Breaking News

తాజా వార్తలు

బిజెపిది అవినీతి రహిత పాలన

– రాహుల్‌ది రైతు పశ్చాత్తాప యాత్ర – జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోడి నాయకత్వంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విస్తృత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ అన్నారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత యుపిఏ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌ రైతుల ...

Read More »

గందర గోళంగా మునిసిపల్‌ సాధారణ సమావేశం

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ సాధారణ సమావేశం శనివారం ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం మునిసిపల్‌ ప్రత్యేక అధికారి సమక్షంలో నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందే పలువురు కౌన్సిలర్లు పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ, నీటి ఎద్దడి గురించి మునిసిపల్‌ పాలకవర్గాన్ని నిలదీశారు. బిజెపి, టిడిపి ఆర్మూర్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్లు ద్యాగ ఉదయ్‌, జి.వి. నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, కానీ మునిసిపల్‌ పాలకవర్గం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ...

Read More »

ఊరిస్తున్న వాతావరణం

– తీవ్ర వడగాలులు, సాయంత్రం వేళ చలిగాలులు – చినుకు రాలడం లేదు – మరో రెండ్రోజుల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ సూచన నిజామాబాద్‌ కల్చరల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాతావరణం ప్రజలను ఊరిస్తుంది…జల్లు కురిసినట్టే కురిసి మాయమవుతుంది… భానుడు మాత్రం మండిమండనట్టు మండుతూనే ఉన్నాడు…దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మే మాసాంతం కల్లా రుతుపవనాలు వచ్చే అవకాశముందని ఓవైపు వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. దీనికి తోడు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా చిరు జల్లులు కురియడంతో ...

Read More »

నిరుద్యోగ యువతకు శిక్షణ

నిజామాబాద్‌ అర్బన్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ రంగాల్లో నిరుద్యోగ యువతకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, స్టెఫ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి వెంకటేశం తెలిపారు. నిర్మాణ రంగంలో వృత్తి నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ, అలాగే మిషనరీ ట్రేడ్‌లో 30 మంది అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ, బార్‌ బెండింగ్‌ ట్రేడ్‌లో 30 మందికి, పెయింటింగ్‌, డెకోరేషన్‌లో 30 మందికి, కార్పెంట్రీలో 30 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ...

Read More »

సమన్వయంతో పుష్కరాలు విజయవంతం చేద్దాం

– నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు నిజామాబాద్‌ అర్బన్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా రెండు జిల్లాల అధికారుల సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కలెక్టర్లు రోనాల్డ్‌రోస్‌, జగన్మోహన్‌లు తెలిపారు. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బాసరలోని త్రిపుల్‌ ఐటిలో ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...

Read More »

డాక్టరేట్‌ అందుకోనున్న అమృతలత

నిజామాబాద్‌ కల్చరల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ రచయిత, విద్యావేత్త, విజయ్‌ విద్యాసంస్థల అధినేత్రి అమృతలత రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకోనున్నారు. ఈ మేరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్‌ను ప్రకటించింది. విద్యావిభాగానికి చెందిన ఆచార్య నిర్మలాదేవి పర్యవేక్షణలో ‘రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌ ఆఫ్‌ టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ తెలుగు లాంగ్వేజ్‌ – ఏ స్టడీ’ అన్న అంశంపై విలువైన పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. దీంతో అమృతలతకు పిహెచ్‌డి పట్టా లభించింది. ...

Read More »

నేషనల్‌ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థుల ఎంపిక

మద్నూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. మద్నూర్‌ మండలం పెద్ద తడ్గూర్‌ గ్రామానికి చెందిన సుభాష్‌, సుప్రియలు నేషనల్‌ మీన్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారని ఉపాధ్యాయుడు నరేందర్‌ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మెరిట్‌ స్కాలర్‌షిప్‌లకు ఎంపికవుతున్నారని, ఈయేడు కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, జిల్లాకు చెందిన పలువురు సుభాస్‌, ...

Read More »

తృటిలో తప్పిన ప్రమాదం

భీమ్‌గల్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని వేల్పూర్‌ రోడ్డు మార్గమధ్యంలో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. కాగా ఆటో డ్రైవర్‌కు, ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ డ్రైవర్‌ వేగంగా ఆటోనడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపరాదని, వాహన దృవీకరణ పత్రాలు, ఇన్సురెన్సు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. వాహనాల తనిఖీ సందర్భంగా సరైన పత్రాలు లేనివారికి జరిమానా విధించడమే ...

Read More »

మునిసిపల్‌ కార్మికుల పర్మనెంట్‌కై 1న ఛలో హైదరాబాద్‌

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ వ్యవస్థలో కాంట్రాక్టు పద్దతిలో కాలం వెళ్ళదీస్తున్న కార్మికులను పర్మనెంట్‌ చేయాలనే డిమాండ్‌తో జూన్‌ 1న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.రాజనర్సు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, వారిని పర్మనెంట్‌ చేస్తామని ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నప్పటికి ఇంతవరకు పర్మనెంట్‌ చేయకపోగా వారికి కల్పించాల్సిన కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇతర ...

Read More »

నీటి సరఫరా కేంద్రాన్ని ఆకస్మికంగా తనికీ చేసిన చైర్‌పర్సన్‌

  కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డులో గల నీటి సరఫరా వ్యవస్థను శుక్రవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఆకస్మిక తనిఖీ చేశారు. 5వ వార్డులోని సైలానిబాబా కాలనీ ప్రాంతంలో మునిసిపల్‌ వాటర్‌ ట్యాంకర్ల ద్వారా పట్టణానికి నీటి సరఫరా చేస్తుంటారు. ఛైర్‌పర్సన్‌ ఆకస్మిక తనికీ చేసి నీటి సరపరా జరుగుతున్న తీరును వాటర్‌ ట్యాంకర్ల రిజిష్టర్లను, ట్యాంకర్ల ట్రిప్పుల సమయాన్ని పరిశీలించారు. గైర్హాజరైన వాటర్‌ ట్యాంకర్‌ల కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత విధించాలని ...

Read More »

శనివారం మునిసిపల్‌ అత్యవసర సమావేశం

  ఆర్మూర్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో శనివారం ఛైర్‌ పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అధ్యక్షతన మునిసిపల్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కమీషనర్‌ రాజు తెలిపారు. ఈ సమావేశంలో నాలుగు అంశాలను ఎజెండాలో చేర్చి కౌన్సిల్‌ ఆమోదానికి చర్చించడం జరుగుతుందన్నారు. కావున మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌, కౌన్సిలర్‌లందరు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆయన కోరారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in ...

Read More »

అవతరణ వేడుకల్లో లఘుచిత్రాలు, ఫోటోగ్రపీల ప్రదర్శనలు

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా స్టేట్‌ ఆర్ట్‌ ఆఫ్‌ గ్యాలరీ, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సలాం తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ సంచాలకులు డి.మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 2 నుంచి 7 వరకు ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్‌ బెనగల్‌, బి.నర్సింగరావు చిత్రాలు, ఎన్‌.శంకర్‌ యొక్క జై బోలో తెలంగాణ, రసమయి బాలకిషన్‌ జై తెలంగాణ, అల్లాడి శ్రీధర్‌ కొమురం భీం ...

Read More »

అన్నీ హంగులతో అవతరణ వేడుక

  – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరవీరులకు ఆత్మశాంతి చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి నగదు పురస్కారాలు అందించడానికి అర్హులను ఎంపిక చేయడానికి స్థానిక జిల్లా పరిషత్‌లో ఛైర్మన్‌ చాంబర్‌లో శుక్రవారం కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ...

Read More »

మూలికల పేరుతో ఘరానా మోసం…

  – చాకచక్యంతో దొంగలను పట్టుకున్న పోలీసులు కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూలికల పేరిట చోరీలకు పాల్పడుతున్న దొంగలను కామారెడ్డి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ గురువారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. డిఎస్పీ కథనం ప్రకారం… నర్సాపూర్‌కు చెందిన ఒంటెద్దు రవి, ఒంటెద్దు శ్రీనివాస్‌, ఒంటెద్దు సాయిలు ముగ్గురు కలిసి మూలికలు విక్రయిస్తూ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. వీరు ఇందల్వాయికి చెందిన అబ్దుల్‌ సయీద్‌కు ఈనెల 22న మూలికలతో సర్వరోగాలు ...

Read More »

అధికఫీజులు వసూలు చేస్తే ఉద్యమం తప్పదు

  – విద్యార్థి సంఘాల హెచ్చరిక కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ ఫీజుల పేరిట అదిక ఫీజులు వసూలు చేస్తే ఉద్యమం తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ జివో 42, ఆర్‌టిఇ 2009 ప్రకారం హైస్కూల్‌ ఫీజు రూరల్‌లో 10,800, అర్బన్‌లో 12 వేలు ఉండగా, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు వీటిని పట్టించుకోకుండా అడ్మిషన్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాల ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">