Breaking News

తాజా వార్తలు

ఎసిబి వలకు చిక్కిన పంచాయితీ కార్యదర్శి

బాల్కొండ, నవంబర్‌ 12 : గ్రామ ఉపసర్పంచ్‌ వద్ద 5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పంచాయితీ కార్యదర్శి ఉదంతం బుధవారం బాల్కొండ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. ఎసిబి డిఎస్పీ సంజీవరావు నేతృత్వంలో బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ అలకొండ శ్రీనివాస్‌ నుంచి చిట్టాపూర్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శి రమేశ్‌ 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ...

Read More »

స్నానానికి వెళ్లి యువకుని మృతి

బాల్కొండ, నవంబర్‌ 12 : బాల్కొండ మండలం పోచంపాడుకు చెందిన బలేరావు పవన్‌ (30) గోదావరి పుష్కరఘాట్‌ వద్ద ప్రమాదవశాత్తు నీట మునికి మృతి చెందినట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. మృతుడు పవన్‌ మంగళవారం మధ్యాహ్నం స్నానం కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు వెతికినా ఆచూకి లభించలేదు. బుధవారం పుష్కరఘాట్‌ వద్ద నీటిపై తేడంతో పవన్‌గా గుర్తించారు. మృతునికి ఆరెళ్ల కూతురు సౌమ్య, భార్య రమ్యకృష్ణ వున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ ...

Read More »

రోగి పట్ల అసభ్యంగా వైద్యుడి ప్రవర్తన -జిల్లా వైద్యాధికారి విచారణ

  ఆర్మూర్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ప్రబుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ రోగి పట్ల ఆసుపత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించారన్న విషమై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గోవింద్‌ వాగ్మారె విచారణ జరిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఆమె పట్ల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ అమర్‌భూషన్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు రోగి బంధువులు ఆరోపించారు. ఇక్కడ ఎవరు లేరని, ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు ...

Read More »

అన్ని రంగాల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం -టిపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ ధ్వజం

ఆర్మూర్‌, నవంబర్‌ 12 : తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని టిపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ ధ్వజమెత్తారు. టిపిసిసి అధికార ప్రతినిధిగా నియమితులైన చంద్రమోహన్‌ను స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఎస్టీలకు ప్రత్యేక పంచాయితీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు అమలు కావడం లేదన్నారు. కేసిఆర్‌ హామీలన్నీ ...

Read More »

బెంగాళీ హఠావో..స్వర్ణకార్‌ బచావో.. -ఆర్మూర్‌లో ర్యాలీ, షాపుల మూసివేత

ఆర్మూర్‌, నవంబర్‌ 12 : బెంగాళీ వర్తకుల బంగారం షాపులు మూసి వేయించాలని ఆర్మూర్‌లో బుధవారం స్వర్ణకారులు ర్యాలీ నిర్వహించారు. ‘బెంగాళీ హఠావో..స్వర్ణకార్‌ బచావో..’ అనే నినాదంతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగాళీ బంగారం దుకాణాలను మూసి వేయించారు. ఐదారు ఏళ్ల క్రితం ఆర్మూర్‌కు వచ్చిన బెంగాళీ బంగారం వర్తకులు దుకాణాలు తెరిచి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్వర్ణకారులు ఆరోపించారు. ఎక్కువ రేట్లకు మడిగెలను అద్దెకు తీసుకుని వాటి అద్దెలను కూడా పెరచారన్నారు. బెంగాళీ వర్తకులు నాసిరకం బంగారంతో ఆభరణాలు చేస్తున్నారన్నారు. ...

Read More »

ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి 49వ రోజుకు చేరిన దీక్షలు

  బోధన్‌, నవంబర్‌12: ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని, షుగర్స్‌ మజ్దుర్‌సంఘ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 49వ రోజుకు చేరాయి. రెంజల్‌ మండల ఎంఆర్‌పీయస్‌ నాయకులు దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా రెంజల్‌ మండల ఎంఆర్‌పీయస్‌ నాయకులు బాలజీ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ మేరకు వెంటన్‌ ప్రభుత్వం స్వాదీనం చేసుకోని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్వాదీనం చేసుకోకపోతే అందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీయస్‌ నాయకులు పాల్గొన్నారు. The following two ...

Read More »

రేవంత్‌రెడ్డి క్షేమాపణ చెప్పాలి

బోధన్‌, నవంబర్‌12: నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి క్షేమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బోధన్‌ నియోజక వర్గ ఇంచార్జి కొట్టూర్‌ నవీన్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. బుధవారం బోధన్‌ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డపై నిరాధారమైన ఆరోపణలు చెయడం సరైంది కాదన్నారు. ఇంక్కొక్కసారి ఎంపీ కవితపై ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌వి నాయకులు శివ, నరేష్‌, సందీప్‌, ...

Read More »

ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో నిరసన

బాల్కొండ, నవంబర్‌ 11 : ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగపై మాలమహానాడు అధ్యక్షుడు గైని గంగారాం అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇందుకు నిసనగా బాల్కొండలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వన్నెల్‌ బి లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్లకార్డులతో గంగారాం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందకృష్ణను విమర్శిస్తే మాదిగ సమాజం ఊరుకోదని హెచ్చరించారరు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దాసరి రాజేశ్‌, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. The following two tabs ...

Read More »

చెరువుల పునరుద్ధరణపై అధికారుల సర్వే

  బాల్కొండ, నవంబర్‌ 11 : గ్రామీణ చెరువుల పునరుద్ధరణపై మంగళవారం అధికారులు సర్వే నిర్వహించారు. బాల్కొండ మండలంలోని ముప్కాల్‌, జలాల్‌పూర్‌, చాకిర్యాల గ్రామాల్లో చెరువులపై ఇరిగేషన్‌ డిప్యూటీ ఇఇ ఉదయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కాండ మండలంలోని 12 చెరువులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మండలంలోని బాల్కొండ, ముప్కాల్‌, చిట్లాపూర్‌, నల్లూర్‌, బుస్సాపూర్‌, చాకిర్యాల, దూదిగాం, కొడిచెర్ల, కొత్తపల్లి, వేంపల్లి, జలాల్‌పూర్‌, మెండోరా గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 6 చెరువులకు పూడిక తీత, కాలువలు, ...

Read More »

కరువు మండలంగా ప్రకటించాలి -మద్నూర్‌లో రాస్తారోకో

మద్నూర్‌, నవంబర్‌ 11 : మద్నూర్‌ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ ఈ సీజన్‌లో కనీస వర్ష పాతం కూడా నమోదు కాలేదన్నారు. ఖరీఫ్‌లో పంటలన్నీ ఎండిపోయాయని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాలేదన్నారు. రబీలో పంటలు కూడా పండించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా ఎస్‌ఎన్‌ఏ రహదారిపై బిజెపి నాయకులు, ...

Read More »

మద్నూర్‌లో వాహనాల తనిఖీ

మద్నూర్‌, నవంబర్‌ 11 : మద్నూర్‌లో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎస్‌ఎన్‌ఏ రహదారిపై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా నెంబరులేని వాహనాలు, రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేని వారితో పాటు పరిమితికి మించి వాహనాలు నడిపిన వారికి సైతం జరిమానాలు విధించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అన్నారు. డ్రైవర్లు రోడ్డు రూల్స్‌ను పాటించాలన్నారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -ఒకరి మృతి -మరొకరి పరిస్థితి విషమం

  కామారెడ్డి, నవంబర్‌ 11 : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఇద్దరు ఇంటర్మీడియట్‌ విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. మాచారెడ్డి మండలానికి చెందిన మానస (18) మంగళవారం ఉదయం పురుగుల మందు సేవించగా ఆసుపత్రికి తరలించారు. స్థానిక బతుకమ్మకుంట కాలనీలో సమీప బంధువుల వద్ద వుంటుంది. దీంతో మానసను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స చేయడానికి నిరాకరించడంతో ప్రభుత్వ ...

Read More »

ఆశా వర్కర్ల ధర్నా, ముఖం చాటెసిన డియంహెచ్‌ఒ.

నిజామాబాద్‌, నవరబర్‌ 11; తమ సమస్యలను వెంటనె పరిష్కరించాలని జిల్లాలొని ఆశా వర్కర్లందరు మంగళవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలొ డియంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, గత 27 నెలలుగా ఇవ్వని జీతాలను వెంటనే చెల్లించాలని, టిఎ, డిఎ లను కూడా వెంటనె చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. మరియు రాష్ట్ర బడ్జెట్‌లొ కూడా వీరికి సముచితస్తానం కల్పించి ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు ...

Read More »

ధ్యనంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

బోధన్‌, నవంబర్‌11: ప్రతి ఒక్కరు ధ్యనం చేయడంతోనే సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని బ్రహార్షి సుబాష్‌ పత్రిజీ అన్నారు. మంగళవారం బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ రామాలయంలో పత్రిజీ 67వ జన్మదిన సందర్బంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా పత్రిజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధ్యనం చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు శాకపరులుగా మారాలని అన్నారు. ప్రతి ఇంట్లో పిరమిడ్‌ నిర్మించుకోని ధ్యనం చేయడం వల్ల ఆనంతమైన శక్తులు శరీరంలోకి ప్రవేశిస్తాయని, దీంతో సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని ఆయన తెలిపారు. ఆనంతరం బోధన్‌ శక్కర్‌నగర్‌లోని ...

Read More »

కలకలం రెపిన నకిలీ కరెన్సి

నిజామాబాద్‌, నవరబర్‌ 11; నగరంలోని నాగారం కెనాల్‌లొ నకిలీ కరెన్సి కలకలం రేపింది. వివరాలలోకి వెలితె నగర శివారులోని నాగారం దగ్గర గల నిజాంసాగర్‌ కెనాల్‌లొ ఈరోజు ఉదయం 11 గంటల సమయంలొ ఎవరొ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ కరెన్సి నోట్లని ఒక సంచిలొ తీసుకువచ్చి కెనాల్‌ నీటిలొ పారవెసి పారిపోయాడు. అది చూసిన స్తానికులు అవి నిజమైన నోట్లని భావించి వాటికొసం ఎగబడ్డారు. దీనితొ అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఆయి బ్రిడ్జిపైన రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. వెంటనె 5 టౌన్‌ పొలీసులు ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">