Breaking News

తాజా వార్తలు

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త బుధవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా హైదరాబాద్‌ రోడ్డులో తవ్విన రోడ్ల మరమ్మతులకోసం కపిల హోటల్‌ ముందు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం మన ఎమ్మెల్యే – మన ఎంపి కార్యక్రమంలో భాగంగా 2వ, 4వ, 8వ డివిజన్‌లలో ఇంటింటికి తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే …

Read More »

షీ టీం గురించి విద్యార్థినిలకు అవగాహన

  బీర్కూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె డిగ్రీ కళాశాలలో మంగళవారం షీ టీం అవెర్నెస్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేసి విద్యార్థులకు షీ టీం గురించి అవగాహన కల్పించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. ముఖ్య అతిథిగా డిఎస్‌పి నర్సింహారావు, బాన్సువాడ టౌన్‌ ఎస్‌హెచ్‌వో శేఖర్‌రెడ్డి, షీ టీం ఇన్‌చార్జి సంపత్‌కుమార్‌, బీర్కూర్‌ ఎస్‌ఐ పాల్గొని షీ టీం ఏర్పాటు, వారి విదుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు చింతకుంట మోహన్‌, శంకర్‌, ఇలియాస్‌ …

Read More »

25న మెగారక్తదాన శిబిరం

  నందిపేట, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ బుధవారం రోజున నందిపేట మండల ప్రజా పరిసత్‌ కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి రెడ్‌క్రాస్‌ సొసైటీ, నిజామాబాద్‌, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి సుమారు 500 మంది రక్తదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. Email this page

Read More »

వెబ్‌ల్యాండ్‌ ప్రక్రియను డిసెంబరు నాటికి పూర్తిచేయాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెబ్‌ ల్యాండ్‌ ప్రక్రియను డిసెంబరు నాటికి పూర్తిచేయాలని స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ వెబ్‌ల్యాండ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెబ్‌ల్యాండ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసి 1(బి) ప్రచురించాలన్నారు. గ్రామాల వారిగా పంట విస్తీర్ణం నమోదు చేయాలని సూచించారు. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా తప్పులను సరిదిద్దాలని చెప్పారు. సాదా బైనామా, అసైన్ట్‌ ల్యాండ్‌, పహాణీ, ఆన్‌లైన్‌ …

Read More »

సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ

    బీర్కూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం 44.70 శాతం సబ్సిడీపై 25 కిలోల శనగ విత్తనాల బస్తాను ఒక ఎకరాకు సరిపోయేలా పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో సబ్సిడీపై శనగ విత్తనాలను పంపిణీ చేశారు. 25 కిలోల బస్తారేటు రూ. 2170 కాగా సబ్సిడీ 970 రూపాయలు పోను రైతుధర 1200 లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక్కో …

Read More »

కేర్‌ విద్యార్థుల కేరింత… నూతన విద్యార్థుల పులకింత…

  నిజామాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2005 లో కేవలం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభమై దిన దిన ప్రవర్దమానమై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తమ కళాశాల ప్రస్తుతం 10 గ్రూపుల్లో, సుమారు 1000 కి పైగా విద్యార్థులతో నడుస్తుందని కేర్‌ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ నరాల సుధాకర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. …

Read More »

ఛలో కేరళ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేరళలో కమ్యూనిస్టులు చేస్తున్న హత్యాకాండను నిరసిస్తూ నిర్వహించనున్న ఛలో కేరళకు సంబంధించిన గోడప్రతులను మంగళవారం ఏబివిపి భీమ్‌గల్‌ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్‌ జక్కుల కార్తీక్‌ మాట్లాడుతూ దేవభూమిగా, భూతల స్వర్గంగా ప్రసిద్ది గాంచిన కేరళ రాష్ట్రంలో సిపిఎం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులు హత్యలకు ఒడిగడుతున్నారని, కొందరిని శత్రువర్గంగా ముద్రవేసి నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు సిద్దాంతాలను కాదన్నవారు హత్యకు గురవుతున్నారని, నేటికి …

Read More »

బాసర సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు

  బాసర, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ జ్ఞానసరస్వతి దేవి దేవస్థానం బాసర అమ్మవారి 40 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ అధికారులు లెక్కించి వివరాలు వెల్లడించారు. 40 రోజుల ఆదాయం రూ. 43 లక్షల 671, విదేశీ కరెన్సీలు 20, మిశ్రమ బంగారం 107 గ్రాముల 400 మి. గ్రాములు, అదేవిధంగా వెండి 2 కిలోల 370 గ్రాములు వచ్చినట్టు కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఆదిలాబాద్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజమౌళి, …

Read More »

మహిళలు స్వశక్తితో ఎదగాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు స్వశక్తితో ఎదగాలని ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో సెట్విన్‌ కేంద్రంలో కుట్టు శిక్షణ పొందిన అభ్యర్థులకు మంగళవారం ఆయన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. న్యాక్‌, సెట్విన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం కుట్టు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు శిక్షణ తరగతులు వినియోగించుకొని తద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు. …

Read More »

మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో మూఢనమ్మకాలకు గురికావద్దని నిజాంసాగర్‌ ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆరేడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూఢ నమ్మకాల వల్ల ఆస్తులు నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవాలని సూచించారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి కేసులు పెట్టుకోవద్దన్నారు. రాత్రివేళల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే …

Read More »

మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలాఖరులోగా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప బూర్గుల్‌ గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరు శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటి వరకు వంద మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం 22 మందికి మరుగుదొడ్లు మంజూరుకాగా మరో 20 మంది లబ్దిదారులు స్థలాలులేక చేపట్టడం లేదన్నారు. స్థలాలున్న లబ్దిదారులు వారంరోజుల్లో నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ అనిత, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పెంటయ్య, రాములు, …

Read More »

కొనుగోలు కేంద్రం ప్రారంభం

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు సద్వినియోగం చేసుకునేందుకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని గున్కుల్‌ సొసైటీ ఛైర్మన్‌ మోయినుద్దీన్‌ అన్నారు. మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో మంగళవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శుద్దిచేసిన ధాన్యంతో తేమ శాతం ప్రకారంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలు చేయాలని రైతులకు సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, డిసిసిబి డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, …

Read More »

అవినీతి కేసులో షబ్బీర్ అలీ.. ఈడీ చార్జిషీట్!

  హైదరాబాద్: ఈడీ చార్జిషీట్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ పేరు నమోదుచేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్‌, రంజిత్ సిన్హా అవినీతి కేసులో షబ్బీర్ అలీపేరు తెరపైకి వచ్చింది. రంజిత్‌ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేశాడు. కాగా, ఖురేషికి షబ్బీర్ అలీ లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన.. షబ్బీర్ అలీ, ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. Email this page

Read More »

సినిమా లవర్స్ తప్పక చూడాల్సిన ‘గల్ఫ్’

పొట్టకూటి కోసం కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలేసి.. పరాయి దేశానికి వలస వెళ్లి.. అక్కడ బాధలను దిగమింగుకుని మరీ కుటుంబం కోసం కష్టాలు అనుభవిస్తున్న గల్ఫ్ కార్మికుల కోసం.. ఓ సినిమా వచ్చింది. సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ.. వంటి సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే పీ.సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘గల్ఫ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. గల్ఫ్ కష్టాలు, ఓ ప్రేమకథ, కన్నతల్లిదండ్రుల కోసం తపన.. ఇలా పలు అంశాలను స్పృసిస్తూ సునీల్‌కుమార్ …

Read More »

ప్రజావాణిలో 74 ఫిర్యాదులు

  కామారెడ్డి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 74 ఫిర్యాదులు అందినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఇందులో రెవెన్యూశాఖకు సంబంధించి 33, పంచాయతీ రాజ్‌ -10, డిఆర్‌డిఎ – 8తో ఆయా శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. వినతులు పరిశీలించి వాటిని పరిస్కరించాలని అధికారులకు ఆదేశించినట్టు వివరించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, అధికారులు పాల్గొన్నారు. Email this page

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">