Breaking News

తాజా వార్తలు

విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.

  -వి.సి. పార్థ సారధి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 27: నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టనున్న కెజి నుంచి పిజి వరకు ఉచిత ఆంగ్ల విద్య వ్యవస్థ ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ఇంఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ పి.పార్థ సారధి తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత విద్యా రంగంలో భారీ సంస్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. శుక్రవారం తెయూలో కళలకు రూపమిద్దాం కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు అన్న అంశంపై ప్రముఖ ఆంగ్ల ...

Read More »

బిసిలకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయాలి

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 27: నిజామాబాద్‌, న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల కొరకు ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ పథకం బిసిలకు కూడా వర్తింపచేయాలని తెయూ విద్యార్థి సంఘాల అధ్యక్షుడు ఎస్‌.నవీన్‌ కుమార్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అధ్యక్షుడు నవీన్‌ కుమార్‌ మాటాడుతూ ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనరిటీలకు ఈ పథకం అమలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసిలు 50% నికి పైగా ఉన్నారని వారిలో చాలా ...

Read More »

న్యాయ కళాశాలపై వచ్చిన ఫిర్యాదులను ఖండించిన ‘లా’ విద్యార్థులు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26: నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలపై అసత్య ఆరోపణలను ఖండిస్తూ లా విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాల క్రితం చదివిన విద్యార్థులు మాట్లాడుతూ న్యాయ కళాశాలపై ఒక పత్రికలో వచ్చిన అసత్యపు ప్రకటనలపై మాట్లాడుతూ అవన్నీ అసత్యపు ప్రచారాలని పేర్కొన్నారు. న్యాయ కళాశాలలో రెగ్యులర్‌ గా తరగతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌లు క్రమం తప్పకుండా హాజరవుతూ చక్కగా బోధన చేస్తున్నారని, న్యాయకళాశాలో సమస్యలు ఉన్నాయన్నది వాస్తవమని దానిపై మాత్రమే విద్యార్థులు ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాల భవనంలో పూలే, అంబేద్కర్‌ చిత్రపటాల ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, ఫివ్రబరి 26: నిజామాబాద్‌, న్యూస్‌: భారత దేశంలో మొట్ట మొదటి సారిగా పాఠశాలలను ప్రారంభించిన మహాత్మా జ్యోతి రావు పూలే, విశ్వరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలను తె.యూ. న్యాయ కళాశాల భవనంలో న్యాయ కళాశాల అధిపతి జెట్లింగ్‌ ఎల్లోసా ఆవిష్కరించారు. ఈ సంబర్భంగా న్యాయ కళాశాల అధిపతి మాట్లాడుతూ భారత దేశంలో మొదటి సారిగా బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం పాఠశాలలను స్థాపించి, విద్యను అందించిన మహనీయుడు పూలే అని, సమాజంలో ఉన్న ...

Read More »

ఆహార భద్రత కార్డు కొరకు బారులు తీరిన జనం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26: నిజామాబాద్‌ న్యూస్‌: ఆహార భద్రత కార్డు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అధికారుల తప్పిదాల ద్వారా అర్హులైన వారికి ఆహార భద్రత కార్డులు అందక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని దరఖాస్తు దారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అర్హులందరికి ఆహార భద్రత కార్డులు అందచేస్తామని రాని వారు ఉంటే తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలని మండల తహసీల్దార్‌ రాజేందర్‌ సూచించారు. The following two tabs ...

Read More »

ప్రజలకు ఆయుర్వేద చికిత్స అవసరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26: నిజామాబాద్‌ న్యూస్‌: ప్రజలకు ఆయుర్వేద చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని దీని వలన వ్యాధులను అనతి కాలంలోనే నిర్మూలించవచ్చని డిఎమ్‌హెచ్‌వో బసవేశ్వరి అన్నారు. తెలంగాణ అను వంశిక ఆయుర్వేద గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2015 డైరీ ఆవిష్కరణకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా పతంజలి ఆయుర్వేదం ఆధ్వర్యంలో రోగులకు ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వహీద్‌ అహ్మద్‌ డా.రఘు బిడిఎస్‌, డా.మిశ్రా, డా.గణశ్‌, పతంజలి ఆయుర్వేద మేనేజర్‌ నాగరాజు పాల్గొన్నారు. The ...

Read More »

సబ్‌ ప్లాన్‌ అమలుకు మార్చి 10న ఛలో అసేంబ్లీ

  -పిలుపునిచ్చిన దళిత సంఘాలు నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: దళిత గిరిజనుల జీవితాలను మార్చే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతుందని, సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలని, తగిన నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు మార్చి 10న ఛలో అసేంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర సమన్వయ కర్త పి.శంకర్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన అయన ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ...

Read More »

హైదరాబాద్‌లో నూతన డి.ఆర్‌.ఎం గా ఛార్జి తీసుకున్న అరుణ సింగ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌: హైదరాబాద్‌లో నూతన డి.ఆర్‌.ఎం గా ఛార్జి తీసుకున్న అరుణ సింగ్‌ మంగళవారం నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బుకింగ్‌ కౌంటర్‌, పార్కింగ్‌ ప్రదేశాలను, రైల్వే భూములు, ఆక్సిడెంట్‌ రిలీఫ్‌ మెడికల్‌ వ్యాన్‌, రైలు భోగీలను తనిఖీ చేశారు. అనంతరం రైల్వూ అధికారులు ముందు ముందు వచ్చే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రైట్వే స్టేషన్‌లో ఎటువంటి దొంగతనాలు, అక్రకార్యకలాపాలు జరుగకుండా రైల్వే పోలీసు అధికారులు ...

Read More »

కలెక్టర్‌ సారూ నన్ను గుర్తు పట్టారా?

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌: నమస్తే సారూ నాపేరు అంగూరు లక్ష్మి(24), నన్ను గుర్తు పట్టలేదా పట్టలేక పోవచ్చు ఎందుకంటే మీరు మస్తుగా తీరిక లేకుండా ప్రజల పరేషాన్లు తీర్చేందుకు మీరూ పరేషాన్లు పడుతుండ్రు. మరి గదే పరేషాన్‌తో నన్ను కూడా గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు గుర్తొచ్చిన్నా…హా.. నేనే లక్ష్మిని సారూ మీ ఆఫీసుల కూడా రోజు ఛాయి లమ్ముకుంటా, మీ ఆఫీసుల సార్లందరూ నాకాడకోచ్చి ఓయ్‌ లక్ష్మీ ఛాయి పొయ్యు అంటారు కానీ ఒక్కలు గూడా నీకు ఫించన్‌ వచ్చిందా ...

Read More »

ఒకే కుటుంబానికి చెంవిన ఐదుగురు వ్యక్తులపై దాడి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌: నగరంలోని హమాల్‌వాడి చౌరస్తా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెంవిన ఐదుగురు వ్యక్తులపై దాడి చేసిన ముత్యాల శ్యాంబాబు, ఆయన తండ్రి, 25 మంది అనుచరులను ఎస్సీ, ఎస్టీ, నిర్భయ చట్టం ప్రకారం కేసునమోదు చేయాలని ”దళిత ఐక్య వేదిక” ఆధ్యర్యంలో అంబేద్యకర్‌ కాలనీ నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ చక్రి దౌలత్‌ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన రాత్రి హమాల్‌వాడి ప్రాంతంలో ముత్యాల శ్యాంబాబు, ఆయన తండ్రి అనుచరులు ...

Read More »

ముస్లిం కటిక సమాజానికి న్యాయం చేయండి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: బలవంతంగా ముస్లిం కటిక సమాజం నుండి జంతువులను దొంగిలించడం ముఖ్య భూమికగా చేసుకొని సామాజిక కౄరత్వం ప్రదర్శించడం పై పూర్తి ఇలాంటి చర్యలు మా సమాజం ఆర్థిక ఇబ్బందులు కలుగచేస్తున్నారు. మా ముస్లిం కటిక సమాజం రక్షణ కొరకు ఎస్పీకి ఆల్‌-ఇండియా-ఉల్‌-కురిషీ తరపున ఫిర్యాదు చేశారు. మేము కొన్న జంతువులని బలవంతంగా తీసుకొని మిమ్మల్ని కొట్టడం, జంతువులను మమ్మల్ని పోలీసు స్టేషనుకు తీసుకెళ్ళి కేసులు రిజిష్టర్‌ చేస్తున్నారు. ఇది మాకు ఆర్థిక ఇబ్బందిని కలుగచేస్తోంది. ఇది ...

Read More »

తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 : నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఇందుకు సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొవాలని జిల్లా జ్యుడీషియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసారు. ఈ మేరకు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో ప్రత్యేక హైకోర్టు కొసం న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు మద్ధతుగా నగరంలో ఈరోజు కోర్టు ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ...

Read More »

మానసిక శారీరక ఉల్లాసం కోసం ”ఎన్‌.సి.సి” – యండమూరి వీరేంద్రనాథ్‌

  నిజామాబాద్‌ ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: ఆదివారం నిజామాబాద్‌ నగర శివారులోని ముబారఖనగర్‌లోగల ఆర్‌బివిఆర్‌ఆర్‌ పాఠశాలలో ఎన్‌సిసి ‘సి’ సర్టిఫికెట్‌కు సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. ఇందులో మొత్తం 272 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు చెందినవారు. ఈ పరీక్షలు ఉదయం 10గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరిగింది అనంతరం మధ్యాహ్నం 2.30Û నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల వరరకు ప్రాక్టికల్స్‌లను నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలకు రాష్ట్ర పరీశీలకులుగా కర్నూలు ...

Read More »

నాకు ఫెంచన్‌ ఇప్పించండి సారూ…

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: సారూ అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది అన్ని రకాల అర్హతలు ఉన్న వృద్ధులకు, వికలాంగులకు. అర్హులైన వారందరికి ఫించన్‌లు మంజూరు చేయడంలో కొందరు సర్పంచ్‌లు సెక్రటరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు అందవలసిన ఫింఛను అందకుండా పోతున్నాయి. ధర్మారం(బి) గ్రామానికి చెందిన పొనగంటి పోచయ్య వయసు 70 సంవత్సరాలు, 70% వికలాంగుడని ప్రభుత్వం ధృవీకరించిన పత్రాలు ఉన్న నీవు అనర్హుడని మాట దాటేస్తున్నారని అన్నాడు. పటుసార్లు ప్రజావణికి ఫిర్యాదు ...

Read More »

జిల్లాలో బంద్‌ అసంపూర్ణం -బస్టాండ్‌ ముందు న్యాయవాదుల ఆందోళన -మద్ధతు తెలిపిన ప్రైవేటు విద్యాసంస్థలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21: నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ ప్రత్యేక హై కోర్టు కోసం న్యాయవాదులు చేపట్టిన బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. వీరికి మద్ధతుగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. శనివారం బస్టాండ్‌ ఎదుట న్యాయవాదులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. రాస్తా రోకో చేసి నిరసన తెలిపారు. ఐతే బంద్‌కు కొన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు దూరంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు యధావిధిగా నడిచాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా శనివారం ఇచ్చిన ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">