తాజా వార్తలు

ఉపకార వేతనాల పంపిణీ

నిజామాబాద్‌, మార్చి 09   ఆర్మూర్‌ న్యూస్‌: ఆర్మూర్‌ పట్టణంలోని రాజారాం నగర్‌ కాలనీలోగల ప్రాథమిక పాఠశాలలో ఎంఇవో రాజగంగారాం చేతుల మీదుగా సోమవారం వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. పాఠశాలలోని వికలాంగ విద్యార్థులైన గణేశ్‌, గోపి, మీనాక్షిలకు నెలకు 70 రూపాయల చొప్పున 700 రూపాయలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయుడు గోపాల్‌, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ పోశెట్టి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Email this page

Read More »

దొంగ అరెస్టు- బైక్‌స్వాధీనం

నిజామాబాద్‌, మార్చి 09   ఆర్మూర్‌ న్యూస్‌ : లింగంపేట్‌ మండలం బోనాల గ్రామానికి చెందిన లీలాస్వామి అనే యువకుణ్ణి సోమవారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… బోనాల గ్రామానికి చెందిన లీలాస్వామిని పట్టణంలోని కెనాల్‌ కట్ట ప్రాంతంలో అరెస్టు చేసి ఆయన వద్దనుంచి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు సిఐ వెల్లడించారు. Email this page

Read More »

ట్రాఫిక్‌ సారూ… జరఇటు సూడూ…

నిజామాబాద్‌, మార్చి 08 నిజామాబాద్‌ న్యూస్‌ : మన ఊర్ల మొగోళ్ళు ముగ్గురు ముగ్గురు తిరుగుతే దొరకవట్టి ఫైన్లేస్తరు. మరిగట్లనే ఆడోళ్ళు కూడా ముగ్గురు ముగ్గురు తిరుగుతుండ్రు. వోలో పెద్దలన్నట్టు ఆడోళ్ళు మొగోళ్ళకు తీసిపోరన్నట్టు గీ ఫోట్వ సూత్తనే సమజైతుంది కదా. కానీ ఈ దినంలల్ల మనపోరగాండ్ల కంటే ఆడోళ్ళే అల బండ్లను ఇయ్యర్‌…మయ్యర్‌… రోడ్లమీద నడుపుతుండ్రు. మరి గిదిమీకు కనవడతలేదా..? ఇస్కూలు పిల్లలు, లైసెన్సులు లేనోళ్లు, ఓటుహక్కు లేనోళ్ళు కూడా రోడ్లమీద బండ్లను ధూం… ధాం… నడుపుతుండ్రు. గిట్ల నడుపుతే దెబ్బలు తాకినోళ్ల …

Read More »

వేతనాలు సక్రమంగా చెల్లించండి

  – నిజామాబాద్‌ దక్కన్‌ షుగర్స్‌ కార్మికులు నిజామాబాద్‌, మార్చి 08 నిజామాబాద్‌ న్యూస్‌ : జిల్లా కేంద్రంలోని బోధన్‌ లోగల చక్కర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు గత రెండు సంవత్సరాల నుంచి రావాల్సిన వేతనాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని నిజాం దక్కన్‌షుగర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌.కుమారస్వామి, కార్మికులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 20 మంది కాంటాక్టు ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని గత ప్రభుత్వాన్ని …

Read More »

నాఇంట్లో నాకు చావడానికి అవకాశమివ్వండి

నిజామాబాద్‌, మార్చి 08   నిజామాబాద్‌ న్యూస్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్‌లోగల టీచర్స్‌కాలనీలో నివాసముండే నా ఇంటిని నాకు ఇప్పించాలంటూ రిటైర్డ్‌ ఎంఇవో చంద్రశేఖర్‌ నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… టీచర్స్‌కాలనీలోగల తన ఇంటిని ఎక్సైజ్‌ శాఖకు అద్దెకిచ్చామని అన్నారు. 2011లో మూడు సంవత్సరాల అగ్రిమెంట్‌ చేసుకున్నట్టు ఆయన అన్నారు. కానీ ఇపుడు వెళ్లి ఖాళీచేయమని అడిగితే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ తన శాఖకు చెందిన సిఐని అడగమని చెప్పారన్నారు. సిఐ వద్దకెళితే సూపరింటెండెంట్‌ను అడగాలని …

Read More »

రెంజల్‌ తహసీల్దార్‌గా కె.వెంకటయ్య

నిజామాబాద్‌, మార్చి 08 నిజామాబాద్‌ న్యూస్‌ : రెంజల్‌ మండల తహసీల్దార్‌ నంది గణేశ్‌ గత నెల ఏసిబి వలలో చిక్కగా అప్పటినుంచి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా డేవిడ్‌ కొనసాగుతున్నారు. కాగా తాజాగా సోమవారం మాక్లూర్‌ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కె.వెంకటయ్య రెంజల్‌ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశానుసారం రెంజల్‌ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదులు : రెంజల్‌ మండల తహసీల్‌ కార్యాలయంలో నూతన తహసీల్దార్‌ వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి …

Read More »

నా కొడుకు మృతదేహాన్ని నాకు ఇప్పించండి

నిజామాబాద్‌, మార్చి 08 – రోదిస్తున్న తల్లిదండ్రులు నిజామాబాద్‌ న్యూస్‌ : బతుకు దెరువు కోసం యువత పరదేశం బాట పడుతున్నారు… అనేక కారణాల వల్ల అక్కడ మృత్యువాతపడుతున్నారు… అటు కన్నవారికి, ఇటు కుటుంబీకులకు చివరకు కన్నీళ్లే మిగులుతున్న దురదృష్ట సంఘటనలు నిరుద్యోగ యువకుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలోని బాడ్సి గ్రామానికి చెందిన చిన్న గంగారాం (25) గత రెండు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం సౌదీవెళ్లాడు. అకస్మాత్తుగా గంగారాం 4 ఫిబ్రవరి 2015 నాడు మృతి చెందినట్టు …

Read More »

ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, మార్చి 08   ఆర్మూర్‌ న్యూస్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కమలానెహ్రూ కాలనీకి చెందిన ఐదుగురు పేకాటరాయుళ్లను ఆదివారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆర్మూర్‌ పట్టణ శివారులో దోబీఘాట్‌ ఖాళీస్థలంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేయగా ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుంచి 3210 నగదు, 7 సెల్‌ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. Email this page

Read More »

మాటలు మానెడు… చేతలు మూరెడు

నిజామాబాద్‌, మార్చి 08 – తెరాస ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఆర్మూర్‌ న్యూస్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ పనులు గడపదాటడం లేదని మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెరాస ప్రభుత్వం తెదేపా ఎమ్మెల్యేలపై భౌతిక దాఢులకు పాల్పడుతున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి తెరాసలో చేర్చుకుంటున్నారని మాట వినని …

Read More »

ముదిరాజ్‌ సంఘం ఆద్వర్యంలో బోనాలు

నిజామాబాద్‌, మార్చి 08 ఆర్మూర్‌ న్యూస్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు హాజరై పెద్దబజార్‌ ముదిరాజ్‌ సంఘం భవనం నుంచి పెద్దమ్మ ఆలయం వరకు డప్పు వాయిద్యాలతో బోనాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి సమర్పించారు. సుమారు 200 మంది మహిళలు బోనమెత్తి అమ్మవారిని పూజించారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, వర్షాలు బాగా కురియాలని అమ్మవారిని కొలిచారు. గంగాజలంతో అమ్మవారిని అభిషేకించి బలిదానం గావించారు. కార్యక్రమంలో …

Read More »

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలిo

నిజామాబాద్‌, మార్చి 08   నిజామాబాద్‌ న్యూస్‌ : అవినీతి రహిత సమాజం కోసం మహిళలు ఎక్కువగా కృషి చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లా మహిళ శిశుసంక్షేమశాఖ, వివిద స్వచ్చంద సంస్థలు, మహిళా సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ర్యాలీని సంయుక్త కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే ఎంతో చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారని ఆయన అన్నారు. …

Read More »

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, మార్చి 08 నిజామాబాద్‌ న్యూస్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో శనివారం రాత్రి రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్‌ఐ టాటాబాబు తన సిబ్బందితో దాడిచేసి 1440 రూపాయలు స్వాధీనం చేసుకొని, ఏడుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు : మండలంలోని గ్రామాల్లో, మండల కేంద్రంలో ఎక్కడైనా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని రెంజల్‌ ఎస్‌ఐ టాటాబాబు ఒక ప్రకటనలో …

Read More »

విద్యార్థులు న్యాక్‌ గుర్తింపునకు సహకరించాలి

  – విసి పార్థసారధి నిజామాబాద్‌, మార్చి 07 నిజామాబాద్‌ న్యూస్‌ : తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్‌ గుర్తింపు బృందం ఏప్రిల్‌ 12 నుంచి 15వ తేదీ వరకు రానున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా సహకరించాలని తెవివి ఉపకులపతి పార్థసారధి కోరారు. విద్యార్థి సంఘాల నాయకులతో రిజిస్ట్రార్‌ లింబాద్రితో కలిసి ఈ మేరకు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాక్‌ గుర్తింపు అనేది విద్యార్థులకు, విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మకంగా ఉండే అంశమని ఇందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. న్యాక్‌ గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో …

Read More »

హైకోర్టు వెంటనే విభజించాలి

నిజామాబాద్‌, మార్చి 07 నిజామాబాద్‌ న్యూస్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించకపోవడం తెలంగాణకు ప్రత్యేక బార్‌కౌన్సిల్‌ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమని కెయు బిసి విద్యార్థి సంఘాల నాయకులు హెచ్‌.నవీన్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన 9 నెలలు గడుస్తున్నా ఇ ంతవరకు హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు గత నెల రోజుల …

Read More »

ఎముకల నిపుణులలో జిల్లావాసికి బంగారుపతకం

నిజామాబాద్‌, మార్చి 07 నిజామాబాద్‌ న్యూస్‌ : నగరంలోని శ్రీరక్ష ఆసుపత్రి వైద్యులు రాందాస్‌ ఎం.ఎస్‌ ఆర్థోపెడిషన్‌కు ప్లేస్‌మెంట్‌ ఆఫ్‌ ధోరాసిక్‌ పాలిక్లి స్క్రూస్‌ యూసింగ్‌ ఫ్రీ హ్యాండ్‌ టెక్నిక్‌ వితౌట్‌ ఇమేజ్‌ గైడెన్సు అనే కొత్త స్పైన్‌ ఆపరేషన్‌ టెక్నిక్‌లో 100 శాతం మంచి ఫలితాలు సాధించారు. ఈమేరకు ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన కృషికి గాను బంగారు పతకం లభించిందన్నారు. నడుమునొప్పి, కాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఉత్తమ చికిత్సలు తమ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందన్నారు. తన …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">