Breaking News

తాజా వార్తలు

శబరిమలకు బయల్దేరిన స్వాములు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత కఠిన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాలధరించిన స్వాములు బుధవారం బీర్కూర్‌ నుంచి శబరిమల బయల్దేరారు. బీర్కూర్‌ తోట్ల హనుమాన్‌ ఆలయం సన్నిధానంలో గురుస్వామి మదప్ప ఆధ్వర్యంలో స్వాములకు అయ్యప్ప శరణుఘోషచెబుతూ భక్తిశ్రద్దలతో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. శబరిమలకు వెళ్లే స్వాములకు మహిళలు, గ్రామస్తులు మంగళహారతులతో గ్రామ పొలిమేరవరకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఆనంద్‌ గురుస్వామి, సదానంద, కోటిస్వామి, ఎంపిటిసి సుధాకర్‌ యాదవ్‌, గంగాధర్‌, గ్రామస్తులున్నారు. Email this page

Read More »

బీర్కూర్‌లో చెత్తబుట్టల పంపిణీ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌లో భాగంగా స్వచ్చ బీర్కూర్‌ కోసం చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నట్టు మాజీ పిఏసిఎస్‌ అధ్యక్షుడు గాంధీ తెలిపారు. బుధవారం 1200 బుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సన్న, హన్మంత్‌, రఘు, రాములు యాదవ్‌, సాయిలు, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

మానవజన్మ సార్థకం కావాలంటే భక్తిమార్గాన్ని ఎంచుకోవాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు వారి జన్మ సార్థకం చేసుకోవాలంటే భక్తిమార్గాన్ని ఎంచుకోవాలని బిచ్కుంద మఠాధిపతులు బండాయప్ప స్వామి అన్నారు. ఆయన పిట్లం మండల కేంద్రంలో సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్న తెలంగాణ జానపద మండల స్థాయి భజన పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత భక్తిమార్గాన్ని ఎంచుకోవాలని, పిట్లంలో భక్తి గీతాలతో కలిగిన భజన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ద్వాపర యుగంలో భజన పాటల …

Read More »

రోహిదాస్‌ (మోచి) కులసంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్నూర్‌ మండల కేంద్రంలో బుధవారం శ్రీరోహిదాస్‌ (మోచి) కుల సంఘం 2018 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రతినిధులు, స్థానిక ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని అన్ని మండలాల్లో పర్యటించి మోచి కులస్తులను ఏకం చేస్తు సంఘం అభివృద్దికి కులస్తుల ఎదుగుదలకు తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్‌ కేంద్రం మోచి కులస్తులు అంబిల్‌పూర్‌ అశోక్‌, అంబిల్‌పూర్‌ రాజు, లింగం, జయరాం, గంగారాం, …

Read More »

అయ్యప్ప ఆలయానికి ఎంపి విరాళం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోగల అయ్యప్ప ఆలయానికి జహీరాబాద్‌ ఎంపి బిబి.పాటిల్‌ తనస్వంతంగా రూ. 2 లక్షల రూపాయల చెక్కును బుధవారం జిల్లా ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు జగదీష్‌, వైస్‌ ఎంపిపి నర్సాగౌడ్‌ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. గత యేడాది ఎంపి బి.బి.పాటిల్‌ ఆలయ ప్రాంగణంలో మార్బల్‌ గ్రానైట్‌ విరాళంగా ఇస్తానని, ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల చెక్కు అందజేయడం జరిగిందని జగదీష్‌ తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

పిట్లం ఎస్‌ఐ అంతిరెడ్డికి ప్రశంసా పత్రం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం ఎస్‌ఐ అంతిరెడ్డికి బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి రైస్‌మిల్స్‌ చోరీ కేసు చేదించినందుకు ప్రశంసా పత్రం అందించారు. మండల కేంద్రంలో దొంగతనాలు అరికట్టేందుకు పిట్లం పోలీసులు పహారా, సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేసినందుకు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినందుకు పిట్లం స్టేషన్‌ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి నర్సింహారావు, సిఐ శ్రీనివాస్‌రావు, తదితరులున్నారు. Email this page

Read More »

ఒకరి ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి గ్రామ పరిధిలో తన ప్లాటుకు మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ ఉన్నట్టు తేలడంతో ఓ బాధితుడు బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రయివేటు డాక్యుమెంటరీ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి… గుండారం గ్రామానికి చెందిన పట్ల నర్సింలు, ప్రసాద్‌, రాములు అనే వ్యక్తుల వద్ద 200 గజాల జాగను రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాడు. ఇంటి నిర్మాణ విషయంపై అక్కడికి వెళ్లగా మరికొందరు తామే …

Read More »

ముగ్గురు దొంగల అరెస్టు

  -డిఎస్‌పి ప్రసన్న కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగలను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డిఎస్‌పి ప్రసన్న తెలిపారు. బుధవారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్‌ అయాబ్‌ఖాన్‌, షేక్‌ వాసిమ్‌, షబ్బీర్‌ అలీలు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి రైల్వేస్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో …

Read More »

నేరాలు తగ్గుముఖం

  – జిల్లా ఎస్‌పి శ్వేతా కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు సంవత్సరాల కంటే ఈ యేడు నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక డిపివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక నేర నివేదిక సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలో కొద్ది నెలల క్రితం రైస్‌మిల్‌లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందేనన్నారు. ఇందులో పోలీసుల సమన్వయంతో 24 లక్షల రూపాయలు రికవరీ చేయడం …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

  కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి లోపం ఉన్న 8 మందిని గుర్తించి ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపి మందులు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు శ్యాంగోపాల్‌, రమేశ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, నరేశ్‌, జయప్రకాశ్‌, తదితరులున్నారు. Email this page

Read More »

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి ఆత్మహత్య

  కామారెడ్డి, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామానికి చెందిన వడ్ల దేవేంద్రస్వామి (12) అనే విద్యార్థి మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దేవేంద్రస్వామి ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ ప్రసన్నరాణి, గ్రామీణ సిఐ కోటేశ్వర్‌రావులు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. Email this page

Read More »

భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతం చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసి డిసెంబరు చివరి నాటికి పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన తాడ్వాయి మండల కేంద్రంలో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. మాన్యువల్‌గా రూపొందిస్తున్న ప్రక్షాళనపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబరు చివరి నాటికి ప్రక్షాలన పూర్తిచేయాలని ఆదేశించారు. Email this page

Read More »

రోహింగ్యా ముస్లింలకు దేశంలో ఆశ్రయం కల్పించొద్దు

  – ఆరెస్సెస్‌ తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో రోహింగ్యాముస్లింలకు ఆశ్రయం కల్పించవద్దని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌ అన్నారు. మంగళవారం ఆరెస్సెస్‌ కళాశాల విద్యార్థుల శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. రోహింగ్యా ముస్లింలు మయన్మార్‌ దేశంలో మారణహోమం సృష్టించారని, అలాంటి వారిని మన దేశంలో ఆశ్రయం ఇవ్వాలని ఎంఐఎం అదినేత అసదుద్దీన్‌ ఓవైసి డిమాండ్‌ చేయడం దేశ ద్రోహమే …

Read More »

మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రిలో అరుదైన చికిత్స

  నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రిలో ఆదివారం అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా పూర్తిచేసినట్టు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వేల్పూర్‌ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన బి.గంగారెడ్డి ఆదివారం తీవ్రమైన కడుపునొప్పితో తమవద్దకు రావడంతో వైద్యులు ఆయన్ను పరీక్షించగా గంగారెడ్డి రక్తంలో హిమోగ్లోబిన్‌ 4 శాతం తక్కువగా ఉందని, కిడ్నీ పనితనం తగ్గి పియోటిన్‌లో ప్రవేశించిందని, దీనికితోడు పీహమ్‌ (స్పెన్‌) …

Read More »

29న హైదరాబాద్‌లో గొల్ల కుర్మల భవనం ప్రారంభోత్సవం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 29న ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేతుల మీదుగా గొల్ల కుర్మల సంక్షేమ భవనం ప్రారంభం కానుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రబాకర్‌ యాదవ్‌ తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని గొల్ల కుర్మ సభ్యులందరు 29న హైదరాబాద్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు. గొల్ల కుర్మల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు చేపడుతుందని, కులస్తులందరు ముందుకు వచ్చి సమస్యలు తెలిపితే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">