Breaking News

తాజా వార్తలు

5వ రోజు ఘనంగా ఆవిర్భావ వేడుకలు

ఆర్మూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆర్మూర్‌ పట్టణంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శనివారం ఆర్మూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - October ...

Read More »

సరస్వతీ బిడ్డలం చదువు’కొనలేం’..

వేలూ లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో ఖరీదుగా చదువు’కొన’లేదు. మాసిపోయిన బెంచీలూ మసిబారిన గోడల నీడలో తప్ప. అడగకుండానే అన్నీ సమకూర్చే డాడీ, అడుగుకో ఆనందం కొనుక్కొచ్చే మమ్మీ అంటే తెలియదు. కాయకష్టంతో దోస్తీ చేసే అమ్మానాన్నలు తప్ప. అయినా ఈ చిన్నారులు చిన్నబోలేదు. చింత పడలేదు. పేదరికాన్ని మోస్తూనే ఉన్నారు. సరస్వతీ కటాక్షాన్ని సాధిస్తూనే ఉన్నారు. చెమట చిందిస్తూనే ఉన్నారు. చదువులో విజయాలు లిఖిస్తూనే ఉన్నారు. కాసింత ఆసరా దొరికితే… కాసింత ధైర్యం అందితే… ఈ పేదింటి రత్నాలు ఎన్నెన్ని కాంతులు ...

Read More »

ఉత్తిష్ఠత! జాగ్రత ! ప్రాప్యవరాన్ నిబోధత

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాంగికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలా కాన్త త్రై లోక్యం మంగళం కురు ఈ సంస్కృత వాక్యాలు వినని వారు మనలో చాలా అరుదు. ప్రతి ఇంటా, ప్రతి ఆలయంలో వినిపించే ఈ మంగళ వాక్యాలు విద్యాభ్యాసం చేస్తున్న రాముడిని తెల్లవారు జామున మేల్కొలుపుతూ గురువు విశ్వామిత్రుడు పలికిన మాటలు. ‘‘కౌసల్య సుపుత్రుడవైన ఓ శ్రీరామా! సూర్య భగవానుడు రాబోయే వేళవుతోంది. ఓ నర శ్రేష్ఠుడా మేలుకొనుము. ...

Read More »

ప్రజ్ఞ కళాశాల విద్యార్థులకు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ప్రకటించిన తెలంగాణ యూనివర్సిటీ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రజ్ఞ కళాశాల విద్యార్థులను శుక్రవారం కళాశాల యాజమాన్యం సన్మానించారు. శ్రీహిత 99 శాతం మార్కులు సాధించింది. ఈమెతోపాటు వివిధ కోర్సుల్లో వందకు వంద సాధించిన 20 మంది విద్యార్థులను ఎస్‌బిహెచ్‌ దేవునిపల్లి మేనేజర్‌ ఈశ్వర్‌, కళాశాల కరస్పాండెంట్‌ శశిదర్‌ శర్మ జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్‌ గోవర్ధన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ మోహన్‌, అధ్యాపకబృందం పాల్గొన్నారు. The following ...

Read More »

గ్రీన్‌వాక్‌ అటవీశాఖ ఆధ్వర్యంలోర్యాలీ

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి పట్టణంలో గ్రీన్‌వాక్‌ ఫౌండేషన్‌, అటవీశాఖ సంయుక్త ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా విశ్రాంత ఉద్యోగుల భవనంలో పర్యావరణ సదస్సు, మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ర్యాలీని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి సలీం జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ హరితహారంపై నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. తెలంగాణలో చేపట్టిన ...

Read More »

బోరుమోటారు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డు హౌజింగ్‌ బోర్డులోని ద్వారకానగర్‌లో శుక్రవారం వార్డు కౌన్సిలర్‌ రేణుక చంద్రశేఖర్‌ బోరు మోటారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మంచినీటి ఎద్దడి నివారణకు నిదులు కేటాయించారని తెలిపారు. నిదుల కోసం ఎమ్మెల్యేను కోరగా వెంటనే నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా వార్డుల అభివృద్ధికి ఎమ్మెల్యే, ఛైర్మన్‌ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌, ...

Read More »

పర్యావరణాన్ని కాపాడాలని అటవీశాఖ ర్యాలీ

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కామారెడ్డి డివిజన్లోని అటవీశాఖ సిబ్బంది పర్యావరణాన్ని కాపాడాలని అడవులను రక్షించాలని కామారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన గాలి, నీరు అందే అవకాశముంటుందని పేర్కొన్నారు. అడవులను నరికివేసి భావితరాలకు హాని కలిగించవద్దని సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్‌ అటవీశాఖ సిబ్బంది, ఆర్డీవో నగేశ్‌, డిఎఫ్‌వో నాగేశ్వర్‌రావు, జిల్లా సెకండ్‌ క్లాస్‌మేజిస్ట్రేట్‌ సలీం, ...

Read More »

తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో ఎం.వినోద్‌చారికి చోటు

  ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు 2015లో ఎం.వినోద్‌చారికి చోటు లభించింది. రాష్ట్ర గీతాన్ని, సిఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని ఆవాలతో రాసినందుకు ఈ ఘనత సాధించాడు. ఇందుకుగాను 15 గంటల సమయం పట్టినట్టు చారి తెలిపారు. ముఖ్యమంత్రి తనకు ప్రోత్సాహాన్ని అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని చారి అంటున్నారు. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితమిస్తున్నట్టు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk ...

Read More »

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్మూర్‌ పట్టణంలో అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సిద్దులగుట్టపైగల నవనాథుల విగ్రహాల నుంచి హెరిటేజ్‌ వాక్‌ కమ్‌ రన్‌ఫర్‌ ఎర్త్‌ అనే పరుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ పరుగు సిద్దులగుట్టనుంచి అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా తహసీల్‌ కార్యాలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్‌ నాగరాజు, కమీషనర్‌ సివిఎన్‌ రాజు, ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయ ...

Read More »

తైవాన్‌ పర్యటనలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  ఆర్మూర్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కెటిఆర్‌తో కలిసి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తైవాన్‌ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఇండియా-తైవాన్‌ కో ఆపరేషన్‌ ఫాం అధికారులతో సమావేశంలో వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా తైవాన్‌లో పర్యటన కొనసాగుతుందని వారు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...

Read More »

విత్తనవేటలో రైతులు

  బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌ ఆసన్నమవుతుండడంతో రైతులు విత్తన వేటలో పడ్డారు. వర్షాధారంగా పంటలు సాగుచేసే మెట్ట ప్రాంత రైతులు విత్తనాల కోసం వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిఏటా మెట్టరైతులకు రాయితీపై సోయావిత్తనాలు అందిస్తుంది. సకాలంలో విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడడం ప్రతిఏటా కొనసాగుతుంది. కొందరు రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద కొననుగోలు చేసి అదునులో విత్తనాలు వేసుకునేందుకు ఆతృతపడుతున్నారు. తొలకరి వర్షాలు కురియగానే దుక్కులు దున్ని విత్తనాలువేస్తారు. ముఖ్యంగా సోయా పంటతోపాటు ...

Read More »

ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుని మృతి

  కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ చెరువులో శుక్రవారం మధ్యాహ్నం ఈతకువెళ్లి ప్రమాదవశాత్తు పాషా (21) మృతి చెందినట్టు దేవునిపల్లి ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంటకు చెందిన పాషా శుక్రవారం సరంపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడినుంచి ఈతకొట్టేందుకు చిన్నమల్లారెడ్డి చెరువులోకి వెళ్లగా ప్రమాద వశాత్తు మృతి చెందినట్టు తెలిపారు. మృతునికి భార్య, కూతురు ఉన్నట్టు తెలిపారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డల్ని కడుపులోపెట్టి కాపాడుకుంటది

    తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డల్ని కడుపులోపెట్టి కాపాడుకుంటది : గల్ఫ్ టీఆరెస్ ఆవిర్భావ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత (దుబాయి లో) తెలంగాణ తెచ్చుకున్నదే మన కష్టాలను దూరం చేసుకోడానికని, సమైక్య పాలనలో మొదలైన వలసలు ఇకనైనా ఆగాలని శ్రీమతి కవిత అన్నారు. దుబాయిలో నేడు జరిగిన “ఫ్రెండ్స్ ఆఫ్ టీఆరెస్” కార్యక్రమానికి శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి శాఖల్ని విదేశాల్లోనూ ప్రారంభిస్తున్నామని అన్నరు. ఇప్పటికే ...

Read More »

ట్రాపిక్‌ సిబ్బందికి వడదెబ్బ నివారణ పరికరాలు

  – జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో వడ దెబ్బ నివారణక సంబంధించిన పరికరాలు ట్రాపిక్‌ పోలీసులకు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. స్థానిక ధర్నా చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ ఎండాకాలంలో ట్రాఫిక్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, అంతేగాకుండా వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త చర్యగా పరికరాలు అందించినట్టు పేర్కొన్నారు. ఇందులో చల్లని కళ్ళజోడ్లు, వాటర్‌ బాటిల్స్‌ మొదగువాటిని ...

Read More »

గుట్టుగా గంజాయి…

  – మామూళ్ల మత్తులో సిబ్బంది – నియంత్రించడంలో అధికారులు విఫలం – తక్కువ ధరకే ఎక్కువ కిక్కు నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో యథేచ్చగా గంజాయి రవాణాతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చట్టవ్యతిరేకమైన గంజాయి రవాణా, అమ్మకాలు అరికట్టడంలో అటు సంబంధిత ఎక్సైజ్‌శాఖతో పాటు ఇటు పోలీసులు సైతం పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో, తాండాల్లో సాగుచేసే గంజాయికి ప్రస్తుతం బ్రేక్‌ పడింది. దీంతో ఇప్పుడు ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">