Breaking News

తాజా వార్తలు

సినిమా రివ్యూ: ఒక లైలా కోసం

  నటీనటులు: నాగ చైతన్య, పూజా హెగ్డే, సుమన్, షియాజీ షిండే, చలపతిరావు తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: విజయ్ కుమార్ కొండా  కథ..  కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని …

Read More »

తెలుగు లోగిళ్లు. విజయోస్తు!

భారతీయ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగ వెనకా స్పష్టమైన ఆలోచన ఉంది; వివేచన ఉంది. ఓపిగ్గా పరిశీలిస్తే- పండుగల వెనక జాతి చరిత్ర మూలాలు కనిపిస్తాయి. ‘ప్రతి గేహంబున శాంతిసౌఖ్యముల దీపశ్రేణి వెల్గించి, శాశ్వతమున్, సత్యము, సుందరమ్మయిన విశ్వప్రేమ’ను నెలకొల్పాలన్న విశ్వజనీన భావన – మన పెద్దల వివేకంలోంచి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ‘మనది మనుష్య జాతి అనుమాట ఒకానొకడి ఆత్మలో అనుక్షణమును మారుమ్రోగుటయెచాలు- సమాజ పురోభివృద్ధికిన్’ అన్న అపురూపమైన ఆలోచన పండుగల నాటి ఆచార వ్యవహారాల్లోంచి తొంగిచూస్తూ ఉంటుంది. ‘కత్తిపోటు ఎవరిమీద పడినా, …

Read More »

మార్నింగ్‌ రాగాలు….

Morning Ragas

‘ఈరోజు ఏమిటో నాకు చాలా డల్‌గా ఉంది…మూడ్‌ అస్సలు బాగా లేదు’ అని మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాం. మరి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలి ? ఇదిగో ఈ కింది చిట్కాలు పాటించి చూడండి… ఫ హడావిడిగా నిద్రలేవడం మంచి అలవాటు కాదు. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చోవాలి. ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదలాలి. గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఫ నిద్రలేవగానే కండరాలు ముఖ్యంగా వెన్నెముక బిగదీసుకుపోయినట్టు చాలా గట్టిగా ఉంటుంది. స్ర్టెచింగ్స్‌ చేయకుండా …

Read More »

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా. వర్షాలు పెరుగుతున్నకొద్దీ ఎక్కడ లేని సీజనల్ వ్యాధులు పుట్టుకొస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాల బారినపడి నిరుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. పలువురు పిట్టల్లా రాలిపోయారు కూడా. అయితే ఈసారి ముందస్తుగానే ప్రభుత్వం అప్రమత్తత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మలేరియా నివారణ అధికాులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజలు కనీస జాగ్రత్త పాటించాల్సిన అవసరం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు లేవు. కానీ ప్రతి వర్షాకాలం సమయంలో సీజనల్ …

Read More »

కవి సమయం కోదారి శ్రీను

తెలంగాణ పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, ముఖ్యంగా వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేసిన తీరు అభినందనీయం. ఆంతేకాదు, తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చిండు శ్రీను. అస్సోయ్ దూలా పాట ఒక్కమాటలో తెలంగాణ సమైక్యతకు నిండు నిదర్శనం. కోదారి శ్రీను. ఇది తన కలం పేరు. సాయుధ పోరాట వీరుడు కొమురయ్య (దొడ్డి) స్ఫూర్తితో తాను ఆ దారిని ఎంచుకుని కోదారి శ్రీను అయిండు. ఈ …

Read More »

నేను – జయధీర్ – డక్కలి గోపాల్

చిన్నతనం నుండి ఏదో ఒక అనారోగ్యం. పోషక విలువల లేమి వల్ల బలహీనత. మా తల్లికి సైతం అస్వస్థత. పెద్ద కుటుంబం. చిన్న ఆదాయం. సంఘర్షణలోంచి జీవితాన్ని చూస్తూ లేస్తూ పడుతున్నప్పుడు స్నేహమే ఒక ఆలంబన. జీవితంలో స్నేహాలకు కొదువలేదు. కానీ, ఆత్మగౌరవం, అభిమానం, సంతృప్తినిచ్చే ఒక స్నేహం ఎన్నో రూపాలలో ఉండవచ్చు. బంధుస్నేహం, సమవయస్సు స్నేహం…ఏదైనా కావచ్చు. మొదట మా అమ్మనీ- విడవకుండా ఆమె చదివే పుస్తకాల పట్ల స్నేహం. వీథిలో స్నేహితులు. ఆటల స్నేహితులు. బడి స్నేహితులు. పక్కింటి స్నేహితులు. ఎంతోమంది. …

Read More »

కవి సమయం మిత్ర – విమలక్క

ప్రాస కోసం కాదు, నిజం. ఒకరు అజ్ఞాతం. ఇంకొకరు జ్ఞాతం. ఒకరు కలం. ఇంకొకరు గళం. తెలంగాణంలో ఈ ఇద్దరి యుగళ గీతం అరుణోదయం. ఒక విమోచన. అలియాస్ అన్న పదం పోలీసులు తెచ్చింది కాబోలు అందుకే వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్రల గురించి మాట్లాడుతుంటే అట్లా కాకుండా కూర మల్లమ్మ బిడ్డ అని రాయాలనిపిస్తుంది. కూర బాలయ్య చిన్న కొడుకు అని చెప్పాలనిపిస్తంది. జనశక్తి అగ్రనేత కూర రాజన్న తమ్ముడని గుర్తు చేయాలనిపిస్తుంది. మూలవాగు మాణిక్యం అనీ …

Read More »

నీటి యాతన

గ్లాసెడు నీటి విలువ తెలియాలంటే గాంధారి మండలంలోని బూర్గుల్‌కు వెళ్లాల్సిందే. గ్రామంలో కనీస నీటి సౌకర్యాలు లేక గ్రామస్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లి అనారోగ్యానికి గురై మహిళలు గర్భాన్ని కోల్పోతున్నారు. నీటిగోసతో బంధువులు ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. గ్రామ యువకులకు పిల్లలను ఇవ్వడం లేదు. నీటి సమస్యతో విడాకులైన ఘటనలు, ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలూ ఉన్నాయి. ఒక్కరోజు నీరు పట్టుకుం టే.. మూడు, నాలుగు రోజులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఎడారి ప్రాంతంలో కూడా ఇంతటి నీటి …

Read More »

నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు

బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్‌లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి.  ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి …

Read More »

అసౌకర్యాలకు నిలయంగా మార్కెట్ కేంద్రాలు

 పేరు గొప్ప వూరు దిబ్బలాగా పరిస్థితి మారింది. పేరుకు నియోజకవర్గం కేంద్రమైనా సమస్యలకు నిలయంగా మారింది. సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గ్రామంలో దినసరి కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, ప్రతి గురువారం నిర్వహించే వారాంతపు సంత అసౌకార్యాల మధ్య కొనసాగుతున్నాయి. కనీస సౌకర్యాల గురించి ఏళ్లుగా పట్టించుకున్న నాథుడు కరవయ్యారు. దీంతో మార్కెట్‌లో కూరగాయలు, చేపలు తదితర వస్తువులు విక్రయించే వ్యాపారులు, అటు కొనుగోళ్లకు వచ్చే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. వర్షాకాలంలో వర్షం కురిస్తే వానలో తడవాల్సిన పరిస్థితి. ఎండాకాలంలో ఎండలో క్రయవిక్రయాలు …

Read More »

రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను విధించొద్దు 

లోక్ సభ ఎన్నికలు ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెగ్యులర్ బడ్జెటును జూన్ చివర్లో గాని, లేదా జులై మొదట్లో గాని ప్రవేశపెడతారు. అంటే- పరిశ్రమ, వ్యవసాయం, బ్యాంకింగ్ వంటి రంగాలకు, ఆర్థిక నిపుణులకు ఆ బడ్జెటు ఎలా ఉండాలనే అంశంపై అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు మరో అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ సందట్లో చిన్న మదుపుదారులు, వయోవృద్ధుల (సీనియర్ సిటిజన్ల) మొరలు వినేదెవరు..? వారి గోడును పట్టించుకొని, పరిష్కరించడం ముఖ్యం. చిన్న మదుపరులకు ప్రతిఫలం: చిన్న మదుపరులకు మరెక్కడికైనా వెళ్లడానికి …

Read More »

బాసట లేని బాసర!

తెలంగాణలోని ఏకైక అంతర్జాతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ట్రిపుల్ ఐటీ) కొరతల కొలిమిలో కునారిల్లుతోంది. 2008లో అవతరించింది మొదలు బాసర ఐఐఐటీ నానావిధ సమస్యలకు నెలవైనట్లు వరసగా వార్తాకథనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్ళి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్ జైన్ రూపొందించిన అధ్యయన నివేదిక- అక్కడి భోజనం ఘోరమని, బోధనం అధ్వానమని స్పష్టీకరిస్తోంది. ఆయన నివేదికాంశాలు ‘ప్రతిష్ఠాత్మక’ ట్రిపుల్ ఐటీ దయనీయ దీనావస్థను కళ్లకు కడుతున్నాయి. గతంలోనూ బాసర ఐఐఐటీ గతి రీతులపై ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కుళ్ళిపోయిన …

Read More »

జీరో డిగ్రీ – పుస్తక సమీక్ష

ఏ వూరు మీది…..ఐద్రబాద్….అంటే ఎక్కడి నుంచి వచ్చిండ్రని….పైలట్ సంది ఈడనే….తాత తండ్రుల్ది యావూరో….. మాకైతే పట్నమే ఎర్క…..గిట్ల మాట్లాడెటోళ్లది ఐతే పట్నం కాకుంటే లష్కర్….కానీ కొంత మంది ఊర్లల్ల కేలి వస్తరు…..బస్తీదేవత యాదమ్మలు ఎంతగా ఆదరించినా అమ్మ యాదికొస్తే ఆకలినీల్లు జాంతానై…..అమ్మ ఊర్లె ఉన్నదాయె…..పొట్టచేతపట్టుకుని పట్నం బోయిన కొడ్కు ఎట్లున్నడో అని తినదు…తిన్నా తిన్నన్నం పెయికి వట్టది. గాపోరడు చిన్న కోలి దీస్కుని ఉంటుండు…..నిన్న జూసిన…..నిద్రల కల్వరిస్తుండు….అమ్మ అమ్మ అంటుండు…..జరమొచ్చిందో ఏమో….జరంల అమ్మ యాదికొచ్చినట్టుంది పిలగానికి…..గసొంటి కలవరింతలే ఈ జీరోడిగ్రీ కవితలు. ఈ కవిపేర్ల …

Read More »

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం

ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి నాంది పలికారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా సంస్థల్లో తీవ్ర నిర్బంధంలోనూ పనిచేస్తూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమైన కలం వీరులు స్వీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు జర్నలిస్టుల జాతర వేదికగా సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఆకాంక్షను పల్లెపల్లెకు చేర్చిన జర్నలిస్టులు నవ తెలంగాణ నిర్మాణంతో పాటు తమ హక్కుల సాధన కోసం కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. జర్నలిస్టుల …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">