తాజా వార్తలు

ఆధునిక వ్యవసాయ యంత్రీకరణ పథకం ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద శుక్రవారం అర్హులైన రైతులకు ఆధునిక వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. ఇట్టి పథకాన్ని రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు ఈ పథకానికై మంజూరు చేయగా 200 కోట్లు తెలంగాణ రైతులకు కావాలని కోరన్నారు. దానిని సి.ఎం కేసీ.ఆర్‌ మంజూరు చేయడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, అర్బన్‌ ఎం.సి.ఎ బిగాల గుప్త, …

Read More »

హిందూ శక్తి సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

  నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 23: రేపు జరిగే హిందూ శక్తి సమ్మేళనాన్ని విజయవంతం చెయాలని ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. ఈ సమ్మేళనం నగరంలోని బస్టాండ్‌ ప్రక్కనగల హరిచరణ్‌ మార్వాడి పాఠశాల యందు జిల్లా సాధు దంపతుల ఆద్వర్యంలో జరుగుతుందన్నారు. హిందువులకు ఎటువంటి సమస్యలు ఎదురైన విశ్వహిందూ పరిషత్‌ ముందుంటుంది అన్నారు. అనంతరం గోవుల రక్షణకై నగరంలోని ముఖ్యమైన పలు ప్రాంతాలలో త్రాగునీరు కుండిలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ …

Read More »

టి.జి.ఓ డైరీ క్యాలండర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: తెలంగాణ గెజిటేడ్‌ అధికారుల డైరీ, క్యాలండర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని నూతన అంబేద్కర్‌ భవనంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా టి.జి.ఓ స్‌ జిల్లా అధ్యక్షుడు బాబురావునాయక్‌ మాట్లాడారు. ఆరోగ్య భద్రత కార్డులు, ఇండ్ల స్థలాలు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రప్పించాలని ఆయన కోరారు. ఖాళీలుగా ఉన్న 1లక్ష 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. పి.ఆర్‌.సి సనీస వేతనం రూ. 10 వేలవరకూ పెంచాలని …

Read More »

బోర్లు నిషేదం… 127 గ్రామల్లో వాల్టా అమలు…భూగర్భ జలాలు తగ్గడమే కారణం… ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ రోస్‌

నిజామాబాద్‌, జనవరి 23: మళ్లీ భూగర్బ నీళ్ల లొల్లి షూరూ అయింది. ఒకవైపు వర్షాలు లేక రైతులు విలవిలాడుతున్నారు. పంటలు వేయాలంటేనే జంకుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం బోర్లు వేసేవారిపై వాల్టాను ఉపయోగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రోనాల్ట్‌రాస్‌ ఉత్తర్వులను జారీ చేసారు. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వాల్టా చట్టం పరిధిలోకి జిల్లాలోని 127 గ్రామాలను తీసుకువస్తూ, అక్కడ ఎవరు కూడా కొత్తగా బోర్లు వేయరాదని నిషేదం విధించారు. వాల్టా చట్టాన్ని అనుసరించి ఎనిమిది ప్రభుత్వ …

Read More »

అర్హులందరికి ఆహార భద్రత పథకం అమలు.

డిచ్‌పల్లి, జనవరి 22, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేేశ పెట్టిన ఆహార భద్రత పథకాన్ని గురువారం డిచ్‌పల్లి మండలంలోని కోరట్‌ పల్లి, ఖిల్లా డిచ్‌పల్లి గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రూప్‌సింగ్‌, లింబాద్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పిపి దాసరి ఇంద్ర మాట్లాడుతూ అర్హులందరికి ఈ పథకం ద్యారా లబ్ది పొందాలని, అర్హత ఉండి కార్డు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, రేషన్‌ డీలర్లు, టిఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు …

Read More »

నిరుపేదల కోసమే ఆహార భద్రత పథకం

రెంజల్‌, జనవరి 22, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసమే ఆహార భద్రత పథకాన్ని ప్రవేశ పెట్టిందని తాడ్‌ బిలోలి సర్పంచ్‌ అన్నారు. గురువారం గ్రామంలో ఆహార భద్రత పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హత ఉండి రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విండో ఛైర్మన్‌ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌ రాజేశ్వర్‌, డీలర్లు పార్వతి రాజేశ్వర్‌, గంగాధర్‌ నాయకులు అనంతరావు, అరికెల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Email …

Read More »

టీయూలో 24న పెయింట్‌ యువర్‌ డ్రీమ్స్‌ వైస్‌ చాన్స్‌లర్‌ పార్థసారధి రాక

డిచ్‌పల్లి, జనవరి 22: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 24న పెయింట్‌ యువర్‌ డ్రీమ్స్‌ (కలలకు రూపమిద్దాం ) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ లింబాద్రి ప్రకటనను విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ పార్థసారధి హాజరవుతారని, యూనివర్సిటిలోని కంప్యూటర్‌ సైన్స్‌ భవనంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ఉద్దేశంతో వీసి పార్థసారథి వినూత్న కార్యక్రామాన్ని చేపట్టి పెయింట్‌ యువర్‌ డ్రీమ్స్‌ (కలలకు రూపమిద్దాం) అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా టీయూలో ప్రారంభించారని పేర్కోన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం …

Read More »

మెడికల్‌ కళాశాలకు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 22:   నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు 50 అదనంగా సీట్లు ఎంబీబీఎస్‌కు కేటాయించారు. 2012 ఆగష్టులో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఇదివరకే 100 ఎంబిబీఎస్‌ సీట్లును కెటాయించారు. జిల్లాలోని కళాశాలలో ఉన్న వసతులు ఇతర ఏర్పాట్ల దౄష్ట్యా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు 50 సీట్లు ఇచ్చేందుకు భారతీయ వైద్య మండలి అంగీకారం తెలిసినట్లు సమాచారం. జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అదనపు సీట్ల కోసం గత ఎడాది కళాశాల అధికారులు ఎంసీఐకి ప్రతిపాదనలు …

Read More »

భవిష్యత్తుకు భరోసా ఎన్‌పిఎస్‌ ఎమ్మార్వో వెంకటయ్య

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 22: ప్రతి కుటుంబానికి భవిష్యత్తుకు తప్పనిసరిగా భరోసా ఉండాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ సర్వీసెస్‌(ఎన్‌పిఎస్‌) భరోసాను ఇస్తుందని మాక్లూర్‌ ఎమ్మార్వో వెంకటయ్య అన్నారు. గురువారం మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌ చౌరస్తాలో మండల ఎన్‌పిఎస్‌ బ్రాంచ్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్వో వెంకటయ్య ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. …

Read More »

స్వైన్‌ఫ్లూ’ బారి నుండి ప్రజలను కాపాడాలి – డా. బాపురెడ్డి

  ప్రజలపై యమపాశంగా మారుతున్న ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి బారి నుండి ప్రజలను ప్రభుత్వమే కాపాడాలని డాక్టర్‌ బాపురెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడూతూ, ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి ”హెచ్‌1” అనే వైరస్‌ ద్వారా సోకుతుందని,.ఈ వ్యాధి పందులు,పక్షుల ద్వారా వ్యాపిస్తుందన్నారు. జలుబు, దగ్గు, దమ్ము ఎక్కువగా రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ి ‘స్వైన్‌ఫ్లూ’ అవగాహనపై బ్యానర్లను పెట్టించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాధి నివారణకు సంబంధించిన ” టిఎఎమ్‌ఎఫ్‌ఎల్‌యు, రాలెంజా ” అనే …

Read More »

డైరీ అధికారుల మోసం ఇది

  -పట్టించుకోండి పెద్దసార్లూ… -ఓ బాధితుడి ఆవేదన.. అక్రందన.. నిజామాబాద్‌, జనవరి 20: కలెక్టర్‌ సారూ….. నా పేరు యార్లగడ్డ బాబురావు. మాది మిర్జాపూర్‌ గ్రామం, కోటగిరి మండలం. నిజామాబాద్‌ జిల్లా డైరీ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ ఉపాధి పేరుతో నన్ను మోసం చేసి రూ.5 లక్షలు నష్టం చేయడమే కాకుండా డైరీని ఏర్పాటు చేయించి మరో రూ.1.05 కోట్లు ఖర్చు చేయించి నష్టం చేయించిన అధికారులపై చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాను. ఇది నా పరిస్థితి… సుమారు 26 నెలల క్రింద ఎ.పి. డైరీ …

Read More »

ప్రైవేట్‌ పాఠశాలలను ప్రభుత్వమే ఆదుకోవాలి

  -ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాదురెడ్డి నిజామాబాద్‌, జనవరి 20: తెలగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అందించడంతో పాటు గ్రామ గ్రామాన అ్షర అభ్యాసం అందిస్తూ కూటీర పరిశ్రమలుగా ప్రైవేట్‌ పాఠశాలలు పని చేస్తున్నాయని ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ అన్నారు. మంగళవారం అమృతా గార్డెన్స్‌లో ట్రాస్మా జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సును ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాదురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకుంటున్నదని అన్నారు. రాజకీయ నాయకులు కార్పోరేట్‌ విద్యకు …

Read More »

గ్రామాభివృద్ది కమిటీ వేధింపుల నుండి రక్షించండి

  నిజామాబాద్‌ రూరల్‌, జనవరి 20: డిచ్‌పల్లి మండలం నల్లవెల్లి గ్రామాభివృద్ది కమిటీ బాటలోనే మిగతా గ్రామాల్లోని పెత్తందార్లు గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని సిపిఎం నేత పెద్ది వెంకట్రాములు అన్నారు. నల్లవెల్లి గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ కిరణా దుకాణాలలో అమ్మకాలపై నిబంధనాలు విధించారని అన్నారు. ఈమేరకు గ్రామ అభివృద్ది కమిటీ తీరుపై జిల్లా కలెక్టర్‌కు సిపిఎం నాయకులు ఫిర్యాదు చేసారు. గ్రామంలో కిరాణ దుకాణంపై వేలంపాట పెట్టి, గ్రామభీవృద్ది కమిటీల ఆదేశాలను అమలుచేయని గ్రామప్రజలపై రూ.10 వేలు జరిమానా దౌర్జన్యంగా వసూలు …

Read More »

స్వచ్ఛభారత్‌తో ఆరోగ్య సూత్రలు

  -బిజెపి నేత డాక్టర్‌ బాపురెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 20: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో గ్రామీణ ప్రజలు ఐదు స్వచ్ఛమైన ఆర్యోగ్య సూత్రలు పాటించాలన్నారు. మంగళవారం ఆమ్రాద్‌ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా డాక్టర్‌ బాపురెడ్డి పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన ఆరోగ్యం కావాలంటే గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, బాలలికలు, రక్తహీనతను రూపుమాపేందుకు సరైన ఆహరం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కత్తికల్లు, కల్తిపాల సరఫరాలను నిషేదించాలన్నారు. గ్రామీణ పరిసర ప్రాంతాల్లో పారిశుద్యన్ని నెలకోల్పోన్నారు. గ్రామంలో …

Read More »

25న జాతీయ ఓటర్ల దినోత్సవం

  -ఓటర్‌ జాబితాలో చేరండి; డిఆర్‌వో మనోహార్‌ నిజామాబాద్‌, జనవరి 17; జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకోని ఈనెల 25న ప్రతి ఒక్కరు యువత ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి(డిఆర్‌వో) మనోహార్‌ అన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. అ సందర్భంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు ఈనెల 18న నియోజకవర్గ స్థాయిలో క్విజ్‌, ఏలోకేషన్‌, పెయింటింగ్‌ పోటీలను నిర్వహించాలని, ఇక్కడ గెలుపొందిన వారికి ఈనెల 23న జిల్లా స్థాయిలో పోటీలను …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">