Breaking News

తాజా వార్తలు

అడవి పంది దాడిలో ఒకరికి గాయాలు

  కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన జింక మల్లేశంను అడవి పందులుదాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తన వ్యవసాయ బావివద్ద ఎడ్లకు, పశువులకు నీటిని పెట్టేందుకు వెళ్ళగా పొలంలో ఉన్న అడవి పందులు ఒక్కసారిగా దాడిచేయగా మల్లేశం తొడభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు జరిపారు. ఫారెస్టు అధికారులు అడవి పందులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి మెరుగైన చికిత్సలు అందించాలని చెప్పారు. …

Read More »

అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు

  నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి గేటు వద్ద నాందేడ్‌-సంగారెడ్డి, అకోల జాతీయ రహదారి 161 పక్కన శ్రీఅభయాంజనేయస్వామి ఏకశిల శివపంచాయతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన పట్లోల్ల రాదాబాయి, లక్ష్మారావు ఆశీస్సులతో కిషోర్‌కుమార్‌ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు మూడురోజుల పాటు విగ్రహ ప్రతిష్టా, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 23న మార్గశిర పంచమి రోజున గణపతిపూజ, …

Read More »

అచ్చంపేటలో గ్రామసభ

  నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామంలో రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన సర్వే గ్రామసభ నిర్వహించారు. అధికారుల బృందం రైతులకు సంబంధించిన భూ సర్వే నెంబర్లు పరిశీలించారు. గ్రామంలో రైతులతో కలిసి తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌ మాట్లాడుతూ పట్టేదారుకు సంబంధించిన సర్వే నెంబర్లు గ్రామసభలో చదివి వినిపించారు. రికార్డుల ప్రక్షాళన సర్వే రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందని, ఇందుకోసం రైతులందరు తప్పకుండా సర్వే చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మణెమ్మ, విఆర్వో సరిత, లక్ష్మణ్‌, మరిపల్లి …

Read More »

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు, యువకులు అన్ని రంగాల్లో రాణించాలని గ్రంథాలయాలను ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు సమాయత్తం కావాలని కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ చదువుపై దృష్టి సారిస్తూనే అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. గ్రంథాలయానికి కావాల్సిన అన్ని వసతులను …

Read More »

భూ రికార్డుల ప్రక్షాళన 57 శాతం పూర్తి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల ప్రక్షాళన నేటికి 66 శాతం పూర్తి కావాల్సి ఉండగా 57 శాతాన్ని సాధించామని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ప్రక్షాళనపై సోమవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. డిసెంబరు నాటికి ప్రక్షాళన పూర్తిచేయాలని సూచించారు. కొన్ని మండలాల్లో తక్కువగా నమోదు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని టీం లీడర్లకు సూచించారు. వక్ప్‌ బోర్డు స్థలాలపై సమాచారాన్ని అందజేయాలని రెవెన్యూ అదికారులకు సూచించారు. అనంతరం మండలాల వారిగా సమీక్ష …

Read More »

ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టఱ్‌ సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కన్వర్జన్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ, గ్రామీణాభివృద్ధి శాకల ద్వారా జియో ట్యాగింగ్‌ చేసి హరితహారం లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలన్నారు. గొర్ల పంపిణీ పథకం ద్వారా కోటి 7 లక్షల గొర్రెల పంపిణీ కాగా, అదనంగా 22 వేల గొర్రెలు జిల్లాలో ఉన్నాయన్నారు. భూ ప్రక్షాళనలో వందశాతం …

Read More »

విద్యార్థినిలకు సురక్షిత వాతావరణం కల్పించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థినిలకు కళాశాలల్లో సురక్షిత వాతావరణం కల్పించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా పోలీసు ఆధ్వర్యంలో బాలికలపై జరిగే లైంగిక దాడులపై జాగో, బద్‌లో, బోలో అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి పాల్గొని ప్రసంగించారు. బాలికలపై జరిగే లైంగిక దాడులను విద్యార్థినిలు, సంబంధిత యాజమాన్యానికి తెలియపరచాలని వారికి యాజమాన్యాలు రక్షణ కల్పించాలని, భద్రత …

Read More »

రాష్ట్ర స్థాయి రక్బీ ప్రాబబుల్స్‌ జట్టు ఎంపిక

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి రక్బీ ప్రాబబుల్స్‌ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇందులో జిల్లాలోని వశిష్ట, సాందీపని, ఆర్యభట్ట, శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను శిక్షణ కోసం ఎంపిక చేశారు. వీరికి నాలుగురోజుల పాటు శిక్షణ ఇచ్చి అందులో ప్రతిభ కనబరిచిన 24 మంది క్రీడాకారులను సూర్యపేటలో జరిగే …

Read More »

ప్రజావాణిలో 77 ఫిర్యాదులు

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 77 ఫిర్యాదులు అందినట్టు జనహిత అధికారులు తెలిపారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల, అధికారులు పాల్గొన్నారు. Email this page

Read More »

అవేంటో తేలిపోయాయి…

  నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల విజయవాడలో ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో రెండు, మూడు వింత పక్షులు కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. తెల్లని గుబురు గుబురు బొచ్చు, పొడుగాటి బక్క పల్చని కాళ్ళు, నల్లని కనుగుడ్లు…. చూసిన వారంతా వింత వింతగా చర్చించుకున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఆ పక్షులు తెగ హల్‌చల్‌ చేసేశాయి. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు జెనిటిక్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. చివరగా అవేంటో తెలిసిపోయాయి. భారతదేశంలో అరుదుగా …

Read More »

ఘనంగా ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలను ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ రూరల్‌లో ఆయా గ్రామాల్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. Email this page

Read More »

బిజెపిపై దుష్ప్రచారం మానుకోండి

  – బిజెపి ఎస్‌సి మోర్చా జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్‌ నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలం అభంగపట్నంలో జరిగిన సంఘటనలో బిజెపికి ఎలాంటి సంబందం లేదని బిజెపి ఎస్‌సి మోర్చా జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భరత్‌రెడ్డికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఈ విషయంపై గతంలోనే బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎండల లక్ష్మినారాయణ …

Read More »

ఉత్తమ క్రీడాకారుడుగా ఎంపికైన ఆకుల రవి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల క్రీడల్లో జాతీయ స్థాయిలో పార్కు బాల్‌, బేస్‌ బాల్‌, బాస్కెట్‌ బాల్‌ విభాగాల్లో విజయాలు సాధిస్తూ 2013 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆకుల రోహిత్‌ను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారునిగా గుర్తించింది. వచ్చేనెల డిసెంబరు 3న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఆకుల రోహిత్‌ నిజామాబాద్‌ డిసిపి (అడ్మిన్‌) ఆకుల రాంరెడ్డి కుమారుడు. Email …

Read More »

22న శత కళ్యాణ మహోత్సవం

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఈనెల 22వ తేదీన స్థానిక మున్నూరు కాపు సంఘంలో శత కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు నగర మాజీ మేయర్‌ సంజయ్‌ తెలిపారు. ఆదివారం మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ధర్మపురి ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటి వరకు 100 పెళ్ళిళ్ళు చేయడం జరిగిందని, ఈనెల 22వ తేదీన మరో 25 పెళ్ళిళ్ళు జరిపిస్తున్నట్టు ఆయన తెలిపారు. హిందూ మతంతోపాటు సర్వ …

Read More »

ఐటి హబ్‌ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయదలచిన ఐటి హబ్‌ కొరకు స్థలాన్ని అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త ఆదివారం పరిశీలించారు. స్థానిక డ్వాక్రా బజార్‌లోగల మూడున్నర ఎకరాల స్థలాన్ని ఇందుకోసం గుర్తించడం జరిగింది. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఆకుల సుజాత, ఆర్డీవో వినోద్‌, తహసీల్దార్‌ సుదర్శన్‌, తదితరులున్నారు. Email this page

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">