Breaking News

తాజా వార్తలు

తెయు క్యాంపస్‌ను సందర్శించిన కలెక్టర్‌

  -హరిత హారం ఏర్పాట్లపై సమీక్ష డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు, అలాగే తెలంగాణ యూనివర్సిటీకి వస్తారన్న సమాచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ బుధవారం వర్సిటీని సందర్శించారు. నిజామాబాద్‌ ఆర్డీవో, అటవీ, పోలీసు ఉన్నతాదికారులు ఆయన వెంట ఉన్నారు. వీరితో కలిసి క్యాంపస్‌ను సందర్శించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లింబాద్రితో సమీక్షించారు. అదికారులకు యూనివర్సిటీ సిబ్బందితో కలిసి సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గ్రంథాలయ భవనం ...

Read More »

తెవివిలో జూలై 3 నుంచి హరితహారం

  డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో జూలై 3 నుంచి 10వ తేదీ వరకు హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రిన్సిపాళ్ళు చాలా చురుకైన పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ప్రిన్సిపాళ్ళు తమ తమ కళాశాలలపరిధిలో ఏర్పాట్లు చూడడంతోపాటు, క్యాంపస్‌ మొత్తం 7 సెక్టార్లుగా విభజించి లక్ష మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నందున మరింత గురుతర బాద్యత తీసుకోవాలని వివరించారు. వారు తీసుకోవాల్సిన బాధ్యతలు, వారి ...

Read More »

జిల్లాలో 99 శాతం ఆధార్‌ సీడింగ్‌

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ సీడింగ్‌ ప్రశంసాపూర్వకంగా ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆధార్‌ సీడింగ్‌పై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాకు ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ సీడింగ్‌కు అనుసంధానంచేయడానికి మాడల్‌ జిల్లాగా కావడం సరైందేనని, జిల్లా ఈ సీడింగ్‌ను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తెలంగాణలోనే నిజామాబాద్‌ జిల్లాలో 99 శాతం ఓటరు గుర్తింపునకు ...

Read More »

ప్రభుత్వ పథకాలపై కలెక్టర్‌ సమీక్ష

– అంగన్‌వాడి కేంద్రాలను పరిపుష్టం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై జిల్లా అధికారులు ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ద కనబరిచి వాటి లక్ష్యాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం వర్ని మండలం పెద్దగుట్ట వద్ద పచ్చని చెట్ల మధ్య జిల్లా స్థాయి అధికారులతో పలు పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రాలు, మరుగుదొడ్లు, ...

Read More »

బంద్‌ విజయవంతం చేయండి

ఆర్మూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచి ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లోని విద్యావ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జూలై 1వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు సుమన్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస ప్రబుత్వం విద్యావ్యాపారానికి పాల్పడుతున్న, ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతుందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం పాఠశాలలను పటిష్ట పరిచి ...

Read More »

విద్య అనేది నైతిక హక్కు

ఆర్మూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరికి విద్య అనేది నైతిక హక్కు అని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. బుధవారం ఆర్మూర్‌ పట్టణంలో బడిబాట కార్యక్రమం నిర్వహించాలని తహసీల్దార్‌ శ్రీధర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించాలని తహసీల్దార్‌ శ్రీధర్‌కు వినతి పత్రం అందించారు. అలాగే ప్రస్తుతం విద్యార్థులకిచ్చే మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదని, వాటిని పెంచి ఇవ్వాలని వారు కోరారు. The following two tabs ...

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ఆర్మూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అన్నారు. మంగళవారం 300 ప్లాట్లలో రుద్రమదేవి పరస్పర సహాయ సహకార పరపతి సంఘం మహిళలు నిర్వహించిన మహాసభకు మునిసిపల్‌ ఛైర్మన్‌, కమీషనర్‌ సివిఎన్‌రాజు, టిఎంసిలు ఉదయశ్రీలు ముఖ్య అతిథిలుగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు మహిళా సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ అభివృద్ది చెందుతున్నారని, మహిళలు పురుషులపై ఆధారపడకుండా అన్ని రంగాల్లో ...

Read More »

భీమ్‌గల్‌ ఎస్‌ఐగా సుఖేందర్‌రెడ్డి

భీమ్‌గల్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ కొత్త ఎస్‌ఐగా సుఖేందర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. ఇదివరకు ఎస్‌బిలో ఉన్న సుఖేందర్‌రెడ్డికి భీమ్‌గల్‌కు ఎస్‌ఐగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్‌ఐగా -2గా విధులు నిర్వహిస్తున్న డి.స్వామిగౌడ్‌ను బాల్కొండ ఎస్‌ఐగా బదిలీ చేశారు. ఆయన ఆదివారం విదులనుంచి రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా ఎస్‌ఐ-1గా శ్రీరాం విజయ్‌కుమార్‌ విధులు నిర్వహిస్తున్నారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest ...

Read More »

తెవివి నాన్‌టీచింగ్‌ సిబ్బందికి మూడురోజుల ప్రత్యేక శిక్షణ

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌కు మూడు రోజుల పాటు ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ కోసం వర్క్‌షాప్‌ బుధవారం నుంచి నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ప్రముఖ శిక్షణ సంస్థ అయిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ హైదరాబాద్‌ తోపాటు జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా శిక్షణ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ శిక్షణ కార్యక్రమం తెలంగాణయూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌లో నిపుణులచే అపార ...

Read More »

ఎస్‌బిఐ 60వ వార్షికోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ

డిచ్‌పల్లి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 60వ వార్షికోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి బ్రాంచ్‌ ఆధ్వర్యంలో ఖాతాదారులకు హరితహారంలో భాగంగా మంగళవారం మొక్కలు పంపిణీ చేశారు. ఖాతాదారులచే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టేలా ఖాతాదారులక, ఇతరులకు అవగాహన కల్పించారు. బ్యాంకు సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు టిజియు శాఖ ద్వారా వంద మొక్కలు వారి ఖాతాదారులతో ‘మొక్కలు పెంచండి – కాలుష్యాన్ని నిర్మూలించండి’ అని వారి ఖాతాదారులకు బ్యాంకు మేనేజర్‌ స్వర్ణలత తెలిపారు. ...

Read More »

ఎవరికి వారే యమునా తీరే…

  – బల్దియా పాలకవర్గం, అధికారుల పరిస్థితి కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీ తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా మారింది. పాలకవర్గ సభ్యులు అధికారుల మాట వినరు, అధికారులు పాలకవర్గ సభ్యుల మాట వినరు. దీంతో ఇద్దరి మధ్య విబేదాలు తారాస్తాయికి చేరాయి. సభ్యులు అధికారులపై దుమ్మెత్తి పోయడం, అదికారులు దుమ్ము దులిపేసుకొని పనిచేసుకోవడం పరిపాటి అయింది. దీంతో బల్దియా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఆయా వార్డుల్లో సమస్యలు అలాగే ఉండగా ఆర్థిక ...

Read More »

నిజాం షుగర్స్‌ స్వాధీనానికి పెరుగుతున్న డిమాండ్‌

  బాన్సువాడ, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం చక్కర పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలన్న డిమాండ్‌ రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కార్మికులు, వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు కొన్నాళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవల కాలంలో డిమాండ్‌ పెరగుతుంది. నెలరోజులుగా బోధన్‌లో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇతరులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిజాం షుగర్స్‌ ...

Read More »

పోచమ్మ ఆలయం సందర్శన

  కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డులోగల పోచమ్మ ఆలయాన్ని శనివారం మునిసిపల్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ సందర్శించారు. కామారెడ్డి మాల కుల సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆలయానికి రంగులు వేయించి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ పనులను వైస్‌ఛైర్మన్‌ దగ్గరుండి పరిశీలించారు. బోనాలపండగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కుల సంఘం ప్రతినిధి బాల్‌రాజు, రమేశ్‌, శంకర్‌, నిరంజన్‌, చిన్నరాజు, తదితరులున్నారు. The following two tabs ...

Read More »

డిజిటల్‌ ఇండియా, డిజిటల్‌ తెలంగాణ విజయవంతం చేయాలి

  నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ స్థాయి ప్రజలకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించడానికి డిజిటల్‌ ఇండియా, డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌ తెలిపారు. శనివారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతోజూలై 1 వరకు జిల్లాలో నిర్వహించే డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజి సైన్సు ద్వారా వస్తున్న మార్పులకు అనుగుణంగా గ్రామ స్థాయిలో కూడా ఇ-గవర్నెన్సు కార్యక్రమం ద్వారా గ్రామ స్తాయి ప్రజలకు కంప్యూటర్‌ ...

Read More »

బహుముఖ ప్రజ్ఞాశాలి సైబ పరంధాములు

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుముఖ ప్రజ్ఞాశాలి సైబ పరంధాములు జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిజామాబాద్‌లో జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌కార్యదర్శి సి.పార్థసారధి తెలిపారు. ఈ మేరకు సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళదృష్టి సమర్పణలో ఏర్పాటు చేసిన కీ.శే. సైబ పరంధాములు చిత్రించిన ఛాయాచిత్ర ప్రదర్శన చిత్రాలను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. కళాకారులకు ఏదో ఒక కళలో ప్రవేశం కన్పిస్తుందని, అరుదైన విషయం ఫోటోగ్రాఫి, సాహిత్యం,చిత్రకళలో వీరికి ప్రావీణ్యం ఉండటం చెప్పుకోదగ్గ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">