Breaking News

తాజా వార్తలు

పాఠశాలపై నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌వోకు వినతి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పలు పాఠశాలల్లో రాత్రివేళ దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై నిఘా ఉంచి తగు చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎస్‌హెచ్‌వోకు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సందీప్‌ కుమార్‌, పట్టణ ఇన్‌చార్జి ఆజాంలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, సామగ్రి చోరీ అవుతున్నాయని చెప్పారు. వీటితోపాటు పాఠశాల ఆవరణలో మద్యం సేవించడం, పేకాటలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని దృస్టికి తెచ్చారు. ...

Read More »

ఘనంగా ధన్వంతరి జయంతి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శనివారం తెలంగాణ పిఎంపి అసోసియేషణ్‌ ఆద్వర్యంలో వైద్య మూలపురుషుడు ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ కాలంలో ప్రజలు అనేక రోగాల బారిన పడగా దాన్ని చూసి ధన్వంతరి భగవానుడు ప్రత్యేక ఆయుర్వేద మందులను కనుగొని ప్రజలను రోగాల నుంచి విముక్తులను చేశారన్నారు. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని పరిచయం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పిఎంపి డివిజన్‌ ...

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 20వ వార్డులో శనివారం మురికి కాలువల నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5 లక్షలతో కాలు వనిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టరును ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు అంజద్‌, భూంరెడ్డి, సంగి మోహన్‌, ఏఇ గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు సంజీవ్‌, రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

సారిక కుటుంబానికి న్యాయం చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక అత్తగారి కుటుంబం చేతిలో దారుణ హత్యకు గురైందని, వారి కుటుంబానికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శనాచారి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి వెళ్ళి సారిక తల్లిదండ్రులు శ్రీనివాసచారి, లలితలను పరామర్శించి వారిబాధలు తెలుసుకున్నట్టు చెప్పారు. వరంగల్లులో మాజీ ...

Read More »

స్త్రీ శక్తి దివస్‌ సందర్బంగా ఆటల పోటీలు

  కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ శక్తి దివస్‌ను పురస్కరించుకొని శనివారం డిగ్రీ కళాశాల విద్యార్తినిలకు ఏబివిపి ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు. గత రెండ్రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు శనివారంతో ముగిసినట్టు ఏబివిపి మహిళా కో కన్వీనర్‌ రాంపురం రమ్య తెలిపారు. ముగింపు ఆటకు ముఖ్య అతిథిగా ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.ఎన్‌.గిరి హాజరయ్యారు. విద్యార్థినిలకు ఝాన్సీలక్ష్మిబాయి గురించి వివరించి, ప్రతి స్త్రీ ధైర్యసాహసాలు కలిగి ఉండాలన్నారు. అమ్మాయి చదువు అవనికి వెలుగు అన్నట్టుగా మహిళలు అన్ని ...

Read More »

బినోలా అభివృద్దికి సమగ్ర ప్రణాళిక

  నవీపేట, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలంలోని బినోల గ్రామంలో ఏర్పాటు చేసిన మన ఊరు – మన ప్రణాళిక కార్యక్రమానికి నిజామాబాద్‌ ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాడ వాడలా ఇంటింటికి తిరిగి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గ్రామ సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని గ్రామస్తులకు కల్పించారు. అనంతరం ఎంపి మాట్లాడుతూ లిప్టు ఇరిగేషన్‌ కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తెప్పించి 1500 ఎకరాల ...

Read More »

యువజనోత్సవాల్లో తెయు విద్యార్థుల ప్రతిభ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా యువజన సంక్షేమశాఖ స్టెప్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన యువజనోత్సవాల్లో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు తమ సత్తా చాటారు. మొత్తం ఏడు బహుమతులు గెలుచుకొని ప్రతిభ చూపారు. వర్సిటీ బృందానికి నాయకత్వం వహించిన సాంస్కృతిక సమన్వయకర్త డాక్టర్‌ త్రివేణి తెలిపిన వివరాల ప్రకారం వక్తృత్వ పోటీల్లో పి.రవళి మొదటి బహుమతి గెలుచుకుంది. అలాగే జానపద గీతాలాపనలో ఎ.శ్రీనివాస్‌ బృందం మొదటి బహుమతి, జానపద నృత్యాలలో సురేశ్‌ ...

Read More »

విద్యార్థులు గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలి

  రెంజల్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ అన్నప్పుడు గెలుపు, ఓటములు సహజమని, ఓటమి గెలుపునకు నాంది అని ఎంపిపి మోబిన్‌ ఖాన్‌ అన్నారు. శుక్రవారంతో ముగిసిన రాజీవ్‌ ఖేల్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. గెలుపు ఓటములను విద్యార్థులు సమానంగా స్వీకరించాలని స్నేహ పూర్వక వాతావరణంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, తహసీల్దార్‌ వెంకటయ్య, ఎంపిడివో చంద్రశేకర్‌, ఎంఇవోసంజీవరెడ్డి, ...

Read More »

తెవివికి విచ్చేసిన కేంద్ర ప్రజా పనుల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌

  డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీకి శుక్రవారం కేంద్ర ప్రజాపనులశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ శైలేంద్ర శర్మ వచ్చారు. మెయిన్‌ క్యాంపస్‌లో బాలుర వసతి గృహం, భిక్కనూరులోని సౌత్‌ క్యాంపస్‌లో బాలికల, బాలుర వసతి గృహాల నిర్మాణ పనుల ప్రగతిని ఆయన రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తో కలిసి సమీక్షించారు. మెయిన్‌ క్యాంపస్‌లోని బాలుర వసతి గృహం పనులు వచ్చే విద్యాసంవత్సరం వరకు పూర్తి కావాలని, భిక్కనూరులోని వసతి గృహ పనులు పదినెలల్లో పూర్తికావాలని వారు ఇంజనీరింగ్‌ ...

Read More »

పాఠశాలలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివనాగేశ్వరి మాట్లాడుతూ విద్యార్తులు, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు మొక్కలునాటి పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూంరెడ్డి, సిద్దమ్మ, అంజద్‌, సంగి మోహన్‌, తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews ...

Read More »

సౌత్‌ క్యాంపస్‌ సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియు సౌత్‌ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్బంగా జిల్లా కార్యదర్శి భానుప్రసాద్‌ మాట్లాడుతూ టియు సౌత్‌ క్యాంపస్‌ సమస్యలకు నిలయంగా మారిందని, యూనివర్సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో వీధి దీపాలు లేక రాత్రిపూట విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో ప్రమాదాలు జరిగి విద్యార్థులు గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ...

Read More »

ఇంద్రధనుశ్‌ కింద ఉచితంగా ఏడురకాల టీకాలు

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారులు, గర్భిణీలకు పూర్తిస్థాయిలో ఇమ్యునైజేషన్‌ టీకాలను అందించేందుకు మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాన్ని 4 విడతలుగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ చాంబరులో జరిపిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీలు, రెండు సంవత్సరాల లోపు పిల్లలకు 70 శాతం మాత్రమే ఇమ్యునైజేషన్‌ టీకాలు పొందుతున్నారని అన్నారు. నూరుశాతం ఇమ్యునైజేషన్‌ పొందేందుకు మిషన్‌ ఇంద్రధనుష్‌ ద్వారా 7 రకాల జబ్బులను అరికట్టే టీకాలు ఇచ్చే ...

Read More »

అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలి

  – జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాస్త్రీయ, సాంకేతిక అంశాలలో తమలో దాగి వున్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రేరణ ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని, వాటిని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు, ప్రతిస్టలు తీసుకురావాలని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ దఫేదారు రాజు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఎస్‌ విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రేరణ ప్రదర్శన 2015 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ...

Read More »

పాదయాత్రల పేరుతో కాంగ్రెస్‌ నాయకుల డ్రామాలు

  కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెనిద్ర ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మారిస్తే కాంగ్రెస్‌ నాయకులు ఏదో ఘోరం జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతూ పాదయాత్రల పేరిట డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌, కామారెడ్డిఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం దోమకొండ మండలానికి చెందిన వివిద పార్టీలకు సంబంధించిన 200 మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. వారిని ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులకు ...

Read More »

ఖిల్లా డిచ్‌పల్లి రామాలయాన్ని సందర్శించిన డిజిపి అనురాగ్‌ శర్మ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్‌ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లాలోని స్పోర్ట్స్‌ మీట్‌ వెళ్తున్న ఆయన ఖిల్లా రామాలయాన్ని సందర్శించారు. ఖిల్లా రామాలయానికి డిజిపిరాక సందర్భంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాలయానికి వచ్చిన డిజిపికి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు, డిఎస్పీ, డిచ్‌పల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">