Breaking News

తాజా వార్తలు

వినియోగదారులపై అకాల వర్షాల ప్రభావం

  బాన్సువాడ, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లగా వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అకాల వర్షాల దెబ్బతో కూరగాయల పంటలక తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడులు తగ్గిపోయి మార్కెట్‌లో కొరత ఏర్పడింది. వినియోగదారులనుంచి కొనుగోలు పెరగడంతో సరిపడా మార్కెట్లో కూరగాయలు అందుబాటులో లేకుండాపోయాయి. ముఖ్యంగా స్తానికంగా సాగయ్యే ఆకుకూరలు, తీగజాతి కూరలు, ఉల్లిగడ్డలు అకాల వర్షాలకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో కొరత ఏర్పడింది. ఇటీవల వరకు ...

Read More »

ఇంటర్‌ ఫలితాల్లో విజయ్‌ జూనియర్‌ కళాశాల జయకేతనం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విజయ్‌జూనియర్‌ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేసినట్టు కరస్పాండెంట్‌ ప్రజ్ఞా గంగామోహన్‌ తెలిపారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాదించినట్టు ఆయన చెప్పారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఆర్మూర్‌ డివిజన్‌ 2వ ర్యాంకు సాధించినట్టు ఆయన చెప్పారు. ఎంపిసిలో డి.శుభశ్రీ 978, ఎన్‌.సుష్మ-950, బైపిసిలో వినీల-935, సిఇసిలో వంశీకృష్ణ-919 మార్కులు సాదించినట్టు ఆయన వివరించారు. The following two tabs change content ...

Read More »

వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌, పిప్రి, ఆలూర్‌, ఆర్మూర్‌ పట్టణంలోని ఒడ్డెర కాలనీలోగల పాఠశాలల్లో వెనక బడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవి శిక్షణ తరగతులు సర్పంచ్‌లు బండ లక్ష్మణ్‌, విజయలక్ష్మి, కళాశ్రీ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. పెర్కిట్‌ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఇవో రాజగంగారాం మాట్లాడారు. ఇందులో 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న వెనకబడిన విద్యార్తులు హాజరవుతున్నారని, ఈ తరగతులు ...

Read More »

చైన్‌స్నాచర్ల విజృంభణ

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో చైన్‌ స్నాచర్లు విజృంభిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకొని వారి ప్రతాపాన్ని చూపుతున్నారు. దీంతో మహిళలు ఒంటరిగా రోడ్లపై తిరగాలంటే జంకుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆర్మూర్‌ పట్టణంలోని యోగేశ్వర్‌ కాలనీలో కట్కం అరుంధతి అనే మహిళ వద్ద నుంచి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి మహిళ మెడలోంచి రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయినట్టు బాధితురాలు ...

Read More »

యానంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో రైతు సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ దాసరి ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించటానికే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, దాసరి లక్ష్మీనర్సయ్య, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. The ...

Read More »

టీఎన్‌వీఎస్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌కు వినతిపత్రం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరించాలని వచ్చే విద్యాసంవత్సరానికి కల్లా నూతన బాలుర హాస్టల్‌ భవనాన్ని నిర్మించాలంటు తెయూ రిజిస్ట్రార్‌ లింబాద్రికి టీఎన్‌వీఎస్‌ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం నాడు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోర్సులు పెరిగిన దృష్ట్యా హాస్టల్‌ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా చూడాలని అన్నారు. పీజీ ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్‌ టెస్ట్‌ కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేస్తే వెనుకబడిన నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల విద్యార్థులకు సౌకర్యంగా ...

Read More »

ఇద్దరు సీఎంల మధ్య మళ్ళీ మాటల యుద్ధం

సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలయింది. కొంత కాలం సైలేట్ గానే ఉన్నా… ఇప్పుడు ఇద్దరి వాయిస్ రైజ్ అయింది. నిన్న జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కే సీ ఆర్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును ఉద్దేశించి ‘కిరికిరి నాయుడు పొద్దున్న లేస్తే… ఎదో ఓ పుల్ల పెడుతాడు. ఛీ… పోమ్మానా కూడా ఇక్కడే ఉంటాడు’ అని కేసీఆర్ మండిపడ్డారు. దీంతో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కేసీఆర్ ని ఉద్దేశించి ‘నా ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సోలార్‌ హీటర్‌ వితరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని వృద్దాశ్రమానికి సోమవారం రూ. 40 వేల విలువగల సోలార్‌వాటర్‌ హీటర్‌ను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ క్లబ్‌ గవర్నర్‌ మల్లాది వాసుదేవ్‌ మాట్లాడారు. రోటరీ క్లబ్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో వృద్దాశ్రమానికి వాటర్‌హీటర్‌తోపాటు చిన్నమల్లారెడ్డి, దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలకు 50 చొప్పున బెంచీలు అందజేసినట్టు తెలిపారు. దీంతోపాటు వైద్య, విద్య శిబిరాలు నిర్వహిస్తూ కామారెడ్డి రోటరీ క్లబ్‌ సేవల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని ...

Read More »

సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిఐటియు ఆద్వర్యంలో కామారెడ్డి తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ బాధ్యుడు రాజలింగం మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నామమాత్రపు వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా వేతనాలు సైతం విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఆశా వర్కర్లు దుర్బర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

పోలీసుల ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గది ఆవరణలో సోమవారం కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు స్వచ్చభారత్‌ చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణను దత్తత తీసుకొని స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాలు శుభ్రం చేసినట్టు డిఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో సైతం పోలీసుల ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు సంతోష్‌, సుభాష్‌, తదితరులు పాల్గొన్నారు. The ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు 3 లక్షలతో సిసి డ్రైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు సభ్యులందరితో కలిసి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ, బట్టుమోహన్‌, నాయకులు రాంకుమార్‌, తదితరులు ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts ...

Read More »

తెరాస విజయగర్జనకు భారీగా జనసమీకరణ – వేలాదిగా తరలివెళ్లిన నాయకులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన తెరాస విజయగర్జనసభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, తరలి వెళ్లారు. సుమారు 30 బస్సులు, వందకుపైగావాహనాల్లో నాయకులు, కార్యకర్తలను తరలించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని ఇదివరకే అధిస్టానం ఆదేశాలున్న నేపథ్యంలో నాయకులు కార్యకర్తలను సమీకరించేందుకు చమటోడ్చారు. కార్యకర్తలతో పాటు నాయకులు వాహనాల్లో కలిసి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నాయకులు జనసేకరణ కోసం పోటీపడ్డారు. గత కొన్ని రోజలు కిందటనే ...

Read More »

ఇజ్రాయిల్‌ వెళ్తున్న విసి పార్థసారధికి రిజిస్ట్రార్‌ శుభాకాంక్షలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయశాఖ అధికారులు రైతుల పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్‌ దేశ పర్యటనకు వెళ్తున్న వ్యవసాయ శాఖ సెక్రెటరీ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఇన్‌చార్జి వైస్‌ఛాన్స్‌లర్‌ పి.పార్థసారధిని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ సెక్రెటరీ చాంబర్‌కు వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. విసి విదేశీ యాత్ర విజయవంతం కావాలని, రాష్ట్రానికి, తెలంగాణ యూనివర్సిటీకి వారి పర్యటన ద్వారా మేలు కలగాలని రిజిస్ట్రార్‌ ఆశించారు. ...

Read More »

తెవివి అభివృద్ధి కోసం మరిన్ని ప్రణాళికలు

– జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీని మన తెలంగాణరాష్ట్రంలోనే నెంబరు వన్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దుటకు మరిన్ని ప్రణాళికలు అమలు చేస్తామని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. వచ్చే రెండు మూడేళ్లలో యూనివర్సిటీని అన్నిరంగాల్లో అభివృద్ది చేసి దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీగా రూపొందించడానికి అన్ని విధాలా సహాయం చేస్తామని ఎంపి భరోసా ఇచ్చారు. సోమవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ఇతర అధ్యాపక బృందం ఎంపి కవితను హైదరాబాద్‌లోని ఆమె ...

Read More »

బాల్యమే భవిష్యత్తుకు పునాది – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా విద్యార్థులు బాల్యంలోనే గట్టి పునాదులు ఏర్పాటు చేసుకునే విధంగా పిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దిశా నిర్దేశం చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఉద్భోదించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వశిక్షా అభియాన్‌ జిల్లాశాఖ భాగస్వామ్యంతో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనకబడ్డ విద్యార్తులకు తర్పీదు ఇవ్వడానికి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 195 కేంద్రాలను ఏర్పాటు చేసి 9098 మంది విద్యార్థులకు ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">