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. శనివారం నగర కమీషనర్‌ వెంకటేశ్వర్లు ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు శివశక్తి మహిళా సంఘం హైదరాబాద్‌కు చెందిన కల్పనారెడ్డి మాట్లాడారు. ప్రదర్శన ఈనెల 6వ తేదీ నుంచి 21వ తేదీ జూన్‌ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. ఎగ్జిబిషన్‌లో ...

Read More »

తెలంగాణ జాగృతి – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆవిర్భావ సభలో పాల్ఘొన్న అధ్యక్షులు

  తెలంగాణ జాగృతి – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆవిర్భావ సభలో పాల్ఘొన్న అధ్యక్షులు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నేటి సాయంత్రం దుబాయిలో జరిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్ఘొన్నారు. ఈ సమావేశం లో శ్రీమతి కవిత మాట్లాడుతూ గల్ఫ్ వలస కార్మికుల సంరక్షణ, తెలంగాణ సాంస్కృతిక వికాసమే ద్యేయంగా  తెలంగాణ జాగృతి – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ పని చేస్తుందని తెలిపారు. ...

Read More »

బైకు దొంగ అరెస్టు

ఆర్మూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ శివారులో దోబిఘాట్‌ వద్ద ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వాహనాల తనికీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకవ్యక్తి కనిపించడంతో వాహన దృవపత్రాలు అడగడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారని, దీంతో అతన్ని విచారించగా టివిఎస్‌ ఎక్సెల్‌ దొంగిలించినట్టు విచారణలో వెల్లడైందని ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. దీంతో శివను అరెస్టు చేసి అతని వద్దనుంచి బైకును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్టు రవికుమార్‌ తెలిపారు. The following two tabs change content ...

Read More »

వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

ఆర్మూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలోగల స్టార్‌ వాటర్‌ప్లాంట్‌ను శనివారం ఆర్మూర్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌ సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నందున సీజ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. వాటర్‌ ప్లాంట్‌ వల్ల కాలనీలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నందున సీజ్‌ చేసినట్టు చెప్పారు. ఆయన వెంట విఆర్వో, స్థానిక కౌన్సిలర్‌, వైస్‌ఛైర్మన్‌ లింగాగౌడ్‌, తదితరులున్నారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews ...

Read More »

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌లో ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడురోజుల పాటు జరిగే ఏఐవైఎఫ్‌ మహాసభల పోస్టర్లను శనివారం కామారెడ్డిలో డిప్యూటి డిఇవో బలరాంనాయక్‌, నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోది ప్రభుత్వం రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన హామీలు మరిచి వారిని రోడ్డున పడేవిధంగా చేస్తుందని ఆరోపించారు. ఇప్పటివరక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల జాడేలేదని పేర్కొన్నారు. ...

Read More »

అలరించిన సాహిత్య సభ

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆర్యనగర్‌ కాలనీలోగల సరస్వతి నిలయంలో శనివారం నిర్వహించిన సాహితీ సభ అలరించింది. సభలో కవులు మాట్లాడుతూ కవి గర్షకుర్తికి మునిసిపల్‌ స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. సభాధ్యక్షత వహించిన కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ కవులకు పలు సూచనలు చేసి తమ కవితలతో అలరించారు. ముఖ్య అతిథి చాట్ల నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కేవలం ప్రభుత్వమే నిర్వహిస్తుందని భావించక సాహిత్య తరంగిణి, గర్షకుర్తి ...

Read More »

మరుగుదొడ్ల అవకాశాన్ని వినియోగించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌- స్వచ్ఛ తెలంగాణ పథకంలో భాగంగా ప్రభుత్వం లబ్దిదారులకు మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ఇస్తున్న డబ్బులను వినియోగించుకోవాలని మునిసిపల్‌ అధికారులు సూచించారు. స్వచ్ఛభారత్‌- స్వచ్ఛ తెలంగాణ అమల్లో భాగంగా కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో శనివారం మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మేస్త్రీలకు మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వం నుంచి వస్తున్న నిదుల గురించి వివరించారు. వార్డుల వారిగా వచ్చిన లబ్దిదారులతో మాట్లాడి ప్రస్తుతం స్తలమున్నవారికి వెంటనే మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్‌ ...

Read More »

రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనికీచేసిన డిఆర్‌ఎం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ను శనివారం రైల్వే డిఆర్‌ఎం అరుణాసింగ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌తోపాటు క్యాంటీన్‌, వివిధ కార్యాలయాలు, ఫుట్‌పాత్‌, టికెట్‌ కౌంటర్లు, ఇతర విభాగాలను పరిశీలించారు. క్యాంటీన్‌లో తినుబండారాలను అధిక ధరలకు అమ్మడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ధరలకే తినుబండారాలు విక్రయించాలని నిర్వాహకులకు ఆదేశించారు. స్టేషన్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts ...

Read More »

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

– బోలెరా వాహనాలు, మారణాయుధాలు స్వాధీనం నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారని ఈ మేరకు ఎస్పీ శనివారం విలేకరుల సమావేశంలో వి వరాలు వెల్లడించారు. నిందితులు గతంలో బాన్సువాడ పట్టణంలోని ఓ దుకాణం షెట్టర్‌ పగులగొట్టి చోరీకి పాల్పడగా సిసికెమెరాలో రికార్డు అయిందని, అలాగే బాన్సవాడలో మరో జువెలరీ షాపులో కూడా చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాన్సువాడ, ...

Read More »

నియోజకవర్గ మైనార్టీలకు రూ. రెండు కోట్ల 82 లక్షల విడుదల

బీర్కూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీల అభివృద్దికి నియోజకవర్గ పరిధిలో బీర్కూర్‌, బాన్సువాడ, వర్ని, కోటగిరి మండలాల మైనార్టీలకు రెండుకోట్ల 82 లక్షలు ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న స్వామివారి ఆలయ అభివృద్దికి, భోజనశాలకు 50 లక్షలు విడుదల చేయగా ఈ సందర్భంగా 10 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో మండల ...

Read More »

వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

బీర్కూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం బీర్కూర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పూలతో అభిషేకం చేసి, హారతి, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుందని, జిల్లా నుంచే కాక మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని వారి కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు ...

Read More »

బోరుబావిని ప్రారంభించిన మండలాధ్యక్షురాలు

బీర్కూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నసురుల్లాబాద్‌ గ్రామంలో బుధవారం మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షురాలు మల్లెల మీన హన్మంతు బోరుబావులను ప్రారంభించారు. 4 లక్షల రూపాయల నాన్‌ సిఆర్‌ఎఫ్‌ నిదులతో రెండు బోరుబావులను, 650 మీటర్ల పొడవుతో గల పైప్‌లైన్‌ను ఆమె ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సౌకర్యాలను మెరుగు పరచడం కోసం కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విద్యానగర్‌ కాలనీ, శివాజీనగర్‌, పోచమ్మగల్లిలో బోరుబావులు, వాటర్‌ ట్యాంకుకు పైప్‌లైన్‌లను లింకేజీ ఇవ్వడం తదితర పనులుచేపట్టారు. కార్యక్రమంలో కంది మల్లేశ్‌, మల్లేశ్‌గౌడ్‌, ...

Read More »

అస్తవ్యస్తంగా ఉన్న ఇంటినెంబర్ల సవరణ

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఇంటి నెంబర్లతో పలు సమస్యలు ఏర్పడుతున్నందున ఈ సమస్యను అధిగమించడానికి ఇంటి నెంబర్లను క్రమబద్దీకరించడానికి నగరపాలక సంస్త చర్యలు తీసుకుంటుంది. నగరంలోని ఇళ్లకు సరైన పద్దతిలో క్రమ సంఖ్య లేకపోవడం వల్ల పోలింగ్‌ స్టేషన్లకు, నివాసాలకు ఎక్కువ దూరం ఉండడం, సమగ్ర కుటుంబ సర్వేలో సిబ్బందికి ఇబ్బంది, ఓటరు గుర్తింపు కార్డుల ఆధార్‌ లింకు, పోస్టల్‌శాఖకు చిరునామా గుర్తింపులో ఇబ్బందులు తదితర సమస్యలతోపాటు నగరాన్ని స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చే ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">