Breaking News

తాజా వార్తలు

ర్యాలీని ప్రారంభించిన ఎస్‌.పి.

నిజామాబాద్‌, నవంబరు 14, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టర్‌ గ్రౌండ్‌ ఆవరణలో ఐ.సీ.డీ.ఎస్‌ మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎస్‌.పి. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్‌ లాల్‌ నెహ్రూ 125 వ జన్మదినం సందర్భంగా ఈ రోజు జరుపుకుంటున్న బాలల దినోత్సవంలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో ఉన్న బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని మరియు బాల్య వివాహాలను అరికట్టాలని ఆయన సూచించారు. తదనంతరం పిల్లలు …

Read More »

అన్ని రోగాలకు కూడలి డయాబేటిస్‌….. జేసి శేషాద్రి

నిజామామాబాద్‌, నవంబరు 14, మనిషికి వచ్చే అన్ని రోగాలకు కూడలి డయాబెటిస్‌ అని, దీని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎస్‌బిహెచ్‌, ఐఎంఎ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రపంచ మధుమోహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిఆగా హాజరైన జేసి శేషాద్రి కార్యక్రమ జ్యోతిని వెలిగించి, ప్రసంగించారు. ప్రపంచంలో ఈ వ్యాధి దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు ఏన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని సూచించారు. …

Read More »

18 నుంచి జిల్లాలో ఎంపి కవిత పర్యటన

నిజామాబాద్‌, నవంబరు 14, నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈనె 18 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇటీవల లండన్‌లో పర్యటించి గురువారం రాష్ట్రనికి చెరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ఆమె జిల్లలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు సన్నహాలె చేసుకున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్కషన్‌ పథకం స్థానికుల అభిప్రాయలను తెలుసుకుంటారు. బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బాల్కోండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో …

Read More »

రైల్వే స్టేషన్లో ప్రైవేట్‌ బహుళ సముదాయాలు….నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపిక

కసరత్తు ప్రారంభించిన ఆర్‌ఎల్‌డిఎ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 14, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మహార్థశ రానుందా…. మోడల్‌ రేల్వే స్టేషన్లగా మారుస్తామన్న యుపిఏ ప్రభుత్వం ఇంటి ముఖం పట్టింది. మోడల్‌ సంగతి ఏలా ఉన్న స్టేషన్‌ మాత్రం ఎప్పటిలాగే అవస్థలతో డల్‌గా ఉంది. ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వంలో రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే స్థలాల్లో బహుళ సముదాయాలను నిర్మించేందుకు పైవ్రేట్‌ భాగస్వామ్యన్ని కోరుతంది. ఇందుకు మోడల్‌గా నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. నిజామాబాద్‌ నగరానికి నడి బోడ్డున ఉన్న రైల్వే …

Read More »

దళితులకు మూడెకరాల భూమి పంపిణి చేయాలి

బోధన్‌, నవంబర్‌13: దళితులందరికి మూడెకరాల నాణ్యమైన భూమి పంపిణి చేయాలని కాంగ్రెస్‌పార్టీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో గురువారం బోధన్‌ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్‌ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుణప్రసాద్‌ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల ఎస్సీలతోపాటు,  పట్టణంలోని ఎస్సీలకు కూడ మూడు ఎకరాల భూమిని పంపిణి చేయాలని ఆయన అన్నారు. పట్టణంలో కూడ నిరుపేద ఎస్సీలు ఉన్నారని గుర్తు చేశారు.  ఆర్డీవో కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్‌ పార్టీకి …

Read More »

ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి -టిఎన్‌ఎస్‌ఎఫ్‌ యజ్ఞం

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించాలని, నిధుల మంజూరిలో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని కోరుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. వర్సిటీ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యుడు, జిల్లా మంత్రి, పార్మలెంటు సభ్యురాలు ప్రత్యేకంగా చొరవ చూపి తక్షణమే 200 కోట్ల రూపాయలు కేటాయించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత …

Read More »

15న కార్మిక సంఘం జిల్లా సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణలపై ఈనెల 15న జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు సిఐటియు డివిజన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ తెలిపారు. బుధవారం ఆయన డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలన్ని ఐక్యంగా వుండి కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించాలని, ఈ సదస్సును విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. Email this page

Read More »

ఎంఆర్‌పిఎస్‌ సదస్సుకు తరలిరావాలి

డిచ్‌పల్లి, 12 : ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసర్తున్న ఎంఆర్‌పిఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ ఈనెల 16న నిజామాబాద్‌ రానున్నారని ఆ సంస్థ డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు గురిజాల అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎంఆర్‌పిఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనిల్‌కుమార్‌ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. కాగా నిజామాబాద్‌లో నిర్వహించే సదస్సుకు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో …

Read More »

ఎసిబి వలకు చిక్కిన పంచాయితీ కార్యదర్శి

బాల్కొండ, నవంబర్‌ 12 : గ్రామ ఉపసర్పంచ్‌ వద్ద 5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పంచాయితీ కార్యదర్శి ఉదంతం బుధవారం బాల్కొండ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. ఎసిబి డిఎస్పీ సంజీవరావు నేతృత్వంలో బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ అలకొండ శ్రీనివాస్‌ నుంచి చిట్టాపూర్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శి రమేశ్‌ 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. …

Read More »

స్నానానికి వెళ్లి యువకుని మృతి

బాల్కొండ, నవంబర్‌ 12 : బాల్కొండ మండలం పోచంపాడుకు చెందిన బలేరావు పవన్‌ (30) గోదావరి పుష్కరఘాట్‌ వద్ద ప్రమాదవశాత్తు నీట మునికి మృతి చెందినట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. మృతుడు పవన్‌ మంగళవారం మధ్యాహ్నం స్నానం కోసం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు వెతికినా ఆచూకి లభించలేదు. బుధవారం పుష్కరఘాట్‌ వద్ద నీటిపై తేడంతో పవన్‌గా గుర్తించారు. మృతునికి ఆరెళ్ల కూతురు సౌమ్య, భార్య రమ్యకృష్ణ వున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ …

Read More »

రోగి పట్ల అసభ్యంగా వైద్యుడి ప్రవర్తన -జిల్లా వైద్యాధికారి విచారణ

  ఆర్మూర్‌, నవంబర్‌ 12 : ఆర్మూర్‌ ప్రబుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఓ రోగి పట్ల ఆసుపత్రి వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించారన్న విషమై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గోవింద్‌ వాగ్మారె విచారణ జరిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చింది. ఆమె పట్ల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ అమర్‌భూషన్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు రోగి బంధువులు ఆరోపించారు. ఇక్కడ ఎవరు లేరని, ఎక్కడైనా ప్రైవేటు ఆసుపత్రిలో చేరాలని వైద్యుడు …

Read More »

అన్ని రంగాల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం -టిపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ ధ్వజం

ఆర్మూర్‌, నవంబర్‌ 12 : తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని టిపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ ధ్వజమెత్తారు. టిపిసిసి అధికార ప్రతినిధిగా నియమితులైన చంద్రమోహన్‌ను స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఎస్టీలకు ప్రత్యేక పంచాయితీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు అమలు కావడం లేదన్నారు. కేసిఆర్‌ హామీలన్నీ …

Read More »

బెంగాళీ హఠావో..స్వర్ణకార్‌ బచావో.. -ఆర్మూర్‌లో ర్యాలీ, షాపుల మూసివేత

ఆర్మూర్‌, నవంబర్‌ 12 : బెంగాళీ వర్తకుల బంగారం షాపులు మూసి వేయించాలని ఆర్మూర్‌లో బుధవారం స్వర్ణకారులు ర్యాలీ నిర్వహించారు. ‘బెంగాళీ హఠావో..స్వర్ణకార్‌ బచావో..’ అనే నినాదంతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగాళీ బంగారం దుకాణాలను మూసి వేయించారు. ఐదారు ఏళ్ల క్రితం ఆర్మూర్‌కు వచ్చిన బెంగాళీ బంగారం వర్తకులు దుకాణాలు తెరిచి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్వర్ణకారులు ఆరోపించారు. ఎక్కువ రేట్లకు మడిగెలను అద్దెకు తీసుకుని వాటి అద్దెలను కూడా పెరచారన్నారు. బెంగాళీ వర్తకులు నాసిరకం బంగారంతో ఆభరణాలు చేస్తున్నారన్నారు. …

Read More »

ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలి 49వ రోజుకు చేరిన దీక్షలు

  బోధన్‌, నవంబర్‌12: ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని, షుగర్స్‌ మజ్దుర్‌సంఘ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 49వ రోజుకు చేరాయి. రెంజల్‌ మండల ఎంఆర్‌పీయస్‌ నాయకులు దీక్షల్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా రెంజల్‌ మండల ఎంఆర్‌పీయస్‌ నాయకులు బాలజీ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ మేరకు వెంటన్‌ ప్రభుత్వం స్వాదీనం చేసుకోని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్వాదీనం చేసుకోకపోతే అందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీయస్‌ నాయకులు పాల్గొన్నారు. Email this page

Read More »

రేవంత్‌రెడ్డి క్షేమాపణ చెప్పాలి

బోధన్‌, నవంబర్‌12: నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి క్షేమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బోధన్‌ నియోజక వర్గ ఇంచార్జి కొట్టూర్‌ నవీన్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. బుధవారం బోధన్‌ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డపై నిరాధారమైన ఆరోపణలు చెయడం సరైంది కాదన్నారు. ఇంక్కొక్కసారి ఎంపీ కవితపై ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌వి నాయకులు శివ, నరేష్‌, సందీప్‌, …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">