Breaking News

Tag Archives: Awareness

ఎన్నికల విధులపై పూర్తి అవగాహన అవసరం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు పోలింగ్‌ నిర్వహణ పట్ల, విదుల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ విధులపై నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ...

Read More »

అయోడిన్‌ లోపంపై అవగాహన అవసరం

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో అయోడిన్‌లోపం వల్ల 2.8 మిలియన్‌ జనాభా వివిధ రకాల రుగ్మతలతో బాదపడుతున్నారని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని జిల్లా మాస్‌ మీడియా అధికారి సువర్ణకుమారి, సాందీపని కళాశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబా, జిల్లా ఆరోగ్య బోధకుడు సంజీవరెడ్డిలు అన్నారు. సోమవారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో అయోడిన్‌ లోపం వాటివల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వ్యక్తికి 100-150 ఎంసిజి అయోడిన్‌ అవసరమని ...

Read More »

ఈవిఎం, వీవీ ప్యాట్‌ యంత్రాలపై పూర్తి అవగాహన అవసరం

  కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అధికారులు స్పస్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక ఏఎంసి గోదాములో 48 ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ద్వారా 22 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులు, 76 మంది సెక్టోరియల్‌ అధికారులు, 22 మంది డిప్యూటి తహసీల్దార్లు, సిబ్బందికి ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ యంత్రాల వినియోగంపై పూర్తి ...

Read More »

ఈవిఎంల వినియోగంపై అవగాహన

రెంజల్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దూపల్లి గ్రామాల్లో ఈవిఎం మిషన్ల ఉపయోగంపై ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో వీటి గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఓటరు ఈవిఎంపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏపిఎం చిన్నయ్య, తాజా మాజీ సర్పంచ్‌ చందూరు సవిత, రవి, మదన్‌ తదితరులున్నారు.

Read More »

ఓటు వినియోగంపై బదిరులకు వారి భాషలో అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు వినియోగంపై బదిరులకు వారి భాషలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌ సమావేశమందిరంలో సంబంధిత అధికారులు, హెచ్‌పిడి పాఠశాల సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బదిరులకు అర్థమయ్యే విధంగా సంజ్ఞలతో అవగాహన కల్పించాలని, ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినపుడు వారి ఓటరు కార్డు, గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వారికి పంపినీ చేసిన చీటి, ఓటరు జాబితాలో వారి ...

Read More »

మెడిసిన్‌ విద్యార్థులకు ఓటరు నమోదుపై అవగాహన

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెడిసిన్‌ విద్యార్థులకు గురువారం ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు హాజరై మాట్లాడారు. ఓటరు నమోదుపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ఏ వృత్తిలో ఉన్నవారైనా ఓటుహక్కు తమ కనీస బాద్యతగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. విద్యాధికులకంటే నిరక్షరాస్యుల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం కొంతమేర బాధకలిగిస్తుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. విద్యావంతులు ఓటుహక్కును వినియోగించుకొని మంచి ప్రజా నాయకులను దేశానికి అందించాలని కలెక్టర్‌ ...

Read More »

కంటివెలుగుపై విస్తృత ప్రాచుర్యం కల్పించాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రాచుర్యం, అవగాహన చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతికుమారి, కమిషనర్‌ వాకటి కరుణలు అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, డిఎంఅండ్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ కంటివెలుగు స్క్రీనింగ్‌ క్యాంపుల్లో తప్పకుండా విటమిన్‌ ఎ,డి, లు అందుబాటులో ఉంచాలని, నిరంతర విద్యుత్తు సరఫరా క్యాంపులకు అందించాలని, జిల్లా కలెక్టర్‌ ...

Read More »

రైతులకు పంట దిగుబడి సలహాలు, సూచనలు అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించి పంట దిగుబడికి సూచనలు, సలహాలు అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో రైతులకు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్లకు, వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులకు, మండల వ్యవసాయ శాఖాధికారులకు పత్తిపంటపై సస్యరక్షణ చర్యలు, అవలంబించాల్సిన పద్దతులపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు ...

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

నందిపేట రూరల్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిల సమావేశం శనివారం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌ కుమార్‌, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు ప్రతి గ్రామస్థాయిలో బూత్‌ కమిటీలు పటిష్టం చేయాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశించిన 23 సూత్రాల ప్రకారం పార్టీ పటిష్టం చేయాలని ఆయన కోరారు. ...

Read More »

క్షయ వ్యాధిపై వార్డుల్లో అవగాహన

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షయ వ్యాధి పట్ల కామారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెండోరోజు శనివారం పట్టణంలోని వివిద ప్రాంతాల్లో టిబి పర్యవేక్షకులు ప్రజలకు క్షయవ్యాధి గురించి వివరించారు. దేశం నుంచి క్షయవ్యాధిని 2025 వరకు పారద్రోలాలని యునైట్‌ టు ఎండ్‌ టిబి లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు తెలిపారు. యాక్టివ్‌ కేస్‌ ఫైండింగ్‌ ద్వారా పట్టణంలో పర్యటిస్తు ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. టిబి లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వాసుపత్రికి పంపుతున్నట్టు ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ ...

Read More »

స్వచ్చత కోసం ఇంటింటికి అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చతపై అవగాహన కల్పించేలా ఇంటింటికి ప్రచారం చేయాలని డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా స్వచ్చభారత్‌ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జనహిత భవనంలో శనివారం ఐకెపి సిసిలకు, పివోఏలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన సర్వేలో జిల్లాలో ఓడిఎఫ్‌గా ప్రకటించిన 96 గ్రామ పంచాయతీలను ఓడిఎఫ్‌కు అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు. 96 గ్రామాల్లో ఐకెపి సిబ్బంది ద్వారా రీవెరిఫికేషన్‌ చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో పూర్తి ...

Read More »

సాంకేతిక అంశాలపై అవగాహన అవసరం

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసులకు సాంకేతిక అంశాలపై అవగాహన అవసరమని అదనపు డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం టిఎస్‌ కాప్‌ టిసిటిఎన్‌ఎస్‌ బ్లూకోల్డ్‌, డయల్‌ 100 ముగింపు కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. సాంకేతిక అంశాలపై ప్రతి ఒక్క పోలీసులకు అవగాహన అవసరమని, తద్వారా నేరస్తులను తక్షణమే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. తీవ్రమైన నేరాలైనా, చిన్న నేరాలైనా పెట్టి కేసు యాప్‌ను ఉపయోగించుకొని నేరాలు నియంత్రించవచ్చని ఆయన సూచించారు. ...

Read More »

సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త అన్నారు. మంగళవారం నగరంలోని 41వ డివిజన్‌లో తెరాస పార్టీ బూత్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో బృహత్తర పథకాలు ప్రవేశపెట్టిందని, ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ...

Read More »

వందశాతం డ్రిప్‌ రాయితీపై రైతులకు అవగాహన కల్పించాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఇస్తున్న 80 నుంచి వందశాతం రాయితీకి సంబంధించి డ్రిప్‌ ఇరిగేషన్‌ సదుపాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవనశాఖ డిప్యూటి డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ అధికారి ప్రేమ్‌సింగ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లాలో జరిగే మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు స్కీం ఇతర పథకాలపై ఉద్యానవన అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాబార్డు ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం రైతులకు రుణాలు అందిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పెండింగ్‌లో ...

Read More »

కెసిఆర్‌ కిట్‌లపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల్లో కెసిఆర్‌ కిట్‌లపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతుల సంఖ్య పెంచేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం వైద్య, ఐసిడిఎస్‌ సిబ్బందితో ఆయనసమీక్షించారు. కెసిఆర్‌ కిట్‌లు, గర్భిణీలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్తిక సాయం, తదితరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. పిహెచ్‌సిల్లో సిబ్బంది రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మాతృ, శిశు మరణాల రేటు తగ్గించేలా చూడాలన్నారు. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షించాలని, నివేదికలు సకాలంలో పంపాలని ...

Read More »

ఎన్నికల ప్రక్రియపై అవగాహన అవసరం

నిజామాబాద్‌ టౌన్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా హైదరాబాద్‌ నుంచి మాట్లాడారు. ఇఆర్‌వో నెట్‌లో ఓటరు నమోదు, డిప్యూటేషన్‌, మార్పులు, చేర్పుల సందర్భంలో ఆ వ్యక్తి ఏ నియోజకవర్గంలో ఇంతకుముందు నమోదైన వివరాలు తెలియజేస్తుందని, ఆ సందర్భంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు. ఆ వివరాలను ఇఆర్‌వో నెట్‌ ...

Read More »

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన అవసరం

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. గ్రామస్వరాజ్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ బుధవారం వేల్పూర్‌ మండలంలోని అమీన్‌పూర్‌, మండల కేంద్రంలో గ్రామస్వరాజ్‌ దివస్‌లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, అంటువ్యాదులు, రోగాలు ప్రబలకుండా ఆరోగ్యవంతంగా జీవించవచ్చని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. చిన్న, చిన్న వ్యాధులు అంటురోగాలు ప్రబలినా దీర్ఘకాలికంగా ...

Read More »

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణపై అందరికి అవగాహన కల్పించాలని రాజస్థాన్‌ లోని మాధవ్‌ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగ పరిశోధక విద్యార్థి పుట్ల అనిల్‌కుమార్‌ అన్నారు. అహ్మద్‌ టిటిసి కళాశాలలో ఆదివారం ఎన్‌ఐఓఎస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో శిక్షణ పొందని ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పర్యావరణ విద్య- దాని ఆవశ్యకత అనే అంశంపై అనిల్‌ వివరించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యక్ష అనుభవాల ...

Read More »

టిబి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువకులు హెచ్‌ఐవి ఎయిడ్స్‌తోపాటు టిబి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ అంజయ్య సూచించారు. కామారెడ్డి జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఆద్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ బిటిఎస్‌లో జరుగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల శిక్షణా తరగతుల్లో భాగంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తాము నిర్వహించే శిబిరాల్లో ప్రజలకు టిబి అనుమానిత లక్షణాలు, వాటి నివారణపై అవగాహన ...

Read More »

అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

కామారెడ్డి, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైల్వే ప్రయాణీకులనుంచి జాగ్రత్తగా ఉండాలని ఆర్‌పిఎఫ్‌ జిఆర్‌ఎపి ఎస్‌ఐలు శంకర్‌, తావు నాయక్‌, శ్రీనివాస్‌లు ప్రయాణీకులకు సూచించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో మంగళవారం జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా ప్రయాణీకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారు నేరుగా ప్రయాణీకులతో మాట్లాడారు. ప్రయాణీకులు ఎవరైనా అపరిచితుల నుంచి తినుబండారాలు తీసుకోవద్దని సూచించారు. కిటీకిల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, సామాన్ల పట్ల ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే 182 ...

Read More »