నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెలలో వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత కోరారు. గురువారం జిల్లా అధికారులతో ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్‌కు సిద్ధం కావడంపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జనవరిలో వ్యాక్సిన్ రానున్నట్లు తెలుస్తున్నందున అందుకు సంబంధించి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ...
Read More »ఈ లక్షణాలుంటే వెంటనే టెస్టు చేయించుకోండి…
హైదరాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్రిటన్‌లో పుట్టిన కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చే, అక్కడకు వెళ్లే విమానాలన్నింటినీ చాలా దేశాలు రద్దు చేశాయి. దాని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్డౌన్లు పెట్టేస్తున్నారు. ఇండియాలోనూ కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని సిటీల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఈ రకం కరోనాను గుర్తించడానికి నిర్దిష్టమైన టెస్టుల్లేవు. ఆర్టీపీసీఆర్ టెస్టులే చేసి పాజిటివ్ వస్తే దాని జన్యు క్రమాన్ని తేల్చే పనిలో పడ్డారు ...
Read More »స్ట్రెయిన్ వైరస్ లక్షణాలు ఇవే
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూరప్ దేశాలను ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వణికిస్తోంది. కొత్త రకం వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త రకం కరోనా ఇప్పుడు బ్రిటన్‌ని కలవరపాటుకి గురిచేస్తోంది. బ్రిటన్‌లో 1000 కి పైగా కేసుల్లో కొత్త రకం కరోనా వైరస్ కొనుగొబడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. వేగంగా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో బ్రిటన్‌లో టైర్-4 లాక్ డౌన్ విధించింది బోరిస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా లండన్, సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో కఠినమైన ...
Read More »కామారెడ్డిలో పాజిటివ్ శాతం తక్కువ
కామారెడ్డి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) రెండో విడత సర్వే ద్వారా కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్, నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామాల్లో ఏడు శాతం పాజిటివ్ ఉందని ఐసీఎంఆర్ సమన్వయకర్త దినేష్ కుమార్ తెలిపారు. నల్గొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలో ఆగస్టు నెలలో రెండో విడత సర్వే నిర్వహించామని చెప్పారు. నల్గొండ, జనగామ జిల్లాల కన్నా కామారెడ్డిలో పాజిటివ్ శాతం తక్కువగా నమోదైందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ...
Read More »సాహిత్యం సమాజానికి దివ్య ఔషధం
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాహిత్యం సమాజానికి దివ్యమైన ఔషధంగా పని చేస్తుందని, కరోనా సమయంలోనూ నిరూపణ అయిందని ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ విశాల్ అన్నారు. బుధవారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కాసర్ల నరేశ్ రావు రచించిన కట్టడి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషిలోని మానవత్వం ప్రజల చైతన్యం కరోనా వంటి అనేక విపత్తులకు సమాధానం చెప్పగలవని ఆయన వివరించారు. కరోనా సమయంలో సాహిత్యం కూడా ఒక ఔషధంగా ...
Read More »ఇద్దరికి కరోనా పాజిటివ్
కామరెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్ సెంటర్లో కరోన పరీక్షల క్యాంప్ నిర్వహించినారు. క్యాంపులల్లో రామరెడ్డి గ్రామంలో 40 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 40 మందికి, పోసానిపేట్ గ్రామంలో 40 మందికి, ఉప్పల్ వాయ్ గ్రామంలో 40 మందికి, మరియు వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 40 కరోన పరీక్షలు నిర్వహించారని డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 16 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 216 మందికి ...
Read More »రామారెడ్డిలో కరోన పరీక్షలు – అందరికి నెగిటివ్
కామారెడ్డి, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్ సెంటర్లో కరోన పరీక్షలు నిర్వహించినారు. రామరెడ్డి గ్రామంలో 89 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 58 మందికి, పోసానిపేట్ గ్రామంలో 42 మందికి, ఉప్పల్ వాయ్ గ్రామంలో 41 మందికి, మరియు వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో 66 మందికి కరోన పరీక్షలు నిర్వహించారని వైద్యాధికారి షాహీద్ ఆలి తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 319 మందికి కరోన ...
Read More »శ్వాస సంబంధిత వ్యాధి గ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కాలానుగుణంగా వ్యాపించే వ్యాధుల నివారణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలను మైక్ ద్వారా ప్రచారం చేశారు. ప్రస్తుతం కోవిడ్ 19 వ్యాప్తి చెందే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు నివారణ, నియంత్రణ గురించి జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విస్తతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో ...
Read More »కోవిడ్ పరీక్షలు జరిగేలా చూడాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లత తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుండి మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పరీక్షలు ప్రతి పిహెచ్సిలో 25 జరిగే విధంగా చూడాలని ప్రతి ఒక్కరు మాస్కులు దరించేవిధంగా, సోషల్ డిస్టెన్స్, శానిటేషన్ వాడాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ...
Read More »శుభ్రమైన ఆహారం తీసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేశారు. పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కాలానుగుణంగా సంక్రమించే వ్యాధులు ప్రభల కుండా తగు నివారణకు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మర్లకుంటా ...
Read More »ఇద్దరికి కరోనా పాజిటివ్
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ర్యాపిడ్ ఆంటీజెన్ కిట్ ద్వారా 56 మందికి కరోన టెస్ట్‌లు నిర్వహించినట్టు వైద్యాధికారి షాహీద్ అలీ తెలిపారు. కాగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, ఒక్కరు రామారెడ్డి గ్రామస్తులు, ఒక్కరు గర్గుల్ గ్రామస్థులని వైద్యాధికారి పేర్కొన్నారు.
Read More »విస్తృతంగా ఆరోగ్య సూత్రాల ప్రచారం…
కామారెడ్డి, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కామారెడ్డి పట్టణంలో కోవిడ్ 19నివారణకు, నియంత్రణకు పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు గురించి విస్తతంగా ప్రచారం చేశారు. కాకతీయ నగర్, విద్యానగర్, దేవనపల్లిలో మాస్కులు పంపిణీ చేశారు. డిఎం హెచ్‌వో డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచనలను అనుసరించి డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో నాగరాజ్, సంజీవరెడ్డి, ఎం.రాణి ప్రచారం చేశారు.
Read More »చలికాలంలో వ్యాప్తిచెందే వ్యాధులపై అవగాహన
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు చలికాలంలో వ్యాప్తి చెందే వ్యాధులకు తోడు ప్రస్తుతం కరోనాను నివారణ, నియంత్రణ గురించి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు, వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో పాటించాలని డిఎం హెచ్‌వో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో అంటువ్యాధులు మరియు కోవిడ్ 19ను పూర్తిస్థాయిలోవ్యాప్తిని అరికట్టేందుకు విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. వైద్యుల సూచనలు, వ్యక్తిగత, ...
Read More »ప్లాస్మాదానం.. ప్రాణదానం….
కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కరోనా పేషెంట్‌కి బి పాజిటివ్ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన వ్యాపారి జలిగామ చంద్రశేఖర్ మానవత దక్పథంతో బి పాజిటివ్ ప్లాస్మాను సన్ షైన్ వైద్యశాల హైదరాబాదులో అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని బాలు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో ...
Read More »కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది…
కామారెడ్డి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్ మీడియా అధికారులు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. కామరెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చలికాలంలో, పండగల సందర్భంగా అధికంగా ఉండే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు ...
Read More »కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు ఉచితబెడ్ సదుపాయం
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ ఫ్రంట్ లైన్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారందరికి తమ ఆసుపత్రిలో ఉచితబెడ్ సదుపాయం కలిగిస్తున్నట్లు చందమామ హాస్పటల్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిలోజినాయక్ శనివారం తెలిపారు. రిపోర్టర్స్, పోలీస్, మునిసిపల్ వర్కర్స్, ఆశా వర్కర్స్, పి.హెచ్.సిలో విధులు నిర్వహించే డాక్టర్లు, నర్సులు, గ్రామ పంచాయతీ పారిశుద్ద కార్మికులు కరోనాను అంతం చేయడానికి ముందుండి పోరాడుతున్నారని గుర్తుచేశారు. అందుకే వారికి కరోనా అధికంగా సోకే ప్రమాదమున్నందున్న వారందరికి తమ ...
Read More »పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 ర్యాపిడ్ టెస్టులు చేయగా మాగి షుగర్ ఫ్యాక్టరీలో ఇద్దరు, అచ్చంపేట్ గ్రామంలో నలుగురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్ తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు. నిజాంసాగర్ లో మొత్తం పాజిటివ్ కేసులు 238 కరోనాను జయించిన వారు.189 ...
Read More »తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి ఆద్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఔషద దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ఔషద దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ 19 ఔషదాలు, యాంటి బయోటిక్స్, ఇతర మందుల ధరలు, వాటి నిలువలు, నాణ్యత పరిశీలించారు. మందుల కొనుగోలు, అమ్మకం బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్‌పయిరీ మందులను ...
Read More »ప్లాస్మా దానం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండలం మోతే గ్రామానికి చెందిన బాల్ రెడ్డి అనే 57 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి హైదరాబాదులోని సజన వైద్యశాలలో ఏ పాజిటివ్ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నాగరాజు సహకారంతో ఏ పాజిటివ్ ప్లాస్మాను హైదరాబాద్‌కు వెళ్లి అందజేసి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో 250 ...
Read More »నిజాంసాగర్‌లో కరోన కేసులు నిల్
నిజాంసాగర్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా ఎవరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని మండల వైద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. నిజాంసాగర్‌లో మొత్తం 193 కేసులు కాగా, కోలుకున్నవారు 62 మంది, ఒకరు కరోనాతో మరణించారన్నారు. కరోనా పాజిటివ్ కేసులు కొమలాంచ 2, తుంకిపల్లి 7, గాలి పూర్ 4, గునుక్కల్ 9, శేర్ఖాన్ పల్లి 1,మల్లూర్ 9, సింగీతం 7, మగ్దూంపూర్ ...
Read More »