తాజా వార్తలు

ప్రజావాణికి రెండు ఫిర్యాదులు

రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: రెంజల్‌ మండలం తహసీల్‌ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్‌ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి రెండు ఫిర్యాదులు వచ్చాయని ఈ ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్‌ వెంకటయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Email this page

Read More »

నేడు మండలానికి ఎంపి కవిత రాక

రెంజల్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు మండలంలోని కందకుర్తి, ధూపల్లి గ్రామాలకు జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ధూపల్లిలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం ఎంపి దత్తత గ్రామమైన కందకుర్తి గ్రామాన్ని సందర్శించి పుష్కర పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మండల తెరాస అధ్యక్షులు పాశం సాయిలు ఒక ప్రకటనలో తెలిపారు. Email this page

Read More »

భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 36వ డివిజన్‌లో భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి మల్యాల గోవర్దన్‌ మాట్లాడుతూ 36వ డివిజన్‌లో అర్హులైన వారందరికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని వారన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవో 58 ప్రకారం ఇళ్ళ పట్టాలు వారికి మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులను …

Read More »

చెరువునుంచి అక్రమంగా మట్టి తరలింపు

బాన్సువాడ, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేశాపూర్‌ గ్రామ చెరువు నుంచి మట్టిని కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అధికారుల కన్నుగప్పి అక్రమంగా భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గూపన్‌పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్‌. నారాయణరెడ్డి అనే వ్యక్తి సోమవారం తహసీల్దార్‌ రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కంఠేశ్వర్‌ శివారుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లక్ష రూపాయలు గుత్తాగా కొని వేల ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. ఈ …

Read More »

సమస్యలుంటే ఫోన్‌ చేయండి

  డిచ్‌పల్లి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఎంపిపి దాసరి ఇందిర, జడ్పిటిసి కూరపాటి అరుణ, ఎంపిడివో, తహసీల్దార్‌ పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని సమస్యలపై సమష్టి సమావేశం ఏర్పాటు చేశారు. సమస్యలు ఆయా శాఖల వారితో ముఖాముఖి చర్చించారు. సమస్యలపై అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు సహకార సంఘం డైరెక్టర్లు, ఆయాశాఖల అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఏ గ్రామంలో సమస్యలున్నా వెంటనే …

Read More »

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య యత్నం

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని స్థానిక హమాల్‌వాడికి చెందిన బల్ల వినయ్‌ (26) అనే వ్యక్తి శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్తానిక మైసమ్మ మందిరంలో నిద్రిస్తుండగా తనను నిద్రనుంచి లేపి అదేవీధికి చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి తనను అక్కడ నిద్రించకూడదని పక్కనేగల కుళాయి పైపుతో దారుణంగా కొట్టాడని బాధితుడు నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌తో విన్నవించుకున్నాడు. వినయ్‌ కథనం ప్రకారం… చక్రధర్‌ తనను కుళాయిపైపుతో దారుణంగా కొట్టడంతో తన గోడును విన్నవించడానికి వెంటనే …

Read More »

కబ్జాదారులపై కఠిన చర్యలు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కబ్జాలకు గురన శిఖం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో పలు చెరువుల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆయన మాట్లాడారు. ఆక్రమణలు ఉన్నవారు శిఖంభూములను వెంటనే ఖాళీ చేయాలని, లేనియెడల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని …

Read More »

రుద్రమదేవి ఆడియో ఆవిష్కరణ విశేషాలు

ఆడియో సీడీలను అల్లుఅర్జున్, అనుష్క విడుదల చేసి తొలి సీడీని కొండా సురేఖ, కొండా మురళిలకు అందజేశారు. కొండా సురేఖ మాట్లాడుతూ ‘‘ పోరాటాలకు మారుపేరైన రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించిన గుణశేఖర్ గారిని అభినందిస్తున్నాను. సినిమాని 2డి, 3డి టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు. నేను సినిమా చూసి చాలా కాలమైంది. ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. సిరివెన్నెల …

Read More »

సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

  – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శన తెలంగాణలో ప్రత్యేకతను సంతరించుకుందని, ఈ యేడు సైతం ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించి కామారెడ్డి పేరును చాటుకున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గోదావరి …

Read More »

కన్నుల పండువగా ఉగాది

  కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో ప్రజలు ఉగాది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో ప్రతియేటా ఎడ్లబండ్ల ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈయేడు సైతం ఎడ్లబండ్ల పండగను వైభవంగా నిర్వహించారు. స్థానిక దుర్గమ్మ, పోచమ్మ, మైసమ్మ ఆలయాల చుట్టు అలంకరించిన ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. దీన్ని తిలకించేందుకు పట్టణవాసులు వేలాదిగా తరలివచ్చారు. పండగ సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాల్లో పంచాంగ శ్రవణం జరిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చనలు, అభిషేకాలు చేశారు. పట్టణ పద్మశాలి …

Read More »

ప్రజలు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ సరఫరా

  – మంత్రి జగదీశ్‌రెడ్డి నిజామాబాద్‌, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: విద్యుత్తు కొనుగోలుకు ఎంత ఖర్చయినా భరించి పంటల ఎండిపోకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 12 విద్యుత్‌ ఉపకేంద్రాలు ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి సదాశివనగర్‌పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ నియోజకవర్గంలో లో ఓల్బేజి సమస్య అధిగమించడానికి 32 కోట్ల వ్యయంతో 33/11 కెవి సబ్‌స్టేషన్లు …

Read More »

తాగునీటి ఎద్దడిని నియంత్రిస్తాం

  ఆర్మూర్‌, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ పట్టణంలో నీటి సమస్య ఉన్నది వాస్తవమేనని, దీన్ని అధిగమించేలా ఈపాటికే చర్యలు చేపట్టినట్టు ఆమె చెప్పారు. ఇతర పార్టీల కౌన్సిలర్లు సైతం తమకు సహకరించి నీటి ఎద్దడిని ఎలా నియంత్రించాలో సలహాలు, సూచనలు చేయాలని పేర్కొన్నారు. కానీ విమర్శించడం వల్ల ప్రజలకు నష్టమే జరుగుతుందని స్పష్టం చేశారు. తమపై …

Read More »

ప్రజా సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయం

  ఆర్మూర్‌, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రజల సంక్షేమమే తెరాస పార్టీ లక్ష్యంగా సిఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వ పాలనలో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనతో ఇతర పార్టీలకు వంతుపట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్లే దీన్ని సహించలేక తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు తెరాసను విమర్శిస్తున్నారని అన్నారు. తమ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించి ఓట్లు …

Read More »

వైభవంగా కుక్కలగుట్ట జాతర

ఆర్మూర్‌, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని కుక్కలగుట్ట హనుమాన్‌ మందిర జాతర ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు మందిరంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంమీదుగా పెర్కిట్‌ వరకు స్వామివారిని ఊరేగించి జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మొక్కులు తీర్చుకొని రథం వద్ద టెంకాయలు కొడుతూ, మంగళహారతులు సమర్పించారు. స్వామివారి రథాన్ని లాగడానికి పెద్ద సంఖ్యలో యువకులు పోటీపడ్డారు. Email this page

Read More »

మోటారు సైకిల్‌ ఢీకొని వ్యక్తికి గాయాలు

  రెంజల్‌, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన విఠల్‌ అనే వ్యక్తి తన మోటారుసైకిల్‌ వాహనాన్ని కల్వర్టుకు ఢీకొనడంతో గాయలయ్యాయి. స్థానికుల సహాయంతో 108లో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. Email this page

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">