Breaking News

తాజా వార్తలు

సూర్యవంశీ ఆరెకటికె సంఘం ఆధ్వర్యంలో బోనాలు

    కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సూర్యవంశి ఆరెకటికె సంఘం ఆద్వర్యంలో మంగళవారం బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ముస్తాబు చేసి నెత్తిన బెట్టుకొని సైలాన్‌బాబా కాలనీలోని కట్టమైసమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు కన్నయ్య, బాలాజీ, సురేశ్‌, గోవింద్‌, శ్యాం, రాజు, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

చిరువ్యాపారులకు అవగాహన సదస్సు

    కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చిరు విక్రయదారులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో చిరువ్యాపారుల సంఘం ఏర్పాటు, పుస్తక నిర్వహణ, బ్యాంకు లావాదేవీలు, స్వయం ఉపాధి రుణాల గురించి తెలిపారు. ఎల్‌డిఎం శివప్రసాద్‌ ఖాతాల నిర్వహణ, రుణాల గురించి వివరించారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ చిరు వ్యాపారులకు సంబంధించిన పథకాల గురించి చెప్పారు. అనంతరం వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో మెప్మా డిఎంసి శ్రీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. …

Read More »

యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాలు

  కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం గొల్లవాడ, భారత్‌రోడ్డు, యాదవ సంఘం ఆద్వర్యంలో బోనాలు ఊరేగించారు. అశోక్‌నగర్‌ కాలనీలోని బూరుగు మైసమ్మ ఆలయం వరకు మహిళలు బోనాలను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలోయాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అరికెల ప్రభాకర్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ కుంబాల రవి యాదవ్‌, సంఘం ప్రతినిదులు శ్రీశైలం యాదవ్‌, కృష్ణ యాదవ్‌, నర్సింలు, రాజయ్య, అశోక్‌, వెంకటి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. …

Read More »

పంటల బీమా అవగాహన రథాలు ప్రారంభం

  కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రథాలను మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలం 2017లో కామారెడ్డి జిల్లాకు గాను వరిపంట గ్రామం యూనిట్‌గా సోయాబీన్‌, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలను మండల యూనిట్‌గా యూనిఫైడ్‌ ప్యాకేజీ, ఇన్సురెన్సు పథకం కింద జిల్లాను ఎంపిక చేశారన్నారు. ఈ పథకం కింద రైతు వ్యక్తిగత ప్రమాదబీమా, బోరుమోటరు, …

Read More »

తల్లిని కడతేర్చిన తనయుని అరెస్టు

  కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిని హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న హంతకుడైన కొడుకును మంగళవారం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కామరెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్‌ తాండాలో గత సంవత్సరం అక్టోబరు 3న జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితుని పట్టుకొని విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. హత్యకు పాల్పడ్డ మెగావత్‌ రాజేందర్‌ (21)ని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణి తెలిపిన వివరాల ప్రకారం… మెగావత్‌ రాజేందర్‌ హైదరాబాద్‌లో ఎర్నాటికల్‌ ఇంజనీరింగ్‌లో 4వ సంవత్సరం …

Read More »

వెంకన్న ఆలయంలో దాతల సహకారంతో సిసి రోడ్డు పనులు

  బీర్కూర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం దాతల సహాయంతో మండల పరిషత్‌ నిధుల నుంచి సిసి రోడ్డు పనులను ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లిపెద్ది చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్‌ గ్రామంలో చాలా ఏళ్ల నుంచి వెంకటేశ్వరస్వామివారి ఆలయం ఆదరణకు నోచుకోలేదని, ఆలయ కమిటీని ఏర్పాటు చేసుకొని అదనపుగదులు, సిసి రోడ్డు పనులను చేపడుతున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ …

Read More »

విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

  బీర్కూర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొలం పనులు చేయడానికి వెళ్లి అకస్మాత్తుగా విద్యుత్‌షాక్‌కు గురై మహిళ మృతి చెందిన సంఘటన నసురుల్లాబాద్‌ మండలంలోని రాములగుట్ట తాండాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపి కథనం ప్రకారం… వలీబాయి (40) తమ సొంత పొలం పనుల నిమిత్తం కూలీలను వెంటబెట్టుకొని వెళ్లింది. కూలీలకు తాగునీరు కోసం వెళ్లగా విద్యుత్‌ స్థంబానికి చుట్టిన సపోర్టు తీగలవల్ల విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు …

Read More »

నగదు కోసం రాస్తారోకో

  నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహ్మద్‌నగర్‌ రైతులు నగదు కోసం రోడ్డెక్కారు. రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం మహ్మద్‌నగర్‌ ఆంధ్రాబ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. మూడు గంటల పాటు బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెలకు కేవలం రూ. 10 వేలుమాత్రమే బ్యాంకు అధికారులు ఇస్తున్నారని, లక్ష రూపాయలు …

Read More »

వరినాట్లు ప్రారంభం

  నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో బోరుబావుల కింద వరినాట్లు వేసే కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మండలంలోని మాగి, గున్కుల్‌, గోర్గల్‌, కోమలంచ తదితర గ్రామాల్లోని మంజీర పరివాహక ప్రాంతంలో గల పంట పొలాల్లో లిఫ్టు ఇరిగేషన్‌ ద్వారా వరినాట్లు వేసుకుంటున్నారు. ఇప్పటికే రైతులందరు మంజీర పరివాహక ప్రాంతంలో వరినారు సిద్దం చేసుకున్నారు. వరి మొలకలు రావడంతో బోరుబావుల కింద ఉన్న పంట పొలాలు వేసుకుంటున్నారు. వర్సాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా సరిగా వర్సాలు కురియకపోవడంతో …

Read More »

ఈద్‌ మిలాప్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాక

  నందిపేట, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని జామామజీద్‌ పక్కనగల టెలిఫోన్‌ బీడీ కంపెనీలో బుధవారం 11.30 గంటలకు జరిగే ఈద్‌మిలాప్‌ కార్యక్రమానికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విచ్చేస్తున్నట్టు జమాతె ఇస్లామి హింద్‌ కన్వీనర్‌ షేక్‌గౌస్‌ తెలిపారు. మండల ప్రజలందరు కలిసి పండగ సంతోషాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కుల, మతాలకు అతీతంగా ప్రజలందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. Email this page

Read More »

కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

  నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌లకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలని జిల్లా ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు విఠల్‌ పిలుపునిచ్చారు. మండలంలోని నర్వా గ్రామంలో ముదిరాజ్‌ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి-ఎలోకి మార్చాలన్నారు. ముదిరాజ్‌లను మత్స్యకార్మికులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో నర్వా సర్పంచ్‌ నర్సింలు, అనసూయ, కోమలంచ సర్పంచ్‌ సాదుల సత్యనారాయణ, మండల తెరాస ఉపాద్యక్షుడు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

రోగాలబారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు

  నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపిడివో రాములు నాయక్‌ పంచాయతీ కార్యదర్శులను, కారోబార్లను ఆదేశించారు. నిజాంసాగర్‌ ఎంపిడివో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని వాటర్‌ ట్యాంకులను వారానికి ఒకసారి క్లోరినేషన్‌ చేయించాలన్నారు. వాటర్‌ ట్యాంకుల ద్వారా ప్రజలకు సరఫరా అయ్యే పైప్‌లైన్ల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున నీటివల్ల ప్రజలకు …

Read More »

గోర్గల్‌లో బోనాల పండగ

  నిజాంసాగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామంలో నల్లపోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండగ నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిమీద పెట్టుకొని భాజా భజంత్రీలతో వీధుల్లో ఊరేగించారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అక్కడే వనభోజనాలు సిద్దంచేసుకొని తిన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మొక్కుకున్నారు. Email this page

Read More »

దత్తత పాఠశాలకు 5 వేల విరాళం

  బీర్కూర్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు నసురుల్లాబాద్‌ దత్తత తీసుకున్న యుపిఎస్‌ మైలారం పాఠశాలకు నసురుల్లాబాద్‌ పిఆర్‌టియు ప్రధాన కార్యదర్శి మదన్‌సింగ్‌ రూ. 5 వేలు విరాళం అందజేశారు. గ్రామ పెద్దలు ప్రభాకర్‌రెడ్డి, ఎంపిటిసి మహేందర్‌లకు నగదు అందజేశారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి పిఆర్‌టియు కృషి చేయడం అభినందనీయమని పెద్దలన్నారు. పిఆర్‌టియు అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ చిన్న చిన్న పనులు తప్ప అన్ని పనులు పూర్తికావచ్చాయన్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్‌ సందర్శించే అవకాశముందన్నారు. కార్యక్రమంలో తెరాస …

Read More »

మహిళల భద్రత కొరకే షీ టీం

  నందిపేట, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రత, రక్షణ కొరకే షీ టీం పనిచేస్తుందని షీ టీం ఆర్మూర్‌ ఏఎస్‌ఐ నరేందర్‌ పేర్కొన్నారు. సోమవారం నందిపేట మండల కేంద్రంలోని శ్రీసాయి జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల నుద్దేశించిమాట్లాడారు. పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు, అందులో భాగంగానే నందిపేటలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు మహిళలను, విద్యార్థినిలను, యువతులను వేధించినా, సెల్‌ఫోన్‌ల …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">