Breaking News

తాజా వార్తలు

ఘనంగా కుస్తీ పోటీలు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బరంగెడ్గి గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీలకు మల్లయోధులు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చివరి కుస్తీ గెలిచిన అభ్యర్థికి పంచాయతీ ఆద్వర్యంలో నగదు, శాలువా, జ్ఞాపిక అందజేశారు. కుస్తీ పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. గ్రామపెద్దలు పాల్గొన్నారు. Email this page

Read More »

ప్రతిష్టకు సిద్దమైన ఆంజనేయ ఆలయం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌బి నగర్‌ హనుమాన్‌ కాలనీలో ఇష్టకార్యసిద్ధి ఆంజనేయస్వామి క్షేత్రంలో గురువారం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. పునరుద్దరణలో భాగంగా భక్తుల విరాళాలు సేకరించి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఇందులో భాగంగా ఈనెల 20, 21,22 తేదీల్లో ప్రత్యేక పూజలు, ప్రతిష్ట, యజ్ఞ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రముఖ పండితులు గంగవరం నారాయణ శర్మతోపాటు 21 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయకమిటీ ప్రతినిదులు సత్యనారాయణగౌడ్‌, నిత్యానందం, బాల్‌కిషన్‌లు …

Read More »

రక్తదానం చేసిన వైస్‌ఛైర్మన్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ బుధవారం రక్తదానం చేశారు. ఆపదలో ఉండి ఓవ్యక్తికి రక్తం అవసరం కాగా మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌తోపాటు తెరాస నాయకులు రక్తదానం చేశారు. Email this page

Read More »

సులభ్‌ కాంప్లెక్సు పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో మహిళ సులభ్‌ కాంప్లెక్సు నిర్మాణ పనులను కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సులభ్‌ కాంప్లెక్సులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటిని గుర్తించి అవసరమైన చోట సులభ్‌ కాంప్లెక్సులు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 12వ వార్డులో సులభ్‌ కాంప్లెక్సు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు దాత్రిక సత్యం, వార్డు వాసులు పాల్గొన్నారు. Email this …

Read More »

రాష్ట్ర ఆహార కమీషన్‌ ఛైర్మన్‌కు సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆహార కమీషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన తిరుమల్‌రెడ్డిని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో తెరాస నాయకులతో పాటు పలువురు సన్మానించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆది నుంచి పాల్గొని ఉద్యమంలో తిరుమల్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ఆహార కమీషన్‌ ఛైర్మన్‌గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెరాస మాజీ పట్టణ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, …

Read More »

చలివేంద్రం ప్రారంభం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామంలో ఆదివారం చలివేంద్రం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల, బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ప్రారంభించినట్టు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రహ్లాద్‌, ఎంపిటిసి లక్‌పతి, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

రైతు బాంధవుడు కెసిఆర్‌

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రైతు బాంధవుడిగా కొలుస్తున్నారు. కెసిఆర్‌కు రుణపడి వుంటామని గ్రామ గ్రామాన పాలాభిషేకం చేస్తున్నారు. ఆదివారం గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో రైతులు, నాయకులు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు 100 శాతం రుణమాపీ చేయడమే గాకుండా, రైతులు వ్యవసాయంలో పడే బాధలను చూసి ఉచితంగా ఎరువులను అందిస్తామని ప్రకటించారు. ఎకరానికి 4 వేల రూపాయలు ఎరువులు ఉచితంగా అందజేస్తున్న కెసిఆర్‌కు రైతులు నీరాజనాలు …

Read More »

మొక్కజొన్న పంట దగ్దం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పోతంగల్‌ కలాన్‌లో ఆదివారం మొక్కజొన్న పంట దగ్దమైంది. గ్రామానికి చెందిన మామిడి సాయిలుకు చెందిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో ఒక్కసారిగా పంట మొత్తం కాలి బూడిదైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైరింజన్‌ వచ్చి మంటలను ఆర్పింది. ఈ ప్రమాదంలో 50 వేల పంట నష్టం సంభవించినట్టు సమాచారం. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సాయిలు వేడుకుంటున్నాడు. Email this page

Read More »

రిజర్వేషన్ల అమలుపై గిరిజనుల హర్షం

  గాంధారి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై గాంధారి మండల గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్థానిక నెహ్రూ చౌరస్తా వద్ద కెసిఆర్‌ భారీ చిత్రపటానికి 100 లీటర్లతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూబడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కెసిఆర్‌ వెంట రాష్ట్రంలోని గిరిజనులంతా వున్నారన్నారు. …

Read More »

బల్దియా కార్మికుల నిర్లక్ష్యంతో అగ్నిప్రమాదం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బల్దియా కార్మికుల నిర్లక్ష్యంతో కామరెడ్డి పట్టణంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని జాతీయ రహదారిపై పాత చెక్‌పోస్టు వద్ద పారిశుద్య కార్మికులు చెత్తకు నిప్పుపెట్టి వెళ్లిపోయారు. అనంతరం మంటలు వ్యాపించడంతోపక్కనే ఉన్న కార్లషెడ్‌లో నిప్పంటుకుంది. దీంతో రెండు కార్లు కాలిబూడిదయ్యాయి. రెండు లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించినట్టు దుకాణదారుడు వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. Email this page

Read More »

పుస్తె, మెట్టెల వితరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పేద వధూవరులకు పుస్తె, మెట్టెలను అందజేశారు. మున్నూరుకాపు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆకుల శ్రీనివాస్‌, ఆయన తండ్రి రాములు జ్జాపకార్థం రామారెడ్డి మండల కేంద్రంలోని చిన్న లింబయ్య, లక్ష్మిల కూతురు నవ్య వివాహానికి వెళ్లి పుస్తె, మెట్టెలు అందజేశారు. అనంతరం మున్నూరు కాపు జిల్లా అద్యక్షుడు మామిండ్ల అంజయ్య ఆధ్వర్యంలో మున్నూరు కాపు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కామరెడ్డి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పెద్ద …

Read More »

ఎండిపోతున్న పంటలు – ఆందోళనలో రైతులు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత దశాబ్ద కాలంగా సరైన వర్షాలు కురియకపోవడం, గత వర్షాకాలం ఓ మోస్తరు భారీ వర్షాలు కురియడంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతులు చక్కగా పంటలు సాగుచేశారు. రబీ సీజన్‌లో సైతం పుష్కలంగా నీరు ఉంటుందన్న ఆశతో వివిధ పంటలు సాగుచేశారు. వేసవిలో ఎండలు తీవ్రం కావడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటల్లో సైతం నీరు ఇంకిపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో బోర్లు ఎత్తిపోవడంతో రైతులు ఆందోళన …

Read More »

బిజెపి నాయకుల అరెస్టు

  నందిపేట, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి, బిజెవైఎం కార్యకర్తలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తు తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన నందిపేట పోలీసులు ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిజెపి మండల అధ్యక్షుడు రాజుతోపాటు పలువురు నేతలను ఆదివారం ఉదయంముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేసన్‌కు తరలించారు. Email this page

Read More »

వైద్యుల ఆందోళనకు మద్దతునివ్వం

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యుల ఆందోళనకు మోర్తాడ్‌ ప్రభుత్వ వైద్యులు మద్దతు ప్రకటించడం లేదని ఇన్‌చార్జి వైద్యులు మోహన్‌బాబు ఆదివారం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ సంఘానికి చెందిన వైద్యులు ఆందోళనతో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుబడి యధావిధిగా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్యులు రవిందర్‌, లక్ష్మి, రాధిక, సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, సౌజన్య ఉన్నారు. Email this page

Read More »

అనాథ శరణాలయానికి వితరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ తన కుమార్తె తేజస్విని జన్మదిన వేడుకలను దోమకొండ మండల కేంద్రంలోని అనాథ ఆశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్బంగా తేజస్విని అనాథ పిల్లల మధ్య కేక్‌ కట్‌చేసి అనంతరం ఆశ్రమానికి రూ. 7 వేలు విరాళంగా అందజేశారు. Email this page

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">