Breaking News

తాజా వార్తలు

టిఎన్‌ఎస్‌ఎఫ్‌ బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు స్వచ్చందంగా బంద్‌ పాటించారు. ఈసందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాజేశ్‌ మాట్లాడుతూ కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అమలు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తేవాలని, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ విధించాలని, పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం వర్తింపజేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులు …

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో బుధవారంమునిసిపల్‌ ఛైర్‌ఫర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మునిసిపల్‌ నాన్‌ ప్లాన్‌ నిధులు రూ.4 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని దశల వారిగా అభివృద్ధి చేస్తామని, పార్టీలకు అతీతంగా అభివృద్దిలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. అధికారులు పనులు నాణ్యతతో జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రామ్మోహన్‌, నాయకులు లింగారెడ్డి, …

Read More »

10వ రోజుకు చేరిన మునిసిపల్‌ కార్మికుల నిరసన

  – రోడ్డుపై ఆటా పాట కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె బుధవారంతో 10వ రోజుకు చేరుకుంది. మునిసిపల్‌ కార్మికులు స్థానిక కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆటలు, కబడ్డి, తదితర ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట టెంటువేసి బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీక్షా శిబిరాన్ని పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు సందర్శించి తమ మద్దతు …

Read More »

 వర్షాభావ పరిస్థితులున్నందున…. పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

  – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసలే వర్షాభావ పరిస్థితులు, అందులోనూ వేసిన పంటలు చీడ, పీడలతో పాడుకాకుండా రైతులకు సంయుక్త బృందాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం వీడియో కాన్పరెన్సు ద్వారా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్‌ రుణాలు ఏవిధంగా రిన్యువల్‌ చేస్తున్నారని, పంటల పరిస్థితి, …

Read More »

తెవివి నాన్‌టీచింగ్‌ సిబ్బంది ధర్నా

  డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది బుధవారం మహాధర్నా నిర్వహించారు. పే రివిజన్‌ కమీషన్‌ సూచించిన విధంగా పేస్కేల్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాన్‌టీచింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎ.మనోహర్‌గౌడ్‌, జనరల్‌ సెక్రెటరీ బి.భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులచే సమానంగా పెంచిన పిఆర్‌సిని విశ్వవిద్యాలయ ఉద్యోగులకు అమలు చేయాలన్నారు. విశ్వవిద్యాలయ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, పర్మనెంటు విసిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పరిపాలనా …

Read More »

పుష్కర విధుల నిర్వహణలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి

  – మంత్రి జోగురామన్న నిజామాబాదు, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని పుష్కర ఘాట్లలో పోచంపాడు వద్ద అధికంగా నీరు ప్రవహిస్తున్నందున భక్తులకు సదుపాయకరంగా ఉన్నందున భక్తులు విఐపిల తాకిడి అధికమైంది. మంగళవారం నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కాగా బుధవారం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో నీటి ప్రవాహం గల పోచంపాడ్‌, సావెల్‌, గుమ్మిర్యాల్‌, దోంచంద, తడపాకల పుష్కర ఘాట్లకు ప్రజలు తరలివస్తున్నారు. బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, …

Read More »

అమెరికాలో పరిశోధనకు ఎంపికైన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బి.శిరీష

  డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రి విభాగం అధ్యక్షురాలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శిరీష బోయపాటి ఇంటర్నేషనల్‌ ఫెల్లో యంగ్‌ సైంటిస్టు అవార్డుకు ఎంపికయ్యారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వారిచే భారతదేశ వ్యాప్తంగా ఇవ్వబడిన 12 ఫెలోషిప్‌లలో ఒకరిగా నిలిచిన డాక్టర్‌ శిరీష అమెరికాలో ఆరునెలల పాటు పరిశోధనలు చేయనున్నారు. నెలకు మూడు వేల డాలర్లతో రీసెర్చ్‌ గ్రాంట్‌ ఈ పరిశోధనకు లభిస్తుంది. ఈ పరిశోదనల కోసం డాక్టర్‌ శిరీష …

Read More »

కొనసాగుతున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మె

  ఆర్మూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 7వ రోజుకు చేరుకుంది. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు టెంట్లు వేసి బైఠాయించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. Email this page

Read More »

విద్యాసంస్థల బంద్‌ పాక్షికం

  ఆర్మూర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం విస్మరించినందుకు నిరసనగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పిలుపు మేరకు ఆర్మూర్‌ పట్టణంలో టిడిపి విద్యార్థి విభాగం నాయకులు బంద్‌ నిర్వహించారు. ఈ మేరకు బంద్‌ పాక్షికంగా కొనసాగింది. పలు విద్యాసంస్థలు మంగళవారమే బంద్‌కు మద్దతు తెలిపాయి. మరికొన్ని విద్యాసంస్థలు యథావిధిగా తరగతులు కొనసాగించారు. Email this page

Read More »

పుష్కరఘాట్ల వద్ద భక్తజన సందోహం

  రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి పుష్కర ఘాట్ల వద్ద భక్తజన సందోహం ఏర్పడింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు జిల్లా నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాలు అదిక సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. పురాతన, నూతన శివాలయాల్లో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ జలాలతో శివాలయాల్లో అభిషేకాలు చేశారు. మరో 11 రోజుల పాటు జరిగే పుష్కరాల సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. …

Read More »

తెలంగాణ అంతటా మహాపుష్కరాల్లో స్నానాలు ఆచరించాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గోదావరి మహా పుష్కరాల్లో ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం రెంజల్‌ మండలం కందకుర్తి గోదావరి పుష్కరాల్లో పాల్గొని స్నానం ఆచరించిన మంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు చేయించారు. అనంతరం మంత్రికి, జడ్పి …

Read More »

తెవివి పిజి పరీక్షా ఫలితాల విడుదల

  డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో జరిగిని పిజి రెగ్యులర్‌, సప్లమెంటరీ, బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను వర్సిటీ విసి సి.పార్థసారధి విడుదల చేశారు. 1379 మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల్లో 1158 మంది ఉత్తీర్ణులయ్యారని 221 మంది ఫెయిల్‌ అయ్యారని తెలిపారు. మొత్తం 84 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇందులో 82 శాతం అమ్మాయిలు, 85 శాతం అబ్బాయిలు ఉన్నారని, ఈ సంవత్సరం నుంచి వివిధ …

Read More »

2015-16 విద్యాసంవత్సరంపై సమీక్ష

  డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2015-16 విద్యాసంవత్సరం తరగతులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే సంవత్సరం తీసకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశాన్ని తెవివి విసి పార్థసారధి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి నిర్వహించారు. ఈయేడు ఎల్‌ఎల్‌ఎం కోర్సు, ఎంఎస్‌డబ్ల్యు, పిజిక్స్‌లో పిహెచ్‌డి కోర్సు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. త్వరలో ఇప్పటికే నిర్మాణమన లైబ్రరీని ప్రారంభిస్తామని హాస్టల్‌ నిర్మాణం ప్రారంభిస్తున్నామని తెలిపారు. లైబ్రరీలో కాంపిటీటివ్‌ సెల్‌ ఏర్పాటు చేసి లక్ష రూపాయలకు పుస్తకాలు కొనుగోలు చేస్తున్నామని విసి తెలిపారు. కాంపిటీటివ్‌ …

Read More »

ప్రయివేటు పాఠశాలల్లో విద్యావ్యాపారాన్ని అరికట్టాలి

  కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని టిజివిపి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి స్కూలు యూనిఫారాలు, పుస్తకాలు, బ్యాగులు తదితర స్టేషనరీ పేరిట విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రయివేటు పాఠశాలల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, స్టేషనరీ విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

  – బిజెపి మహిళా మోర్చా డిమాండ్‌ కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులుకల్పించాలని, ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడపాలని భారతీయ జనతాపార్టీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు గీతారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, పాఠశాల వసతుల గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మూత్రశాలలు అసంపూర్తిగా ఉండడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">