తాజా వార్తలు

నెలాఖరులోగా పత్తిరైతులకు గుర్తింపు కార్డులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం జనహిత భవనంలో మండల రైతు సమన్వయ సమితి సభ్యులతో, వ్యవసాయ అధికారులతో పత్తి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం 20 వేల 655 ఎకరాల్లో పత్తివేశారని, ఈయేడు అధికంగా 49 వేల 781 ఎకరాల్లో పత్తి వేశారని తెలిపారు. మద్నూర్‌లో కొనుగోలు కేంద్రం ఉందని, పిట్లం, కామారెడ్డి ల్లో …

Read More »

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

  కామరెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని హైమద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు అన్నారు. రామేశ్వర్‌పల్లిలోని టిటిసి విద్యార్థులతో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మకు విశిష్ట స్తానముందని, ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన అవసరముందన్నారు. పూలను దేవుళ్ళుగా పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు హలీఫ్‌ పాషా, శ్రీనివాసులు, స్వప్న, సత్యనారాయణ, …

Read More »

మత్స్యసంపద నూరుశాతం మత్స్యకారులదే

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యసంపద నూటికి నూరుశాతం మత్స్యకారులదేనని వారికే చెందుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలోని చెరువులో చేపపిల్లలను విడిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాన్సువాడ మండల పరిధిలో 14 చెరువుల్లో 19 లక్షల 73 వేల 580 చేపపిల్లలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇబ్రహీంపేట్‌ చెరువులో 2 లక్షల 67 వేల చేపపిల్లల్ని విడుస్తున్నట్టు తెలిపారు. దళారులను …

Read More »

ఆడపిల్లకు చీరపెట్టడం సంస్కృతిలో భాగం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆడబిడ్డలకు చీరపెట్టడం మన సంస్కృతిలో భాగమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని పాత బాన్సువాడ చావడి, కొత్త బాన్సువాడలోని వీక్లిమార్కెట్‌లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, ఆత్మీయతతో ఆడబిడ్డలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను బహుమతిగా అందించిందన్నారు. ఒక కోటి 4 లక్షల మందికి చీరలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నిజాంసాగర్‌ నుంచి …

Read More »

సూర్యోదయ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

  నందిపేట, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని సూర్యోదయ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గును, తంగేడు పూలతో అందంగా ముస్తాబుచేసిన బతుకమ్మను శ్రద్దతో పూజించి ఆడి పాడారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Email this page

Read More »

లక్ష్మిఫిల్లింగ్‌ స్టేషన్‌లో బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డిలోని స్థానిక లక్ష్మిఫిల్లింగ్‌ స్టేషన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు యాజమాన్యం హాజి, నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం అందంగా అలంకరించిన 5 ఫీట్ల బతుకమ్మను పెట్రోల్‌ పంప్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. చక్కగా విద్యుత్‌ దీపాల కాంతులతో అలంకరించి పలువుర్ని ఆకట్టుకుంటుంది బతుకమ్మ. జిల్లా కలెక్టర్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్‌ పంపుల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు …

Read More »

వ్యక్తి అదృశ్యం

  నందిపేట, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఐలపురం గంగాధర్‌ (24) గత 20 రోజుల నుంచి కనిపించకుండా పోయాడని తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వెళ్లిన గంగాధర్‌ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటింకి పంపించారని, నిజామాబాద్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించగా కొంతమేర నయమైందని మల్లయ్య తెలిపారు. కాగా గత 20 రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదని, చుట్టాలు, బంధువుల …

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 10 ఫిర్యాదులు

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపిలో 10 ఫిర్యాదులు అందినట్టు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో డయల్‌ యువర్‌ సిపి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించినట్టు తెలిపారు. కాగా నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పరిధిలో మొత్తం 10 ఫిర్యాదులు రాగా కమీషనర్‌ సానుకూలంగా స్పందిస్తు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత …

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

  నందిపేట, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మండల పరిసత్‌ అధ్యక్షురాలు అంకంపల్లి యమున అధ్యక్షతన మండల కేంద్రంలోని మండల కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ ప్రారంభించి, తర్వాత మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసిల ఆధ్వర్యంలో చీరలు పంపినీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించే ఏకైక ప్రభుత్వమని వక్తలన్నారు. ప్రతి ఒక్కరు పండగకు కొత్తబట్టలు కొనుక్కోలేదని బాధ పడకూదనే …

Read More »

డయల్‌యువర్‌ ఎస్‌పిలో 5 ఫిర్యాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యాలయంలో ప్రజల నుంచి 5 ఫిర్యాదులు అందినట్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎస్‌పి శ్వేతారెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కామారెడ్డి-1, దేవునిపల్లి-2, ఎల్లారెడ్డి-1, తాడ్వాయి-1 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు పిర్యాదులు పరిస్కరించాలని ఎస్‌పి నివేదించినట్టు వివరించారు. Email this page

Read More »

సిసి డ్రైనేజీ పనులు ప్రారంభం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 33వ వార్డు స్నేహపురి కాలనీలో నిర్మిస్తున్న సిసి డ్రైనేజీ పనులను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పి.సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. లక్ష వ్యయంతో మురికి కాలువ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ భారతమ్మ, మాజీ కౌన్సిలర్‌ జూలూరి సుధాకర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు కిషన్‌, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షునిగా మార్కండేయులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కామరెడ్డికి చెందిన భక్త మార్కండేయులును నియమిస్తు సంఘం అధ్యక్షుడు బాబురావు ఉత్తర్వులు జారీచేశారు. మార్కండేయులు చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. సోమవారం మార్కండేయులుకు నియామకపత్రం అందజేశారు. మార్కండేయులు మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతికి తనవంతు కృసి చేస్తానని పేర్కొన్నారు. Email this page

Read More »

ప్రజావాణి రద్దు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీ నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చీరల పంపిణీ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిని సన్నద్దం చేసేందుకు వారు విధుల్లోకి వెళ్లిన క్రమంలో ప్రజావాణి రద్దుచేయాల్సి వచ్చిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు స్వీకరించలేదని యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని వివరించారు. Email this page

Read More »

రూ.250 కోట్లతో మహిళలకు చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండగ సందర్భంగా రూ.250 కోట్లతో తెలంగాణలోని ఆడపడుచులకు ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ మండలం సోమేశ్వర్‌ గ్రామంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి 4 లక్షల 15 వేల 470 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఆడబిడ్డల కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ప్రభుత్వం …

Read More »

చైతన్య పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య పాఠశాలలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తంగేడుపూలు, గునుగుపూలు తెచ్చి పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలు పేర్చి ఆడారు. విద్యార్థులకు పండగ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్టు పాఠశాల కరస్పాండెంట్‌ తానోబా ఆనంద్‌రావు తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు సంబరాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమిత్రానంద్‌ పాల్గొన్నారు. Email this page

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">