Breaking News

తాజా వార్తలు

ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్‌

మద్నూర్‌, అక్టోబర్‌ 30 : మద్నూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో గురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించారు. ముళ్లపొదలు తొలగింపు, చెత్తాచెదారం తొలగించారు. తరగతి గదులను సైతం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ మారుతి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని పాఠశాల పరిసరాలను శుభ్రం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ …

Read More »

బోధనలో మెళుకువలు పాటించాలి

మద్నూర్‌, అక్టోబర్‌ 30 : మాతృ భాషా బోధనలో ఉపాధ్యాయులు మెళుకువలు పాటించాలని రాజీవ్‌ విద్యా మిషన్‌ పరిశీలకుడు వెంకటచారి అన్నారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో గురువారం జరిగిన తెలుగు భాషా బోధనపై శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభాషను సులువైన పద్దతిలో బోధించాలన్నారు. విద్యార్థులు రాయడం, చదవడం, ఉక్తలేఖనంలో పట్లు సాధించేలా బోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌విఎం సిఎంఓ స్వర్ణలత, ఎంఇఓ మారుతి, ఆర్‌పిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Email this page

Read More »

మధన్‌ ఇప్పర్గా గ్రామంలోధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మద్నూర్‌, అక్టోబర్‌ 30 : మద్నూర్‌ మండలం మధన్‌ ఇప్పర్గా గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్‌ గంగుబాయి ప్రారంభించారు. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం విక్రయించాలని సర్పంచ్‌ సూచించారు. ఎ గ్రేడ్‌ ధాన్యానికి 1400 రూపాయలు, బి గ్రేడ్‌ ధాన్యం 1350 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యురాలు లక్ష్మీబాయి, ఐకెపి ఎపిఎం మల్లయ్య, అధ్యక్షురాలు కళావతి, గ్రామ రైతులు పాల్గొన్నారు. …

Read More »

పెద్ద ఎక్లారాలో యువకుని ఆత్మహత్య

మద్నూర్‌, అక్టోబర్‌ 30 : మద్నూర్‌ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన ఖానాపూర్‌ ప్రకాశ్‌ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి గురువారం తెలిపారు. దినసరి కూలీగా పనిచేస్తున్న మృతుడు ప్రకాశ్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు వివరించారు. దీంతో మృతుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. Email this page

Read More »

విద్యుత్‌ షాక్‌తో బోరు మెకానిక్‌ మృతి

మద్నూర్‌, అక్టోబర్‌ 30 : మద్నూర్‌ మండలంలోని డొంగ్లి గ్రామ శివారులో బోర్‌ మరమ్మత్తు పనులు చేస్తుండగా జంగం లింగప్ప (48) విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పోతంగల్‌ గ్రామానికి చెందిన మృతుడు లింగప్ప గురువారం చెడిపోయిన బోరును మరమ్మతు చేస్తుండగా ఈ విద్యుత్‌షాక్‌ తగిలింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం మద్నూర్‌ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు. Email this page

Read More »

190 మందికి వైద్య పరీక్షలు – 8 మంది హైదరాబాద్‌కు తరలింపు

తాడ్వాయి, అక్టోబర్‌ 30 : తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 190 విద్యార్థినిలకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 మందిని మరిన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ తరలించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ రాణి తెలిపారు. పాఠశాల ఆవరణలో డాక్టర్‌ రాజుగౌడ్‌, పాప, సుమలత, శ్రీను, జనార్దన్‌లు విద్యార్థినులను పరీక్షలు నిర్వహించారు. Email this page

Read More »

నల్లధనంపై సుప్రీం దర్యాప్తు

ఎగుమతుల పరంగా ప్రపంచ వాణిజ్యంలో పదమూడో స్థానంలో ఉన్న ఇండియా, నల్లధన ప్రవాహాలను సరిహద్దులు దాటించడంలో అయిదో స్థానానికి ఎగబాకినట్లు అంతర్జాతీయ అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లోపే విదేశీ బ్యాంకుల్లో నక్కిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే చర్యలు చేపడతామన్న యూపీఏ పెద్దలు మాట తప్పిన నేపథ్యంలోనే- ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపేణా ఈ కీలకాంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. ఆదేశాల అంకుశాలతో ఎన్నిసార్లు అదిలించినా యూపీఏ మద మత్తేభం కదలకపోయేసరికి- సుప్రీం ధర్మాసనమే చొరవ చూపి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటును …

Read More »

జిల్లా ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయుల కార్యవర్గం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయుల జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా లింబూరి లక్ష్మన్‌, ఉపాధ్యక్షులుగా రోజాకళ, రాజకుమార్‌, ప్రధాన కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, సాయిబాబా, సహాయ కార్యదర్శులుగా రమేశ్‌, నాగరాణి, జ్యోత్స్న, సంధ్యారాణి, వేణు, ప్రచార కార్యదర్శులుగా రాము, సంజీవ్‌, వినయ్‌కుమార్‌, కోశాధికారిగా లతేందర్‌లను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బాలు, రవీందర్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

మల్లాపూర్‌ వృద్ధుని అదృశ్యం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : మద్నూర్‌ మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన సాయగొండ (65) గత పది రోజులుగా కనిపించడం లేదని అతని కుమారుడు మల్లుగొండ ఫిర్యాదు చేసినట్లు మద్నూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, సమీప బంధువులు, గ్రామాలు, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. Email this page

Read More »

గ్రామీణ వైద్యుడి నిర్లక్ష్యం – ఓ మహిళకు గర్భస్రావం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : ఓ గ్రామీణ వైద్యుని నిర్లక్ష్యం కారణంగా మహిళకు గర్భస్రావం జరిగిన సంఘటన ఇటీవల మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగింది. మహారాష్ట్రలోని అంబుల్లా గ్రామానికి చెందిన కొమ్మువార్‌ లక్ష్మి తన పుట్టినిల్లు అయిన మద్నూర్‌కు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ప్రైవేటు వైద్యుడు సంగమేశ్వర్‌ వద్ద చికిత్స కోసం చేరగా వైద్యం వికటించింది. దీంతో లక్ష్మికి గర్భస్రావం కావడంతో ఆమె బంధువులు, కుటుంబీకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దెగ్‌లూర్‌-బాన్సువాడ రహదారిపై రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్‌ఐ …

Read More »

విసి చాంబర్‌ ఎదుట ఎబివిపి ధర్నా

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 : తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ సమస్యల మీద చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఎబివిపి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి సమీపంలోని తెలంగాణ యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. అంతక్రితం యూనివర్సిటీ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో సమస్యలను పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.అంజాగౌడ్‌ అన్నారు. ఇన్‌చార్జి విసిలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. నలుగురు వుండాల్సిన గదిలో …

Read More »

సినిమా రివ్యూ: ఒక లైలా కోసం

  నటీనటులు: నాగ చైతన్య, పూజా హెగ్డే, సుమన్, షియాజీ షిండే, చలపతిరావు తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: విజయ్ కుమార్ కొండా  కథ..  కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని …

Read More »

తెలుగు లోగిళ్లు. విజయోస్తు!

భారతీయ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగ వెనకా స్పష్టమైన ఆలోచన ఉంది; వివేచన ఉంది. ఓపిగ్గా పరిశీలిస్తే- పండుగల వెనక జాతి చరిత్ర మూలాలు కనిపిస్తాయి. ‘ప్రతి గేహంబున శాంతిసౌఖ్యముల దీపశ్రేణి వెల్గించి, శాశ్వతమున్, సత్యము, సుందరమ్మయిన విశ్వప్రేమ’ను నెలకొల్పాలన్న విశ్వజనీన భావన – మన పెద్దల వివేకంలోంచి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ‘మనది మనుష్య జాతి అనుమాట ఒకానొకడి ఆత్మలో అనుక్షణమును మారుమ్రోగుటయెచాలు- సమాజ పురోభివృద్ధికిన్’ అన్న అపురూపమైన ఆలోచన పండుగల నాటి ఆచార వ్యవహారాల్లోంచి తొంగిచూస్తూ ఉంటుంది. ‘కత్తిపోటు ఎవరిమీద పడినా, …

Read More »

మార్నింగ్‌ రాగాలు….

Morning Ragas

‘ఈరోజు ఏమిటో నాకు చాలా డల్‌గా ఉంది…మూడ్‌ అస్సలు బాగా లేదు’ అని మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాం. మరి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలి ? ఇదిగో ఈ కింది చిట్కాలు పాటించి చూడండి… ఫ హడావిడిగా నిద్రలేవడం మంచి అలవాటు కాదు. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చోవాలి. ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదలాలి. గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఫ నిద్రలేవగానే కండరాలు ముఖ్యంగా వెన్నెముక బిగదీసుకుపోయినట్టు చాలా గట్టిగా ఉంటుంది. స్ర్టెచింగ్స్‌ చేయకుండా …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">