Breaking News

Tag Archives: BJYM

చత్తీస్‌ఘడ్‌ అమర జవాన్లకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌లోని మావోయిస్టుల‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల‌ ఆత్మకు శాంతి చేకూరాల‌ని భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల‌ స్తూపం వద్ద కొవ్వొత్తుల‌తో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేయం రాష్ట్ర నాయకుడు నరేంధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఛత్తీస్‌ ఘడ్‌లో జరిగిన నక్సలైట్‌ దాడి అతిదారుణమైన సంఘటన అని దాడుల‌లో వీర మరణం పొందిన 22 మంది సైనికుల‌కు వినయపూర్వక శ్రద్ధాంజలి ...

Read More »

ఖాళీ పోస్టులు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా టెక్రియల్‌ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 22 మంది కార్యకర్తలను అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల ఆనంతకష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలకై కొట్లాడి ...

Read More »

డిగ్రీలు, పిజిలు చదివారు.. ఇప్పుడేమయింది…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కారణంగా గత మార్చి నుండి పాఠశాలలు మూసివేయటంతో ప్రయివేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మూతికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు. అనంతరం రెండు రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దోమకొండ మండలానికి చెందిన ప్రయివేటు ఉపాధ్యాయుడు పోతు కిషోర్‌ ఆత్మకు ...

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి 70వ జన్మదినం సందర్భంగా జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపుమేరకు సేవా సప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇందూరు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో బస్వ గార్డెన్‌ మరియు శ్రీరామ గార్డెన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.

Read More »

15న కాగడాల ప్రదర్శన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విమోచనం పొందిన సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కామారెడ్డిజిల్లా కేంద్రంలో సెప్టెంబర్‌ 15న కాగడాల ప్రదర్శన, మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంధర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాక ముందు విమోచన దినోత్సవం ...

Read More »

వారి త్యాగాలు స్మరించుకోవాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రామారెడ్డి ఎమ్మార్వోకు బిజెవైఎం రామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షులు ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17, 1948లో తెలంగాణ రాష్ట్రానికి నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణాలో అనేక మంది అసువులు బాసిన వారి ప్రాణా మానాల త్యాగ ఫలితంగానే సెప్టెంబర్‌ ...

Read More »

ఘనంగా శివాజీ జయంతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి వేడుకలు పురస్కరించుకొని మంగళవారం బిజెవైఎం నగర అధ్యక్షుడు రోషన్‌లాల్‌బోరా ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోషన్‌ మాట్లాడుతూ హిందూ సమాజంకోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని, యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి చైతన్య కులకర్ణి, నరేశ్‌, సాయి, ప్రతాప్‌, మహేశ్‌, సంజీవ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్‌ బార్‌ ...

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో దీక్ష

  నందిపేట, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం నందిపేటలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా జిల్లా యువమోర్చా అధ్యక్షుడు న్యాలంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలకం వేణు, కార్యదర్శి శంకర్‌గౌడ్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి విద్యార్థులను, యువతను మోసం చేసిందని విమర్శించారు. రాబోయే కాలంలో విద్యార్థి యువతనే ...

Read More »

బిజెవైఎం నూతన కమిటీ ఎన్నిక

  బీర్కూర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం భారతీయ జనతా యువమోర్చా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బిజెపి మండల అధ్యక్షుడు వడ్ల సతీష్‌ తెలిపారు. మండల సభ్యులందరి సమక్షంలో ఎన్నిక జరిగిందన్నారు. అధ్యక్షునిగా రాము, ఉపాధ్యక్షులుగా చెన్ను చరణ్‌, నేనావత్‌ వసంత్‌, ప్రధాన కార్యదర్శిగా కృష్ణకుమార్‌, కార్యదర్శులుగా సాయికుమార్‌, గోవర్ధన్‌, కోశాధికారిగా ఉల్లెంగ భాస్కర్‌లు ఎన్నికైనట్టు చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రీతూసింగ్‌, ...

Read More »