Breaking News

Tag Archives: bar association

ఘనంగా శివాజీ జయంతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం బిజెవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌బోరా ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోషన్‌ మాట్లాడుతూ హిందూ సమాజంకోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని, యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి చైతన్య కులకర్ణి, నరేశ్‌, సాయి, ప్రతాప్‌, మహేశ్‌, సంజీవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్‌ బార్‌ ...

Read More »

న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డులు అందజేత

నిజామాబాద్‌ టౌన్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాదుల ఆరోగ్యబీమా కార్డులను జిల్లా న్యాయమూర్తి కె.సుజన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదులకు బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమని, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య మాట్లాడుతూ 2 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను ప్రభుత్వం కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు దేవిదాస్‌చాండక్‌, కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ...

Read More »

బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సుజన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో పోటీతత్వం సహజమని, న్యాయవాదుల మధ్య సఖ్యత పెంచడానికి అసోసియేషన్‌ లాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేసి నిర్దోషులైన ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని ఆమె సూచించారు. అనంతరం నూతన కార్యవర్గంచే ప్రమాణ ...

Read More »

9న బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 9న సోమవారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జిన సుజన, అతిథులుగా అదనపు జిల్లా జడ్జిలు ఉదయ్‌కుమార్‌, సుదర్శన్‌ హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల అధికారులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, తులసీదాస్‌, సుదర్శన్‌లు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నట్టు ఆయన తెలిపారు. కావున న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ...

Read More »

బార్‌ అసోసియేషన్‌ అధ్య్ష, కార్యదర్శులుగా శ్రీహరి ఆచార్య, జగన్‌ల ఎన్నిక

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా శ్రీహరి ఆచార్య, ప్రధాన కార్యదర్శిగా మల్లేపూల జగన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి రాజ్‌కుమార్‌ సుబేదార్‌, తులసీదాస్‌, సుదర్శన్‌ తెలిపారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శికి ఒకరు చొప్పున నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్యక్షులు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి జగన్‌లు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో ...

Read More »

బార్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ బుధవారం జిల్లా జడ్జి కె.సుజన చేతులమీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి తమవద్దకు వచ్చే కక్షిదారులకు న్యాయం చేయాలని సూచించారు. న్యాయవాదులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు మాణిక్‌రావు, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ఆశ నారాయణ, సంతోష్‌, దేవిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

  కామారెడ్డి, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ ఆవరణలో న్యాయవాదులతో పాటు ఇతరులకు 144 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వైద్యుడు శివప్రసాద్‌ తెలిపారు. వీరిలో 22 మందికి షుగర్‌ వ్యాధి ఉన్నట్టు నిర్దారించినట్టు తెలిపారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు దామోదర్‌రెడ్డి, నరేశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఇస్సాపల్లి ఘటన నిందితులకు బార్‌ అసోసియేషన్‌ సహకరించొద్దు

  ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇస్సాపల్లి గ్రామంలో దళితులపై దాడిచేసిన నిందితులను దళిత, ప్రజా సంఘాల ఒత్తిడిమేరకు ఎట్టకేలకు ఏడుగురిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించడాన్ని స్వాగతిస్తున్నామని దళిత, ప్రజాసంఘాల నాయకులు బి.దేవరాం, పిసి భోజన్న, తెడ్డు రవికిరణ్‌, వెంకటేశ్‌, టి. కుమారస్వామి అన్నారు. ఆర్మూర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితుల పట్ల వివక్షాపూరిత వైఖరితో హేళన చేస్తు మూకుమ్మడిగా ఇంటిపై దాడిచేసి మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన నిందితులను పోలీసులు ఘటన ...

Read More »