Breaking News

తాజా వార్తలు

పుష్కర పనులు వేగవంతం చేయాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కర ఘాట్ల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కలెక్టర్‌ ఏ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హెచ్‌ఆర్‌డి అధికారులు, ఘాట్ల ఇన్‌చార్జి అధికారులతో కందకుర్తి పుస్కర ఘాట్లలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పుష్కర ఘాట్లకు, శివాలయానికి వేరువేరుగా దారిని ఏర్పాటు చేయాలని, పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమన్నారు. పనులను …

Read More »

పుష్కర నిర్మాణ పనులు 30 వరకు పూర్తిచేయాలి

  – జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుష్కరాల ఘాట్‌ ఇన్‌చార్జి అధికారులు సంబంధిత ఘాట్లలో ఇతర అదికారులతో సమన్వయం చేసుకొని నిర్వహించవలసిన పనులపై నివేదించాలని సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో పుష్కరాల విధులు నిర్వహించే అధికారులతో రెండోరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరాల ఘాట్ల వద్ద పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ తదితర పనులు పూర్తి అయ్యే దశలో ఉన్నాయని, కొన్ని పూర్తి చేసి మరికొన్ని చివరి …

Read More »

డిఎడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

  ఆర్మూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగుల్లో తెరాస ప్రభుత్వం లక్ష ఉద్యోగాల పేరిట ఆశలు రేపిందని పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్‌ అన్నారు. ఈమేరకు శుక్రవారం డిఎడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ శ్రీదర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి డిఎడ్‌ నోటిఫికేషన్‌తోపాటు అన్ని శాఖల ఉద్యో గాల …

Read More »

విద్యుత్‌ ఏఇగా నటరాజ్‌

  ఆర్మూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ విద్యుత్‌ ఎఇగా నటరాజ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలన్నింటిని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. Email this page

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

  ఆర్మూర్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్‌ సద్దార్‌ అస్కరీ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోదన చేయడం జరుగుతుందని, అలాగే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు తమ కళాశాలలో ఉన్నట్టు ఆమె చెప్పారు. ఎల్‌ఎఎసిడి గుర్తింపు గల ఏకైక కళాశాల అని పేర్కొన్నారు. Email this page

Read More »

హరితహారానికి సిద్దం కండి

  – టియు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ యూనివర్సిటీలో కనీ వినీ ఎరుగని రీతిలో చేపట్టాలని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఇందులో భాగంగా వర్సిటీ క్యాంపస్‌లో వేలాది మొక్కలు నాటి గ్రీన్‌ క్యాంపస్‌గా మార్చాల్సిన అవసరముందని ప్రొఫెసర్‌ లింబాద్రి సూచించారు. జిల్లా కలెక్టర్‌, ఇతర అధికార యంత్రాంగం కూడా హరితహారం విషయమై వర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించనుందని పేర్కొన్నారు. శుక్రవారం …

Read More »

బోధనేతర సిబ్బందితో రిజిస్ట్రార్‌ సమావేశం

  డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం బోధనేతర సిబ్బందితో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ చాంబర్‌లో జరిగిన సమావేశంలో బోధనేతర సిబ్బందికి ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌, విధి నిర్వహణ ఎలా చేయాలి తదితర అంశాలపై చర్చించారు. ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేయాలనే అంశంపై త్వరలోనే ఒకరోజు వర్క్‌షాప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఫైనాన్స్‌ ఆఫీసర్‌ జాకీర్‌ అహ్మద్‌ఖాన్‌, ఆడిట్‌ అధికారి, సూపరింటెండెంట్‌ సాయాగౌడ్‌, భాస్కర్‌, జ్యోతి, సరిత, తదితరులున్నారు. …

Read More »

కార్మికుల సంక్షేమం  తెలంగాణ ఉద్యమ లక్ష్యాo

  గల్ఫ్ లోని ప్రవాస కార్మికుల సంక్షేమం  తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్లో ఒకటని అన్నారు నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంత్ల కవిత. కువైట్ లోని కార్మికులతో మాట్లాడిన శ్రీమతి కవిత తెలంగాణ కార్మికులను తెలంగాన ప్రభుత్వం  కాపాడుకుంటదన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరన వేడుకలకు హాజరయ్యేమ్దుకు నేడు కువైట్ చేరుకున్న నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గురువారం (11 జూన్ 2015) ఉదయం కువైట్ లోని వలస కార్మికుల క్యాంపులను సందర్శించి అక్కడి తెలంగాణ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

అశ్లీల చిత్రాలు చూస్తున్న వ్యక్తి అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోఅశ్లీల చిత్రాలు చూస్తున్నాడని సుంకె శ్రీనివాస్‌ అనే ఆర్టీఏ ఏజెంట్‌ను గురువారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. సిఐ కథనం ప్రకారం గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్టీఏ ఏజెంట్‌ షాప్‌పై దాడిచేసి తన ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ పక్కవారికి చూపిస్తుండగా ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ షాపుపై దాడిచేసి అతన్ని అరెస్టు చేసి ఫోన్‌ను సీజ్‌చేసినట్టు సిఐ తెలిపారు. ఇంకా ఎవరైనా అశ్లీల చిత్రాలు చూసినా, డౌన్‌లోడ్‌ …

Read More »

నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 18వ వార్డు అరుంధతి నగర్‌ కాలనీలో గురువారం స్థానిక కౌన్సిలర్‌ నరినె రజిత నవీన్‌ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లుదంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి భక్తులు, కాలనీవాసులు, పట్టణ ప్రజలు, తెరాస నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. Email this page

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో గురువారం మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. లక్ష రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు పనులను వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రగతి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమీషనర్‌ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్‌ గణేశ్‌, సిపివో రాహుల్‌, నాయకులు కిషన్‌, శ్రీనివాస్‌, …

Read More »

విఆర్‌ఏలను కొనసాగించాలి

  కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలో వంతుల వారిగా కొనసాగుతున్న విఆర్‌ఏలను యధావిధిగా కొనసాగించాలని సిఐటియు అనుబంధ విఆర్‌ఏల సంఘం ఆద్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ కామారెడ్డి డివిజన్‌లో వంతులవారి విధానం స్వతంత్ర కాలం నుంచి నడుస్తుందన్నారు. డివిజన్‌లోని సేవలు దళిత కటుంబాలు వంతుల వారిగా ఒక్కో మండలంలో 800ల మందికిపైగా ఉన్నారన్నారు. కామారెడ్డి డివిజన్‌లో ఎక్కువ కుటుంబాలు ఆధారపడ్డ …

Read More »

శుక్రవారం పాఠశాలల ప్రారంభం

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి సెలవుల్లో సరదాగా సేదతీరిన బడిపిల్లలు శుక్రవారం నుంచి యధావిధిగా పాఠశాలలకు హాజరు కానున్నారు. శుక్రవారంతో పాఠశాలలన్ని పున: ప్రారంభం చేయాలన్న విద్యాశాఖ ఆదేశాలతో జిల్లాతో పాటు పట్టణంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో పట్టణంలోని బుక్‌స్టాళ్ళు, స్కూలు బ్యాగుల దుకాణాలు, యూనిఫాంల దుకాణాలు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. పుస్తకాల ధర గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడు 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగాయని, ఇకవిద్యార్థుల …

Read More »

కరుణించని వరుణుడు

  ఆర్మూర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం, తీవ్ర ఎండ, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి అయిన పట్టణ ప్రజలకు ఇంకా తొలకరి పలకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిరుగు దాటి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు భారీ వర్షం నమోదు కాకపోవడంతో ఇటు రైతాంగం, ప్రజలు ఆందోళనకు గురై వరుణ దేవుడిని పూజిస్తున్నారు. తీవ్రమైన ఎండలకు భూగర్భ జలాలు ఇంకిపోవడం, ఆర్మూర్‌ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి వరుణుడు …

Read More »

ఆశలు నింపిన జల్లులు

  బాన్సువాడ, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నదాతలు వర్షం కోసం ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తుండగా బాన్సువాడ ప్రాంతంలో గురువారం కురిసిన జల్లులు వారిలో ఆశలు నింపాయి. వర్షాకాలం ఆరంభమై నాలుగు రోజులు కావస్తున్నప్పటికి జల్లుల జాడలేకపోవడం అన్నదాతకు కలవరానికి గురిచేసింది. ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో నాలుగు రోజులుగా ఖరీఫ్‌ సాగుపై ఆందోళనకు గురయ్యారు. వర్షం కోసం చకోర పక్షుల్లాగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ మోస్తారుజల్లులు కురిశాయి. దీంతో ఖరీఫ్‌ సాగుపై అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">