Breaking News

తాజా వార్తలు

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా.. జిల్లాకు మొండి చేయి ఎన్నికల హామీలు గల్లంతే

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా..  జిల్లాకు మొండి చేయి  ఎన్నికల హామీలు గల్లంతే నిజామాబాద్‌  నవంబరు 5:  తెలంగాణ రాష్ట్ర తొలి పద్ధు నిజామాబాద్‌ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పది నెలలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989.49 కోట్లు, ఆర్థిక లోటు ...

Read More »

వారం రోజుల్లో ఓటరు కార్డెలకు ఆధార్‌ అనుసంధానం – కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 5, వారం రోజుల్లోగా ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్‌ కార్డులను ఆనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఓటర్‌ గుర్తింపు కార్డులను ఆధార్‌ కార్డులను అనుసంధానం చేసేందుకు నిజామాబాద్‌ జిల్లాను ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసారని, నియోజక వర్గ స్థాయి, బిఎల్‌ఓలు పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డులను అనుసంధానం చేయడంలో 96 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నామని అన్నారు. అందుకే ...

Read More »

రేపు మనగుడి పూజా సామగ్రి పంపిణి

నిజామాబాద్‌ నవంబరు  5, తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కార్తీక పూర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు (6న) మనగుడి పూజా సామగ్రిని ఉచితంగా పంపిణి చేయనున్నట్లు ధర్మప్రచార మండలి చైర్మన్‌ జిల్లా అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్త తెలిపారు. 9న తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభను ఈనెల 9న సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించనున్నట్లు బీసీ ఐక్య సంఘర్షణ సమితి జిల్లా ...

Read More »

పదవులు వదిలి ఇతర పార్టీల్లో చేరండి

భిక్కనూరు, నవంబర్‌ 4 : కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి పదవులు పొందిన వారు  పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరాలని డిసిసిబి మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ గొడుగు కింద గెలుపొందిన వారు స్వార్థం కోసం రాజకీయ పార్టీలను మారుతున్నారని విమర్శించారు. పార్టీ పిరాయించాలనుకునే వారు వారు ప్రస్తుతం వున్న పార్టీ ద్వారా పొందిన పదవులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఇద్దరు ముగ్గురు పార్టీని వీడినంత మాత్రానా ఒరిగేదేమీ ...

Read More »

బీడీ కార్మికులకు 26 రోజుల పని కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 4 : బీడీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని నూతన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంది సత్యం డిమాండ్‌ చేశారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పించన్‌ ఇవ్వాలని, నాన్‌ పిఎఫ్‌ కార్మికులకు పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రి వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనే అందేలా చూడాలని, బీడీ కార్మికుల పిల్లకు స్కాలర్‌షిప్‌లు, ఇండ్లులేని ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే

మద్నూర్‌, నవంబర్‌ 4 : మద్నూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కింద వచ్చిన దరఖాస్తులపై అధికారులు, సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మద్నూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం సర్వే నిర్వహించారు. ఆహార భద్రత కార్డులు, పించన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. అర్హులైన లబ్దిదారులకు రేషన్‌, పించన్‌ అందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మద్నూర్‌ విఆర్‌ఓ శంకర్‌పటేల్‌, సిబ్బంది పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...

Read More »

పించన్లకు సర్కారు మూహుర్తం – 8న పంపిణీకి ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు

  నిజామాబాద్‌, నవంబర్‌ 4 : రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రాంరభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. వితుంతు, వికలాంగ, వృద్ధాప్య పించన్ల పంపిణీకి ఈనెల 8వ తేదీని ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ డివిజన్‌, మండలస్థాయి అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులు, పించన్ల దరఖాస్తుల పరిశీలనపై వివిధ స్థాయిల అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సవరించిన మేరకు రేషన్‌కార్డు, పించన్‌ ఇవ్వడానికి గ్రామీణులైతే ఏటా లక్షా ...

Read More »

బిచ్కుందలో ఘనంగా పీర్ల పండగ

బిచ్కుంద, నవంబర్‌ 4 : బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం మొహర్రం వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అంతకు ఒక రోజు ముందు సోమవారం రాత్రి దూదిపీరు (పెద్దపీరు)ను అత్యంత సుందరంగా అలంకరించి ముస్లీం కాలనీలో పెద్దపీరును ప్రతిష్టించారు. మజ్నా ఆట అసోయి దూలా ఆటలాడుతూ భాజా భజంత్రీలతో నృత్యాలు చేశారు. ప్రజలు బెల్లం, నిశ్శాన్‌, చెక్కరి, తియ్యటి పదార్థాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం సాయంత్రం వేళ బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రధాన వీధుల ద్వారా పెద్దపీరును ఊరేగించారు. అనంతరం మండల ...

Read More »

కామారెడ్డిలో చోర్‌ బజార్‌

అడ్డికి పావుసేర్‌ ధరకే సెల్‌ ఫోన్‌ కామారెడ్డి, నవంబర్‌  4: వేలల్లో ధర పలికే సెల్‌ఫోన్‌ వందల్లో దొరుకుతుందంటే నమ్ముతారా? ఇది ముమ్మాటికి నిజం. అయితే అలా తక్కువ ధరకు సెల్‌ఫోన్‌ అమ్మకాలు కామారెడ్డిలోని చోర్‌ బజార్‌లో జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని సిరిసిల్లా రోడ్‌లో ఎస్‌బిహెచ్‌ బ్యాంకు ఎదురుగా వున్న వీధిలో సెల్‌ఫోన్‌ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆ వీధిలోకి వెళ్తే వందలాది మంది సెల్‌ఫోన్‌లను చేతిలో పట్టుకుని రోడ్డుపై నిల్చుండి లావాదేవీలు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. నోకియా మొదలుకొని శ్యాంసంగ్‌, ఎల్‌జి, మాక్రోమాక్స్‌, ...

Read More »

శ్రీవెంకటేశ్వర ఆలయంలో లక్షదీపారాధన

బోధన్‌, నవంబర్‌04: బోధన్‌ మండలం శ్రీనివాసనగర్‌లోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్బంగా మంగళవారం ఆలయ కమిటి నిర్వహకులు లక్షదీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆలయ ఆవరణలో లక్షదీపాలతో కాంతులు వెదజల్లాయి. ఆనంతరం  ఆలయంలో గ్రామ మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్బంగా ప్రతియేట లక్షదీపారాదన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ నిర్వహకులు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and ...

Read More »

కబ్జాలో సుడిలో శిఖం భూములు

 చెరువుల్లో కాసుల పంటలు – కబ్జాలో సుడిలో శిఖం భూములు కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు దశాబ్దలుగా నిర్లక్షానికి గురైన చెరువులను బాగు చేయించడానికి ప్రభుత్వం ప్రయాత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు చిన్న నీటి వనరులన్ని కబ్జాల కంబంధ హస్తల్లో చిక్కుకున్నాయి. శిఖం భూముల్లో పంటలు సాగుచేస్తూ కాసుల దిగుబడి పోందుతున్నారు. పెద్దలు అక్రమింకున్న భూములు వదిలేసి పే దోల్ల కబ్జాల్లో ఉన్న భూములను తీసేసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన సర్వేలతో అక్రమాల నిగ్గు తేల్చి కబ్జాలను తోలగిస్తేనే ప్రయోజనం కలుగుతోంది. బోధన్‌ డివిజన్‌లోని  నిజాంసాగర్‌, పిట్లం ...

Read More »

కల్దుర్కిలో ఘనంగా మొహరం పండుగా

బోధన్‌, నవంబర్‌04: బోధన్‌ మండలం కల్దుర్కిలో మంగళవారం మొహరం పండుగా ఉత్సవాలు  ఘనంగా నిర్వహించారు. మొగులాల పీర్లను అత్యంత ఘనంగా అలంకరించి పీర్లను ప్రతిష్టించారు. గ్రామస్తులు కులమతాలకు అతీతంగా పీర్ల వద్ద ఆశన్న, ఊశన్న, అసోయిదూల హారతి పాటలు పాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పీర్ల వద్ద మొక్కులను తీర్చికున్నారు. చుట్టు ప్రక్కల గ్రామాలైన సిద్దాపూర్‌, రాంపూర్‌, బండార్‌పల్లి, మావందికుర్దు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలలో పాల్గొన్ని మొక్కులు తీర్చుకున్నారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

అటోడ్రైవర్లు బాద్యతయుతంగా వాహనాలు నడుపాలి

అటోడ్రైవర్లు బాద్యతయుతంగా వాహనాలు నడుపాలి – జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బోధన్‌, నవంబర్‌04: అటో డ్రైవర్లు బాద్యతయుతంగా వాహనాలు నడుపాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ సూచించారు. మంగళవారం బోధన్‌ పట్టణ శివారులోని ఎఆర్‌గార్డెన్‌లో అటోడ్రైవర్లుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మట్లాడుతూ అటోడ్రైవర్లు రోడ్డుకు సంబంధించిన నియమనింధనలు పాటించాలని తెలిపారు.  అటోడ్రైవర్లు అందరు యూనిఫాం దరించి వాహనాలు నడుపాలన్నారు.  అటో నడిపే సమయంలో సెల్‌పోన్‌లో మాట్లాడవద్దని సూచించారు. కొంతమంది అటోడ్రైవర్లు నిర్లక్ష్యంగా అటోలను నడుపడవల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల ...

Read More »

రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు మాధవ్‌ ఎంపిక

మద్నూర్‌, నవంబర్‌ 3 : మద్నూర్‌ మండలం తడ్గూర్‌ పెద్ద జిల్లా పరిషత్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి వి.మాధవ్‌ రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్‌ 1న ఎల్లారెడ్డిలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌-14 45 కిలోల విభాగంలో మాధవ్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. దీంతో ఆయనను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పిఇటి భుజంగ్‌ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మాధవ్‌ తన సత్తా చాటి పాఠశాలకు పేరు తెస్తారని ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ...

Read More »

మద్నూర్‌లో వాహనాల తనిఖీలు

మద్నూర్‌, నవంబర్‌ 3 : మద్నూర్‌ మండల కేంద్రంలోని ఎస్‌ఎన్‌ఏ రహదారిపై సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, కాలుష్య నివారణ పత్రాలు, బీమా పత్రాలను పరిశీలించారు. నెంబరు ప్లేట్‌తో పాటు అవసరమైన పత్రాలు వారు, పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణించిన వారికి జరిమానాలు విధించినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">