Breaking News

తాజా వార్తలు

కవి సమయం కోదారి శ్రీను

తెలంగాణ పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, ముఖ్యంగా వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేసిన తీరు అభినందనీయం. ఆంతేకాదు, తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చిండు శ్రీను. అస్సోయ్ దూలా పాట ఒక్కమాటలో తెలంగాణ సమైక్యతకు నిండు నిదర్శనం. కోదారి శ్రీను. ఇది తన కలం పేరు. సాయుధ పోరాట వీరుడు కొమురయ్య (దొడ్డి) స్ఫూర్తితో తాను ఆ దారిని ఎంచుకుని కోదారి శ్రీను అయిండు. ఈ ...

Read More »

నేను – జయధీర్ – డక్కలి గోపాల్

చిన్నతనం నుండి ఏదో ఒక అనారోగ్యం. పోషక విలువల లేమి వల్ల బలహీనత. మా తల్లికి సైతం అస్వస్థత. పెద్ద కుటుంబం. చిన్న ఆదాయం. సంఘర్షణలోంచి జీవితాన్ని చూస్తూ లేస్తూ పడుతున్నప్పుడు స్నేహమే ఒక ఆలంబన. జీవితంలో స్నేహాలకు కొదువలేదు. కానీ, ఆత్మగౌరవం, అభిమానం, సంతృప్తినిచ్చే ఒక స్నేహం ఎన్నో రూపాలలో ఉండవచ్చు. బంధుస్నేహం, సమవయస్సు స్నేహం…ఏదైనా కావచ్చు. మొదట మా అమ్మనీ- విడవకుండా ఆమె చదివే పుస్తకాల పట్ల స్నేహం. వీథిలో స్నేహితులు. ఆటల స్నేహితులు. బడి స్నేహితులు. పక్కింటి స్నేహితులు. ఎంతోమంది. ...

Read More »

కవి సమయం మిత్ర – విమలక్క

ప్రాస కోసం కాదు, నిజం. ఒకరు అజ్ఞాతం. ఇంకొకరు జ్ఞాతం. ఒకరు కలం. ఇంకొకరు గళం. తెలంగాణంలో ఈ ఇద్దరి యుగళ గీతం అరుణోదయం. ఒక విమోచన. అలియాస్ అన్న పదం పోలీసులు తెచ్చింది కాబోలు అందుకే వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్రల గురించి మాట్లాడుతుంటే అట్లా కాకుండా కూర మల్లమ్మ బిడ్డ అని రాయాలనిపిస్తుంది. కూర బాలయ్య చిన్న కొడుకు అని చెప్పాలనిపిస్తంది. జనశక్తి అగ్రనేత కూర రాజన్న తమ్ముడని గుర్తు చేయాలనిపిస్తుంది. మూలవాగు మాణిక్యం అనీ ...

Read More »

నీటి యాతన

గ్లాసెడు నీటి విలువ తెలియాలంటే గాంధారి మండలంలోని బూర్గుల్‌కు వెళ్లాల్సిందే. గ్రామంలో కనీస నీటి సౌకర్యాలు లేక గ్రామస్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లి అనారోగ్యానికి గురై మహిళలు గర్భాన్ని కోల్పోతున్నారు. నీటిగోసతో బంధువులు ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. గ్రామ యువకులకు పిల్లలను ఇవ్వడం లేదు. నీటి సమస్యతో విడాకులైన ఘటనలు, ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలూ ఉన్నాయి. ఒక్కరోజు నీరు పట్టుకుం టే.. మూడు, నాలుగు రోజులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఎడారి ప్రాంతంలో కూడా ఇంతటి నీటి ...

Read More »

నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు

బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్‌లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి.  ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి ...

Read More »

అసౌకర్యాలకు నిలయంగా మార్కెట్ కేంద్రాలు

 పేరు గొప్ప వూరు దిబ్బలాగా పరిస్థితి మారింది. పేరుకు నియోజకవర్గం కేంద్రమైనా సమస్యలకు నిలయంగా మారింది. సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గ్రామంలో దినసరి కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, ప్రతి గురువారం నిర్వహించే వారాంతపు సంత అసౌకార్యాల మధ్య కొనసాగుతున్నాయి. కనీస సౌకర్యాల గురించి ఏళ్లుగా పట్టించుకున్న నాథుడు కరవయ్యారు. దీంతో మార్కెట్‌లో కూరగాయలు, చేపలు తదితర వస్తువులు విక్రయించే వ్యాపారులు, అటు కొనుగోళ్లకు వచ్చే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. వర్షాకాలంలో వర్షం కురిస్తే వానలో తడవాల్సిన పరిస్థితి. ఎండాకాలంలో ఎండలో క్రయవిక్రయాలు ...

Read More »

రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించొద్దు 

లోక్ సభ ఎన్నికలు ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెగ్యులర్ బడ్జెటును జూన్ చివర్లో గాని, లేదా జులై మొదట్లో గాని ప్రవేశపెడతారు. అంటే- పరిశ్రమ, వ్యవసాయం, బ్యాంకింగ్ వంటి రంగాలకు, ఆర్థిక నిపుణులకు ఆ బడ్జెటు ఎలా ఉండాలనే అంశంపై అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు మరో అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ సందట్లో చిన్న మదుపుదారులు, వయోవృద్ధుల (సీనియర్ సిటిజన్ల) మొరలు వినేదెవరు..? వారి గోడును పట్టించుకొని, పరిష్కరించడం ముఖ్యం. చిన్న మదుపరులకు ప్రతిఫలం: చిన్న మదుపరులకు మరెక్కడికైనా వెళ్లడానికి ...

Read More »

బాసట లేని బాసర!

తెలంగాణలోని ఏకైక అంతర్జాతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ట్రిపుల్ ఐటీ) కొరతల కొలిమిలో కునారిల్లుతోంది. 2008లో అవతరించింది మొదలు బాసర ఐఐఐటీ నానావిధ సమస్యలకు నెలవైనట్లు వరసగా వార్తాకథనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్ళి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్ జైన్ రూపొందించిన అధ్యయన నివేదిక- అక్కడి భోజనం ఘోరమని, బోధనం అధ్వానమని స్పష్టీకరిస్తోంది. ఆయన నివేదికాంశాలు ‘ప్రతిష్ఠాత్మక’ ట్రిపుల్ ఐటీ దయనీయ దీనావస్థను కళ్లకు కడుతున్నాయి. గతంలోనూ బాసర ఐఐఐటీ గతి రీతులపై ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కుళ్ళిపోయిన ...

Read More »

జీరో డిగ్రీ – పుస్తక సమీక్ష

ఏ వూరు మీది…..ఐద్రబాద్….అంటే ఎక్కడి నుంచి వచ్చిండ్రని….పైలట్ సంది ఈడనే….తాత తండ్రుల్ది యావూరో….. మాకైతే పట్నమే ఎర్క…..గిట్ల మాట్లాడెటోళ్లది ఐతే పట్నం కాకుంటే లష్కర్….కానీ కొంత మంది ఊర్లల్ల కేలి వస్తరు…..బస్తీదేవత యాదమ్మలు ఎంతగా ఆదరించినా అమ్మ యాదికొస్తే ఆకలినీల్లు జాంతానై…..అమ్మ ఊర్లె ఉన్నదాయె…..పొట్టచేతపట్టుకుని పట్నం బోయిన కొడ్కు ఎట్లున్నడో అని తినదు…తిన్నా తిన్నన్నం పెయికి వట్టది. గాపోరడు చిన్న కోలి దీస్కుని ఉంటుండు…..నిన్న జూసిన…..నిద్రల కల్వరిస్తుండు….అమ్మ అమ్మ అంటుండు…..జరమొచ్చిందో ఏమో….జరంల అమ్మ యాదికొచ్చినట్టుంది పిలగానికి…..గసొంటి కలవరింతలే ఈ జీరోడిగ్రీ కవితలు. ఈ కవిపేర్ల ...

Read More »

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం

ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి నాంది పలికారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా సంస్థల్లో తీవ్ర నిర్బంధంలోనూ పనిచేస్తూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమైన కలం వీరులు స్వీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు జర్నలిస్టుల జాతర వేదికగా సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఆకాంక్షను పల్లెపల్లెకు చేర్చిన జర్నలిస్టులు నవ తెలంగాణ నిర్మాణంతో పాటు తమ హక్కుల సాధన కోసం కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. జర్నలిస్టుల ...

Read More »

బాసర సరస్వతీ ఆలయం

పురాణగాధ కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇకాడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం ...

Read More »

జూలురు లోకతప్త కవిత్వం ‘ముండ్లకర్ర’

ఎంత విషాదమిది? ఈనాడు తెలంగాణ పల్లెటూళ్లు ఎలా ఉన్నాయో ఇది చదివితేనే అర్థమవుతుంది. జీవితంలోని కష్టసుఖాలు, వాటి కార్యాచరణ సంబంధాల పట్ల సరైన అవగాహన ఉన్న కవి జూలూరు గౌరీశంకర్. ఆయన కవిత్వం జ్వలించే ఆగ్రహంగానో, ఉక్రోషంగానో, నిస్సహాయంగా, నిర్వేదంగా కనిపించే హాలాహలంగానో కనిపించినా ప్రతి అక్షరం తన స్వీయానుభవం నుంచి ఆవిష్కృతమైన తెలంగాణా జీవిత పార్శ్వమే. ‘ముండ్లకప్ప’- జూలూరు గౌరీశంకర్ సమగ్ర కవిత్వం… ఒక పలవరింత ఒక కలవరింత, మహా పులకరింత!  ”మనం తప్పు చేసినప్పుడు నాయన వూహించకుండా చెంపపై కొట్టే దెబ్బ మహాకవిత్వం. ...

Read More »

ఒగ్గు కథకు చిరునామా “మిద్దె రాములు” – ఓ తెలంగాణ కళాకారుడు

ఒగ్గు కథకు మారు పేరు ‘మిద్దె రాములు’. అతని పాటకు పల్లె పల్లవవుతుంది. అతని గొంతు గట్లను దాటుతూ పంట పొలాల్ని స్పృశిస్తుంది. అతని కథకు తంగెడుపూలు తలవూపుతూ స్వాగతం చెబితే, పల్లెలు, తండాలు ప్రాణం పోసుకుంటాయి. అతను ఆ రోజు ఊళ్లో కథ చెబుతాడంటే ఆ ఊరికి కొత్త కళ వచ్చేస్తుంది. అది ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ఆడిటోరియం. చిరుగజ్జెల సవ్వడితో, నాట్య భంగిమలతో ఓ తెలంగాణ కళాకారుడు అద్భుతంగా ఒగ్గు కథ చెప్పాడు. స్టేజి దిగగానే జనమంతా ఆయన చుట్టుమూగి ‘ఆటోగ్రాఫ్‌ ...

Read More »

తెలంగాణ రాష్ట్రానికి దిగ్దర్శకులే నేతలుగా రావాలిప్పుడు…

మరో నెలరోజుల్లో సాకారం కానున్న తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ దిశా సూచికలు- రేపటి ఎన్నికలు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ఇప్పుడిక ప్రగతి పథంలో పరుగులెత్తించేదెలాగన్నది కీలకాంశం. తెలంగాణ శ్రమజీవుల గడ్డ. అడవులు, నదీనదాలు, బొగ్గు, సున్నపురాయి వంటి ఖనిజాలు సహా అపార సహజవనరుల అడ్డా. ఒకవైపు రతనాలు పండిస్తూనే- వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళ్లే అవకాశాలు అనంతం. దూకుడుతో ఈ కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే దిగ్దర్శకులే నేతలుగా రావాలిప్పుడు… కావాలిప్పుడు! దశాబ్దాల తెలంగాణ స్వప్నం సాకారమైంది. నవ తెలంగాణలో ...

Read More »

నవ తెలంగాణకు నాంది!

చూపుడు వేలిమీద సిరాచుక్క రేపు తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతున్న కీలక తరుణమిది. యథాపూర్వం ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక సమరం సాగుతున్నా- ఫలితాలు వెలువడ్డ పక్షంరోజులకు తెలంగాణ అస్తిత్వ కాంక్షలు సాకారం కానుండటంతో, ఈ ఎన్నికల ప్రాధాన్యం ఎనలేనిది. దశాబ్దాల ‘ప్రత్యేక’ ఉద్యమాల ఫలశ్రుతిగా, భారతావనిలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ రెండో తేదీన ఆవిర్భవించబోతోంది. ఆ ఆనందానికి, నవతెలంగాణ తొట్టతొలి సారథ్యం కోసం పోటీలు పడుతున్న భిన్న పార్టీల భావోద్వేగాలు జతపడి పక్షంరోజుల ఎన్నికల ప్రచారం ‘ధూం ధాం’గా సాగిపోయింది. 17లోక్‌సభ, 119అసెంబ్లీ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">