తాజా వార్తలు

కేసీఆర్‌ తెలంగాణ వ్యక్తేనా

– రాజారాం యాదవ్‌ నిజామాబాద్‌, మార్చి 11 ఆర్మూర్‌ న్యూస్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసలు తెలంగాణకు చెందిన వ్యక్తేనా అని టిడిపి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో ఆయన మట్లాడారు. సిఎం కేసీఆర్‌ చారిత్రకంగా తెలంగాణకు చెందిన వ్యక్తేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుండి టిటిడిపి ఎమ్మెల్యేలను బహిష్కరించడంపై ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే వారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వం తీరును …

Read More »

పన్నులు చెల్లిస్తే సౌకర్యాలు కల్పిస్తాం

– డిపివో కృష్ణమూర్తి నిజామాబాద్‌, మార్చి 11 ఆర్మూర్‌ న్యూస్‌ : గ్రామస్తులు బకాయి ఉన్న పన్నులు చెల్లించి సహకరిస్తే గ్రామాల్లో కావాల్సిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి డిపివో కృష్ణమూర్తి చెప్పారు. ఆర్మూర్‌ మండలం అమ్దాపూర్‌లో పన్నుల బకాయిల కోసం మంగళవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న బృందం పనితీరును ఆయన పరిశీలించారు. బృందం సభ్యులు ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేసే పద్దతి బాగుందని అభినందించారు. వారి వెంట ఇంటింటికి తిరిగి బకాయి ఉన్నవారు చెల్లించాలని కోరారు. ఈ …

Read More »

ప్రభుత్వ కళాశాలలో అన్ని సౌకర్యాలు – ప్రిన్సిపాల్‌ సఫ్దార్‌ అజ్‌గారీ

-ప్రిన్సిపాల్‌ సఫ్దార్‌ అజ్‌గారీ నిజామాబాద్‌, మార్చి 11 ఆర్మూర్‌ న్యూస్‌ : ప్రయివేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు సైతం తీర్చిదిద్దుతున్నారని ఆర్మూర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సఫ్దార్‌ అజ్‌గారీ తెలిపారు. బుధవారం కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో చేరండి అనే గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వం పటిష్టపరుస్తుందని పేర్కొన్నారు. ప్రయివేటు కళాశాలలకు ధీటుగా ఇక్కడ విద్యబోధిస్తున్నట్టు చెప్పారు. కళాశాలలో చేరే విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. …

Read More »

‘అడ్మిషన్లు ప్రారంభమైనవి’

నిజామాబాద్‌, మార్చి 11 బోర్డులు పెడితే చర్యలు తప్పవు ఆర్మూర్‌ న్యూస్‌ : విద్యాసంవత్సరం ముగింపునకు ముందే వివిధ ప్రయివేటు విద్యాసంస్తల యాజమాన్యాలు అడ్మిషన్లు ప్రారంభమైనవి అనే బోర్డులు ఈపాటికే సిద్దంచేసి తగిలించారు. దీంతో బుధవారం ఆర్మూర్‌ ఎంఇవో రాజగంగారాం వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణంతోపాటు మండలంలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాటు చేసిన బోర్డులను వెంటనే తొలగించాలని ఆయన సూచించారు. లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Email this page

Read More »

ఎన్‌డిఎస్‌ఎల్‌పై చిగురిస్తున్న ఆశలు

నిజామాబాద్‌, మార్చి 11   బాన్సువాడ న్యూస్‌ : నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ ప్రయివేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో మంగళవారం ప్రకటించడం రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రయివేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఏళ్ల తరబడిగా కార్మికులు, రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే పరిశ్రమ స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెరాస శ్రేణులు పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమను స్వాదీనం …

Read More »

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

నిజామాబాద్‌, మార్చి 11   ఆర్మూర్‌ న్యూస్‌ : ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌లో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న భార్యాభర్తలు కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా మూడు రోజుల క్రితం భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో భర్త మారుతి మనస్తాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్‌ సిఐ కథనం ప్రకారం… దంపతులు బాన్సువాడ మండలం సంగోజిపేటకు చెందిన జంగంపల్లి మారుతి (50), జంగం పార్వతి మూడేళ్ల క్రితం బతుకు దెరువు కోసం అంకాపూర్‌కు …

Read More »

ఎగ్జిబిట్‌ పోస్టర్‌ పోటీల విజేతలు అజయ్‌కుమార్‌, దివ్య

నిజామాబాద్‌, మార్చి 11 డిచ్‌పల్లి న్యూస్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా బయోటెక్నాలజి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిట్‌ల పోస్టర్‌ కాంపిటీషన్‌లో విజేతలను బుధవారం నేషనల్‌ సైన్స్‌డే కో ఆర్డినేటర్‌ ప్రొపెసర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. ఎంఎస్‌సి బయోటెక్నాలజి ప్రథమ సంవత్సరం చదువుతున్న అజయ్‌కుమార్‌కు ప్రథమ బహుమతి, దివ్య ద్వితీయ బహుమతి, లభించిందని వెల్లడించారు. వీరికి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా బహుమతులు అతిథుల చేతుల మీదుగా అందజేయనున్నట్టు తెలిపారు. Email this page

Read More »

ఇంటి పన్ను వసూలు కోసం స్పెషల్‌ డ్రైవ్‌

నిజామాబాద్‌, మార్చి 11 డిచ్‌పల్లి న్యూస్‌ : మండలంలోని అమృతాపూర్‌ గ్రామంలో బుధవారం ఇంటిపన్ను వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పన్ను వసూలు కొరకు స్పెషల్‌డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్టు ఇవో పిఆర్‌డి శ్రీనివాస్‌రావు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇలాగే కొనసాగుతుందని అన్నారు. Email this page

Read More »

సిసి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

నిజామాబాద్‌, మార్చి 11 ఆర్మూర్‌ న్యూస్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక 3వ వార్డు హౌజింగ్‌బోర్డు కాలనీలో రూ. 2.5 లక్షల ప్లాంటు గ్రామ్‌ నిధులతో సిసి డ్రైన్‌ పనులు ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్‌ అభివృద్దే లక్ష్యంగా ముందుక సాగుతున్నామని వారు పేర్కొన్నారు. మునిసిపల్‌ అభివృద్దికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇదేవిధంగా ప్రజలు సైతం తమకు సహకరిస్తే రాబోయే కొన్ని …

Read More »

కొత్త సాప్ట్‌వేర్‌తో కూలీలందరికి ఆధార్‌

నిజామాబాద్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ : ఆధార్‌ నమోదుకాని కూలీలకు కొత్తగా సాప్ట్‌వేర్‌ ద్వారా తిరిగి వివరాలు నమోదు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో డ్వామా, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూజిల్లాలోని 8300 మంది కూలీల ఆధార్‌ వివరాలు సరిగా నమోదు కానందున వారి వివరాలు సాప్ట్‌వేర్‌ ద్వారా తిరస్కరించబడ్డాయని తెలిపారు. ఈవివరాలను తిరిగి నమోదు చేయడానికి ఉడై సంస్థ ద్వారా కొత్తగా సాప్ట్‌ వేర్‌ను ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

స్వయం ఉపాధి పనుల కోసం యువతకు శిక్షణ ఇప్పించాలి

నిజామాబాద్‌, మార్చి 10   – కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ న్యూస్‌ : 2015-16 సంవత్సరంలో చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు 2 వేల మందికి స్టేట్‌ బ్యాంక్‌ హైధరాబాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్వయం ఉపాధి పనుల కోసం వివిధ ట్రేడులలో శిక్షణ ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలియజేశారు. డిచ్‌పల్లిలోని గ్రామీణ ఉపాధి స్వయం శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ విష్ణుకుమార్‌కు సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 2015-15 సంవత్సరంలో గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం …

Read More »

ఐఎఫ్‌టియు 8వ సభలనువిజయవంతం చేయాలి

నిజామాబాద్‌, మార్చి 10   నిజామాబాద్‌ న్యూస్‌ : ఈనెల 13న హైదరాబాద్‌లో జరగనున్న ఐఎఫ్‌టియు 8వ మహాసభలను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి జె.గంగాధర్‌ తెలిపారు. ఈ మేరకు డిచ్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సభల సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కునుంచి ర్యాలీగా బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరా పార్కుకు చేరుకుంటుందన్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉంటుందని పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఇంటర్‌నెట్‌ ద్వారా డబ్బులు సంపాదించడం – సెమినార్‌

నిజామాబాద్‌, మార్చి 10 నిజామాబాద్‌ న్యూస్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్‌ విభాగం సెమినార్‌ హాల్‌లో ఇంటర్‌నెట్‌ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అన్ని అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. మానవాళి చరిత్రలో ఇంటర్‌నెట్‌ ఒక సమాచార విప్లవాన్ని సృష్టించిందని వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం తర్వాత మానవజాతి అభివృద్ధిలో అత్యంత కీలకమైనదని ఇంటర్‌నెట్‌ద్వారా సాధ్యమైన సమాచారం విప్లవమే అని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ పార్థసారధి వివరించారు. ఈ సందర్భంగా విసి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మనం చూస్తున్నది ఇంటర్‌నెట్‌లోని మొదటి దశ …

Read More »

10 రోజుల్లోగా వ్యక్తిగత మరుగుదొడ్లు

నిజామాబాద్‌, మార్చి 09 నిజామాబాద్‌ న్యూస్‌ : అన్నిగ్రామాల్లో నిర్దేశించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను 10 రోజుల్లోగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఎంపిడివోలకు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ పథకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తెలంగాణ హరితహారం, బీడీ కార్మికుల జీవనభృతికి సంబంధించి ఎంపిడివోలతో, సంబంధిత అధికారులతో సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణం ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31లోపు పూర్తి కావాలని, తదుపరి బిల్లుల చెల్లింపునకు ఇబ్బందులు ఉంటాయని కలెక్టర్‌ …

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నిజామాబాద్‌, మార్చి 09   ఆర్మూర్‌ న్యూస్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని సైదాబాద్‌లోగల షాదిఖానాలో సిడిపివో ఇందిర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆమెఆకాంక్షించారు. ఇందుకు తెరాస ప్రభుత్వం సైతం కృషి చేస్తుందని ఆమె గుర్తుచేశారు. అందులో భాగంగానే మహిళా రక్షణకై సిఎం కేసీఆర్‌ ప్రత్యేక దృస్టి సారిస్తున్నారన్నారు. అనంతరం …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">