నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ భారతదేశానికి అందించారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫులాంగ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, పలువురు అధికారులు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ...
Read More »మాక్లూర్ క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవీడ్ లక్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్‌లోని క్వారంటైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించి కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్లకు ఏర్పాటుచేసిన సదుపాయాలపై లక్షణాలున్న పేషెంట్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి త్రాగునీరు, ఆహారం, బెడ్స్, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ...
Read More »కోవిడ్ కేర్ కేంద్రాలు రేపటి వరకు సిద్ధం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో కోవిడ్ కేర్ కేంద్రాలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. మాక్లూర్‌లో వంద పడకల స్థాయికి, ఆర్మూర్, బోధన్‌లో యాభై చొప్పున సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయించాలనీ, అంబులెన్స్ ...
Read More »15లోగా ప్రైవేటు ఉపాధ్యాయుల వివరాలు అందించండి
నిజామాబాద్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15లోగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాలు అందించాలని ఆ కుటుంబాలను ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆదుకుంటుందని విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం బీఆర్కె భవన్ నుండి ఆమె పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈవోలు పౌరసరఫరాల శాఖ డిసిఎస్వోు, డిఎంతో వీడియో కాన్ఫరెన్స్ ...
Read More »ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పరికరాల పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలంగాణ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లాలోని 0 నుండి 18 సంవత్సరాల వయసుగల ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు అంచనా క్యాంపు 2018లో నిర్వహించారు. దాని ద్వారా 195 లబ్దిదారులకు బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉపకరణములు పంపిణీ చేశారు. పంపిణీ చేయబడిన పరికరముల వివరాలు : వీల్చైర్లు 20, ట్రై సైకిల్స్ 1, ఎం.ఆర్.కిట్స్ 45, వినికిడి యంత్రాలు 100, బ్రెయిలీ కిట్స్ 2, మెడభాగం ...
Read More »ఈజీఎస్ ద్వారా గ్రామాలకు మంచి పనులు జరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు కూలీ లభించడమే కాకుండా ఆయా గ్రామాలకు మంచి పనులు కూడా చేసి పెట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నెలలపాటు కూలీల కోసం అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో 40 శాతం పైగా అంటే ...
Read More »కోవిడ్ చికిత్సలకు సిద్ధం కండి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా తిరిగి పెద్ద సంఖ్యలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని, ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. మంగళవారం తన ఛాంబర్లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కోవీడు వ్యాప్తిపై, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు వైరస్ ఉదృతి ఆందోళనకరంగా కనిపిస్తున్నదని ...
Read More »టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పెరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు – కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్ఫోర్సుమెంట్ విస్తృత తనిఖీలు చేయాలి, బయట తిరిగే ప్రజలందరూ మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి, వ ృద్ధులు, వ్యాధిగ్రస్తులకు దీని ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వీరిలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్ జరగాలి, టెస్టులు పెరగాలి- అప్పుడే వైరస్ అరికట్టడానికి వీలవుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్లో తన ఛాంబర్లో వేరువేరుగా సంబంధిత ...
Read More »కరోనా ఉదృతి నివారణకు విస్తృత చర్యలు
నిజామాబాద్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి అధికారులు మరింత విస్తృత ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్రస్థాయి అధికారులైన రిజ్వి, రాహుల్ బొజ్జా, రోనాల్డ్ రోస్, డాక్టర్ ప్రీతిమీనా, డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ...
Read More »కలెక్టరేట్లో జగ్జీవన్ రామ్ జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనల నేపథ్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి జిల్లా యంత్రాంగం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డిఓ రవికుమార్, యస్సి కార్పొరేషన్ ఈడి రమేష్, ...
Read More »బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన ప్రజల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను అనుగుణంగా ముందుకు వెళ్ళడమే మన ముందున్న లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఏర్పాటు చేయగా సోమవారం నగరంలోని ఆయన విగ్రహానికి అధికారులు, అభిమానులు, ప్రజాప్రతినిధులతో కలిసి ...
Read More »భూ కబ్జాపై విచారణ జరపాలి
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపల్ లో 9 కోట్ల టిఎండిపి నిధుల మిగులు బడ్జెట్లో ప్రస్తావన రానందున గురువారం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్, పెర్కిట్‌లో అక్రమ భూ కబ్జాలు, లే అవుట్లు యధేచగా చేస్తున్నందున దానిపై విచారణ జరపాలని కలెక్టర్‌ని కోరారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహా రెడ్డి, సీనియర్ నాయకుడు ద్యగ ఉదయ్, కౌన్సిలర్లు ఆకుల ...
Read More »ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో వరి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటుపై మాట్లాడారు. వారం రోజుల్లో ఆయా కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను అధికారులు త్వరగా పూర్తి ...
Read More »రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూలీలకు మంచి పనులు అప్పగించి ఆర్థికంగా పుంజుకోవడానికి కృషిచేసిన కలెక్టర్లను అభినందిస్తున్నానని అదేవిధంగా హరితహారం సమీకృత మార్కెట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ...
Read More »నెల రోజుల్లో ఆడిట్ వివరాలు సెటిల్ చేయాలి
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థలకు సంబంధించి నెల రోజుల్లో రెండు సంవత్సరాల ఆడిట్ వివరాలు సెటిల్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్లో లోకల్ ఫండ్ ఆడిట్ అధికారులు, పంచాయతీ రాజ్ జిల్లా పరిషత్ ఎంపీడీవోలు దేవాదాయ శాఖ అధికారులతో పెండిరగ్ ఆడిట్ వివరాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక ...
Read More »ఓటర్ల జాబితా సిద్ధం చేయండి
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీలలో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డ్ మెంబర్లు పదవులను ఎన్నికల ద్వారా భర్తీ చేయుటకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డ్ మెంబర్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నందున అందుకు ముందుగా ఓటర్ల ...
Read More »ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉన్నందున గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మార్చ్ ముగిసేలోగా పూర్తిగా పన్ను వసూలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపిడిఓలు, ఏపిఓలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు, పంచాయతి రాజ్ ఏఈలు, మున్సిపల్ కమీషనర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నలుగురు కమీషనర్లు ...
Read More »టి.బి. నివారణలో జాతీయస్థాయి అవార్డు
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి బి నివారణలో జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణమని, ఇందుకు పని చేసిన క్షేత్ర స్థాయి సిబ్బందిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ నెల 24న ప్రపంచ టి.బి. నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా ఆసుపత్రి లో నేషనల్ టిబి ఎలిమినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రాంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ...
Read More »నిజామాబాద్‌లో బార్లు దక్కించుకున్న వారు వీరే…
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ 7 బార్లకు, బోధన్ మునిసిపాలిటీలో 3 బార్లకు కొత్తగా నోటిఫై చేయబడిన బార్లకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి దరఖాస్తు దారుల సమక్షంలో శనివారం నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో డ్రా తీసినట్టు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్లో విజేతలు… 1. బండి దయానంద్ : టోకెన్ నెంబర్ 3 2. కె.సతీష్ : టోకెన్ నెంబర్ 9 3. బి.రాజు ...
Read More »ఆడిట్ త్వరగా పూర్తిచేయాలి
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కో-ఆపరేటివ్ సొసైటీలో ఆడిట్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో కో-ఆపరేటివ్ సొసైటీ ఆడిటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కో-ఆపరేటివ్ సొసైటీలు 89 ఉన్నాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆడిట్ త్వరగా పూర్తిచేయాలని జిల్లాలోని అన్ని సంఘాలన్నీంటినీ లాభాల బాటలో నడిపించాలని సూచించారు. డీసిఓ సింహాచలం, జిల్లా సహకార ఆడిట్ అధికారి శ్రీనివాసులు, ఆడిటర్లు పాల్గొన్నారు.
Read More »