Breaking News

తాజా వార్తలు

ఎముకల ఫ్యాక్టరీని తొలగించాలి

  నవీపేట, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎముకల నుంచి నూనె తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జంతు కళేబరాలతో కల్తీకల్లు తయారుచేసి ఆయా హోటళ్లకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, దాని ద్వారా తయారుచేసిన పదార్థాలు తింటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నవీపేట మండలం తుంగిని గ్రామ శివారులో రాత్రి 10 దాటిన తర్వాత పెద్ద ఎత్తున జంతు కళేబరాలు, ఎముకలు తరలించి నూనె తయారుచేస్తున్న విషయం ఇటీవలే బయటపడింది. ఈ విషయమై స్పందించిన ...

Read More »

యువతి అదృశ్యం

  ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామానికి చెందిన కచ్చకాయల రాజేందర్‌ కూతురు రమ్య (19) శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిందని ఆర్మూర్‌ ఎస్‌ఐ సంతోస్‌కుమార్‌ శనివారం తెలిపారు. తండ్రి రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. తండ్రి కథనం ప్రకారం శుక్రవారం ఉదయం తన మేనత్త వద్దకు వెళుతున్నానని చెప్పిందని, మేనత్త వద్ద విచారించగా రమ్య అక్కడికి వెళ్లలేదని తెలిసిందని, ఇతర బంధువులను విచారించినా ...

Read More »

ఘనంగా బాలల దినోత్సవం

  ఆర్మూర్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని అన్ని పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్తులు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి. పిల్లలు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. పట్టణంలోని విజయ్‌ పబ్లిక్‌ స్కూల్‌, రాంమందిర్‌ పాఠశాలలో విద్యార్థులు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసంగాలు చేశారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews ...

Read More »

కార్తీక మాస శుభారంభ శుభాకాంక్షలు

సూర్యోదయoలోగా స్నానాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు.. ఈ నెలంతా ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం కానున్నాయి.ఈరోజు నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానుండగా, అంతటా ఆధ్మాతిక శోభ అలుము కోనున్నది. కాలాన్ని బట్టి మనుషుల్లో వచ్చే కొన్ని రుగ్మతలను పారదోలేందుకు పలు ఆచారాలను పూర్వీకులు ప్రవేశపెట్టారని ప్రముఖ పండితులు సెలవిస్తున్నందున ఆధ్యాత్మికం వెనుక ఆరోగ్యానికి కార్తీక మాసం ప్రతీకలా నిలుస్తున్నది. దీపావళి తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ♦స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి ▬ ...

Read More »

మంచి నేల.. మంచి నీరు..!

భూమికి నీరు వ ర్షం ద్వారా అందుతుంది. అయితే, పడిన వానలో కొంత మాత్రమే మొక్కలకు ఉపయోగపడి మిగిలింది రకరకాలుగా పోతుంది. భూమి మీద పడిన మొత్తం వర్షాన్ని ‘అసలు వర్షపాతం’ అంటాం. ఉపరితల ప్రవాహం ద్వారా, ఆవిరి కావటం ద్వారా నష్టపోయింది పోగా, భూమిలో నిల్వ ఉండి మొక్కలకు అందుబాటులో ఉండే వర్షపు నీటిని ‘ఉపయోగపడే వర్షపు నీరు’ అంటాం. ఇదే మొక్కలకు, జంతువులకు, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వర్షపు నీటి ఉపయోగాన్ని వాన పడే తీరు, నేల రకం, నేలను మొక్కలు ఎంత ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 21వ వార్డులో గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ నాన్‌ప్లాన్‌ గ్రాంట్‌ నిధులు రూ. 4 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రగతి పనుల్లో పట్టనంలోని అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రగతి పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, నిమ్మ దామోదర్‌రెడ్డి, తదితరులు ...

Read More »

ఘనంగా దీపావళి వేడుకలు

  కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళ, బుధ వారాల్లో దీపావళి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి స్నానాలు చేసి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి నేపథ్యంలో పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆనవాయితీ ప్రకారం ఆడపడుచులు కూతుళ్లచేత హారతిని తీసుకొని కట్నకానుకలు సమర్పించారు. సాయంత్రం వేళ పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని టపాసుల దుకాణాల్లో సందడి నెలకొంది. ...

Read More »

పశుగ్రాసానికి కొరత

  బాన్సువాడ, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరువు పరిస్థితులు పశు సంపదపై ప్రభావం చూపుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈయేడు ఖరీఫ్‌ సాగు తగ్గడంతో పశు గ్రాసానికి కొరత ఏర్పడింది. బోధన్‌ డివిజన్‌లో ఈయేడు వరిసాగు గననీయంగా పడిపోయింది. వర్షాలు లేక నీటి వనరుల ఆయకట్టులో సాగు తగ్గింది. దీంతోపాటు భూగర్భజలాలు పడిపోవడంతో వీటి ఆధారంగా సాగయ్యే భూముల్లో సైతం పంటలు స్వల్పంగా సాగయ్యాయి. మరోవైపు మెట్టభూముల్లో సైతం పశుగ్రాసానికి పనికివచ్చే పంటలు సాగుకాలేదు. దీంతో పశుగ్రాసానికి తీవ్ర ...

Read More »

తాగునీటి సమస్య సత్వరమే తీర్చాలి

  రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు మండల ప్రత్యేకాధికారి వాజిద్‌ హుస్సేన్‌కు సూచించారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూగత సంవత్సరం -26 శాతం వర్షపాతం నమోదుకాగా, -48 శాతం వర్షాపాతం నమోదైందని, భూగర్భజలాలు కూడా తక్కువగా ఉండడంతో నిజాంసాగర్‌, పోచంపాడ్‌, అలీసాగర్‌, గుత్ప ప్రాజెక్టుల్లో నీటిచుక్క నిల్వ లేకపోవడం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిందని,గ్రామాల్లోని రైతులు మోటార్లు ...

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

హైదరాబాద్‌: విజయవాడలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేనపార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ నుంచిఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌ అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. పంచెకట్టుతో పవన్‌ కల్యాణ్‌ విజయవాడ చేరుకోవడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.అమరావతి శంకుస్థాపనకు హాజరుకాలేక పోయిన పవన్‌ సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా సీఆర్‌డీఏ పరిధిలో జరగనున్న కార్యక్రమాలు, అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలోనే పవన్‌ రాష్ట్ర ...

Read More »

‘మాగీ’ మాయ!

నేరస్థుడు న్యాయ నిర్ణయం చేయడమంటే ఇదే మరి. ‘మాగీ’ రకం సేమ్యాలను మనదేశ ప్రజలకు అంటగట్టిన ‘నెజల్’-నెస్లె-అన్న స్విట్జర్లాండ్ కంపెనీవారు దశాబ్దుల తరబడి మన ఆరోగ్యానికి హాని కలిగించారు. మాగీ సేమ్యాల- నూడుల్స్-లో విషపూరితమైన జీవ రసాయన ధాతువులు కలిసి ఉండడమే ఇందుకు కారణం! కానీ తమ సేమ్యాలు నిరపాయకరమైనవని నెజల్ యాజమాన్యం వారు అక్టోబర్ 16వ తేదీనుంచి దబదబదబా మన దేశమంతటా డప్పులు వాయిస్తున్నారు. ఈ డప్పుల చప్పుళ్లకు మన చెవులు దిమ్మెరపోతున్నాయి. రాజకీయవేత్తల చెవులు మాత్రం దిమ్మెక్కిపోవడంలేదు, ప్రధానంగా అనేక రాష్ట్రాలలో ...

Read More »

మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

మీకూ మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - October 10, 2018 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018 బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018

Read More »

తెయులో బిఇడి ప్రవేశాల కోసం స్పాట్‌ అడ్మిషన్లు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్‌లోని బిఇడి కళాశాలలో 2015-16 అకడమిక్‌ సంవత్సరానికి మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్‌ అడ్మిషన్లు నవంబర్‌ 16న నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఎడ్‌సెట్‌-2015 ఎంట్రెన్స్‌ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు తెయు సారంగాపూర్‌లోని ఎడ్యుకేషన్‌ కళాశాలలో తమ అప్లికేషన్‌ పారంలు నవంబర్‌ 13 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలన్నారు. అప్లికేషన్‌ ఫారంలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని సర్టిఫికెట్లు, ...

Read More »

నవంబర్‌ 26 డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేది గడువు నవంబర్‌ 26 అని పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. వంద రపాయల అపరాధ రుసుముతో పీజు చెల్లింపు చివరి తేదీ 30 అన్నారు. బి.ఎ, బి.కాం, బి.ఎస్‌సి, అన్ని కోర్సులు, బిఎస్‌డబ్ల్యు, బిబిఎ మొదటి, రెండవ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుందన్నారు. యుజి బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు కూడా ఇవే ...

Read More »

పారిశుద్య కార్మికులకు దుస్తుల పంపిణీ

  ఆర్మూర్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ మునిసిపాలిటీ కార్మికులకు రెండో విడతగా మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు రెండు జతల దుస్తులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్మికులను పూర్తిగా విస్మరించారని, వారి బాగోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆమె అన్నారు. మునిసిపల్‌ పాలక వర్గం ఆవిర్భవించిన 16 నెలల కాలంలోనే కార్మికులకు రెండు సార్లు దుస్తులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రమేశ్‌, నాయకులు జో శ్రీనివాస్‌, ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">