Breaking News

తాజా వార్తలు

ముమ్మరంగా పూడిక తీత

బాన్సువాడ, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో భాగంగా బోధన్‌ డివిజన్‌లో చెరువులకు పునర్‌వైభవం వస్తుంది. పక్షం రోజులుగా డివిజన్‌లోని పలు చెరువుల్లో అధికారులు ప్రజా ప్రతినిదులు పూడిక తీత పనులకు ప్రారంభోత్సవం చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్‌ డివిజన్‌లో పలు చెరువుల్లో పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి స్థానిక అధికారులు, నాయకులు కొనసాగింపుగా తమ ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. దీంతో డివిజన్‌లోని …

Read More »

ఘనంగా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని స్తానిక రాజారాంనగర్‌ కాలనీలో పిఎంపి డాక్టర్స్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షులు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆద్వర్యంలో జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిరావుఫూలే సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల, పట్టణ పిఎంపి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. Jyothi Rao pule birthday celebrations in Armoor Email this page

Read More »

వరుడు ఊడాయించాడు… వివాహాం అగిపోయింది…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10: తెల్లవారే సరికి పేళ్లి. అదనంగా కట్నం ఇస్తేనే పేళ్ళి చేసుకుంటానని వరుడు మొండి కేసాడు. అందుకు వదువు తల్లిదండ్రులు నిరాకరించడంతో వరుడు ఊడాయించాడు. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అదే తరహాలో వ్యవహారించడంతో వివాహాం అగిపోయింది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని బోర్గాం(పి) గ్రామంలో ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. చివరకు వదువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుడు పేళ్లికి అంగీకరించాడు. కానీ వదువు మాత్రం ససేమిరా తనకు ఈ పేళ్లి ఇష్టం …

Read More »

అమరవీరులకు నిజామాబాద్‌ రైల్వేపోలీసుల నివాళి

ఇందూరు, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గోండ జిల్లాలో కాల్పుల్లో మరణించిన పోలీసుల అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం రాత్రి రైల్వే పోలీసులు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిజామాబాద్‌ నగరంలోని రైల్వే స్టేషన్‌ ఆవరణలో చుట్టూ కొనసాగింది. ర్యాలీని ఆర్‌పిఎఫ్‌ సిఐ మనోజ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల కోసం విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడు ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉంటారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇచ్చి, …

Read More »

అమరవీరులకు నిజామాబాద్‌ రైల్వేపోలీసుల నివాళి

ఇందూరు, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గోండ జిల్లాలో కాల్పుల్లో మరణించిన పోలీసుల అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని శుక్రవారం రాత్రి రైల్వే పోలీసులు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిజామాబాద్‌ నగరంలోని రైల్వే స్టేషన్‌ ఆవరణలో చుట్టూ కొనసాగింది. ర్యాలీని జిఆర్‌పిఎఫ్‌ సిఐ మనోజ్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల కోసం విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడు ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉంటారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇచ్చి, …

Read More »

వైకాపా జిల్లా అధ్యక్షుని ఎంపిక పట్ల సంబరాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకాపా జిల్లా అధ్యక్షునిగా పట్లోళ్ళ సిద్ధార్థరెడ్డిని నియమించడం పట్ల శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి ఆద్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థరెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకుగాను పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ పటిష్టానికి తమవంతు సహాయ …

Read More »

సంప్రదాయ విద్యల కన్న, సాంకేతిక విద్యే మిన్న

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెక్నాలజి విస్తరిస్తున్న తరుణంలో సంప్రదాయ విద్యల కన్నా సాంకేతిక విద్యే మిన్న అని వాణి విద్యాలయం ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అన్నారు. కామరెడ్డి పట్టణంలో శుక్రవారం రామన్‌ పాలిటెక్నిక్‌, టిఎస్‌ ఆర్‌జేసి కోచింగ్‌సెంటరు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరై రమాదేవి ఉపన్యసించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే సంప్రదాయ విద్యతోపాటు సాంకేతిక విద్యల్లో కూడా రాణించాలని సూచించారు. రామన్‌ కోచింగ్‌ సెంటరు అందుకు ఉపకరిస్తుందని అన్నారు. విద్యార్థులు కోచింగ్‌ సెంటరును ఉపయోగించుకొని ర్యాంకులు సాధించాలని …

Read More »

ఉన్నత లక్ష్యంతోనే గుర్తింపు

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత లక్ష్యంతోనే వ్యక్తికి గుర్తింపు లభిస్తుందని, ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా ముందుకు సాగాలని ప్రముఖ కెరీర్‌ గైడెన్స్‌ అడ్వయిజర్‌ అనిల్‌కుమార్‌ సూచించారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం లైఫ్‌ అండ్‌ కెరీర్‌పై సెమినార్‌ నిర్వహించారు. సెమినార్‌లో అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ మనిషి లక్ష్యాన్ని బట్టి గుర్తింపు లభిస్తుందని, మంచి లక్ష్యాన్ని ఎంచుకొని మంచి గుర్తింపును తెచ్చుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుంచే ఓ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం …

Read More »

కందకుర్తిలో వైద్య శిబిరం

రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రయివేటు వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులకు 845 మందికి వైద్య సేవలు అందించి, 17 మందికి ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు. వైద్య శిబిరంలో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌కు చెందిన వైద్యులు డాక్టర్‌ శైలజ, మూర్తి, రాహుల్‌, ఉదయ్‌ కిరణ్‌, సుమన్‌, మహేశ్‌ కుమార్‌, రెంజల్‌ ప్రభుత్వ వైద్యాధికారి నసీమ ఫాతిమా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. …

Read More »

ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి ఉద్యోగులకు, ఆయాలకు మే 1వ తేదీ నుంచి నెలరోజుల సెలవులు మంజూరు చేయాలని పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కామారెడ్డి ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాచేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.యాదమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌లు మాట్లాడారు. అంగన్‌వాడిల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అనేకసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యల పరిష్కారం పట్ల మొగ్గుచూపకపోవడం గర్హణీయమన్నారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించలేదని, …

Read More »

సర్కారు దావఖాన్ల చెత్తే చెత్త… ముక్కు మూస్కోని పోతున్న జనాలు

ఇందూరు, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇగో ఈ ఫోటో చూసిండ్రా…. ఎండాకాలంలా నీళ్లేక మనం ఏడుత్తున్నం. ఇగ గి జిల్లా సర్కారు దవాఖాన్లయితే నీలు ఎంత పోయిన అడిగే నాథుడు లేకపాయె. మల్ల గట్లపోతే యాడ పడితే ఆడ చెత్త కుప్పలు, మోర్లను సాఫ్‌ చేపియ్యరు. మరి గిట్లయితే ఆడికొచ్చే రోగులకు రోగాలు నయం కావు కదా ఇంకెక్కత్తయి. ఇగ డాక్టర్లే దేవుళ్లని నమ్ముకోని పోయేటోళ్లకు మాత్రం న్యాయం జరుగుడు మాట దేవుడెరుగు గానీ మాక రోగాలు మాత్రం …

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డు రాజానగర్‌ కాలనీలో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిదులురూ. 2 లక్షలతో సిసి రోడ్డు పనులను చేపట్టామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సరోజ, మోహన్‌, ఏ.ఇ. గంగాధర్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు సంజీవ్‌, రవిందర్‌, తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

చెరువుల అభివృద్ధితోనే రైతన్న అభివృద్ధి… – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువులు అభివృద్దిచెందితేనే రైతన్న పంట పొలాలు పచ్చగా ఉంటాయని తద్వారా రైతులు అభివృద్ది చెందుతారని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని దోమకొండ మండలంలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల పునరుద్దరణ చేసేందుకు మిషన్‌ కాకతీయను చేపట్టామని, తద్వారా చెరువుల్లో లభ్యమయ్యే మట్టిని రైతులు తమ పంట పొలాలకు తరలించుకొని రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. దీనిద్వారా చెరువుల్లో …

Read More »

జ్యోతిబాఫూలే విగ్రహ ఏర్పాటుకు వీడని గ్రహణం ….

– కలెక్టర్‌ ఇచ్చిన మాటలు నీటి మూటలేనా..? – అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో నిధులు వృధా… – మూడేళ్ళు గడుస్తున్నా ఏర్పాటుకు నోచుకోని ఫూలే విగ్రహం … నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 10   నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌కు గురువుగా మారి మహాత్ముడుగా బిరుదు పొందిన జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుకు మాత్రం పది అడుగుల స్థలాన్ని ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు మహాత్ముల అడుగుజాడల్లో నడవాలని ప్రజలందరికి చెప్పడమే …

Read More »

రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ఇందూరు, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని రైల్వేస్టేషన్‌ పరిధిలోగల 2వ ప్లాట్‌ఫాం వద్ద పర్బనీ ప్యాసింజర్‌ ఎక్కుతుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని రైల్వే ఎస్‌ఐ సాయినాథ్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో అతనికి ఎడమ కాలు విరిగిందని, తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. అనంతరం అతన్ని చికిత్స నిమిత్తం 108లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. Person Injured severely in Train Accident Induru Email this …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">