Breaking News

Tag Archives: collector dr.sharath

జిల్లా కలెక్టర్‌కు సన్మానం

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఎం.చంద్రకాంత్‌, అధ్యాపకులు డా.టి.శ్రీనివాస్‌, శరత్‌ రెడ్డి, డా.శంకర్‌, సూపరింటెండెంట్‌ ఉదయ్‌ భాస్కర్‌, దేవేందర్‌ సన్మానించారు. ఇల్చిపూర్‌, కామారెడ్డి శివార్లలో గల కాలేజీకి చెందిన భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్‌ను కలిసి పూలమొక్క సమర్పించి ధన్యవాదాలు తెలిపారు. ముళ్ళపొదలు, ఆక్రమణలతో కూడిన ప్రాంతంలోని భూముల రక్షణ కోసం రెవిన్యూ డివిజనల్‌ అధికారి ఆధ్వర్యంలో కమిటీ నియమించి ...

Read More »

31 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పైపులైను పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం మిషన్‌ భగీరథ పథకం పనులపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష చేశారు. అధికారులు ఎలాంటి పెండింగ్‌ లేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని, తాగునీటి వసతికి అన్ని చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ లక్ష్మీనారాయణ, డీఈలు, ...

Read More »

ప్రజారోగ్యమే ప్రభుత్వాల లక్ష్యం

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల కషి చేసిన జిల్లా కలెక్టర్‌ కు, జిల్లా యంత్రాంగానికి, అభినందనలు తెలిపారు. ...

Read More »

ఆసరా పింఛన్ల డబ్బు రికవరీ చేయాలి

కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ వేతనం నుంచి ఆసరా పింఛన్ల డబ్బులు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల 33 మంది ఆసరా పింఛన్లు రద్దు అయినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. మూడు మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్‌ వెజిటేబుల్‌ ...

Read More »

చెడును భోగి మంటల్లో కాల్చివేయాలి

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెడును భోగి మంటల్లో కాల్చి వేసి మంచి మార్గంలో నడవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డా.శరత్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల రాశి వనం సమీపంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆదేశాల మేరకు నిర్వహించిన భోగి మంటలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భోగికి పూజలు నిర్వహించి అగ్ని వెలిగించారు. భోగి మంటలలో ప్రతి ఒక్కరు చెడును, స్వార్థాన్ని ...

Read More »

26లోగా పాఠశాలలు సిద్దం చేయాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, కస్తూరి భా, గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలను జనవరి 26 లోగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1న పాఠశాల, కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. మధ్యాహ్న భోజనం సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. తరగతి గదులను శుభ్రం చేయించి, ఫర్నిచర్‌ ఉండే విధంగా ...

Read More »

వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేవు

కామరెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. జిల్లా స్థాయిలో, డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేవని స్పష్టం చేశారు. ప్రతి ...

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 వాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లందరికి కోవిడ్‌ -19 వాక్సినేషన్‌ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్‌ చేశారు. వాక్సినేషన్‌ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ...

Read More »

నివేదికలు సిద్ధం

కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించబోయే జిల్లా కలెక్టర్ల సదస్సుకు సంబంధించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ధరణి, కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌, హరితహారం, నర్సరీల ద్వారా మొక్కల పెంపకం, విద్యాశాఖ అంశాలకు సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తన క్యాంపు కార్యాలయంలో రూపొందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, ...

Read More »

కరోనా డ్రై రన్‌లో నిర్లక్ష్యం ..మెడికల్‌ ఆఫీసర్‌ పై బదిలీ వేటు

గాంధారి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా డ్రై రన్‌లో మెడికల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ హెచ్చరించారు. జిల్లాలోని గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రై రన్‌ కార్యక్రమంలో భాగంగా నిబంధనలు సరిగ్గా పాటించని మెడికల్‌ ఆఫీసర్‌పై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. నిబంధనలు పాటించని మెడికల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌పై బదిలీ వేటు వేశారు. నిర్లక్ష్యంగా ...

Read More »

రుణ బకాయిలు వసూలు చేయాలి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుణాల బకాయిల వసూళ్లలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ కోరారు. కామారెడ్డి జనహితలో మంగళవారం రుణాల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు జనవరి 31లోగా వసూలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హతగల వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల మహిళలకు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల ...

Read More »

మిషన్‌ భగీరథ పనులు 15 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు జనవరి 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. జనహిత భవనంలో మంగళవారం జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా చేపడుతున్న పనులపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 624 హ్యాబిటేషన్‌లలో 621 ఓఎచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. బాన్సువాడలో 30 కిలోమీటర్లు పైప్‌లైన్‌ పెండింగ్‌ ఉందని, త్వరలో దానిని పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని ...

Read More »

పంచాయతీల ఆదాయాన్ని పెంచేలా చూడాలి

కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సూచించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామ పంచాయతీల వారీగా కూలీల సంఖ్య పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రకతి వనంలో నాటిన మొక్కలు వంద శాతం జీవించే విధంగా చూడాలని పేర్కొన్నారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంచే ...

Read More »

జిల్లా కలెక్టర్‌కు డిజిటల్‌ ఇండియా 2020 అవార్డు

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిజిటల్‌ ఇండియా 2020 అవార్డును భారత రాష్ట్రపతి నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అందుకున్నారు. బుధవారం ఉదయం కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వర్చువల్‌ పద్ధతిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డిజిటల్‌ ఇండియా 2020 అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఎక్సలెన్స్‌ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ డిస్ట్రిక్ట్‌ క్యాటగిరిలో సిల్వర్‌ అవార్డును భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ నుండి జిల్లా కలెక్టర్‌ అందుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ...

Read More »

జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రపతి అవార్డు

కామారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ బుధవారం 30 వ తేదీన భారత రాష్ట్రపతి నుండి అవార్డు అందుకోనున్నారు. డిజిటల్‌ ఇండియా-2020 అవార్డులకు సంబంధించి ఎక్స్లెన్స్‌ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ విభాగంలో 30 వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్త ఢిల్లీలోని ఎగ్యాన్‌ భవన్‌ లోని ఫైనరీ హాలులో జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ అవార్డును అందుకోనున్నారు. జిల్లా ఇన్‌ ఫర్‌ మేటిక్‌ ఆఫీసర్‌ బండి రవి కూడా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ...

Read More »

25 శాతం తగ్గకుండా హాజరయ్యే విధంగా చూడాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు 25 శాతం తగ్గకుండా హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఎండిఓ, ఎపిడి, ఎపిఓలను ఆదేశించారు బుధవారం జనహితలో గాంధారి, సదాశివనగర్‌, కామారెడ్డి, రామారెడ్డి, రాజంపేట బీబీపేట, బికనూర్‌, దోమకొండ, మాచారెడ్డి, తాడ్వాయి, లింగంపేట మండలాలలో జరుగుతున్న ఉపాధి హమీ, పల్లెప్రగతి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో కొత్త పనులను శ్రమశక్తి సంఘాల సమక్షంలో గుర్తించాలని, వారితో అండర్‌ టేకింగ్‌ ...

Read More »

హ‌ద్దుల వ‌ద్ద దిమ్మెలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ గుర్తించిన హద్దుల వద్ద దిమ్మెలు ఏర్పాటు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ను జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో కాలేజీకి సంబంధించిన భూముల హద్దులను ఆయన పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో గత 2016 సంవత్సరంలో జిల్లా సర్వేల్యాండ్‌ రికార్డు శాఖ సర్వే చేయడం జరిగిందని, తిరిగి 2017 సంవత్సరంలో కూడా హద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని, తిరిగి అదే రిపోర్టును జిల్లా ...

Read More »

అభివృద్ధి పనుల పరిశీలన

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, బిక్కనూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివద్ధి పనులను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌లోని పల్లె ప్రకతి వనం, పాఠశాల అదనపు గదులు, గ్రంథాలయ భవనం, స్త్రీ శక్తి భవనం, స్మశాన వాటిక, రైతు వేదిక భవనాలను పరిశీలించారు. 33/11 కె.వి. విద్యుత్‌ ఉపకేంద్రంను సందర్శించారు. ఆవరణలో మొక్కలు నాటాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. బిక్కనూర్‌లో పల్లె ప్రకతి వనం, రైతు వేదిక భవనాలను ...

Read More »

కామారెడ్డిలో ఐదు గ్రామీణ అంగడిలు

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఐదు గ్రామీణ అంగడిలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జాతీయ, వ్యవసాయ గ్రామీణ అభివద్ధి బ్యాంక్‌ చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు అన్నారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో నాబార్డ్‌ ఆధ్వర్యంలో గ్రామీణ అంగడిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కూరగాయలు విక్రయించడానికి గ్రామీణ అంగడి దోహదపడుతుందని సూచించారు. ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వాటర్‌ షెడ్‌ కింద ...

Read More »

కొత్త పనులు గుర్తించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీలో కొత్త పనులు గుర్తించాలని, కొత్తగా కూలీలకు పనులు కల్పించాలని, చేసిన పనులను రిజిష్టర్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మండల అభివద్ది అధికారులను, ఎపిడిలను, ఎపిఓలను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాధి హామీ పనులలో చేపట్టవలసిన పనులను, నిర్వహించవలసిన రిజిష్టర్లపై పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త పనులను గుర్తించాలని, చేసిన పనులను ఆన్‌లైన్‌ నమోదు వెంట వెంటనే నిర్వహించాలని, గ్రామ పంచాయితీ సెక్రటరీలు, ...

Read More »