ఆర్మూర్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 145 వ జయంతిని లాలన వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మానస గణేష్ మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా నిరుపేదల కోసం మహారాష్ట్రలో 143 పాఠశాలలు నిర్మించిన మహానీయుడని కొనియాడారు. స్వాతంత్య్రానికి పూర్వమే స్వఛ్ఛత కార్యక్రమానికి నాంది పలికి పరిశుభ్రత పరమాత్ముడు అని నినదించిన ఆయన స్వఛ్ఛత పితామహుడు అన్నారు. ఆకలికి అలమటించే వారికోసం ...
Read More »25న ఛలో నిజామాబాద్
ఆర్మూర్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 25 న చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులను కోరారు. దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, కార్మిక హక్కులను హరించే చట్టాల సవరణ ఆపాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు ...
Read More »ఛలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఆహార వ్యవస్థను దెబ్బతీసే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 25 ఫిబ్రవరిన జరిగే సభను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కార్మికులకు కోరారు. కోటార్మూర్ గ్రామంలో దేవంగా సంఘములో బీడీ కార్మికుల సమావేశం ...
Read More »రైతు గర్జన గోడప్రతుల ఆవిష్కరణ
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో 25న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లక్షలాదిమంది రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారని, ఈ ఆందోళనను అనేక ప్రచారాలతో అట్లాగే పోలీసు నిర్మాణాలతో బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు తప్పు త్రోవ పట్టింఛటానికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం ...
Read More »జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప ఆలయం వద్ద శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు మహారాష్ట్రకు చెందిన హర్షల్ సురేష్ భోంకర్ అనే 23 సంవత్సరాల యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ఎస్.ఐ. విజయ్ నారాయణ తెలిపారు. మృతదేహంపై నుంచి భారీ వాహనాలు వెళ్లడంతో తునాతునకలు అయి గుర్తుపట్టలేని విధంగా మారిందని, మృతదేహాన్ని ...
Read More »మానస గణేష్‌కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీలోని మామిడిపల్లికి చెందిన మానస స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపకులు మానస గణేష్ నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్లో జరిగిన అమ్మానాన్న ఫౌండేషన్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో రాష్ట్రస్థాయి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు. అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆంజనేయులు, ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, డాక్టర్ నాగరాజు చేతులమీదుగా అవార్డు ప్రదానం జరిగింది. కోవిడ్ వల్ల రాష్ట్రమంతటా లాక్డౌన్ సమయంలో వలసకూలీలకు నిరుపేదలకు నిత్య ...
Read More »ఆర్మూర్‌లో ఛత్రపతి శివాజీ జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జయంతిని ఆర్మూర్ లోని శివాజీ చౌక్ (గోల్ బంగ్లా) వద్ద ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్ ...
Read More »లెదర్ పార్క్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన లెదర్ పార్కు స్థలాలలో వెంటనే నిధులు కేటాయించి లెదర్ ఇండస్ట్రీస్ నిర్మాణం చేపట్టాలని బుధవారం హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ని లెదర్ పార్కు సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నల్ల రాజా రామ్, రాచర్ల రాజ్ దశరత్ ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి ...
Read More »మొక్కలు నాటి జన్మదిన బహుమతిగా ఇవ్వాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి వృక్ష ప్రేమికుడని, మొక్కలన్నా చెట్లన్నా ఆయనకు అమితమైన ఇష్టమని, ఆయన జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటి బహుమతిగా అందించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వేల్పూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి మొక్కలు నాటే ...
Read More »ఉచిత ఎరువులు ఎక్కడ? రైతు రుణ మాఫీ ఎప్పుడు?
ఆర్మూర్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కొరకు ఇసుమంత కూడా మేలు చేయట్లేదని, ఏక కాలంలో రుణ మాఫీ అని, ఉచిత ఎరువులు అని నమ్మపలికి రైతు నడ్డి విరుస్తున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ రైతే రాజని తమ ప్రభుత్వం ...
Read More »ఆర్మూర్‌లో సంత్ సేవాలాల్ జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జంబీహానుమాన్ మందిరం నుండి ఎంఆర్ గార్డెన్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నూతు శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ గిరిజన మోర్చా అధ్యక్షుడు పీర్ సింగ్, జిల్లా మాజీ ...
Read More »ఆర్మూర్‌లో పోలీసు కళాజాత
ఆర్మూర్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీసు కళా జాతా కార్యక్రమం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ అసోసియేషన్, బాధితుల కోసము గల్ఫ్ వెళ్ళేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నకిలీ ఏజెంట్ మోసాల గురించి వివరించారు. అలాగే గల్ప్‌లో జరిగే బాధల గురించి, నకిలీ విసా మోసాల గురించి, గల్ఫ్ వెళ్ళే వారు ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాలు అవగాహన కల్పించారు. వాటి ...
Read More »బిసిల అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు
ఆర్మూర్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్ఎస్ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ వారి అభివృద్ధిపై ఏమాత్రం లేదని, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో బీసీల విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి ఎలాంటి చర్యులు తీసుకోవడం లేదని, బీసీల అభివృద్ధి పట్టించుకునే సమయం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్, బీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు బాశెట్టి రాజ్ కుమార్ అన్నారు. ...
Read More »బిజెపి బడా జోకర్ పార్టీ
ఆర్మూర్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి పార్టీ అంటే బడా జోకర్ పార్టీ అని, బడా జోకర్ పార్టీలో ఇద్దరు జోకర్లు ఒకరు బండి సంజయ్ అయితే మరొకరు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని వారిద్దరికీ పిచ్చి కుక్క కరిస్తే ఎలా వ్యవహరిస్తారో సీఎం కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నారని పియుసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో ...
Read More »ఏకాత్మతా మానవతా వాదంతో ముందుకెళ్ళాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి నరసింహారెడ్డి పాల్గొని పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవతావాదం ...
Read More »ప్రారంభమైన వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
ఆర్మూర్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉచిత పిపిఆర్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా సోమవారం మిర్దాపల్లి, దేగాం గ్రామాల్లో జీవాలలో ఉచిత పిపిఆర్ టీకాల కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు పాల్గొని జీవాలకు మొదట టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు గ్రామాల్లో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్, సురేష్, నాగార్జున కలిసి జీవాలకు టీకాలు వేశారని ఆర్మూర్ మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్. లక్కం ప్రభాకర్ తెలిపారు. ...
Read More »గురుకుల పాఠశాలను సందర్శించిన అధికారులు
ఆర్మూర్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం భౌతిక తరగతులు ప్రారంభమైనందున గురకుల పాఠశాలను ఎంపిపి, జడ్పిటిసి, ఎండివో, ఎంఇవో ఆకస్మికంగా తనికీ చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తగు చర్యలు తీకున్నారా లేదా అని పలు అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున మాస్కులు కూడా పంపిణీ చేశారు.
Read More »జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు
ఆర్మూర్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 31 నుండి బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో నిజామాబాద్ పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు పాల్గొననున్నారు. బాలికల విభాగంలో మద్దుల శ్రీనిక 12 సంవత్సరాలలోపు సబ్ జూనియర్ విభాగంలో, అలాగే 12 సంవత్సరాల బాలుడు శ్రీహిత్ గౌడ్, సీనియర్ విభాగంలో రాజు పాల్గొననున్నారు. నిజామాబాదు టైక్వాండో అసోసియేషన్ నుండి క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడాకారులకు నిజామాబాద్ పట్టణ ఏసిపి ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ కుమార్ క్రీడాకారులకు అభినందించారు. ...
Read More »రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టాస్క్ ఫోర్సు పోలీసులు రూ. 50 వేల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిలాల్ కాన్ఫెక్షనరీ లో గుట్కా పట్టుకుని, నిందితుని అరెస్టు చేసినట్టు టాస్క్ ఫోర్సు సిఐ తెలిపారు. సోమవారం అదనపు పోలీసు కమీషనర్ అరవిందబాబు ఉత్తర్వుల మేరకు టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ షాకెర్ అలీ, వారి సిబ్బంది ఆర్మూర్ పిఎస్ పరిధిలోని ఓ చోట అక్రమంగా గుట్కాఉందని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు జరిపినట్టు ...
Read More »భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట
భీమ్‌గల్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్తానం వారు ఏర్పాటు ...
Read More »