Breaking News

తాజా వార్తలు

అంగన్‌వాడిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

  బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మండల అభివృద్ది అధికారి మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోగల 7,8 అంగన్‌వాడి సెంటర్లను సోమవారం ఆయన పరిశీలించారు. అంగన్‌వాడి కేంద్రంలో పలు సమస్యలున్నాయన్న కార్యకర్తల వినతి మేరకు త్వరలోనే కార్యాలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మిస్తామని, మౌలిక సదుపాయాల్లో భాగంగా వంటగది, మరుగుదొడ్డి, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సయ్య, మల్లెల హన్మంతు, ...

Read More »

గ్రామంలో మంచినీటి సమస్యను అధిగమిస్తాం

  బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో తాగునీటి సమస్య అధిగమించేవిధంగా ప్రణాళిక రూపొందించామని బీర్కూర్‌ సర్పంచ్‌ బూలియా నర్సయ్య అన్నారు. గ్రామంలో గడి వద్ద గల వాటర్‌ ట్యాంకు వాచర్‌పోవడం వల్ల మూడురోజులుగా నీరు సరిగా రావడం లేదని, సోమవారం మరమ్మతులు పూర్తిచేశామని మంగళవారం నుంచి సమృద్ధిగా నీరు లభిస్తాయన్నారు. గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా 6,4,9 వార్డుల్లో బోర్లు వేయించి సింగిల్‌ ఫేజు మోటార్లు వేయించామని అన్నారు. గ్రామంలో తాగునీటి ట్యాంకులు ...

Read More »

గ్రామ పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరపండి

  బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్నారం గ్రామంలో కార్యదర్శి హయ్యూం, సర్పంచ్‌ భర్త కలిసి గ్రామ పంచాయతీ నిధులు గోల్‌మాల్‌ చేశారని, వాటిపై వెంటనే విచారణ చేపట్టాలని మండలంలోని అన్నారం గ్రామస్తులు మండల అభివృద్ది అధికారి మల్లికార్జున్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. గ్రామసర్పంచ్‌ భర్త ఎటువంటి పంచాయతీ తీర్మానం లేకుండానే సుమారు లక్ష 80వేల రూపాయల నిధుల అవకతవకలు జరిపారని వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్పంచ్‌ భర్త అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి హయ్యూం తోడయ్యాడని, నిధుల ...

Read More »

ప్రి పిహెచ్‌.డి ఫీజు తేదీ పెంపు

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్‌డి పరిశోధక విద్యార్థులు ప్రి పిహెచ్‌.డి. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేదిని పొడిగించారు. ప్రస్తుతమున్న ఫీజు గడువు అక్టోబరు 5ను అక్టోబరు 9 వరకు పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 9 వరకు చెల్లించవచ్చని, అలాగే 500 రూపాయల అపరాధ రుసుముతో అక్టోబరు 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. The following two tabs ...

Read More »

తహసీల్‌ కార్యాలయానికి తాళం వేసి ఆశల ఆందోళన

  – పలువురి అరెస్టు కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఆశలు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం ఆశ వర్కర్లు కామారెడ్డి తహసీల్‌ కార్యాలయానికి తాళం వేసి గేటు ముందే ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్బంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం, ఆశ ...

Read More »

స్వయం ఉపాధితో సొంతకాళ్లపై నిలబడాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొంది తద్వారా సొంతకాళ్లపై నిలబడాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. ప్రతిభ ఎడ్యుకేషన్‌ సొసైటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మూడునెలలుగా శిక్షణ పొందిన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జాతీయ పట్టణ జీవనోపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, యువతులకు స్వయం ఉపాధి కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. శిక్షణ ...

Read More »

ప్రబుత్వ పాలనావిభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి ఆధునిక యుగంలో ఉపాధ్యాయుల పాత్ర మరిన్ని సవాళ్లతో కూడుకున్నదిగా మారిందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన విధంగా సోమవారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ టీచింగ్‌ అనేది టెక్నాలజి యుగంలో, మారుతున్న కాలంలో మరింత సంక్లిష్టమైన సవాల్‌గా మారిందన్నారు. ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌గా మారుతున్నది. విద్యార్తుల అవసరాలు, ...

Read More »

8 గ్రామాల్లో గ్రామ సభలు

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 8 గ్రామాల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించారు. తిర్మన్‌పల్లి, దూస్‌గాం, ఇందల్వాయి, మిట్టాపల్లి, సుద్దపల్లి, బర్దిపూర్‌, ధర్మారం గ్రామాల్లో ఉన్న సమస్యలపై గ్రామ సభ నిర్వహించగా తిర్మన్‌పల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని గ్రామస్తులు సభకు వచ్చిన అధికారులకు విన్నవించారు. తిర్మన్‌పల్లిలో మహిళలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను నిలదీశారు. పనిచేసిన డబ్బులు సరిగా రావడం లేదని, తన ఇష్టారాజ్యంగా వర్క్‌ మస్టర్లను రాస్తున్నాడని ...

Read More »

గిరిజన జేఏసి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం గిరిజన జేఏసి ఆద్వర్యంలో ప్రబుత్వ దిష్టిబొమ్మను శవ యాత్ర చేసి దగ్దం చేశారు. ఈ సందర్భంగా జిఆర్‌ఎస్‌ఎస్‌ జేఏసి తెయు విద్యార్తులు జగదీష్‌ నాయక్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీలను గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పిన గిరిజనులకు ఆశలు కల్పించి ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని పేర్కొన్నారు. చెల్లని కమిటీల పేరులో కాలయాపన చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో టియు ...

Read More »

బాధిత కుటుంబాన్ని ఓదార్చిన షర్మిళ

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైకాపా నాయకురాలు షర్మిళ. గ్రామంలో బత్తుల నర్సయ్య గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మృతి విషయాన్ని తెలుసుకొని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. నర్సయ్య కుటుంబాన్ని వైకాపా నాయకురాలు షర్మిళ సోమవారం పరామర్శించారు. ఎల్లప్పుడు తమ సహాయ సహకారాలు ఉంటాయని నర్సయ్య భార్య, కుమారులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. The following two tabs change content ...

Read More »

కుంటలో పడి వ్యక్తి మృతి

  రెంజల్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కుషాన్‌ తాండాలో నవీపేట గ్రామానికి చెందిన మహ్మద్‌ అంజాద్‌ (34) అనే వ్యక్తి నీటి కుంటలో పడి మృతి చెందాడు. సోమవారం అంజాద్‌ తన సోదరుడితో కలిసి గొర్లు కాయడానికి తాండా శివారుకు రాగా గొర్లకు నీరు తాగించడానికి కుంటలోకి దిగి వాటిని బయటకు తీసుకురావడానికి లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో దిగిన అంజాద్‌కు ఈత రాక పోవడంతో తచ్చాడుతూ మునిగి అక్కడికక్కడే మృతి ...

Read More »

దాహార్తి తీర్చండి ప్రభూ!

  రెంజల్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడంతో గ్రామస్తులు తాగునీటి సమస్య పరిష్కరించినట్లయితే తమ సమస్యలు తీరుతాయని తాడ్‌బిలోలి గ్రామస్తులు అన్నారు. సోమవారం మండలంలోని తాడ్‌బిలోలి, బోర్గాం, కళ్యాపూర్‌, వీరన్నగుట్ట గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. గ్రామాల ప్రజలు తమ తమ గ్రామాల్లో నీటి సమస్య ఉందని వెంటనే పరిష్కరించినట్లయితే బాగుంటుందని వాపోయారు. అనంతరం తాడ్‌బిలోలి గ్రామంలో ఎలక్ట్రిషియన్‌, వాటర్‌మెన్‌లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతోనే గ్రామంలో ...

Read More »

పిహెచ్‌డి ఫీజులను తగ్గించాలి

  – యూనివర్సిటీ రిసర్చ్‌ స్కాలర్స్‌ అసోసియేషన్‌ డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిహెచ్‌డి కోర్సు ట్యూషన్‌ ఫీజు, పరీక్ష ఫీజులను తగ్గించాలని యూనివర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ ను డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా స్కాలర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన, తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న తెలంగాణ వర్సిటీలో మాత్రం విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, బడుగులకు విద్యను దూరం చేసే విధంగా నాయకుల పాలన కొనసాగుతుందన్నారు. ఈసందర్భంగా రవి, జైపాల్‌ మాట్లాడుతూ ...

Read More »

తెలుగులో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు అవసరం

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు అధ్యయనం కోసం ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ఆరంభించాల్సిన అవసరముందని తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షుడు ఆచార్య కనకయ్య అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అధ్యయన విభాగం విద్యార్థులు సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. తెలుగు అధ్యయన విభాగం విద్యార్థులు శ్రద్దతో అధ్యయనం చేస్తున్నారని అభినందించారు. యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ...

Read More »

మౌలిక వసతులపై జిల్లా కలెక్టర్‌ సమీక్ష

  నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలను గుర్తించి కూలీలకు పనులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా మండల స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా డివిజన్‌, మండల స్తాయి అధికారులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి వసతి, తెలంగాణ హరితహారం, ఆధార్‌ సీడింగ్‌, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు చెందిన ఆర్థికపరమైన పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">